· స్వాతంత్య్రోద్యమానికి, ఆధునిక జర్నలిజానికి మధ్య తరం ఇది
· సైద్ధాంతిక నిబద్ధతే సర్వంగా పనిచేసిన నిస్వార్థ జర్నలిస్టుల తరం ఇది

· నెమ్మదిగా పశ్చిమాద్రికి చేరుతున్న భానుడితో నడుస్తున్న తరం
· పేద, మధ్యతరగతి వారి సమస్యలతో ప్రభుత్వాన్ని మేý£్కల్పిన తరం

· పదునైన అక్షర చురకత్తులతో సామాజిక మార్పుకోసం పోరాటిన వైనం
· “తండ్రి”లా ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపిన తరం
· “బిడ్డలా” వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
· ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ, సమాచార శాఖలమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలకు “నేటిధాత్రి” దినపత్రిక విజ్ఞప్తి
హైదరాబాద్, నేటిధాత్రి:
స్వాతంత్య్రోద్యమ కాలంలో తమ సర్వస్వస్వం ఉద్యమం కోసం త్యాగం చేసిన వెలుగులోకి రాని మహానుభావులెందరో! అదేవిధంగా నాటి ఉద్యమానికి ఊపిరిగా నిలిచింది జర్నలిజమే! నాటి తొలితరం కాంగ్రెస్ నాయకుల్లో అత్యధికులు తమ రచనలు, వ్యాసాల ద్వారానే ప్రజల్లో చైతన్యాన్ని ఉద్దీప్తం చేయగలిగారు. కేవలం జర్నలిజం మాత్రమే నాటి 19వ శతాబ్దంలో సతీసహగమనాన్ని రూపుమాపడానికి, 20వ శతాబ్దంలో వితంతు పునర్వివాహాల వంటి సంస్కరణోద్యమాలకు మూల స్తంభంగా నిలిచింది, సమాజాన్ని గెలిపించింది. నాటి స్వాతంత్య్రోద్యమ త్యాగాల ప్రేరణతో, స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి కాలంనుంచి నేటి ఆధునిక జర్నలిజం పోకడలకు మధ్య “స్ఫూర్తిదాయక జర్నలిజాన్ని” నెరపి సమాజ హితానికి ఒక తరం జర్నలిస్టులు కషిచేసారనేదానికంటే పో రాటం చేసారని చెప్పడమే సముచితం. “సిద్ధాంతమే” ఈ జర్నలిస్టుల పోరాటానికి స్ఫూర్తి. ఆకలే ఆయుధం, పేదల వెతýను వెలుగులోకి తెచ్చి వారి బతుకులను బాగుచేయడమే లక్ష్యంగా తమ అక్షరాలను చురకత్తులుగా మలచిన గొప్పతరం అది! దళితులు, స్త్రీలు, బలహీనులకోసం వివిధ పంథాలలో పోరాటం చేసి సామాజిక మార్పు అనే “అరుణోదయం కోసం” కషిచేసిన ని స్వార్థ సైద్ధాంతిక నిబద్ధ జర్నలిజం నెరపిన జర్నలిస్టుల తరం, ఇప్పుడు తన ఒడిలోకి రమ్మని ఆ ప్యాయంగా పిలుస్తున్న “పశ్చిమాద్రి ఆరుణకాంతుల” వైపునకు నిశ్శబ్దంగా పయనిస్తోంది. ఆకలికి అన్నం, వేదనకు ఔషదం ఎట్లాగో… క్షుద్బాధను, వ్యాధుల బాధను, నిత్యజీవితంలో సర్వ సమస్యలకు “సిద్ధాంతమే” ఔషధంగా పనిచేసిన త్యాగమయ స్ఫూర్తిదాయక జర్నలిజం నెరపిన తరం ఇది.
