అజాతశత్రువు వద్దిరాజు.. వితరణలో మహారాజు.

`సామాజికంగా అందరివాడు.

`రాజకీయంగా అందరికీ నచ్చే మనసున్న నాయకుడు.

`నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడే నాయకుడు.

`తెలంగాణలో బలమైన బిసి నాయకుడు.

`అన్ని వర్గాలను కలుపుకుపోయే ఆదర్శప్రాయుడు.

`సాయం కోసం వచ్చే వారి దృష్టిలో రంతిదేవుడు.

`శిబి చక్రవర్తిలాంటి సహనమున్న వితరణ శీలి వద్దిరాజు.

`ఆపదలో వున్న వారిని ఆదుకునే మానవత్వం నిండిన వాడు.

`రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్న ఒక ప్రజానాయకుడు

`బిఆర్‌ఎస్‌ కు బలమైన వెన్నుదన్నుగా నిలిచిన నాయకుడు.

`కేసిఆర్‌ మనసు గెలుచుకున్న అంకిత భావం వున్న నాయకుడు.

`ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయం చేస్తాడు.

`అన్ని పార్టీలు గౌరవించేంత వ్యక్తిత్వం వున్న నాయకుడు.

`పార్లమెంటు పలు స్థాయీ సంఘాలలో సభ్యుడు.

`డిల్లీలో సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహానికి, పోలీస్‌ అమరవీరుల స్తూపానికి గ్రానైట్‌ అందించిన దేశ భక్తుడు.

`జాతీయ స్థాయిలో పార్టీలకతీతంగా పలుకుబడి వున్న నాయకుడు.

`తెలంగాణలో అందరూ అభిమానించే కొద్ది మందిలో వద్దిరాజు ఒకరు

`అర్థరాత్రి తలుపుతట్టినా సాయం చేస్తాడు.

`ఆపదలో వున్నవారిని ఆదుకుంటాడు.

`కరోనా కాలంలో రవిచంద్ర చేసిన సాయం మరే నాయకుడు చేసి వుండరు.

`ఇటువల ఖమ్మం వరదల సమయంలో అనేక కుటుంబాలను ఆదుకున్నారు.

`ఖమ్మం ప్రజలు దేవునిగా వద్దిరాజును కీర్తిస్తున్నారు.

`కేంద్రంలో పెట్రోలియం సహజ వాయువు శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులుగా వున్నారు.

