సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు గడువును పెంచాలి
కోటపల్లి మండల బీఆర్ఎస్ సోషల్ మీడియా బాపు నాయక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలంలో వివిధ గ్రామాలలోని వేల ఎకరాల పత్తి పంట నిలిచిపోయిందని బాబు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.చేతికొచ్చిన పత్తి పంట కొనుగోళ్ళు ఆపితే దళారుల రాజ్యం పాలవుతుందని,పత్తి కొనుగోలు ప్రక్రియను మార్చి నెల చివరిదాకా కొనుగోలు సాగించాలని,లేకుంటే పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు.జిల్లాలో ఇప్పటికి 40% పత్తి రైతుల ఇంటి వద్ద అలాగే నిల్వచేసి ఉన్నాయని,ఏదైనా అకాల వర్షం వాటిలితే పత్తి రైతులు నష్టపోయే అవకాశం ఉందని అన్నారు.అలాగే కూలీల కొరతతో పాటు రవాణా సమస్యల వల్ల పత్తి మొత్తం కొనుగోలు కేంద్రాలకు తరలించక పోయారని అధిక వర్షాలతో పత్తి ఉత్పత్తి ఆలస్యంగా జరిగిందని ఇప్పటికీ చేనులలో పత్తి ఉందని ఇలాంటి పరిస్థితుల్లో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలను నిలిపివేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని కొనుగోలు కేంద్రాలు మూసివేస్తే ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరలు చెప్పి రైతులను దోచుకునే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికే కొందరు వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువ కు పత్తి కొనుగోలు చేస్తున్నారని,పత్తి పండించడానికి రైతులు భారీగా పెట్టుబడులు పెట్టారని,సరైన ధర రాకపోతే అప్పుల బారిన పడే ప్రమాదం ఉందని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి కోతలు విధించకుండా పత్తి కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో పని చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.ఏదైనా సమస్య ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకొని మార్చి చివరి వరకు సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు గడువును పెంచాలని కోటపల్లి మండల బీఆర్ఎస్ సోషల్ మీడియా బాపు నాయక్ డిమాండ్ చేశారు.