కమ్యూనికేషన్ రంగంలో నేటి వేగం, నేటి సాంకేతికత నాడు లేవు. ఎలక్ట్రానిక్ మీడియా లేని కాలంలో కేవలం ప్రింట్ మీడియా మాత్రమే వుండేది. వార్తను సేకరించి కార్యాలయానికి పంపి అది ప్రచురితమైన తర్వాత, దానికి వచ్చిన సానుకూల స్పందన, సమస్యకు పరిష్కారం లభించిన సంతప్తే ఎనలేని సంపదగా భావించిన తరం అది. అయితే అప్పటికీ ఇప్పటికీ వ్యవస్థలో కని పించే సారూప్య లక్షణం తమ రక్షణ కోసం పనిచేసే పోలీస్ స్టేషన్ గడప తొక్కడానికి నేటికీ సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొనడం! ‘పి’ అంటే పొలైట్‌నెస్, ‘ఓ’ అంటే ఒబీడియన్సీ, ‘ఎల’అంటే లాయల్టీ, ‘ఐ’ అంటే ఇంటిగ్రిటీ, ‘సి’ అంటే కర్టసీ, ‘ఈ’ అంటే ఎఫిసియన్సీ అనే నిర్వచనాన్ని అప్పట్లో కొన్ని పోలీస్స్టేషన్ల ముందు రాసి వుండేది. రాజకీయ నాయకులు, పలుకుబడి, సంపన్నుల అండ వున్నవారు మాత్రమే పోలీస్‌స్టేషన్ గడపతొక్కే పరిస్థితి నేటికీ కొనసాగుతోంది. విషయమేంటంటే పైన పేర్కొన్న నిర్వచనంలో ఏ ఒక్కటీ సరిగ్గా పాటించని పోలీసుల వద్దకు వెళ్ల డానికి జంకే జనానికి తమ సమస్యలు చెప్పుకోవడానికి అందుబాటులో వుండేది “జర్నలిస్టు” మాత్రమే. ఒక సామాజిక సమస్యను లేదా సామాన్యులకు జరుగుతున్న అన్యాయాన్ని వెలుగులో కి తేగల ఒకే ఒక సాధకుడు జర్నలిస్టు. నేటి పరిస్థితి మాట ఎట్లా వున్నా నాటి జర్నలిస్టులు సామాన్యులకు, బలహీనులకు అండగా నిలిచి, తన పరిస్థితిని కూడా పట్టించుకోకుండా వారికి న్యాయం జరిగేవరకు పట్టువదలని విక్రమార్కుల మాదిరిగా పనిచేసిన వెలుగులోకి రాని జర్నలిస్టులుఎందరో! ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వుండే ఆధిపత్య ధోరణులను సమర్థవంతంగా ఎదిరించింది కూడా ఆ తరం జర్నలిస్టులే! అందుకనే అప్పట్లో పోలీసులకు, జర్నలిస్టులకు మధ్య “వైరభక్తి” కొనసాగేది.
సాధారణంగా మిగిలిన డాక్టర్లు, ఉపాధ్యాయులు, సైంటిస్టులు, వ్యాపారులు, ప్రొఫెసర్లు…ఈవి ధంగా రకరకాల వత్తుల్లో పనిచేసినవారికి ఆర్థిక భద్రత వుండటం వల్ల వారి కుటుంబ సంక్షే మానికి ఎటువంటి ఢోకా వుండదు. అందువల్ల వారిది ‘వత్తిధర్మం’. కానీ జర్నలిస్టులు పాటించేది “సష్టి ధర్మం”. అంటే సకల జీవులు తమ సంతానాన్ని నిస్వార్థంగా పెంచి, అవి స్వయంగా జీవించే స్థాయికి ఎదిగిన తర్వాత తమను వదలి వెళుతున్నప్పుడు తమ ధర్మాన్ని పాటించామన్న ఆనందంతో ఆనంద భాష్పాలు కారుస్తాయి. ఇదే సష్టిధర్మం అంటే! నానా కష్టాలు పడుతున్న కుటుంబానికి తగిన న్యాయం చేయలేక పోతున్నాన్న తొలిచేస్తున్న బాధను “అక్షరాగ్నిగా” మలచి సమస్యల పరిష్కారం కోసం తాను “నాటిన (రాసిన)అక్షర విత్తనాలు” ప్రచురితమై పరిష్కారం రూపంలో ఫలించినప్పుడు కంటివెంట జలజల రాలిన “ఆనందాశవుýనే” తాగి దప్పిక తీర్చుకున్న స్ఫూర్తిదాయక, సైద్ధాంతిక నిబద్ధత కలిగిన తరం అది. ఇదే సష్టి ధర్మం!! అటువంటి జర్నలిస్టుల జీవితానికి ఎటువంటి భద్రత లేదు. తగిన వేతనం, సామాజిక భద్రత లేదు. ఇంటికెళితే ని త్యావసరాలకు కూడావెతుక్కునే దుస్థితే. పిల్లల చదువుల, కుటుంబ పోషణకోసం తగిన ఆర్థిక దన్ను వుండేది కాదు. కానీ తాము నమ్ముకున్న సిద్ధాంతం, అక్షర నిబద్ధత వారిలో దైహిక జీవితం పై ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగించి ముందుకు నడిపేవి. ఇప్పుడు ఆతరం క్రమంగా కనుమరుగైపోతున్నది. ఆరు దశకాల వయస్సు దాటి, గతంలో తాము సాధించిన విజయాల స్మతుల ఆనందం ఇస్తున్న బలంతో మాత్రమే జీవిస్తున్న ఆ తరం జర్నలిస్టులను ఆదరించడం ప్రభుత్వం కర్త వ్యం.
తల్లిదండ్రులను సరిగ్గా చూడని సంతానం జీతంలో 10 నుంచి 15 శాతం కోత విధించి, ఆ తల్లిదండ్రులకు అందించాలని ఆలోచించే ప్రభుత్వం, తన బాధ్యతను ఎప్పటికప్పుడు గుర్తుచేసి, అన్నివర్గాల శ్రేయస్సు లక్ష్యంగా పనిచేసేందుకు ప్రభుత్వానికి ఆయా వర్గాల సమస్యలను తెలిపి, న్యాయంచేసేలా దిక్సూచిలా “తండ్రి బాధ్యతను” పోషించిన నాటి ‘వయోవద్ధ జర్నలిస్టులకు’ నేటి ప్రభుత్వం “బిడ్డ” పాత్ర పోషించి ఆదుకోవడం కనీస బాధ్యత.
అటువంటి జర్నలిస్టుల సేవలను మరువకుండా, సామాజిక బాధ్యతగా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా 60 సంవత్సరాలు దాటిన జర్నలిస్టులకు వివిధ రాష్ట్రాలు పింఛను రూపంలో నెలవారీగా కొంత మొత్తం చెల్లిస్తున్నాయి కూడా. ఉదాహరణకు అస్సాం (రూ.8వేలు), బిహార్ (రూ.15వేలు), హర్యానా (రూ.10వేలు), ఝార్ఖండ్ (రూ.7500), తమిళనాడు (రూ.12వేలు, జర్నలిస్టు మరణం తర్వాత భార్యకు నెలకు రూ.2వేలు), గోవా (రూ.7500), పుదుచ్చేరి (రూ.6వేలు) చొప్పున పింఛన్లు చెల్లిస్తున్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం “శ్రద్ధానిధి” లేదా “సమ్మాన్ నిధి” పేరుతో రిటైర్డ్ జర్నలిస్టులకు నెలకు రూ.20వేలు గౌరవవేతనంగా చెల్లిస్తోంది. అంతేకాదు 65 సంవత్స రాలు దాటిన జర్నలిస్టులు, వారి భార్యలకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ జర్నలిస్టులు, తమకు గతంలో అమలు చేసిన పింఛను స్కీమ్‌ను తిరిగి అమల్లోకి తీ సుకురావాలని ప్ర భుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజస్థాన్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కూడా జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ విధంగా ఆ యా ప్రభుత్వాలు రిటైర్డ్ జర్నలిస్టులకోసం పింఛను సదుపాయాన్ని కల్పిస్తూ, సంక్షేమా కార్యక్ర మాలను అమలు చేస్తుండగా ఒకప్పుడు జర్నలిస్టుగా పనిచేసి సాధకబాధకాలు తెలిసిన ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, సమాచార శాఖను నిర్వహిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు తెలంగాణ జ ర్నలిస్టులకు పింఛను చెల్లించడానికి తగిన సానుకూల నిర్ణయం తీసుకోవాలి. అన్ని వర్గాలకు సంక్షేమం ఒకవైపు అభివద్ధి మరోవైపు లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి కొద్దిమంది రిటైర్డ్ జ ర్నలిస్టుల సంక్షేమం కోసం పింఛను సదుపాయం కల్పించడం అసలు భారమే కాదు. దీన్ని తన కనీస బాధ్యతగా గుర్తించాలి. ప్రభుత్వం ఏ వర్గాల అభ్యున్నతికోసం కషిచేస్తున్నదో వారికోసమేఈ జర్నలిస్టులు కూడా పనిచేశారు. వారి కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు ప్రభుత్వ దష్టికి తెచ్చి “కొవ్వొత్తి” మాదిరిగా వెలుగులు పంచి తాము కరిగిపోయారు. సామాజిక సేవారంగమైన ‘జర్నలి జంలో’ పనిచేసినవారిని పట్టించుకోవడం ప్రభుత్వం వారి సేవలకు ఇచ్చే కనీస గుర్తింపు! తెలంగాణలో “ప్రజా పాలన` ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని ప్రభుత్వం మార్చి 6వ తేదీనుంచి ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు పరిశీలన, గడపగడపకు వెళ్లి సమస్యలను తెలుసుకునే కార్యక్రమం చేపట్టనుంది. ఇందులో భాగంగానే “వయోవద్ధ పాత్రికేయుల” (రిటైర్డ్ జర్నలిస్టుల) పింఛను చెల్లింపు కూడా సంక్షేమ కార్యక్రమంలో భాగంగా అమలు చేయాలని “నేటిధాత్రి” దినపత్రిక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ, సమాచార శాఖలమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలకు విజ్ఞప్తి చేస్తోంది.