`బొగ్గు గనుల శాఖ సంప్రదింపుల సంఘం సభ్యులుగా నియమితులైన వద్దిరాజు రవిచంద్ర

హైదరాబాద్‌,నేటిధాత్రి:
వద్దిరాజు రవిచంద్ర. తెలంగాణలో ఈ పేరు తెలియని వాళ్లు ఎవరూ వుండరు. గొప్ప సామాజిక వేత్తగా ఆయనకు వున్న గుర్తింపుతోపాటు, మానవత్వం మూర్తిభవించిన వ్యక్తిగా ఆయనకు ఎంతో మంచి పేరుఉంది. అన్నా అని సాయం అడితే చాలు ఇప్పటి వరకు కాదని ఎవరినీ అనలేదు. లేదని ఎవరితోనూ చెప్పలేదు. సాయం చేయకుండా వుండలేదు. తనకు తెలిసి వాళ్లెవరైనా సరే ఎంతటి కష్టంలో వున్నా సరే వారిని ఆదుకోకుండా వున్న సందర్భాలే లేవు. ఆయనకు తెలిసిన వారిలో ప్రత్యకంగా తమ సమస్యలను తెలియజేయలేని స్దితిలో వున్నా, ఎవరి ద్వారానైనా ఫలానా వారికి ఇబ్బందులున్నాయని తెలిసినా సరే వారిని ఆదుకుంటారు. సమస్యలను గట్టెక్కిస్తారు. అంతటి గొప్ప మనస్తత్వం వున్న నాయకుడు వద్దిరాజు రవిచంద్ర. మన చుట్టూ వున్న సమాజంలో ఇలాంటి వ్యక్తిత్వం, మానవత్వం వున్న వారు చాల ఆరుదుగా వుంటారు. సంపాదనలో మేటిగా వున్నవారు, ఉన్నత ధనవంతులెవరూ సామాన్యులను కలిసేందుకు ఇష్టపడరు. వారి వ్యక్తిగత జీవితంలో ఎవరికీ అందనంత ఎత్తులో వుంటారు. కాని వద్ది రాజు రవిచంద్ర ప్రజల్లో వుంటారు. ప్రజల కోసం పనిచేస్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాటానికి అవసరమైన ఆర్ధిక చేయూతనందించారు. కాని ఎక్కడా తనకు పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడలేదు. ప్రత్యక్ష తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించకపోయినా తెలంగాణ వాదులందరికీ ఆయన ఇచ్చిన చేయూత తెలుసు. అందుకే తెలంగాణ ఉద్యమాకారులంతా ఆయనను ఎంతో గొప్పగా కీర్తిస్తారు. ఆయన అందించిన ఉద్యమ సాయం అంతా ఇంతా కాదు.
సామాన్యులకు ఆయన చేసిన ఉద్యమ సేవ తెలియదు. కాని అన్ని పార్టీల నాయకులకు, తెలంగాణ ఉద్యమకారులకు ఆయన అందించిన అండాదండలు అందరికీ తెలుసు. ఇక ఆయన ఎంతో దేశ భక్తుడో చాలా మందికి తెలియదు. డిల్లీలో పోలీసు అమరవీరుల స్ధూపం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకున్న సందర్భంలో అవసరమైన గ్రానైట్‌ను ఉచితంగా అందించిన నాయకుడు వద్దిరాజు రవిచంద్ర. అంతే కాకుండా డిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహానికి అవసరమైన గ్రానైట్‌ను అందించి తనకు దేశం పట్ల, దేశ స్వాతంత్ర సమరయోదుల పట్ల ఎంత గౌరవం వుందో చూపించారు. దేశమంటే ఆయన ఎంత ప్రేమిస్తారో ఈ రెండు వితరణలను చూస్తేనే అర్ధమౌతోంది. కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే గ్రానైట్‌ను తెలంగాణ నుంచి పంపించి తన దేశభక్తిని చాటుకున్నారు. ప్రజలకు సాయం చేస్తూ వుంటారు. అంతే కాదు సమాజానికి అవసరమైన ఎన్నొ సేవా కార్యక్రమాలు విసృతంగా చేపడుతుంటారు. ఆయనకు తెలిసి వారిలో సాయం అందుకోని వారు వుండరు. అటు రాజకీయ నాయకులైనా, ఇటు సామాన్య ప్రజలైనా. అలా అందిరినీ తన కుటుంబ సభ్యులుగా చూసుకునే నాయకులు వద్దిరాజు రవిచంద్ర. తన కోసం వచ్చిన ఏ వ్యక్తినైనా సరే ఎంతో ప్రేమగా పలకరిస్తారు. దగ్గరుండి వారి సమస్యలు తెలుసుకుంటారు. అందుకే మంచితనానికి మారుపేరుగా చెప్పుకుంటారు. సమాజంలో కొందరే అజాతశత్రువులుగా కీర్తింపబడుతుంటారు. వాళ్లు అందిరకీ బంధువులౌతుంటారు. ఆపద్భాందవులుగా మారుతారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా చలించిపోతుంటారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో అనూహ్యంగా వరదలు వచ్చాయి. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లలోకి నీరు చేరిపోయి సర్వస్వం కోల్పోయిన వారున్నారు. కనీసం మంచినీళ్లు కూడా అందలేని పరిస్దితులు ఎదురయ్యాయి. దాదాపు వారం రోజుల పాటు ప్రజలు నీటిలోనే వున్న పరిస్ధితులు ఎదురయ్యాయి. అలాంటి ప్రజలకు ప్రతి రోజు ఆహారం, మంచినీళ్లు, పాలు, ఇతర అవసరాలు తీర్చిన ఏకైక నాయకుడు వద్దిరాజు రవిచంద్ర.
