విద్యార్థులకు ప్రైమరీ నుండే ప్రావీణ్యత కల్పించాలి.

జిల్లా విద్యాశాఖ మానిటరింగ్ అధికారి సృజన్ తేజ, మండల నోడల్ అధికారి వెంకటేశ్వర్లు.

దుగ్గొండి,నేటిధాత్రి :

ప్రైమరీ సెక్షన్ నుండే విద్యార్థులకు ప్రావీణ్యత కల్పించేలా ప్రణాళికలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ మానిటరింగ్ అధికారి సృజన్ తేజ,దుగ్గొండి విద్యాశాఖ మండల నోడల్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి, దుగ్గొండి,నాచినపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలకు చెందిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశం మల్లంపల్లి ఉన్నత పాఠశాలలో నిర్వహించారు.ఈ కాంప్లెక్స్ సమావేశంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రామస్వామి,దేవేందర్,జ్యోతిలక్ష్మిలు అధ్యక్షత వహించారు. జిల్లా మానిటరింగ్ అధికారి సృజన్ తేజ మాట్లాడుతూ బోధనలో అలైన్మెంట్ పాటించాలని మల్టి టీచింగ్ లో భాగంగా విద్యార్థులకు వర్క్ బుక్ పూర్తి చేయడానికి పూర్తిగా సహకరించాలని తెలిపారు. ఐదో తరగతి విద్యార్థులు పదివేల స్థాన విలువ వరకు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని, ప్రైమరీ లెవెల్ లో చదవడం రాయడం చతుర్విధ ప్రక్రియలు నేర్పించడం వలన ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు.(ఫౌండేషన్ లీటరసీ న్యూమరసి) పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. ప్రతి పాఠశాలలో లాంగ్ ఆబ్సెంట్ ఉన్న విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులతో పాఠశాలకు వచ్చే విధంగా చూడాలని సూచించారు.పాఠశాలలో స్వచ్ఛతాహి సేవ సంస్కార్ కార్యక్రమాన్ని నిర్వహించాలని దానికి సంబంధించిన ఫొటోలను గూగుల్ లింకులో అప్లోడ్ చేయాలని తెలిపారు. పాఠశాలలో ఎండిఎం డిస్ప్లే, కిచెన్ గార్డెన్, పోస్ట్ బాక్స్, ఉండాలని, ప్రతి పాఠశాల అన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయాలని జిల్లా అధికారి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మూడు కాంప్లెక్స్ లకు చెందిన 33 మంది ఉపాధ్యాయులు,స్టేట్ రిసోర్స్ పర్సన్ ఏవి ఎల్ఎన్ చార్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *