ప్రకృతి వ్యవసాయ సాగుతో మరింత ఆరోగ్య..

ప్రకృతి వ్యవసాయ సాగుతో మరింత ఆరోగ్యం

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మంచిర్యాల,నేటి ధాత్రి:

https://youtu.be/NoviIp1TUK4?si=EohsYI-9HsxUTNf_

 

ప్రకృతి వ్యవసాయ సాగుతో ప్రజల జీవన ప్రమాణాన్ని మరింత పెంపొందించవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాలలో జాతీయ మిషన్ ఫర్ ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత అందించి రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు.ప్రకృతి వ్యవసాయ సాగులో సహజ సిద్ధమైన సేంద్రియ ఎరువులు, సాగు పద్ధతులు అవలంబించడం ద్వారా ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులు సాధించవచ్చని, తద్వారా ప్రజలకు మరింత ఆరోగ్యవంతమైన ఆహార ఉత్పత్తులను అందించవచ్చని తెలిపారు.రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని, పంట సాగులో రైతులకు అవసరమైన మెలకువలను అందించి అధిక దిగుబడి సాధించేలా ప్రోత్సహిస్తుందని తెలిపారు.10 సంవత్సరాల పాటు ప్రకృతి వ్యవసాయ సాగు చేయడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట రైతు వేదిక నుండి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ,ప్రకృతి వ్యవసాయ రైతు కొట్టే రవీందర్,అధికారులతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 15 రైతువేదికలలో 1 వేయి 875 మందితో వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు.ప్రకృతి వ్యవసాయ పథకం పురోగతి దిశగా జిల్లాలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.అనంతరం రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆత్మ చైర్మన్ సింగతి మురళీ,కార్పొరేటర్లు రాజన్న,బియ్యాల త్రివేణి,కమల, లగిశెట్టి రాజయ్య,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version