నేటిధాత్రి. హుజూర్ నగర్
యుద్ధ వీరుడు, అభివృద్ధి ప్రధాత కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన తప్పుడు వ్యాఖ్యలు వెంటనే వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని సూర్యాపేట జిల్లా ఓబిసి డిపార్ట్మెంట్ చైర్మన్ శెట్టి రామచంద్రరావు డిమాండ్ చేసారు. శుక్రవారం అయన మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజాయితీ పరుడు, మరియు దేశ రక్షణ కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శత్రువులతో పోరాడిన అయనపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే క్షమించబోము అని అన్నారు, కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిపై చేసిన ఇలాంటి వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు నమ్మబోరని అయన అభిప్రాయపడ్డారు.