3వరోజుకు చేరిన అగ్నిమాపక వారోత్సవాలు
ఆసుపత్రిలలో ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాలి
పరకాల ఫైర్ అధికారి వక్కల భద్రయ్య
పరకాల నేటిధాత్రి
పట్టణంలోని లలితా నర్సింగ్ హోంలో బుధవారం రోజున ఫైర్ అధికారి వక్కల భద్రయ్య ఆధ్వర్యంలో 3వరోజు వారోత్సవాలు నిర్వహించారు.హాస్పటల్ సిబ్బంది,డాక్టర్లు,చిత్స నిమిత్తం వచ్చిన వారికి అగ్ని ప్రమాదాల నివారణకు తగుచర్యల గురించి అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా అధికారి భద్రయ్య మాట్లాడుతూ పట్టణ కేంద్రంలోని హాస్పిటల్ యాజమాన్యం అగ్నిప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మెలుకువలు సిబ్బందికి తెలిపారు.కరపత్రాలను హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేశారు.ప్రమాదాలను నివారించెందుకు హాస్పటల్ లో ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో చారి,డ్రైవర్ సురేష్ ,శ్రీకాంత్,అజయ్ కుమార్,రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు.