అక్రమంగా నిలువ ఉన్న ఇసుకను సీజ్ చేసిన తహసిల్దార్ వనజ రెడ్డి

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఖాసింపల్లి, ఇందారం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 53 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక కుప్పలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. జైపూర్ మండల ప్రజలు ఎవరైనా అక్రమంగా ఇసుక తరలింపు చేసిన ఇసుక నిల్వ చేసినట్లయితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పదేపదే ఇలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని, ప్రజలు కూడా తమకు అక్రమ ఇసుక రవాణా కార్యకలాపాలు జరిగినట్లయితే సమాచారం అందించాలని, అధికారులకు సహకరించాలని తహసిల్దార్ వనజ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఎమ్మార్వో వనజ రెడ్డి, గిరిధవర్ తిరుపతి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

వ్యాన్ డ్రైవర్ ను కొట్టి సెల్ఫోన్ దొంగలించి పారిపోయిన ముగ్గురు దొంగలు అరెస్ట్

ఇబ్రహీంపట్నం, నేటి ధాత్రి

శనివారం రోజున రాత్రి 11:40 గంటల సమయంలో ఆర్మూర్ వైపు ఒక మొక్కల లోడుతో ఐచర్ వ్యాన్ డ్రైవర్ సుధాగోని గంగాధర్ గౌడ్ కమ్మర్ పెళ్లి మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన వ్యక్తి తన మొక్కలను బండలింగాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఆపుకొని మూత్రవిసర్జన చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు తన వద్దకు వచ్చి అగ్గిపెట్టె ఉన్నదా అన్న అని అడిగారు ఇద్దరు వ్యక్తులు అతనిని గట్టిగా పట్టుకొని మరొక వ్యక్తి తన వద్ద ఉన్న డీజిల్ కొరకు ఉంచబడిన డబ్బులు 5000 రూపాయలు మరియు రెడ్మీ సెల్ ఫోన్లు లాక్కొని నన్ను కొట్టి ఎవరితోనైనా చెబితే చంపుతామని బెదిరించి వెళ్లిపోయారు గాయపడిన వ్యక్తి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి మరియు పారిపోయిన దొంగల గురించి మెట్పల్లి సిఐ నిరంజన్ రెడ్డిని,ఇబ్రహీంపట్నం ఎస్సై మల్లాపూర్ ఎస్సై అనిల్,కిరణ్ కుమార్ లను మూడు బృందాలుగా ఏర్పాటు చేసి పారిపోయిన దొంగల గురించి పంపగా వారు దొంగల గురించి తిరుగుతుండగా ఈరోజు ఇబ్రహీంపట్నం x రోడ్ వద్ద ఒక బైక్ పై ముగ్గురు వ్యక్తులు ఉండగా మెట్పల్లి సిఐ వారిని పట్టుకుని విచారించగా వారు వ్యాన్ డ్రైవర్లు కొట్టి ఫోన్ డబ్బులను బలవంతంగా తీసుకొని పారిపోయినామని తెలిపినారు వారి వివరములు 1. ఏనుగు వంశీ, మేడిపల్లి గ్రామం 2.బైండ్ల వేణు మఠం వాడ మెట్పల్లి 3. కైరా వెంకటేష్ అలియాస్ రవి గౌడ్ బండలింగాపూర్ గ్రామం అని తెలిపినారు వారి వద్ద ఉన్న డబ్బులను సెల్ఫోన్లను చూపించగా సిఐ వారిని అదుపులోకి తీసుకొని వారు వచ్చిన బైకు తనిఖీ చేయగా వారి వద్ద గల పల్సర్ బైక్ కవర్లో ఒక గంజాయి ఉన్న ప్యాకెట్ 200 గ్రాముల దానిని స్వాధీన పరచుకొని పంచుల సమక్షంలో బైకు, డబ్బులను, సెల్ఫోన్లను గంజాయిని తీసుకొని నేరస్తులను ఆధీనంలోకి తీసుకొని వారిని ఈరోజు తదుపరి చర్య నిమిత్తం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు నేరస్తులను 48 గంటలలో పట్టుకున్న ఎస్ఐ అనిల్,కిరణ్ కుమార్ లను మరియు పోలీస్ సిబ్బంది గంగారాం, చైతన్య లను సిఐ నిరంజన్ రెడ్డి అభినందించారు మరియు ఇక నుండి ఎవరైనా రోడ్ల పైన వాహనాలను ఆపి ఈలాంటి చర్యలకు పాల్పడిన మరియు గంజాయి అమ్మిన కొన్న తాగిన మెట్పల్లి సబ్ డివిజన్లో ఎవరైనా పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఇటువంటి వాటి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని మెట్పల్లి
డి.ఎస్.పి ఉమామహేశ్వరరావు తెలిపారు.

