లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.
ఆమనగల్లు / నేటి ధాత్రి :
కల్వకుర్తి నియోజకవర్గం లోని ఆమనగల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో తన అమ్మమ్మకు చెందిన భూమిని నమోదు చేసేందుకు, రికార్డుల్లో తప్పులను సవరించేందుకు ఒక వ్యక్తి వద్ద రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ చింతకింది లలిత, సర్వేయర్ కోట రవిబాధితుడి ఫిర్యాదు మేరకు రూ.50,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.