కేసుల పరిష్కారానికి నూతన కోర్టులు ప్రారంభం
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు నూతనంగా శాంక్షన్ అయినటువంటి రెండు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ శనివారం వర్చువల్ విధానంలో ప్రారంభించారుఈ సందర్భంగా వారు మాట్లాడుతు పెండింగ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారానికి కొత్తగా కోర్టులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
జ్యూడిషల్ ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం బాగున్నప్పుడే విధులు సక్రమంగా నిర్వహిస్తారని అందుకోసం మూడు జిల్లాల న్యాయ శాఖ ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం అభినందించదగిన విషయం అన్నారు.
స్థానిక ప్రెస్ క్లబ్ సమీపంలో ఏర్పాటు చేసిన కోర్టులను, అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రీడలను వారు ప్రారంభించారు.
హై కోర్టు న్యాయమూర్తి, మూడు జిల్లాల అడ్మినిస్ట్రేటివ్ జడ్జి వి. వేణుగోపాల్ హై కోర్టు న్యాయమూర్తులు నామవరపు రాజేశ్వర్ రావు బి. ఆర్. మధుసూదన్ రావు హై కోర్టు చీఫ్ జస్టిస్ తో కలిసి వర్చ్యువల్ కార్యక్రమం లో అతిధులుగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ రమేష్ బాబు ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. వి. పి సూర్య చంద్రకల మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మొహమ్మద్ అబ్దుల్ రఫీ, న్యాయమూర్థులు ఏ. నాగరాజ్, కన్నయ్య లాల్, ఎస్. ఆర్. దిలీప్ కుమార్ నాయక్, జి. అఖిల,
అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి. శ్రీనివాస చారి, ప్రధాన కార్యదర్శి వి. శ్రవణ్ రావు, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