వరంగల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షపదవి గౌడ సామాజిక వర్గానికి కేటాయించాలి

తెలంగాణ గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు నరేష్ గౌడ్

“నేటిధాత్రి” వరంగల్

తెలంగాణలో నూతనంగా నియమించబోతున్న జిల్లా అధ్యక్ష పదవి జిల్లాలో అత్యధిక జనాభా గల గౌడ సామాజిక వర్గానికి కేటాయించాలని తెలంగాణ గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టు నరేష్ గౌడ్ డిమాండ్ చేశారు అలాగే గత పది సంవత్సరాలుగా వరంగల్ జిల్లాలో గౌడ సామాజిక వర్గానికి రాజకీయంగా తీవ్ర అన్యాయం జరిగిందని గత 10 సంవత్సరాలలో రెండు దఫాలుగా కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే గౌడ సామాజిక వర్గానికి ఒక్క టికేటు కూడా కేటాయించకుండా గత ప్రభుత్వం గౌడ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు.. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇచ్చి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పబ్బం గడిపే నాయకులను గుర్తించి వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా పది సంవత్సరాలు అధికారంలో లేకున్నా పార్టీ కోసం ఆస్తుల అమ్ముకొని పార్టీ పిలుపుమేరకు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండి ఉద్యమించి కేసుల పాలైన కాంగ్రెస్ ఉద్యమకారులను గుర్తించి వారికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించాల్సిందిగా తెలంగాణ గౌడ యువజన సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షులు గట్టు నరేష్ గౌడ్ కోరారు దీనిపై రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ని కలసి జిల్లాలో 10 సంవత్సరాలుగా జరిగిన అన్యాయంపై వివరిస్తానని తెలియజేసినారుతెలియజేసినారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలి

ఐఎఫ్టియు జిల్లా నాయకులు కొమరం శాంతయ్య,యాసారపు వెంకన్న.

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ సోమవారం గుండాల మండల కేంద్రంలో పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కార్మిక సంఘాల నాయకులు తాహసిల్దార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా నాయకులు కొమరం శాంతయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు యాసారపు వెంకన్న, ఐఎఫ్టియు ఏరియా కమిటీ కార్యదర్శి గడ్డం రమేష్ లు మాట్లాడుతూ స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ పాలకులపై కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను అణిచివేయటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని విటీని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వేతన కోడ్, వర్కింగ్ కండిషన్ కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్లను అమలు జరిపితే కార్మికులకు ఉన్న ప్రస్తుత రక్షణలన్నీ కోల్పోయి యాజమాన్యాల దయా దాక్షిణ్యాలపై ఆధారపడి జీవించాల్సి వస్తుందని అన్నారు. నాలుగు లేబర్ కోడ్లలోకార్మిక హక్కులను కాలరాసి,యాజమాన్యాలకు లాభం కలిగించే అనేక అంశాలు ఉన్నాయని, ఇప్పటికే యాజమాన్యాలకు అనుకూల నిర్ణయాలు జరుగుతున్నాయని, ఈ నాలుగు కోడ్ల అమలు అయితే కార్మిక హక్కులన్నీ రద్దు అవుతాయని వారన్నారు. బిజెపి ప్రభుత్వం కార్మికులను నష్టపరిచే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని లేని ఎడల రాష్ట్రవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఉద్యమాలు బలోపేతం చేస్తాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు మొక్క నరీ ,గడ్డం కృష్ణ, మాడే సంతోష్, పూనెం సాంబశివరావు, కల్తీ రాంబాబు, యాప రామస్వామి, మానాల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ కు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.

⏩వరంగల్ నగర అభివృద్ధిని విస్మరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

⏩అండర్ డ్రైనేజీ, అంతర్గత రోడ్లను పటిష్టంగా ఏర్పరచాలి.

⏩పేదల ఇండ్లను బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలి.

⏩నగరాభివృద్ధికి ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి.

ఎంసిపిఐ(యు) వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

కాశిబుగ్గ నేటిధాత్రి

వరంగల్ నగర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నాయని ఎంసిపియు(ఐ) వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.ఈ క్రమంలో జనాభా పరంగా దినదినాభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరం అనేక సమస్యలతో సతమతమవుతున్నదని, పాలకులు మారిన, ప్రజా సమస్యలు తగ్గడం లేదని ప్రజా పోరాటాలే సమస్యలకు పరిష్కారం చూపుతాయని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. సోమవారం భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) ఎంసిపిఐ(యు) వరంగల్ నగరంలోని కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోట ఏరియా జనరల్ బాడీ సమావేశం కామ్రేడ్ ఎగ్గెని మల్లికార్జున్ అధ్యక్షతన స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ అనేక త్యాగాలతో, ఆశలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో వరంగల్ నగర ప్రజలకు ఒరిగింది శూన్యమని, కేవలం ఎన్నికల హామీలతో ప్రజలను మభ్యపెడుతూ అధికారం చేపట్టాక కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు,గత ప్రభుత్వం లాగానే ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వరంగల్ నగర సమస్యలను విస్మరిస్తున్నారని అన్నారు.ఈ గ్రామంలో నగర ప్రజలు అంతర్గత రోడ్లు,అండర్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక అనేక అవస్థలు పడుతున్నారని దాంతోపాటు వేలాదిమంది పేదలు తలదాచుకోవడానికి తమ స్థాయిలో ఇల్లు నిర్మించుకుంటే వాటిని రెగ్యులైజ్ చేయకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మరోవైపు కనీసం ఇంటి స్థలాలు లేక, కిరాయిలు కట్టలేక అవస్థలు పడుతున్న ప్రజలకు ఇంటి స్థలాలు,ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పినా కూడా వాటిని ఆచరణలో అమలు చేయకపోవడం అన్యాయం అన్నారు. గత ఎన్నికల ముందు వరంగల్ నగరాన్ని తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత పెద్ద పట్టణంగా తీర్చిదిద్దుతామని గత కేసీఆర్ వలే హామీ ఇచ్చిన ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఎప్పటికైనా గత ప్రభుత్వానికి తగిలిన గుణపాటాన్ని గుర్తుతెచ్చుకొని ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి,వరంగల్ నగర ప్రజల సమస్యలను పరిష్కరించి, సమగ్ర అభివృద్ధి చేపట్టాలని డిమాండ్ చేశారు.లేకపోతే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
ఈ సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్, ఏరియా కార్యదర్శి ఐతం నాగేష్, జిల్లా కమిటీ సభ్యులు అప్పనపురి నరసయ్య,స్థానిక నాయకులు ఆడెపు శంకర్,మార్కండేయ, కృష్ణ, ఆడెపు గణేష్, కొమ్మినేని రాజేందర్, దార శివ, దొంతుల రాజేందర్, శివ తదితరులు పాల్గొన్నారు.

భాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రేవూరి

పరకాల నేటిధాత్రి
మల్లక్కపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దొమ్మటి దాసు,రాజు తండ్రి దొమ్మటి సమ్మయ్య అనారోగ్యంతో ఇటీవల మరణించడం జరిగింది.పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.అనంతరం కుటుంబ సభ్యులను మనోధైర్యంగా ఉండమని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,మల్లక్కపేట గ్రామ కమిటీ అధ్యక్షులు మనూరి రాజు,మాజీ సర్పంచ్ అల్లం రఘు నారాయణ,మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజి రెడ్డి,రాయపర్తి మాజీ ఎంపీటీసీ పర్నెం మల్లారెడ్డి,ఏఎంసీ డైరెక్టర్ దాసరి బిక్షపతి,గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు దోమ్మటి చార్లెస్,బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల చిన్ని,మాజీ కౌన్సిలర్ లక్కము శంకర్,యూత్ కాంగ్రెస్ నాయకులు మచ్చ సుమన్,దోమ్మటి కృష్ణకాంత్., ఉడుత సంపత్,మహమ్మద్ అలీ,గంగోజుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

సెప్టెంబర్ 23 బ్లాక్ డే.

సిఐటియు జిల్లా సెక్రెటరీ ఆకుదారి రమేష్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిఐటియు జిల్లా జాయింట్ సెక్రెటరీ ఆకుదారి రమేష్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 23 బ్లాక్ డేగా నిర్వహించడం జరిగింది
కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలి నేషనల్ మానిటైజేషన్ పైపులైను రద్దు చేయాలి. బొగ్గు బ్రాకులను వేలం వేయడాన్ని నిలుపుదల చేయాలి, సింగరేణి కి నేరుగా గనులను కేటాయించాలి. కార్మికులందరికీ కనీస వేతనం 26 వేల రూపాయలుగా నిర్ణయించాలి.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి. అంగన్వాడి,ఆశ, మధ్యాహ్న భోజనం, ఐకెపి,వివో ఏ, వైద్య ఆరోగ్య రంగంతో పాటు వివిధ స్కీములలో పనిచేస్తున్న స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి చట్టాలు అమలు చేయాలి.
ఈపీఎఫ్ చెల్లింపులో జాప్యం చేసిన వారికి జరిమానాలను తగ్గించడానికి ఉపసంహరించుకోవాలి.
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కార్మికులకు హయ్యర్ పెన్షన్ చెల్లించాలి. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ఈపీఎస్ పెన్షన్ దారులకు కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలకు తగ్గకుండా చెల్లించాలి.
కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించండి.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వెలిశెట్టి రాజయ్య, గడప శేఖర్,
కార్మికులు శంకర్, అబ్బాస్, నవీన్ జ్ఞానేశ్వరి గోమాత, రజిత తదితరులు పాల్గొన్నారు..

వ్యవసాయ మార్కెట్ ప్రమాణ స్వీకరానికి ఆహ్వానం

ముఖ్య అతిధులుగా పరకాల ఎమ్మెల్యే రేవూరి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర

పరకాల నేటిధాత్రి
29ఆదివారం రోజున పరకాల వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవి బాధ్యతలు స్వీకరించడం జరుగుతున్నదని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి,భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు హాజరు కనున్నారు.కావున శాయంపేట,నడికూడ,పరకాల మండలల గ్రామాల నుంచి మరియు పరకాల టౌన్ నుంచి రైతులు,రైతు సంఘం నాయకులు,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీ,జడ్పీటీసీ,ఎంపీపీలు కౌన్సిలర్లు,ప్రజా ప్రతినిధలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ఎస్యుఐ,యూత్ కాంగ్రెస్ , మహిళా కాంగ్రెస్,అనుబంధ సంఘ నాయకులూ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాగరని మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి తెలిపారు.

గొర్లవీడులో స్కూల్లో పోషణ మాస మహోత్సవాలు

అంగన్వాడి టీచర్లు సరోజన కవిత

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి రూరల్ మండలంలోని గొర్లవీడు గ్రామంలో పోషణ మాస ఉత్సవాల సందర్బంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ సునీత ఆధ్వర్యంలో గొర్లవీడు గ్రామంలో గర్భిణీ స్త్రీలకు బాలింతలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించి పోషణ విలువల గురించి తెలియజేయడమైనది ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపెర్వైజర్ సునిత మాట్లాడుతూ గ్రామంలోని గర్భినీలు, బాలింతలు, కిషోర బాలికలు, పిల్లలకు ఏ ఒక్కరికి పోషణ లోపం లేకుండా చూడాలన్నారు. గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే అంగన్వాడి టీచర్లకు వెంటనే తెలియజేయాలి అని సూచించారు
ఎం ఎల్ ఎచ్ కార్తీక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు ప్లాస్టిక్ రహిత గ్రామంగా గొర్లవీడు ను నిలపాలన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు సరోజన,కవిత, వసుమతి,శారద, లత, సరళ,ఏ ఎన్ ఎం గీత, అంగన్వాడి హెల్పర్లు, ఆశా వర్కర్లు, వి ఏ ఓ లు,వి ఓ లు, తల్లులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మెగారెడ్డిని కలిసిన వనపర్తి రేషన్ డీలర్లు

వనపర్తి నేటిధాత్రి:
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిని రాష్ట్రంలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై వనపర్తి రేషన్ డీలర్లు కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు బచ్చురాం మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్లకు ప్రతి నెల గౌరవ వేతనంగా 5000 రూపాయలు క్వింటాలుకు 300 కమిషన్ ప్రజలకు రేషన్ షాపుల ద్వారా 9 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ గోదాం నుండి రేషన్ షాపుల కు బియ్యం బస్తాలు తూకం తక్కువగా వస్తున్నాయని బియ్యం తక్కువగా రావడం వల్ల రేషన్ డీలర్లు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ తూకమున్న బియ్యం బస్తాలను ప్రభుత్వం వాపస్ తీసుకోవాలని ఆయన ఎమ్మెల్యేను కోరారు . లారీ డ్రైవర్లు ప్రభుత్వ పిడిఎఫ్ బియ్యం రేషన్ షాపులకు అన్లోడింగ్ చేసిన తర్వాత అదనంగా డబ్బులు ఇవ్వాలని హమాలీలు దౌర్జన్యం చేస్తున్నారని వారిని కట్టడి చేయాలని ఆయన కోరారు. డీలర్లు ఆకస్మికంగా మరణించి కుటుంబానికి 20 000 ఆర్థిక సహాయం దహన సo స్కారాల కొరకుఇన్సూరెన్సు ద్వారా 10000డీలర్ల కుటుం బాలకు ఇవ్వాలని కోరారు .ఎమ్మెల్యే ని కలిసిన వారిలో వనపర్తి రేషన్ డీలర్లు రాఘవేంద్ర గోపి ఆనంద్ మన్యం జనార్దన్ గౌడ్ తదితరులు ఉన్నారు

ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి: సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ గౌడ్

