తంగళ్ళపల్లి మండలంలో ప్రతి గ్రామీణ ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు…

తంగళ్ళపల్లి మండలంలో ప్రతి గ్రామీణ ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలంలో ప్రతి గ్రామంలోని ప్రజలకు. తెలియజేయుట.విషయం ఏమనగా ఈరోజు 31 డిసెంబర్. సంవత్సరం ఆఖరి రోజు సందర్భంగా .ప్రతిగ్రామంలో యువత యువకులు ప్రజలు నూతన సంవత్సర పండుగ జరుపుకోవాలని ఆశిస్తూ అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వి సుర్సుతంగ.డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు వాహనాల తనిఖీలు. నిర్వహించ.బడునని తెలియజేయడం జరిగింది ఏమైనా కార్యక్రమాలు ఉంటే మండల సంబంధిత పోలీస్ అధికారులు సమాచారం ఇచ్చి అనుమతులు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ముఖ్యంగా యువత మద్యం మత్తులోవాహనాలు నడపడం. రాష్.డ్రైవింగ్ చేయడం.వాహనాల.సైలెన్సర్ తొలగించి శబ్ద కాలుష్యం సృష్టించిన.త్రిబుల్.రైడింగ్ చేయడం లాంటివి పాల్పడిన. ఇళ్లపై. ప్రైవేటు ఆస్తుల. వీధి.దీపాలపై రాళ్లు వేయడం ఆస్తుల్ని ధ్వంసం చేయడం మహిళలను ఇబ్బంది పెట్టడం లేదా అసభ్యంగా ప్రవర్తిస్తే. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడునని.ముఖ్యంగా యువత నూతన సంవత్సర వేడుకల్లో నిషేధిత డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలు వినియోగించినలేదా విక్రయించడానికిపాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని. బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వ స్థలంలో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామని. ప్రజలు యువత నూతన సంవత్సరం వేడుకలను తమ కుటుంబ సభ్యులతో కలిసి శాంతియుతంగా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని తెలియజేస్తూ. పై నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రజలు వెంటనే .100 .కు సమాచారం అందించాలని దీనిపై వెంటనే స్పందించి పోలీసులు చేరుకొని కఠిన చర్యలు తీసుకుంటారని. తెలియజేశారు.తంగళ్ళపల్లి మండల గ్రామీణ గ్రామ ప్రజలకు 2026 సంవత్సరం ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తూ తంగళ్ళపల్లి. ఎస్సై ఉపేంద్ర చారి. పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినారు

తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే….

తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే. తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీస్ విధులు ఉండాలని. ప్రతి ఫిర్యాదుపై తక్షణం స్పందించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని. తంగళ్ళపల్లి మండల పరిధిలోని రౌడీ షీటర్. హిస్టరీ సీటర్లపై.ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రతిరోజు మండల o లో. గ్రామ గ్రామాల్లో పెట్రోలింగ్ చేయాలని. పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో సిబ్బంది అధికారులు తనిఖీ చేస్తూ వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ చట్ట వ్యతిరేకతమైనకార్యక్రమాలు నిర్వహించే వారిపై ప్రత్యేకంగా నిఘ ఏర్పాటు చేయాలని. సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై కొత్తగా రౌడీషీట్ ఓపెన్ చేయాలని. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుండే తగిన కార్యచరణ ప్రారంభించి. ప్రశాంతత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉండాలని. స్టేషన్ పరిధిలో క్రిటికల్ నాన్ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో విజిబుల్ పోలింగ్ పకడ్బందీగా అమలు చేస్తూ శాంతి భద్రతల అంశాలను ముందస్తు సమాచారం సేకరించి సమస్యల తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని. పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు యువతకు గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై నిఘ పెంచాలని. గంజాయి డ్రగ్స్ సేవిస్తే వాటి వలన కలుగు కష్టనష్టాలను రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని వీటి నియంత్రణపై మత్తు పదార్థాలకు అలవాటు పడినవారికి. కలుగు అనర్ధాలపై. నేరాల నియంత్రణపై అవగాహన చేస్తూ వారిని చైతన్యపరచాలని తెలియజేస్తూ ప్రతిరోజు విస్తృతంగా వాహనాలు తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని. వీటన్నిటిపై. ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ. వార్షిక తనిఖీల్లో భాగంగా తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిసరాలను వివిధ కేసులలో సీజ్ చేసిన వాహనాల వివరాలను స్టేషన్కు సంబంధించి పలు రికార్డులను తనిఖీ చేశారని. స్టేషన్ భౌగోళిక. మ్యాపు పరిశీలించి క్రైమ్ హాట్స్పాట్ అడిగి తెలుసుకున్నారని.అనంతరం పెండింగ్.కేసులు కోర్టు కేసులో ప్రస్తుత దర్యాప్తులో ఉన్న కేసులకు క్షుణ్ణంగా రివ్యూ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసి స్టేషన్.పరిధిలోని శాంతి పద్ధతులు పరిస్థితులను స్థితిగతులపై సై వివరంగా అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ వెంట. రూలర్ సీఐ మొగిలి ఎస్సై ఉపేంద్ర చారి తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది. పాల్గొన్నారు

గ్రామాలలో పకడ్బందీగా విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి…

గ్రామాలలో పకడ్బందీగా విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి.

వార్షిక తనిఖీల్లో భాగంగా తంగాలపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

సిరిసిల్ల/తంగళ్ళపల్లి (నేటి ధాత్రి):

 

శుక్రవారం రోజున వార్షిక తనిఖీల్లో భాగంగా తంగాలపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీకిలో భాగంగా స్టేషన్ పరిసరాలను , వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాల వివరాలు,స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేసి,స్టేషన్ భౌగోళిక మ్యాప్ పరిశీలించి క్రైం హాట్స్పాట్స్ అడిగి తెలుసుకున్నారు.

అనంతరం పెండింగ్ కేసులు,కోర్టు కేసులు,ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు క్షుణ్ణంగా రివ్యూ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసి స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితులు,నేరాల స్థితిగతులపై సవివరంగా అడిగి తెలుసుకున్నారు

ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీస్ విధులు ఉండాలని,ప్రతి ఫిర్యాదుపై తక్షణం స్పందించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు,హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పెట్రోలింగ్ సమయంలో సిబ్బంది,అధికారులు తనిఖీ చేస్తూ వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై కొత్తగా రౌడీషీట్స్ ఓపెన్ చేయాలని ఆదేశించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుండే తగిన కార్యాచరణ ప్రారంభించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సంసిద్దంగా ఉండాలని ఆదేశించారు.స్టేషన్ పరిధిలో క్రిటికల్, నాన్ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్ పకడ్బందీగా అమలు చేస్తూ శాంతి భద్రతల అంశాలను ముందస్తు సంచారం సేకరించి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు యువతకు గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై నిఘా కఠినతరం చేస్తునే వాటి వలన కలుగు అనర్ధాలపై, సైబర్ నెరల నియంత్రణ పై చైతన్య పరచాలని,రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ప్రతి రోజు విస్తృతంగా వాహన తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలన్నారు.

ఎస్పీ వెంట సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి, ఎస్.ఐ ఉపేందర్, సిబ్బంది ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version