రక్తదానం చేసిన మండల కాంగ్రెస్ నాయకులు
* ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం
* ఎస్పీ కార్యాలయ ఆవరణలో రక్తదాన శిబిరం
మహాదేవపూర్ అక్టోబర్ 21 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేపూర్ మండలం కాంగ్రెస్ నాయకులు మంగళవారం రోజున ఎస్పీ కార్యాలయ ఆవరణలోని రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. పోలీస్ అమరవీరుల దినోత్సవ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఎస్పీ కిరణ్ కరే, డీఎస్పీ సత్యనారాయణ, సిఐ వెంకటేశ్వర్లు, పవన్ కుమార్ లా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో మండల కాంగ్రెస్ నాయకులు కటకం అశోక్, బుర్రి శివరాజు తో పాటు పలువురు నాయకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ మోతే సాంబయ్య, గ్రామ నాయకులు ఆకుల శ్రీధర్, ఎలకండి శ్రీకాంత్, బుర్రి మహేందర్, కళ్యాణ్, హరీష్ తోపాటు పలువురు నాయకులు, ఎస్పీ కార్యాలయ సిబ్బంది, రక్తదాన శిబిర సిబ్బంది పాల్గొన్నారు.
