మండల రైతులకు ఏవో సూచన.
మహా ముత్తారం నేటి ధాత్రి.
మండలంలోని రైతులు విత్తనాల కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ఏవో సూచనలు చేశారు లైసెన్స్ కలిగి ఉన్న డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని గ్రామాల్లో తక్కువ ధరకు లేదా ఎక్కువ ధరకు లైసెన్స్ లేకుండా అమ్మిన లేబుల్ లేని ప్యాకెట్స్ లో సంచుల్లో లేదా లూస్ విత్తనాలు అమ్మిన వారి నుండి ఎట్టి పరిస్థితులను కొనుగోలు చేయకూడదని తెలియజేశారు . అనుమతి లేనివిత్తనాలు అమ్మిన వారి వివరాలు వ్యవసాయ శాఖ వారికి తెలియజేయాలని సూచించారు. కొనుగోలు చేసిన విత్తనాలు విత్తన కంపెనీ రకం బ్యాచ్ నెంబర్ లా ట్ నెంబర్ ,ధరతో వివరాలు కలిగి ఉన్న రసీదు తీసుకోవాలని మరియు విత్తనాల ప్యాకెట్ మీద తయారుతేది గడువు తేదీ జి ఈ ఎ సి నెంబర్లనిసరిచూసుకోవాలని సరిచూసుకొని కొనుగోలు చేయాలని తెలియజేశారు మరియు కవరు పంట కాలంపూర్తి అయ్యేవరకు భద్రపరచుకోవాలని తెలియజేశారు బిజీ1 బిజీ టు పత్తి విత్తనాలు మాత్రమే సాగు చేయాలని బీజీ3పత్తి విత్తనాలు సాగుకు అనుమతి లేదని కావున ఎవరు సాగు చేయవద్దని బిజీ 3 పత్తి విత్తనాలు అమ్మిన మరియు కొన్న వారు శిక్షార్హులు అని తెలియజేశారు.