సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్య

సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్య ప్రధానోపాధ్యాయులు విజయ పాల్ రెడ్డి
మొగుళ్లపల్లి నేటి ధాత్రి-

సర్కార్ బడుల్లో ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తుందని మొగుళ్లపల్లి ప్రధానోపాధ్యాయులు పింగిలి విజయ పాల్ రెడ్డి తెలిపారు ప్రభుత్వ ఆదేశానుసారం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొగుళ్లపల్లి ప్రధానోపాధ్యాయులు పింగిలి విజయపాల్ రెడ్డి అధ్యక్షతన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వము ఈ సంవత్సరం 10 శాతం విద్యార్థుల నమోదు పెంచాలని ప్రభుత్వం సూచించగా పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఉపాధ్యాయులందరికీ 20 శాతం నమోదు టార్గెట్గా ఇచ్చారు తర్వాత పాఠశాల యొక్క ప్రగతి ప్రణాళికను వివరించారు.


– ఎస్ఎస్సి 2026 ఫలితాలలో మండలములో, 540 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలవడం తో పాటు 100% ఉత్తీర్ణతను సాధించినందుకు విద్యార్థులను మరియు అందుకు కృషి చేసిన ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులను అభినందించారు
– విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో కలిసి బడి బాట ర్యాలీ నిర్వహించారు.
– ప్రాథమిక పాఠశాల నుండి ఆరవ తరగతి విద్యార్థిని విద్యార్థులను మా పాఠశాలలో చేరాలని పాఠశాల లో అన్ని రకాల వసతులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని, మరీ ప్రత్యేకంగా ఎన్సిసి కలిగిన పాఠశాల
– కావున మీ భవిష్యత్తును తీర్చేదిద్దుకొనడానికి ఎన్సిసి, సర్టిఫికెట్ తో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను అందిస్తున్న సంస్థ అని ఇవి మీ ప్రగతికి ఎంతగానో ఉపయోగపడతాయని మీరు తప్పకుండా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొగుళ్లపల్లి నందు ప్రవేశం పొంది మంచి భవిష్యత్తును పొందగలరని సూచించారు.
– ఈ కార్యక్రమంలో సర్పంచ్ చాట్ల విజయ రవీందర్, ఉప సర్పంచ్ హిమబిందు కోటి , వాడు మెంబర్లు, పాఠశాల చైర్మన్ శిరీష, ఉపాధ్యాయులు వై. సురేందర్, జి.అనిల్ కుమార్,
– బి. కుమారస్వామి, కే. ప్రవీణ్,
– ఎం. రాజు, పి. లలిత, జి. రాజయ్య, శ్రీ కల, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్,సీఆర్పీలు శ్రీనివాస్, రాము, అటెండర్ మజార్, సులోచన, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version