అంగన్వాడి కేంద్రంలో ఈసీసీఈ దినోత్సవం ఘనంగా నిర్వహణ
ఆటపాటల ద్వారా చిన్నారులకు విద్య – అంగన్వాడి టీచర్ నల్లభారతి
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట ప్రాజెక్టు పరిధిలోని నర్సంపేట–4 అంగన్వాడి కేంద్రంలో శనివారం ఈసీసీఈ (ప్రారంభ బాల్య సంరక్షణ, విద్య) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ నల్లభారతి మాట్లాడుతూ బడికి సంసిద్ధత, పిల్లల్లో నైపుణ్యాల అభివృద్ధి అనే అంశాలపై అవగాహన కల్పించారు.రెండున్నర సంవత్సరాలు పూర్తైన పిల్లలను అంగన్వాడి కేంద్రంలో ప్రీ-స్కూల్లో చేర్చి ఆటపాటల ద్వారా విద్య బోధిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐదు సంవత్సరాలు పూర్తయిన పిల్లలను ప్రాథమిక పాఠశాలలో చేర్పిస్తున్నామని తెలిపారు.అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు ఎలాంటి ఖర్చు లేకుండా పౌష్టికాహారం అందించడంతో పాటు పూర్వ గణితం, పూర్వ లిఖితం, పఠనం వంటి ప్రాథమిక విద్యా అంశాలను బోధిస్తూ పాఠశాలకు సంసిద్ధులను చేస్తున్నామని వివరించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు మహ్మద్ గౌసియా, ఆయా సునీతతో పాటు ప్రీ-స్కూల్ పిల్లల తల్లులు చామంతుల మానస, నగునూరి మౌనిక, బూస ప్రవళిక, బల్ల అనూష, రామగిరి శిరీష, మద్దెల శృతి, బాదావత్ దివ్య, బొల్లు శ్రావణి, అయిత శ్రీకళ, బోళ్ల సుష్మిత, బల్ల కవిత తదితరులు పాల్గొన్నారు
