తెలంగాణలో మోకాళ్ల యాత్ర చేసిన కాంగ్రెస్ అధికారంలోకి రాదు….
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి …
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో జన గర్జన పేరుతో నిర్వహించిన సభలో బీఆర్ఎస్ పార్టీ పై అవాకులు చవాకులు పేలుతున్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అర్థరహితమని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కే.వాసుదేవరెడ్డి ఆయన పై నిప్పులు చెరిగారు.ఖమ్మం సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై చైర్మన్ డా.కె.వాసుదేవ రెడ్డి స్పందిస్తూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడుతుందని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ముందుగా కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యంగా మీ నాన్నగారు రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన బోఫోర్స్ కుంభకోణంతో మొదలుకొని 2G స్పెక్ట్రమ్ లాంటి అనేక స్కాములకు కాంగ్రెస్ పార్టీ నిలయమని అది ముందు మీరు గుర్తుంచుకోవాలని సూచించారు. 2018 ఎలక్షన్లలో రైతులకు 2లక్షల రుణ మాపి అన్నారు, పెన్షన్లు పెంచి ఇస్తామని హామీలు ఇచ్చిన అవి ప్రజలు నమ్మలేదని, తెలంగాణలో ప్రజల చెంతకు పాలనను తీసుకొస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రజలు నమ్మి రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అడగముందే దర్కాస్తు ఖాని , ధర్నా కానీ చెయ్యక ముందే దివ్యంగులకు రూ.4000 పెన్షన్ ఇస్తామని ప్రకటించి అమలు చేసే ప్రభుత్వము బిఆర్ఎస్. అసలు మీరు అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎంత పెన్షన్లు ఇస్తున్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మోసపూరిత హామీలు ఇస్తున్న మీ మాటలు అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మ కు బంగారు గాజులు చేయిస్తా అన్న తీరుగా మారిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అడగకున్నా 200 నుండి 4000 వరకు ఇస్తున్న కేసీఆర్ ఎక్కడ ఆచరణకు నోచుకోేని మీ హామీలు ఎక్కడ అని ప్రశ్నించారు. ఏ సభలో మీరు మాట్లాడిన బిజెపికి బి టీమ్ బీఆర్ఎస్ అని మాట్లాడుతున్నారని అసలు మీ చేతగానితనం వల్లనే బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుందని,మొన్న నేషనల్ హేరాల్డ్ కేసులో ఐ.టి, ఈడి,సీబీఐ విచారణ ఎందుకు ఆగింది? జైల్లో ఉండాల్సిన మీకు మీ తల్లిగారికి బిజెపి ప్రభుత్వం ఏ విధంగా లబ్ధి చేకూర్చిందో, నరేంద్రమోదీ దయా దక్షిణ్యాల మీద మీరు దేశంలో పర్యటిస్తున్న విషయం ప్రజలకు తెలవదా, అసలు బిజెపికి ఏ టీం, బీ టీం రెండు కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని, తెలంగాణ రాష్ట్రంలో సీఎం అభ్యర్థిని ప్రకటించలేని దుస్థితిలో మీరు ఉన్నారని, రాష్ట్రంలో మీరు మోకాళ్ల యాత్ర చేపట్టిన అమలు కానీ హామీలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి గెలిచి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారని అన్నారు.
తెలంగాణను కాంగ్రెస్ మేనియా కమ్మేసింది. కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రం నలుమూలల నుంచి జనగర్జన సభకు హోరెత్తుతున్నారు. ఇప్పటికే సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానుండడంతో రాష్ట్రంలోని అన్ని దార్లు ఖమ్మం నగరం వైపే పరుగులు తీస్తున్నాయి. అగ్రనేత రాహుల్ గాంధీనే భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభకు హాజరవుతుండడంతో కాంగ్రెస్ పార్టీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. సుమారు ఐదారు లక్షల మందితో జనగర్జన సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో అన్ని సిద్ధం చేశారు. ఈ సభలో పార్టీలో చేరికలు, భట్టికి రాహల్ గాంధీ సన్మానంతో పాటుగా ప్రజలకు కాంగ్రెస్ తరపున స్పష్టమైన హామీలు ప్రకటించనున్నారు.
భట్టి విక్రమార్క పాదయాత్ర ఇప్పటికే రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 నియోజకవర్గాల మీదుగా 1360 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. భట్టి పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో కేసీఆర్ ఏకచ్ఛత్రాధిపత్య రాజకీయాలకు భట్టి విక్రమార్క భరత వాక్యం పలికాడని రాజకీయ వర్గాల్లో ఇప్పటికే బలంగా వినిపిస్తోంది.
కాంగ్రెస్ ఎక్కడుందీ అన్న నోటి నుంచే హస్తం పార్టీనే ఇంకా బలంగా ఉందనిపించాడు. కారులో ఉక్కపోతకు గురవుతున్న నేతలకు, భవిష్యత్ లేక, అవకాశాలు రాని ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ ను ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలిపాడు. దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు నాయకులంతా ఆసక్తి చూపుతున్నారు. కేసీఆర్ మీద వ్యతిరేకత లేదన్న నోళ్లే ఇప్పడు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తరువాత కేసీఆర్ కు ఇంక కష్టమే అనిపించడంలో భట్టి విక్రమార్క తిరుగులేని విధంగా సక్సెస్ అయ్యాడు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ కు ముందు – వెనుక అనేలా మార్చేశారు. మొత్తం రాష్ట్ర రాజకీయ యంత్రాంగమంతా తన చుట్టూ తిరిగేలా చేసుకోవడంలో భట్టి తిరుగులేని విధంగా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇంత వరకూ ఎవరూ పలకరించని నిరుపేద వర్గాలను భట్టి విక్రమార్క నేరుగా కలవడం విశేషం. పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేటెస్ట్ ట్రెండింగ్ గా నిలిచారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఎన్నో సంచలనాలకు..మరెన్నో ప్రజాసమస్యను గుర్తించడానికి వేదికగా నిలిచింది.
ఇప్పటి వరకూ ఎవరూ కన్నెత్తి చూడడానికి కూడా సాహసించని ప్రాంతాల్లో ప్రయాణిస్తూ, స్వతంత్ర తెలంగాణ రాజకీయాలకు ఒక చుక్కానిలా మారాడు. ఆదిలాబాద్ జిల్లా మొదలుకుని రాష్ట్రవ్యాప్తంగా భట్టి పాదయాత్రతో కాంగ్రేస్ మేనియా మొదలైంది. తాజాగా ఖమ్మం నగరంలో తలపెట్టిన జనగర్జన సభతో భట్టి విక్రమార్క నామస్మరణం హోరెత్తుతున్నది.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న జనగర్జన సభ కోసం ఖమ్మం నగరం అందంగా ముస్తాబైంది. ఖమ్మం నగరంలో అడుగడుగునా మూడు రంగుల జండాలే దర్శనమిస్తున్నాయి. ఎటు చూసినా కాంగ్రెస్ ఫ్లెక్సీలతో సుందరంగా మారింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జెండాలు, హోర్డింగ్ లతో అలంకరించారు.
పట్టణంలో ప్రధాన రహదారులు, చౌరస్తాలు, కూడళ్లు, విద్యుత్ స్థంభాలను కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో అత్యంత సుందరంగా అలంకరించారు. పట్టణంలో దాదాపు 45 అడుగుల కటౌట్స్, 20×20 అడుగుల సర్కిల్ హోర్డింగ్ లు, భారీ కటౌట్ లు, పెద్దపెద్ద బెలూన్స్ ఎగరేశారు. రాహుల్ కు యూత్ కాంగ్రెస్ భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో స్వాగతం పలకనుంది. ఈ సభ వైపే ఇప్పుడు యావత్ తెలంగాణ ఆసక్తిగా చూస్తోంది.
`కోట్ల విజయభాస్కరరెడ్డి ఏ పదవులు చేపట్టారో తెలుసా?
` ఎంతో తెలిసినట్లు బిల్డప్పు యాంకర్లు?
` ప్రశ్నించే ముందు చరిత్ర తెలుసుకోవాలి.
`ఒక మంత్రిని ఇంటర్వూ చేసినప్పుడు చరిత్రను వక్రీకరించొద్దు!
`చరిత్రకు మరకలంటించొద్దు!
`చరిత్రపై అవగాహన లేని జర్నలిస్టుల వల్ల సమాజానికి చాలా నష్టం!
` ఇటీవల మంత్రి కేటిఆర్ ఇంటర్వూలో యాంకర్ తప్పుడు ప్రశ్నలు?
` కోట్ల విజయభాస్కరరెడ్డి రెడ్డి రెండు సార్లు ముఖ్యమంత్రి?
`అడిగే ముందు కనీస అవగాహన ఎంతో ముఖ్యం?
` తొలుత1982 నుంచి 83 వరకు, తర్వాత 1992 నుంచి 1994 వరకు సిఎం గా పని చేశారు.
`అసలు ఉమ్మడి రాష్ట్రంలోనే ఏ మంత్రి రాజీనామా చేయలేదు?
`నేదుమల్లి జనార్ధన రెడ్డి ఇంజనీరింగ్ , మెడికల్ సీట్ల విషయం ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి!
` ఎక్సైజ్ కాంట్రాక్టులు మంత్రులకు కేటాయింపులు సిఎం కు ముడుపులు అందినట్లు పెద్ద ఎత్తున ఆరోణలు చేశారు.
`దాంతో నేదురుమల్లి జనార్ధనరెడ్డి రాజీనామా చేయడం జరిగింది?
`చరిత్ర తెలియక తెలంగాణ సమాజాన్ని తప్పు తోవ పట్టించే ప్రయత్నం?
`ఇంకా తెలంగాణపై విషం చిమ్మడం వారి అతి తెలివికి నిదర్శనం?
హైదరబాద్,నేటిధాత్రి:
ఈశ్వరుడు నోరిచ్చాడు కదా…అని అన్నట్లు…న్యూస్ ఛానళ్ల యాంకర్లకు నోరుంటే చాలు..ఆంధ్రా అయితే చాలు..ఈ రెండు క్వాలిఫికేషన్లు వుంటే చాలు. రాజకీయాలు అవసరంలేదు. చరిత్ర మీద అవగహన వుండాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ అదే జరుగుతోంది. అదే సాగుతోంది. తెలంగాణ మీద ఇప్పటికీ ఎలా విషం చిమ్మాలో ప్రయత్నం కొనసాగుతూనే వుంటుంది. తాము చెప్పిందే నిజమనట్టు నమ్మించడం అలవాటు చేసుకున్నారు. ఇదే ఆనాడైనా, ఇప్పుడైనా తెలంగాణ సమాజానికి శాపంగా పరిణమించింది. నాలుకను రెండు సార్లు అదుపులో పెట్టుకోవాలని పెద్దలు సూచించారు. ఒకటి తినేటప్పుడు, రెండోది మాట్లాడేటప్పుడు. రెండోది ఆంద్రా యాంకర్లకు అవసరం లేదన్నట్లుగా మారిపోయింది. నోటికి ఏది వస్తే అదే మాట్లాడడం మళ్లీ మొదలుపెట్టారు. గతంలో 2014 ఎన్నికలు జరిగిన తర్వాత ఇలాగే తమ నోటి నుంచి వచ్చిందే మాట…మేం చూపిందే బాట…అన్నట్లు బరితెగించిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన ప్రజా ప్రనిధులను అవమానపర్చి, తెలంగాణలో బాయ్‌కాట్‌కు గురైన ఛానల్ అది. అయినా దానిలో మార్పు రావడం లేదు. ఎందుకంటే అలాంటి ఛానళ్లలో ఎంత మేదావులైనా తెలంగాణ వారికి అందలం వుండదు. గుర్తింపు కనిపించదు. కాని ఆంధ్రా అయితే చాలు..అక్షరం సరిగ్గా రాకున్నా ఫరవాలేదు. అక్షరం సక్కగ తెలియకుడా ఫరావాలేదు. చరిత్ర అంతకన్నా అవసరం లేదు. మాకున్న తెలివి తెలంగాణ వారికి వుండదన్న అహంబావం ఇంకా వారిలో వున్నట్లుంది. అందుకే ఇంకా అతి తెలివితేటలను ప్రదిర్శిస్తూనే వున్నారు. అక్షర పరిజ్ఞానం లేకపోయినా, నాలుక సామార్ధ్యం మీద ఆధారపడి కాలం వెల్లబుచ్చడం, అదే గొప్ప అనంతగా భావించడం ఆది నుంచీ వారికి అలవాటే…తెలంగాణ సమాజం ఎంత చైతన్యవంతమైందో తెలిసి కూడా వారి అతి తెలివి ప్రదర్శన ఆపడం లేదు.
