యువత ఆలోచనల్లో మార్పు రావాలి

బిజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ..

షాద్ నగర్ అరవింద్ యాదవ్ మృతి పట్ల “డీకే అరుణ” దిగ్భ్రాంతి..

ఆస్ట్రేలియా నుండి అరవింద్ భౌతిక కాయాన్ని రప్పించేందుకు చర్యలు..

మృతుడి కుటుంబ సభ్యులకు డీకే అరుణ ఫోన్ ద్వారా పరామర్శ..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

కుటుంబ సమస్యలు.. చదువులో ఒత్తిడి.. ప్రేమ వ్యవహారాలు.. కారణాలేవైనా నిత్యం యువతీ యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని యువత ఆలోచనలు సమూలమైన మార్పులు రావాల్సి ఉందని మారుతున్న జీవన విధానాల్లో
యువతకు ఓర్పు సహనం ఆలోచన గుణం మెండుగా ఉండాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన బిజెపి మాజీ నేత కీర్తిశేషులు అరటి కృష్ణ ఏకైక కుమారుడు ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీలో అనుమానాస్పద నీతిలో సముద్రంలో మృతి చెందిన వ్యవహారంపై ఆమె స్పందించారు. ఈ సందర్భంగా మృతుడు అరటి అరవింద్ కుటుంబ సభ్యుడూ వరసకు బాబాయ్ అయిన అరటి యాదయ్యతో ఆమె ఫోన్లో మాట్లాడారు. మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ద్వారా బిజెపి పార్టీ అండగా ఉంటుందని ఆమె తెలియజేశారు.భౌతిక కాయాన్ని రప్పించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నట్టు బాధిత కుటుంబ సభ్యులకు భరోసాను ఇచ్చారు.
ఈ సందర్భంగా డీకే అరుణ స్ధానిక మీడియా ప్రతినిధితో ఫోన్లో మాట్లాడారు.
అరవింద్ యాదవ్ కుటుంబ నేపథ్యాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న డీకే అరుణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అరటి కృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఏకైక కుమారుడు కూడా ఇలా మృత్యువాత బాధాకరమని ఆమె పేర్కొన్నారు. సిడ్నీలో అరవింద్ భౌతిక కాయని భారత్ కు రప్పించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సంప్రదింపులు జరిగినట్లు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంటనే భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం లేఖ రాశారని ఆయన కూడా స్పందించి శవాన్ని రప్పించేందుకు పూర్తి చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఆస్ట్రేలియాలో అక్కడ పోలీస్ యంత్రాంగం కేసుకు సంబంధించిన పరిశోధన చేస్తున్నారని అందుకే కొంత ఆలస్యం కావచ్చు అని డీకే అరుణ తెలిపారు. ఏది ఏమైనప్పటికీ అరవింద్ మృతి ఎంతో విషాదమని ఆమె పేర్కొన్నారు. యువతీ యువకులు క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆమె సూచించారు. జీవితంలో కష్ట నష్టాలు ఎన్ని ఎదురైనా ధైర్యంగా బ్రతకడం నేర్చుకోవాలని ఆమె సూచించారు. చిన్న విషయాలను కూడా పెద్దదిగా చూస్తూ బతకలేము అన్న ఆలోచనకు యువత రావడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. దేశంలో ప్రతి గంటకు ఒకరు లేదా ఇద్దరు యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వీరిలో మెజార్టీ చదువుకున్న వారే ఉంటున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు.వివిధ రకాల కారణాలతో తీవ్ర ఒత్తిడికి గురై.. డిప్రెషన్‌లోకి వెళ్లిన కొందరు కుంగుబాటు కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డవారు ఎందరో ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
అలాంటి వారికీ డిప్రెషన్ నుంచి బయటపడి.. మళ్లీ నిత్య జీవన విధానంపై ధ్యాస పెట్టేందుకు పెద్దలుకుటుంబ సభ్యులు ‘సహాయం కౌన్సిలింగ్’ కృషీ చేస్తోందని ఆమె అన్నారు. యువతీ యువకులు తిరిగి సాధారణ జీవితం కొనసాగిలా కుటుంబ సభ్యుల గుర్తించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!