సీపీఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలోని రావి నారాయణరెడ్డి భవన్ లో సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నీ గెలిపించాలని కోరారు. సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేస్తుందని తెలిపారు. సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు తీన్మార్ మల్లన్న కు వుంటుందని అన్నారు. తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని, మీడియా రంగంలో కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారని అన్నారు. నిరంతరం ప్రజల సమస్యల పైన మాట్లాడే కొట్లాడే వ్యక్తి తీన్మార్ మల్లన్న అని అన్నారు. పట్టభద్రులందరూ తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలియజేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. బిజెపి బిఆర్ఎస్ పార్టీలు రెండు నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. నిరుద్యోగం పోవాలంటే కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలియజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామ్ చందర్, కోరిమీ సుగుణ, నేరెళ్ల జోసెఫ్,పీక రవికాంత్, దొంగల సురేష్, బౌత్ కమలాకర్, సుమలత, సుజాత, వీరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.