పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
చందుర్తి, నేటిధాత్రి:
పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు అన్నారు.పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ వారి ఆధ్వర్యంలో చందుర్తి మండ ల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా నుండి వరకు విద్యార్థులతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. వారి త్యాగం సమాజం ఎప్పటికి మారువదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