వరదలు తగ్గినా ప్రజలు నిత్యావసర వస్తువులు లేక ఆకలితో అలమటించకుండా చూసున్నారు. కొన్ని వందల కుటుంబాలను ఆదుకున్నారు. కేవలం ఖమ్మం పట్టణమే కాదు, పక్కనే వున్న గ్రామాల ప్రజలకు ఆయన చేయూతనందించారు. వారిని అదుకుకే ప్రతయ్నం చేశారు. ప్రభుత్వాధి కారులు కూడా వెళ్లలేని ప్రాంతాలకు తన అనుచరుల చేత దగ్గరుండి సేవలు అందించిన నాయకుడు వద్దిరాజు రవిచంద్ర. ఇలా సమాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించి, ప్రజల మేలు కోసం పాటుపడే నాయకుడు. దేశమంతా కరోనా కాలంలో ఎలాంటి పరిస్దితులు ఎదురయ్యాయో తెలియంది కాదు. పేద ప్రజలు ఎన్ని అవస్దలు ఎదుర్కొన్నారో చెప్పనలవి కాదు. ఆ సమయంలో వద్దిరాజు రవిచంద్ర రాజులాగా ప్రజలుకు సాయం అందించారు. ఆయన ఎన్ని వేల మందికి సాయం చేశారో చెప్పలేం. ఖమ్మం జిల్లాలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఆయన ఎంతో మందికి కరోనా సమయంలో అనేక సహాయ సహకారాలు అందించారు. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి వారిని ఆదుకున్నారు. ఖమ్మం జిల్లాలో కొన్ని వేల కుటుంబాలకు అన్నంపెట్టారు. అంతే కాకుండా ఆ సమయంలో వైద్య సహాయం అందించడం అన్నది ఎంత గొప్ప కార్యక్రమమో ప్రత్యేకంగా చెప్పాలిన పనిలేదు. కొన్ని వందల మందికి ఆయన వైద్య సాయం అందించారు. కరోనా వైద్యానికి అవసరమైన సేవ చేశారు. ఎంతో మందికి వైద్యానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. వారి ప్రాణాలను కాపాడి ప్రాణదాత అయ్యారు. ఇక రాజకీయంగా ఆయన అందరి వాడు. వ్యక్తిగతంగా బిఆర్‌ఎస్‌ పార్టీలో వున్నప్పటికీ ఆయన అన్ని పార్టీల నాయకులతో జేజేలు పలికిం చుకోగల నాయకుడు. పార్టీలకతీతంగా ఆయన అందరినీ కలుపుకుపోతుంటారు. ఆయనను అభిమానించే వారిలో అన్ని పార్టీల నాయకులుంటారు. వ్యక్తిగతంగానే కాదు, రాజకీయంగా కూడా ఆయనపై విమర్శలు చేయడానికి ఏ పార్టీ నాయకులు ఇష్టపడరు. అంతటి గొప్ప మానవతా వాది వద్దిరాజు రవిచంద్ర. రాజకీయంగా అందరినీ ప్రేమిస్తుంటాడు. బిఆర్‌ఎస్‌ అధికారంలో వున్నప్పుడు గాని, ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడుగాని ఆయనను రాజకీయ నాయకుడిగా కన్నా, మానవతా వాదిగానే అందరూ చూస్తారు. ఆయనను అభిమానిస్తారు. అందుకే ఆయన కూడా తనను అన్నా పిలిచిన వాళ్లందరినీ ఆదరిస్తుంటారు.
అం దరికీ తలలో నాలుకలా వుంటారు. నమ్మిన సిదాంతం కోసం ప్రాణం పెట్టే నాయకుడు. అలాంటి నాయకుడి గురించి ఈ తరానికి కూడా ఎంతో కొంత తెలియాల్సిన అవసరం వుంది. ఆయన మహాబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి అనే గ్రామంలో జన్మించారు. వరంగల్‌లో విద్యాభ్యాసం చేశారు. కాని చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు ఎత్తుకోవాల్సివచ్చింది. తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ గ్రానైట్‌ వ్యాపారంలోకి వెళ్లారు. అక్కడ కూడా సూపర్‌ సక్సెస్‌ సాదించారు. నెంబర్‌ వన్‌ గ్రానైట్‌ వ్యాపారిగా ఎదిగారు. ఆయన చేసిన గ్రానైట్‌ వ్యాపారమే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. తెలంగాణ గ్రానైట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంటుగా కొనసాగుతున్నారు. మున్నూరు కాపుల ఐక్య వేధికకు కూడా ఆయన గౌరవాద్యక్షులుగా వున్నారు. అంటే తెలంగాణలో వున్న కాపులందరికీ ఆయన బంధువే. అన్ని సంఘాలు ఆయనను గౌరవిస్తున్నవే. అన్ని కాపు సంఘాలు ఆయనను కోరుకున్నారు. అందుకే ఆయనను అందరివాడు అంటారు. బిసిలలో సామాజిక చైతన్యం, రాజకీయాలలో కీలకభూమిక కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. 2018 ఎన్నికల దాకా ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. కాని కాంగ్రెస్‌ పార్టీ ఒత్తిడి మేరకు చేరాల్సివచ్చింది. 2018 ఎన్నికల్లో వరంగల్‌ తూర్పునుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అయితే ఆ సమయంలో తెలంగాణలో అదికారంలో వున్న బిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ పిలుపు మేరకు ఆ పార్టీలో చేరారు. 2022లో రాజ్యసభకు మొదటిసారి ఎన్నికయ్యారు. తర్వాత రెండోసారి 2024లో రాజ్యసభ సభ్యుడయ్యారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!