డోర్నకల్ నియోజకవర్గo నుండి భారీ మెజారిటీ ఇద్దం.
మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్.
కొట్లాడు తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజలు మోసపోయారు
కాంగ్రెస్ మాయ హామీలతో రైతుల హరిగోశ
మండలి లో మన తరుపు ప్రశ్నించే గొంతు మన రాకేష్ రెడ్డి
మాజీ మంత్రి,సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావు.
మరిపెడ నేటి దాత్రి.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గo లో ని మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లా పట్టా భద్రుల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ ఆరు నెలల కాంగ్రెస్ పార్టీని చూసి..వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటున్న తెలంగాణ ప్రజలు అంటున్నారు అని అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒడ్లు కొనే చెతకావడం లేదు, కళ్యాణ లక్ష్మి దిక్కు లేదు,కాంగ్రెస్ వచ్చింది, దొంగ రాత్రి కరెంట్ వస్తుంది.కే సి ఆర్ ఉన్నన్ని రోజులు నీళ్ళు బండు పెట్టు అనే రోజులు నుండి అయిదు నెలల్లో కాంగ్రెస్ పాలనలో ప్రజలు నీళ్ళు కావాలి అనే రోజులు వచ్చాయి అన్నారు,
కాంగ్రెస్ పుణ్యమా అని బండ్ పేపర్ ఇజ్జాతీ పోతుంది అన్నారు, 2500 మహిళలకు రాకపాయే..బోనస్ అంతా బోగస్ అయ్యింది అన్నారు,రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్య,ఉద్యోగులను మోసం చేస్తుంది నిరుద్యోగ భృతి జాడే లేదు అన్నారు, రేవంత్ ప్రభుత్వం లో ఆయితే తిట్లు..లేక పోతే ఓట్లు అన్నారు, ప్రజల కు ఇచ్చిన హామీలు నెరవృష్టే రాజీనామా చేస్తా..అని సవాల్ విసిరితే తొకముడిచిన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం అన్నారు,
నిరుద్యోగ భృతి ఎగ్గోడితే ప్రశ్నించే గొంతు ఎక్కడ పోయింది అన్నారు,జిల్లాల ,మండలాలు తీస్తా అని రేవంత్ మాట్లాడుతుండూ..మహబూబాబాద్ జిల్లా వచ్చింది కాబట్టే అన్ని సౌకర్యాలు వచ్చాయి అన్నారు, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ని గెలిపిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించి మన కోర్కెలు నెరవేరేలా చేస్తాం అన్నారు, గిరిజన మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ఎస్ టీ లకు రిజర్వేషన్ ను పోగొట్టే కుట్ర చేస్తున్నారు,మనం మేల్కొనక పోతే 10శాతం రిజర్వేషన్ పోగొట్టే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది అన్నారు, తెలంగాణ సమాజం తరుపున కొట్లాడే భాధ్యత మాది.. ప్రశ్నించే గొంతు ను గెలిపించండి,రేవంత్ ప్రభుత్వం ఒక్క నోటిఫికషన్ ఇవ్వలేదు..30 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబ్ద్దలు చెప్తున్నారు అన్నారు,పదేండ్ల బిజెపి పాలనలో ప్రజలకు అన్ని కష్టాలే..ఆడాని అంబానీ లు మాత్రం ప్రపంచ కుబేరులు అయ్యింద్రు అన్నారు, దేవుడు అందరి వాడు..ఆయన మీద కూడా బిజెపి వాళ్ళు రాజకీయం చేస్తుంద్రు, తెలంగాణ సమాజం తో బీ ఆర్ ఎస్ కి పేగు బంధం అన్నారు,మానుకోటలో ఆంధ్ర పాలకుల అరాచకాలకు ఎదురుగా నిలబడ్డది మనం మన బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు, ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి,బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, హుజూరబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి,మహబూబాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ కుమారి బిందు, మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నవీన్ రావు, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, మరిపెడ మున్సిపల్ చైర్మన్ సిందూర, మరిపెడ ఎంపిపి అరుణ రాంబాబు,జెడ్పిటిసి శారద రవీందర్, మాజీ ఎంపీపీ గడ్డం వెంకన్న,ఒడిసిన్ ఎస్ మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, డోర్నకల్ నియోజకవర్గo లో ని ఏడు మండల ల పట్టా భద్రులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు