రైతు సంక్షేమంలో భాగంగా కొనుగోలు కేంద్రాల ద్వారా వరిధాన్యం నుగోలు
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుండి వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లాలోని జైపూర్ మండలం టేకుమట్ల, ఇందారం,షెట్ పల్లి,నర్సింగాపూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి వరి ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు.అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని త్వరగా ఆరబెట్టి రైస్ మిల్లులకు తరలించాలని,రైతులు ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని,రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు,నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు తూకం యంత్రాలు,ప్యాడి క్లీనర్లు ఇతర సదుపాయాలు కల్పించాలని తెలిపారు.రైతు వివరాలను సిస్టం లో నమోదు చేసి ఆధార్ కార్డు ద్వారా వారి గుర్తింపును దృవీకరించాలని,రైతు భూమి విస్తీర్ణం,పండించిన ధాన్యం వివరాలను సరి చూడాలని, ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండే విధంగా పరిశీలించాలని తెలిపారు.కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతుల బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
