సిపిఐ (ఎం-ఎల్ )న్యూ డెమోక్రసీ నాయకులు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
తునికాకు సేకరణలో భాగంగా గురువారం చీమల గూడెం గ్రామస్తులు తునికాకు సేకరించి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి పదిమంది కి గాయాలయ్యాయని వారికి ప్రభుత్వం, గుత్తేదారులు మెరుగైన వైద్యం అందించాలని సిపిఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ మండల నాయకులు పాయం ఎల్లన్న, ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) మోకాళ్ళ ప్రసాద్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తునికాకు సేకరణ సందర్భంగా ట్రాక్టర్ బోల్తా పడి గాయాలు పాలై న తునికాకు కార్మికులకు గుత్తేదారులు, ప్రభుత్వం మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని కోరారు.
మునుపటి రోజుల్లో కూడా చీమల గూడెం గ్రామంలో తునికాకు సేకరణ సందర్భంలో అడవి జంతువులైన ఎలుగుబంట్లు, తదితర జంతువుల దాడికి అనేక మంది గురయ్యారని వారికి ప్రాథమిక వైద్యం తప్ప ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించలేదని తునికి ఆకు సేకరణకు వెళ్లి గాయాలు పాలైన తునికకు కార్మికులకు ఒక్కొక్కరికిప్రభుత్వం లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.