# వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య.
# నర్సంపేట డివిజన్ లో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన.
నర్సంపేట,నేటిధాత్రి :
యాసంగి వరి పంటల ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అధికారులను ఆదేశించారు.
శుక్రవారం నర్సంపేట డివిజన్ లోని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ , ఖానాపూర్ ఐనయ్యపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లలో పిఏసీఎస్, ఎఫ్పిఓ, ఐకెపిల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు సమీపిస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా, కాంటా లో ఆలస్యం జరగొద్దని, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ స్థానిక రైతులతో, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో మాట్లాడి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటివరకు మార్కెట్ యార్డ్ కు 50 శాతం ధాన్యం వచ్చిందని,వాటిని సేకరించి మిల్లులకు పంపించడం జరిగిందని కలెక్టర్ అన్నారు.వర్షం కురిసినను రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బాయిల్డ్ మెష్ కు ట్యాగ్ చేస్తూ 100 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐఎఫ్ఎస్ రేవంత్ చంద్ర, డిఆర్డిఓ కౌసల్యాదేవి,జిల్లా పౌర సరఫరాల అధికారి శివప్రసాద్ రెడ్డి, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ సంధ్యారాణి,జిల్లా కోఆపరేటివ్ అధికారి సంజీవరెడ్డి,సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.