ఆత్మకూరులో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు…

ఆత్మకూరులో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

పరకాల,నేటిధాత్రి

నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా పార్టీ నాయకులు కేక్ కట్ చేసి,పండ్లు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.ఈ కార్యక్రమం మండలాధ్యక్షుడు మరుగిద్దె రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో జరిగింది.ముఖ్య అతిథిగా నియోజకవర్గ బాధ్యులు కందుకూరి నరేశ్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ వేడుకల్లో పలువురు స్థానికనాయకులు,కార్యకర్తలుపాల్గొన్నారు.వారిలో మండల నాయకులు,
యువజన ప్రతినిధులు,పార్టీ కార్యకర్తలు ఉన్నారు.ఈ సందర్భంగా నాయకులు కందుకూరి నరేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు.ఐటీ రంగ అభివృద్ధి,పెట్టుబడుల ఆకర్షణ,మౌలిక వసతుల విస్తరణ,రైతు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఆయన పాత్ర విశేషమని నరేష్ పేర్కొన్నారు.ఆయన దూరదృష్టి,పరిపాలనా నైపుణ్యం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించిందని అన్నారు.చివరగా,ముఖ్యమంత్రి దీర్ఘాయుష్షు,ఆరోగ్యం కలగాలని కోరుతూ పార్టీ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

వనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎ పి సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

వనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎ పి సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
76వ జన్మదిన వేడుకలు పారి నేతలు ఘన o గా జరుపుకున్నారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు ఈ వేడుకల సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంటు కన్వీనర్ బి రాములు మాట్లాడుతూ నిరంతర శ్రామికుడు, అలుపెరుగని యోధుడు, నిత్య కృషివలుడు ,సైబరాబాద్ సృష్టికర్త, పేదల పెన్నిధి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు వనపర్తి జిల్లా తెలుగుదేశం వనపర్తి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కే లక్ష్మయ్య న్యాయ వాది షాకీర్ హుస్సేన్ శ్రీను ట్రాక్టర్ బాలయ్య, హోటల్ బలరాం ,ఏ చిన్నయ్య ,మేదరి బాలయ్య, హుస్సేన్ బి శేఖర్ ,శివయ్య చారి, చీర్ల గోవర్ధన్ , ఎం డి ఫారుక్ కి గిరి జంగిడి సురేష్, కొత్తగోళ్ల శంకర్ డి బాలరాజు తదితరులు పాల్గొన్నారు

*పిల్లలకు ఒత్తిడి లేని విద్యనందించాలి…

*పిల్లలకు ఒత్తిడి లేని విద్యనందించాలి…

*ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సతీమణి రేణుకా రెడ్డి…

పలమనేరు(నేటిధాత్రి:

ప్రస్తుత విద్యా విధానంలో పిల్లలపై తీవ్రమైన ఒత్తిడి ఉందని, దీనివల్ల పిల్లలు డిప్రెషన్‌కు లోనవుతున్నారని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి సతీమణి రేణుకా రెడ్డి పేర్కొన్నారు.
గంగవరం మండలంలో ప్రీ ఆన్ ఫ్యూచర్ ప్రైవేట్ పాఠశాల ప్రారంభోత్సవానికి సోమవారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె పూజలు నిర్వహించిన అనంతరం పాఠశాలను ప్రారంభించారు.
​ వినూత్నమైన ప్లే-బేస్డ్ ఎర్లీ ఎడ్యుకేషన్ స్కూల్‌ను ప్రారంభించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
ఆటల ద్వారా సాగే ఈ విద్యా విధానం పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, శారీరక మరియు మానసిక ఎదుగుదల, సోషల్ స్కిల్స్ మరియు సృజనాత్మకతను పెంపొందించడానికి సహాయపడుతుందని ఆమె వివరించారు. ఈ విధానం వల్ల పిల్లలు ఆత్మవిశ్వాసంతో పెరుగుతారని, భవిష్యత్తులో వారికి ఎటువంటి అలవాట్లు లేకుండా మంచి పౌరులుగా ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నూతన విద్యా విధానాన్ని అర్థం చేసుకుని, తల్లిదండ్రులు కూడా సహకరించాలని ఆమె కోరారు. అనంతరం ​పాఠశాల నిర్వాహకురాలు మౌనికకు మరియు ఆమె బృందానికి అభినందనలు ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలమనేరు, గంగవరం, బైరెడ్డి పల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

*ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన

*ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

చిత్తూరు(నేటిధాత్రి:

నిత్య కృషీవలుడు, నవ్యాంధ్ర సాధనలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు కేక్ కట్ చేసి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
చంద్రబాబు దూరదృష్టి, ప్రజల సంక్షేమం కోసం ఆయన పడే తపన అభినందనీయమని, ఆయన ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని, రాష్ట్ర అభివృద్ధికి మరింత సేవలందించాలని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో టిటిడి నాయకులు రాజశేఖర్ నాయుడు,
సోమశేఖర్ నాయుడు వాసు నాయుడు, గందమనేని నరేష్, బిజేపి చిన్నగొట్టిగల్లు మండలాధ్యక్షులు దండు కిషోర్ కుమార్ సింగిల్ విండో చైర్మన్ మత్తుం ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version