తాజాగా రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కేటిఆర్‌ను ఇంటర్వూ చేసిన సందర్భంలో ఓ ఛానల్ యాంకర్ గతంలో మంత్రులు రాజీనామా చేశారంటూ చెప్పుకొచ్చారు.
ఎవరు రాజీనామా చేశారు? అంటూ మంత్రి కేటిఆర్ సదరు యాంకర్‌ను ప్రశ్నిస్తే కోట్ల విజయభాస్కరరెడ్డి అన్నారు. నిజానికి మంత్రి ఆ సమయంలో కొద్దిగా ఆలోచిస్తే ఆ యంకర్ పరువు అక్కడే పోయేది. కాని ఆ సమయంలో మంత్రి కేటిఆర్‌కు గుర్తుకు రాకపోవచ్చు. అంతే కాని మంత్రికి తెలియని విషయాన్ని తాను చెప్పినట్లు సదరు యాంకర్ ఏదో సాధించినంతగా నేను నిరూపించాన్నంత గర్వం చూపించారు. చరిత్ర మీద, తెలుగు రాజకీయాల మీద కనీసం అవగాహన లేని ఆ యాంకర్ అడిగిన ప్రశ్నే తప్పు. అందుకు మళ్లీ తానే చెప్పిన సమాధానం శుద్ద తప్పు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నోసార్లు ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి. కాని ఏనాడు వాటిపై చర్యలు లేవు. ఎందుకంటే బోర్డులో వుండేవారు చేసే తప్పుడు పనులవి. ఎక్కడా, ఎప్పుడూ జరగలేదన్నట్లు మంత్రి కేటిఆర్‌కే పాఠాలు చెప్పినట్లు ముఖ కవలికలు మార్చాడు. తనకు తెలియనిది అబద్దమైన విషయం చెప్పడం ఆ యాంకర్ అతి తెలివికి నిదర్శనం. ఉమ్మడిరాష్ట్రంలో ఓ సందర్భంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ ఏకంగా ఓ జపాన్‌ను చెందిన ఓ బోగస్ కంపనీకి రూ.3కోట్లు చెల్లించడం జరిగింది. ఆ సమయంలో స్వయంగా మంత్రి బొత్స పోనాయ్..ఏటి సేత్తాం..అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినా ఏ ఒక్క ఛానల్ మాట్లాడలేదు. కాని ఇప్పుడు ఓ ఆంద్రా చరిత్రను పుక్కిట పట్టుకున్నట్టు నోటికి ఏది వస్తే అది చెప్పి ఆ యాంకర్ జర్నలిజం పరువు తీశాడు.
కోట్ల విజయభాస్కర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
కేర్రదంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం వుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ తొలిసారి అధికారంలోకి రావడానికి ముందు 1983లో ఆయన ముఖ్యమంత్రిగా వున్నారు. అదేంటో గాని మళ్లీ 1994 లో కూడా ఆయనే సిఎంగా వున్నారు. రెండుసార్లు ఆయన చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీకి అధికారం అందించారు. అలాంటప్పుడు పేపర్ల లీకేజీ ఎక్కడిది. ఆయన రాజీనామా చేసిందెక్కడ? అసలు ఆ యాంకర్‌కు తెలిసినచరిత్రేమిటి? సరే..ఇదిలా వుంటే 1990 నుంచి 1992 వరకు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురు మల్లి జనార్ధనరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కనీసం అది తెలుసా? ఆ రోజుల్లో ఇంజనీరింగ్ ,మెడికల్ ప్రైవేటు కాలేజీల్లో క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసుకునేందుకు కాలేజీలకు అవకాశం కల్పించాడు. అది చట్ట విరుద్దం. నేరం కూడా..? అలాంటి కాలేజీలు వసూలు చేసిన ఫీజుల్లో వాటాలుతీసుకున్నాడని నేదురుమల్లి మీద పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. అందుకే ఆయా కాలేజీలకు అనుమతులు ఇచ్చారు. పేద విద్యార్ధులకు ఇంజనీరింగ్, వైద్య విద్యను దూరం చేశారు. అంతే కాదు ఆ రోజుల్లో రూ.5లక్షలు ఒక్క సీటు కోసం క్యాపిటేషన్ ఫీజు అంటే పెద్ద అమౌంట్. అంతలా అవినీతికి పాల్పడడాన్ని అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీతోపాటు, నాటి కాంగ్రెస్ నేతలు కూడా నేదురుమల్లి మీద విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేకాకుండా అప్పటి మంత్రులకు ఎక్జైజ్ కు చెందిన టెండర్లు అలాట్‌మెంటులో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారన్నది అప్పడు అభియోగం. దానితోపాటు ఆ కాలేజీలన్నీ ఇలా ఎక్జైజ్ వ్యాపారులైన మంత్రులకే కేటాయించారు. ఇలా విద్యావ్యవస్ధను భ్రష్టుపట్టించిన చరిత్ర ఆంధ్ర పాలకులది. ముఖ్యమంత్రి స్ధానంలో వుండి నేదురుమల్లి తన బంధువుల అమ్మాయికి మెడికల్ సీటు ఇప్పించారని కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ తెలుసుకున్న అప్పటి కాంగ్రెస్ అధిష్టానం నేదురమల్లిని అధికారంలో నుంచి దింపేసి, కోట్ల విజయభాస్కరరెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేసింది. ఇదీ అసలు చరిత్ర. ఇది కాకుండా 1985లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఓ పదో తరగతి పరీక్షల్లో కొన్ని అవకతవకలు జరిగాయి. ప్రత్యక్షంగా అప్పటిమంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రమేయం వుందన్న వార్తలు పెద్దఎత్తున వచ్చాయి. అంతే కాకుండా ఆయన ఆధ్వర్యంలో ఆంధ్రా ప్రాంతంనుంచి వచ్చిన వారికి తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో పెద్దఎత్తున ఎలాంటి పరీక్షలు లేకుండానే లెక్చరర్లుగా ఉద్యోగ నియామాకాలు చేశారు. అది అప్పట్లో వివాదమైంది. దాంతో మంత్రిగా వున్న గాలిముద్దుకృష్ణమ నాయుడు రాజీనామా చేశాడు. కాని ఎన్టీఆర్ ఒప్పుకోకుండా కొంత కాలానికి విద్యాశాఖను మార్చి అటవీ శాఖను అప్పగించారు. ఇదీ అప్పట్లో తెలంగాణకు జరిగిన అన్యాయం. ఇలాంటి అన్యాయాల వల్ల తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని, తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావడం లేదని ముఖ్యమంత్రి కేసిఆర్ ఉద్యమం మొదలుపెట్టింది. ఆనాడు నోరు మెదపని సీమాంద్ర మీడియా తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక, సమర్ధవంతమైన ప్రభుత్వాన్ని , వికాసవంతమైన తెలంగాణ సమాజంలో చిచ్చు పెట్టాలని చూస్తోంది. ఇప్పటికైనా మెరుగైన సమాజం కోసం అంటూ చెప్పే ఆంధ్రా ఛానళ్ల మాటలు నిజాలు ఎప్పుడూ కావు. విలువలు లేని వ్యక్తులు జర్నలిజంలో చేరి సమాజాన్నే తప్పుదోవ పట్టించడం ఎప్పటినుంచో సాగుతోంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత వున్న పార్టీలు కూడా ప్రభుత్వం మీద సీమాంధ్ర మీడియాచేసే అసత్యాలను బాధ్యత కల్గిన తెలంగాణ పార్టీలు కూడా వ్యతిరేకించాలి.
