ప్రభుత్వ జూనియర్ కళా శాలలో ఘనంగా విద్యా వారోత్సవాలు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రం లోని స్థానిక ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలను గురు వారం రోజు ఘనంగా జరుపు కున్నారు ఇంటర్ విద్య వారోత్సవాలలో భాగంగా నాలుగవ రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలు విద్యా ప్రమాణాలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు విద్యార్థుల ప్రతిభను ప్రద ర్శించారు. తర్వాత తల్లిదం డ్రులు ,ఉపాధ్యాయుల సమా వేశం నిర్వహించడం, పూర్వ విద్య పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం, ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కందగట్ల కోటేష్, గ్రామ సర్పం చ్ చింతల ఉమా రవిపాల్ , వార్డు మెంబర్ కురాకుల మం జుల అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ దాసరి కల్పన, మెడికల్ ఆఫీసర్ సాయి కృష్ణ, పారా మెడికల్ సిబ్బంది, విద్యార్థి తల్లిదండ్రులు అధ్యాపకులు, మచ్చగిరి స్వామి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి పాల్గొ న్నారు.
