పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి…

పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి

చందుర్తి, నేటిధాత్రి:

పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు అన్నారు.పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ వారి ఆధ్వర్యంలో చందుర్తి మండ ల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా నుండి వరకు విద్యార్థులతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. వారి త్యాగం సమాజం ఎప్పటికి మారువదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

రక్తదానం చేసిన మండల కాంగ్రెస్ నాయకులు…

 

 

రక్తదానం చేసిన మండల కాంగ్రెస్ నాయకులు
* ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం
* ఎస్పీ కార్యాలయ ఆవరణలో రక్తదాన శిబిరం
మహాదేవపూర్ అక్టోబర్ 21 (నేటి ధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేపూర్ మండలం కాంగ్రెస్ నాయకులు మంగళవారం రోజున ఎస్పీ కార్యాలయ ఆవరణలోని రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. పోలీస్ అమరవీరుల దినోత్సవ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఎస్పీ కిరణ్ కరే, డీఎస్పీ సత్యనారాయణ, సిఐ వెంకటేశ్వర్లు, పవన్ కుమార్ లా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో మండల కాంగ్రెస్ నాయకులు కటకం అశోక్, బుర్రి శివరాజు తో పాటు పలువురు నాయకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ మోతే సాంబయ్య, గ్రామ నాయకులు ఆకుల శ్రీధర్, ఎలకండి శ్రీకాంత్, బుర్రి మహేందర్, కళ్యాణ్, హరీష్ తోపాటు పలువురు నాయకులు, ఎస్పీ కార్యాలయ సిబ్బంది, రక్తదాన శిబిర సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version