RTC Strike Halts Services, Workers Protest in Bhupalpally
ఆగిపోయిన ఆర్టీసీ ప్రగతి చక్రాలు
బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ ప్రయాణికులు విద్యార్థులు
భూపాలపల్లి ఆర్టీసీ డిపో ముందు కార్మికుల ధర్నా
ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చెయ్యాలి
2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్ తో అమలు చేయాలి.
ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి డిపో ముందు ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ప్రతినెల 350 కోట్లు కోత విధించకుండా చెల్లించాలి (ప్రభుత్వం ఇవ్వవలసిన పాత బకాయిలు సుమారు 2 వేల 500 కోట్లు వెంటనే విడుదల చేయాలి).
ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి / బెడ్ విన్నర్ స్కీంలో పనిచేస్తున్నవారందరిని రెగ్యులర్ చేయాలి, ఈ పోస్టులను పర్మినెంట్ ఉద్యోగాల కింద భర్తీ చేయాలి.
ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలి/గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించాలి.
అన్ని కేటగిరీలలో పని చేస్తున్న ఉద్యోగులపై అధిక పనిభారాలు తగ్గించాలి.
ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొని ఆర్టీసికి ఇవ్వాలి / ఆర్టీసి స్థలాలను ఈవీ బస్సులకు ఇవ్వరాదు.
మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి.
రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి / అన్ని కేటగిరీలలోని ఖాళీలను భర్తీ చేయాలి.
రిటైరైన ఉద్యోగుల బకాయిలను అన్నిటినీ చెల్లించాలి.
కార్మిక ఐక్యత వర్ధిల్లాలి!

హయ్యర్ పెన్షన్ రిజెక్ట్ అయిన వారికి హయ్యర్ పెన్షన్ పొందేందుకు మరొక అవకాశం ఇవ్వాలి, డిమాండ్ నోటీసు రానివారికందరికీ ఈపిఎఫ్ నుండి డిమాండ్ నోటీసులు ఇప్పించాలి.
అనంతరం ఆర్టీసీ కార్మికుల ధర్నాకు టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై ధర్నాకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి బిల్లును గవర్నర్ వద్ద పంపించాడు కానీ అంతలోనే అసెంబ్లీ ఎలక్షన్లు రావడం జరిగింది మా ప్రభుత్వం పోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది సమస్య మొదలైంది లేకుంటే ఆనాడే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించబడేవి అని వారు అన్నారు కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని వారు పిలుపునిచ్చారు
ఆర్టీసీ కార్మికుల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోఆర్టీసీ జేఎస్ చైర్మన్ బుర్రి తిరుపతి
వైస్ చైర్మన్
వడ్డేపల్లి రవి
కన్వీనర్ బండి శ్రీనివాస్
కో కన్వీనర్ డి రాజయ్య
కోశాధికారి సతీష్
ప్రచార కార్యదర్శి కే ప్రసాద్
సునీత సుమలత అడ్వైజర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు