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నకార్మిక,రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని, కార్మికులకు కనీస వేతనం 26000 వేలు ఇవ్వాలని సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు. సోమవారంచండూరు మండల కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4లేబర్ కోడ్ ల పత్రాలను దగ్ధం చేసి, నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.2014 నుండి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం కార్మిక చట్టాలో చాలా మార్పులు చేశారని,29 చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందన్నారు.కనీస వేతనానికి గ్యారెంటీ లేకుండా ఎనిమిది గంటల పని విధానానికి బదులు 12 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కాంట్రాక్ట్ వర్కర్స్, నాన్ పర్మినెంట్ ఎంప్లాయిస్ అందరిని పర్మినెంట్ చేయాలని, రాష్ట్రంలోని 73 షెడ్యూల్డ్ ఎంప్లాయి మెంట్స్ లో కనీస వేతనాలు సవరించాలని ఆయన అన్నారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ,బోనస్, గ్రాట్యూటి అమలు చేయాలని, ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడి, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులు, ఐకేపీ వి ఓఏ లు, విద్య, వైద్యరంగం తో పాటు వివిధ స్కీములలో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి, కార్మిక చట్టాలను అమలు చేయాలని ఆయన అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన అన్నారు. గడిచిన 10 ఏళ్లలో కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు దారా దత్తం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 28న జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు, సెప్టెంబర్ 30న చలో లేబర్ కమిషనర్ రేట్ జరిగే ధర్నాకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు మోగుదాల వెంకటేశం, సిఐటియు సీనియర్ నాయకులుచిట్టిమల్ల లింగయ్య,చండూర్ మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కత్తుల సైదులు యూనియన్ ఉపాధ్యక్షులునల్లగంటి లింగస్వామి, హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు సాయం కృష్ణయ్య, పిట్టల చిన్న వెంకన్న, ఏ కాలపు అంజయ్య, బొమ్మర గొని సుమన్, బొమ్మరగొని అంజయ్య, బొమ్మర గోని గిరి, జే,కుమార్, పిట్టల అంజి,ధనయ,రమేష్,బి పంగి నాగరాజు, పెద్ద వెంకన్న, గండూరి వెంకన్న, బక్కమ్మ, చంద్రమ్మ, కలమ్మ, అలివేలు, ఎల్లమ్మ, రేణుక, లక్ష్మమ్మతదితరులు పాల్గొన్నారు.

బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం.

చిట్యాల, నేటిధాత్రి :

భారతీయ జనతా పార్టీ చిట్యాల బిజెపి మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జయశంకర్ జిల్లా ప్రముఖ్ డాక్టర్ ఎద్దుల రాజ వర్ధన్ రెడ్డి మరియు బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడు నూతల నిషి ద ర్ రెడ్డి మండల కేంద్రం లో సభ్యత్వ నమోదు చేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్రాంతి లేకుండా భారత దేశ ప్రజల కోసం పనిచేస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ మధ్యతరగతి అని తేడా లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తూ దేశాన్ని ఒక అగ్రగామిగా ఇస్తున్నటువంటి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి మద్దతుగా ప్రతి ఒక్క భారతీయుడు నిల్వాలని భారతీయ జనతా పార్టీకి మద్దతు 8800002024 నెంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు ఇవ్వాలని తద్వారా మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవచ్చని మన దేశంలో కొన్ని శక్తులు దేశాన్ని ముక్కలుగా విభజించాలని చూస్తున్నాయని అవి గమనించి మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడు పైన ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి మద్దతు ఇచ్చి అభివృద్ధిని చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నదని వారన్నారు
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గుండ సురేష్ మండల ఉపాధ్యక్షులు గ జనాల రవీందర్ యువ మోర్చా మండల అధ్యక్షులు మైదామ్ శ్రీకాంత్ ఎస్టి మోర్చా జిల్లా కార్యదర్శి kemsarapu ప్రభాకర్ గుర్రపు రవి సాదా సదానందం పరకాల రఘు కత్తుల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

గ్రోతు మేళా పోషణ మాస ఉత్సవాలు.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం లోని తిరుమలాపూర్ అంగన్వాడీ కేంద్రంలో రమణమ్మ త్రివేణి అంగన్వాడీ టీచర్స్ ఏర్పాటు చేసిన గ్రోత్ మేళ పోషణ్ మాస ఉత్సవాలకు ముఖ్య అతిథిగా డిస్టిక్ ఇంజనీరింగ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు హాజరై కార్యక్రమం యొక్క ఉద్దేశం జయప్రద సూపర్వైజర్ మెడికల్ ఆఫీసర్ రాకేష్ అందరికీ తెలియపరిచినారు, పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాల పిల్లల వరకు ప్రతి నెల బరువు ఎత్తులు ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ లోపు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి తీయించుకోవాలి అని అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా కండరాల అభివృద్ధి లోప పోషణ ఏదైనా జబ్బులు ఉన్న చిన్న వయసులో గుర్తించి సరియైన ఆరోగ్య పరీక్షలు చేయించుతు వయసుల వారీగా కొలతల ప్రకారం సమతుల ఆహారం పిల్లలకు తినిపించినప్పుడు ఆరోగ్యవంతంగా ఎదిగి నేటి బాలలే రేపటి పౌరులుగా అన్ని రంగాలలో రాణించగలుగుతారని వివరించడం జరిగింది. స్కూలు హెచ్ఎం నాగరాజు మాట్లాడుతూ పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని ప్రైవేట్ పాఠశాలలకు పంపించడం వల్ల డబ్బుతో పాటు పిల్లలు ఆరోగ్య పరిస్థితి కుంటుపడుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్స్ సుగుణ కుమారి హెచ్ ఇ ఓ సంజీవరెడ్డి ఏఎన్ఎం ఆశ అంగన్వాడీ టీచర్స్ రమణమ్మ త్రివేణి కవిత ఆయాలు ఓదెమ్మ వనమాల హాజరైనారు,

