Fertilizer Purchase via App Starts
యాప్ ద్వారా యూరియా కొనుగోలు….
◆-: మండల వ్యవసాయ అధికారి వెంకటేశంl
జహీరాబాద్ నేతి ధాత్రి:
రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువుల (యూరియా) కొనుగోలు ప్రక్రియ నేటి నుండి ప్రారంభమవుతుందని మండలంలోని రైతులు ఫర్టిలైజర్ యాప్ ను ఉపయోగించి అవసరమైన ఎరువులను సులభంగా, పారదర్శకంగా కొనుగోలు చేయవచ్చని ఝరాసంగం మండల వ్యవసాయ అధికారి వెంకటేశం తెలిపారు. ఈ విధానం ద్వారా ఎరువుల సరఫరాలో స్పష్టత, సమయపాలనతో పాటు మధ్యవర్తుల పాత్రను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మండలంలోని అన్ని ఎరువుల డీలర్లు ఈ యాప్ తో అనుసంధానమై ఉన్నారని, రైతులు తమ ఆధార్ నంబర్, రైతు వివరాలతో లాగిన్ అయి ఎరువులు కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఫర్టిలైజర్ యాప్ వినియోగ విధానం పై రైతులకు సహాయం అందించేందుకు ప్రతి ఎరువుల డీలర్ వద్ద ఏ ఈ ఓ లను వాలంటీర్లుగా నియమించడం జరుగుతుందని తెలిపారు. దీనివల్ల రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాప్ ను ఉపయోగించగలరని తెలిపారు. నేటి నుండి ఎరువుల (యూరియా) కొనుగోలు కోసం వచ్చే రైతులు తప్పనిసరిగా తమ ఆధార్ నంబర్ తో పాటు తమ పట్టాదార్ పాస్‌బుక్ (PPB) నంబర్‌ను కూడా తీసుకొని రావాలని సూచించారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఝరాసంగం మండల వ్యవసాయ అధికారి వెంకటేశం కోరారు.ఝరాసంగం మండలంలో ప్రస్తుతం 560 బ్యాగ్స్ అందు బాటులో ఉందని అన్నారు.