భూపాలపల్లిలో టియుడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు ప్రారంభం

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో సోమవారం టియుడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్, ప్రధానకార్యదర్శి సామంతుల శ్యామ్, రాష్ట్ర హెల్త్ కమిటీ సభ్యులు సామల శ్రీనివాస్ లు ఈ సందర్భంగా జనంసాక్షి, ప్రజాతంత్ర స్టాఫ్ రిపోర్టర్లు తడుక సుధాకర్, సారేశ్వర్ లకు సభ్యత్వాన్ని అందజేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీష్, శ్యామ్, శ్రీనివాస్ లు మాట్లాడుతూ టియుడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్టు మిత్రులు సభ్యత్వం రెన్యూవల్ చేసుకోవాలని, మిగతా జర్నలిస్టులు కూడా సభ్యత్వాన్ని తీసుకుని సహకరించాలని కోరారు. తొందరలోనే అన్ని మండలాల్లో కూడా పర్యటిస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని వారు కోరారు.

సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన

భూపాలపల్లి నేటిధాత్రి

కేంద్ర ప్రభుత్వం 44,కార్మిక చట్టాలను4, కో డ్ లగా మార్చడానికి వ్యతిరేకిస్తూ బ్లాక్ డే భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 5, ఇంక్లైన్ మొదటి షిఫ్టులో
తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో
కార్మికుల నల్ల బ్యాడ్జీలు పెడుతూ నిరసన తెలపడం జరిగింది
కేటీకే 5,ఇంక్లైన్ గనిలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ
44 చట్టాలను 4 కోడ్ లగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ “బ్లాక్ డే” గా దేశంలోని అన్నిసంఘాలు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు.
కేంధ్రప్రభుత్వం 21 సెప్టెంబర్ పార్లమెంటులో ఈ బిల్లును ఆమోదించచేసుకోవడం దేశంలోని ఆన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని కార్మికుల హక్కులు హరించడానికి కేంధ్రప్రభుత్వం ప్రయత్నింఛడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ నల్లబ్యాడ్జీలతో వారు నిరసన తెలిపారు.
అంకెల గ్యారడితో కార్మిక వర్గానికి
అన్యాయం చేసిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు
అదేవిధంగా లాభాలవాటాలో నికరలాభం మీద ఇవ్వాల్సిన 33% లాభాలను సంస్థ అభివృద్ధి కోసం 2200 కోట్లను తీసుకుని కేవలం 2490 కోట్ల రూపాయల వరకే 33% ఇచ్చి సింగరేణి కార్మికులను మోసం చేయడం హేయమని ఈ తతంగం అంతా గుర్తింపు, ప్రాతినిధ్యసంఘాల పుణ్యమేనని గెలిపించిన పాపానికి కార్మికులకు ధ్రోహం చేయడం పాపమని వారన్నారు.
33% లాభాలవాటా రావల్సిన సింగరేణికార్మికులకు 16.9% మాత్రమే వర్తింపచేయడం ఘోరమని వారన్నారు.
సింగరేణి విస్తరణ కోసం బకాయిలు 30 వేల కోట్లు అడగకుండా , మిగిలిన 67% నుండి చేసుకోవాలని చెప్పకుండా గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముడుపోయాయని వారన్నారు. యువకార్మికుల చైతన్యం, ప్రశ్నించేతత్వమే సింగరేణి కార్మికులను కాపాడుతుందని యువతకు భరోసాగా ఎల్లప్పుడూ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం (కార్మిక సంఘాల ఐక్యవేదిక ) అండగా ఉంటుందని వారు తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో (టి ఎస్ యు ఎస్ ) హెచ్ఎంఎస్ కార్మిక సంఘాల నాయకులు
కాసర్ల ప్రసాద్ రెడ్డి
ఈ శ్రీధర్
జూపల్లి మల్లేష్
పి చంద్రశేఖర్
వెంకటేష్ సంపత్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

కొత్తకొండ వీరభద్ర స్వామిని మొక్కలు సమర్పించినఎమ్మెల్సీ కోదండరాం

భీమదేవరపల్లి,నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో మొక్కులు తీర్చుకోడానికి వచ్చినాము ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ
తెలంగాణలో వ్యక్తిగతమైన మొక్కులు ఉండవు.
ఊరు బాగుండాలి అందులో పాటు నేను బాగుండాలని కోరుకుంటాను.
వీరభద్ర స్వామి మొక్కు దేనికోసం అంటే తెలంగాణ కోసం తెలంగాణ రావాలని ఈ తెలంగాణ ప్రజలు బాగుండాలని నిరంకుశ పాలన పోయినది ప్రజా పాలన బాగుంది ఈరోజు మొక్కలు సమర్పించడం జరిగింది
వీరభద్ర స్వామిని వారిని కోరుకున్నది ఒక్కటే తెలంగాణ అభివృద్ధి చెందాలి అందరూ వాటలు దక్కాలని స్వామివారిని కోరుకున్నాం
ప్రభుత్వం 500 బోనాస్ సన్న వడ్లకు అందరికీ అంది మేలు జరగాలని కోరుకుంటున్నాను
స్వామివారికి పూజలు సక్రమంగా జరగాలంటే అయ్యగార్లకు అవసరం తీర్చాలి
అయ్యగార్లకు కొందరు స్కేలు వచ్చాయి కానీ ఇంకా కొంతమంది
మిగిలి ఉన్నారు
కొన్ని సాంకేతికమైన ఇబ్బంది వలన ఫస్ట్ కు జీతాలు వస్తలేవు వీరికి ఫస్ట్ జీతాలు వచ్చే విధంగా ప్రభుత్వాన్ని విన్నపాలు అందించాలని చెప్పి అయ్యగార్లు నాకు పత్రాన్ని ఇవ్వడం జరిగింది
ఆ పత్రాన్ని కూడా సీరియస్ గా తీసుకొని ఎండోమెంట్ శాఖావారిని మంత్రి పొన్నం ప్రభాకర్ సహాయంతో తెలియజెప్పి వారికి కూడా న్యాయం జరిగేలా నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాను
అక్రమంగా చెరువులో ప్రభుత్వ భూములు ఆక్రమించడం మంచిది కాదు
ఖమ్మం ప్రభుత్వ భూములను పబ్లిక్ సంస్థను ఆక్రమించడం మునుగుడుకు కారణం అదే
నాలను కాపాడకపోతే చెరువుల అక్రమనకు తొలగించకపోతే అందరికి నష్టం
ఉమ్మడి వనరులను కాపాడాలి హైడ్రా సంస్థకు చట్టబద్ధత కల్పించాలని
క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఆహ్వానిస్తున్నాం
రాజకీయాలు మారాలి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి
ప్రజల కేంద్రంగా పాలన సాగాలి
ఆర్వోఆర్ బిల్లును చదివినాము
చట్టాన్ని మార్చడం మంచి పరిణామం ధరణి వలన తలెత్తిన సమస్యల పై మాకు అవగాహన ఉంది
క్షేత్రస్థాయి ధరణి అమలైనప్పుడు 150 గ్రామాలను అధ్యయనం చేశాం ధరిని తప్పులు సరిచేయాలని డిమాండ్ తో ఆందోళన చేశాం
23 రకాల తప్పులు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న బిల్లు ఎట్లా ఉందని ఒక అవగాహనకు వస్తున్నాం
ధరణి లోపం వారు ఎంట్రీ చేసేటప్పుడు తప్పుడు జరిగినాయి

మంచిర్యాల నేటి నుంచి పలు రైళ్ల రద్దు

మంచిర్యాల, నేటి ధాత్రి:

కాజీపేట – బల్లార్ష మధ్య రైల్వే ట్రాక్ పనుల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి బల్లార్ష వరకు నడిచే పలు రైళ్లను నేటి నుంచి అక్టోబర్ 8 వరకు రద్దు చేశారు. మరి కొన్నింటిని దారి మళ్ళించారు. రైళ్ల రద్దుతో దసరా పండుగ నేపథ్యంలో మంచిర్యాల, కొమురం భీమ్, ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలకు ప్రయాణ కష్టాలు ఎదురుకానున్నాయి. విద్యార్థులు,వ్యాపారస్థులు ఉద్యోగులు ప్రయాణాలకు ఆర్టీసీ పై ఆధారపడాల్సి ఉంటుంది.

ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

*బ్రేకింగ్*

భద్రతా పరమైన కారణాలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేసిన నిర్వాహకులు 

*నిరుత్సాహంలో ఎన్టీఆర్ ఫాన్స్* 

రెండు తెలుగు రాష్ట్రాలనుంచి భారీగా వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు 

*అభిమానుల అత్యుత్సాహంతో నోవాటెల్ హోటల్ పాక్షికంగా ధ్వంసం..*

ఎంపీ వద్దిరాజు రాయచూరు మాజీ ఎమ్మెల్యేకు సన్మానం

*Date 21/09/2024*

—————————————-

*బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్,మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర కర్ణాటకలోని రాయచూరు మాజీ ఎమ్మెల్యే,మున్నూరుకాపు సమాజం ప్రముఖులు పాపారెడ్డిని ఘనంగా సన్మానించారు*

*పాపారెడ్డి హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఎంపీ రవిచంద్ర ఆహ్వానం మేరకు శనివారం సాయంత్రం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన నివాసాన్ని సందర్శించారు*

 

*మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డితో పాటు కలిసి వచ్చిన రాయచూరు మున్నూరుకాపు సమాజం ప్రముఖులు నర్సారెడ్డి, కృష్ణమూర్తి,శేఖర్ రెడ్డి, నర్సింహులు, ప్రతాపరెడ్డి, రాజేందర్ రెడ్డి, మల్లేష్, మహేందర్ రెడ్డి,మునిరెడ్డి,వినయ్ రెడ్డిలకు ఎంపీ వద్దిరాజు సాదర స్వాగతం చెప్పి శాలువాలతో సత్కరించారు, వారి గౌరవార్థం ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు*

*ఈ సందర్భంగా మున్నూరుకాపు ప్రముఖులు రౌతు కనకయ్య, డాక్టర్ పీఎల్ఎన్ పటేల్,ఊసా రఘు,మరికల్ పోత సుధీర్ కుమార్,భేతి శ్రీధర్,తెల్లా మురళీధర్,ఆకుల సదానంద్, జెన్నాయికోడే జగన్మోహన్ తదితరులు ఉన్నారు*

ముమ్మ‌రంగా స‌భ్య‌త్వ న‌మోదు

* వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్ట్స్ ఆఫ్ ఇండియా (డ‌బ్ల్యూజేఐ) నిర్ణ‌యం

హైద‌రాబాద్‌:- రాష్ట్రంలో స‌భ్య‌త్వ న‌మోదును ముమ్మ‌రం చేయాల‌ని వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్ట్స్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యుజేఐ) నిర్ణ‌యించింది. పాత్రికేయుల సంక్షేమం కోసం భార‌తీయ‌మ‌జ్జూర్ సంఘ్‌కు అనుబంధంగా ఏర్పాటై జాతీయ స్థాయిలో కృషి చేస్తున్న డ‌బ్ల్యూజేఐ ఆధ్వ‌ర్యంలో పాత్రికేయుల ఆత్మీయ స‌మ్మేళ‌నం జ‌రిగింది. ఉస్మానియా యూనివ‌ర్సిటీలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి బీఎంఎస్ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌లాల్ శ్రీ‌నివాస్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాంరెడ్డి, ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీ రామ్మోహ‌న్ లు హాజ‌రై ప్ర‌సంగించారు. పాత్రికేయుల స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్న డ‌బ్ల్యూజేఐకు తాము అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు.


సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ వ‌ల్లీశ్వ‌ర్ మాట్లాడుతూ డ‌బ్ల్యూజేఐ అన్నిజిల్లాల‌కు విస్త‌రించాల‌ని సూచించారు. నిరంత‌రం కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని , బ‌ల‌మైన శ‌క్తిగా ఎద‌గాల‌ని ఆకాంక్షించారు. దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘ‌మైన భార‌తీయ మ‌జ్దూర్ సంఘ్ డ‌బ్ల్యూజేఐకు అండ‌గా ఉండ‌టం సంతోష‌దాయ‌క‌మ‌న్నారు. జాతీయ స్థాయిలో పాత్రికేయుల స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తేందుకు ఇది దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు.
ఆత్మ‌గౌర‌వంతో పోరాడుదామ‌ని, అంద‌రి మేలు కోసం పాటుప‌డ‌దామ‌ని, జాతీయ ప్ర‌యోజ‌నాలు కాపాడుకుందామ‌ని పిలుపునిచ్చారు. జ‌ర్న‌లిస్టుల విష‌యంలో చేయాల్సింది ఎంతో ఉంద‌ని సీనియ‌ర్ ఎడిట‌ర్‌, ర‌చ‌యిత ఎంవీఆర్ శాస్త్రి అభిప్రాయ‌ప‌డ్డారు. వారి సంక్షేమం కోసం పాటుప‌డుతున్న డ‌బ్ల్యూజేఐని అభినందించారు. డ‌బ్ల్యూజేఐ గౌర‌వాధ్యక్షుడు నంద‌నం కృపాక‌ర్‌, రాష్ట్ర అధ్య‌క్షుడు రాణాప్ర‌తాప్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రావికంటి శ్రీ‌నివాస్‌, ఉపాధ్యక్షుడు అనిల్ దేశాయ్‌, కార్య‌ద‌ర్శి క్రాంతి, సామాజిక కార్య‌క‌ర్త తిరుమ‌ల్‌ పాల్గొన్నారు. క‌రీంన‌గ‌ర్ కు చెందిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు నాయ‌కులు క‌రుణాక‌ర్‌, ప్ర‌మోద్ కుమార్‌, హైద‌రాబాద్‌లోని ప‌లువురు సీనియ‌ర్ పాత్రికేయులు, మ‌హిళా జ‌ర్న‌లిస్టులు హాజ‌ర‌య్యారు. జ‌ర్న‌లిస్టులు ఎదుర్కొంటున్న‌స‌మ‌స్య‌లు, యూనియ‌న్ విస్త‌ర‌ణ‌కు ఉన్న అవ‌కాశాల‌పై వారు త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు.

error: Content is protected !!
Exit mobile version