ఇప్పుడు అందరి చూపు ఖమ్మం వైపే. ఖమ్మంలో జరిగే జనగర్జన సభకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తరలి వస్తున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఇప్పుడు తెలంగాణ వైపే అందరి ఫోకస్. తెలంగాణలో అధికారంకు దగ్గరయ్యామనే నమ్మకం కాంగ్రెస్ లో వచ్చింది. ఇటు బీజేపీ ఢిల్లీ నేతలు కూడా ఖమ్మం సభ వైపే చూస్తున్నారు. తెలంగాణలో బీజేపీని కాంగ్రెస్ హైజాక్ చేసింది. పూర్వ వైభవం దిశగా సాగిపోతోంది. బీజేపీలో నేతల మధ్య దూరం పెరిగింది. కాంగ్రెస్ లో ఐక్యత పెరుగుతోంది. ఖమ్మం సభతో తెలంగాణలో అధికారం వైపు అడుగులు వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. తిరుగులేదనుకున్న బీఆర్ఎస్ లో ఖమ్మం సభ వలన ప్రకంపనలు మొదలయ్యాయి.
ఇప్పుడు అందరి చూపు ఖమ్మం వైపే. ఖమ్మంలో జరిగే జనగర్జన సభకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తరలి వస్తున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఇప్పుడు తెలంగాణ వైపే అందరి ఫోకస్. తెలంగాణలో అధికారంకు దగ్గరయ్యామనే నమ్మకం కాంగ్రెస్ లో వచ్చింది. ఇటు బీజేపీ ఢిల్లీ నేతలు కూడా ఖమ్మం సభ వైపే చూస్తున్నారు. తెలంగాణలో బీజేపీని కాంగ్రెస్ హైజాక్ చేసింది. పూర్వ వైభవం దిశగా సాగిపోతోంది. బీజేపీలో నేతల మధ్య దూరం పెరిగింది. కాంగ్రెస్ లో ఐక్యత పెరుగుతోంది. ఖమ్మం సభతో తెలంగాణలో అధికారం వైపు అడుగులు వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. తిరుగులేదనుకున్న బీఆర్ఎస్ లో ఖమ్మం సభ వలన ప్రకంపనలు మొదలయ్యాయి.
అగ్ర నేతే సత్కరించటం అనేది అరుదైన సందర్భం. ఇప్పుడు భట్టికి ఈ అపూర్వ అవకాశం దక్కింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా భట్టి పీపుల్స్ మార్చ్ యాత్ర మొదలైంది. నేతలను ఏకం చేసింది. పార్టీకి వచ్చిన ఆదరణ, కార్యకర్తల్లో కొత్త జోష్, కేడర్ లో వచ్చిన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. భట్టి యాత్ర పైన ఎప్పటికప్పుడు సమాచారం సేకరించిన రాహుల్ గాంధీ ఖచ్చితంగా భట్టికి తగిన గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు.
దీంతో, భట్టి పాదయాత్ర ముగింపు సభగా, పొంగులేటితో సహా ఇతర ముఖ్య నేతల చేరిక సభగా ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన నిర్వహణకు సిద్ధమైంది. ఖమ్మంలో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు సందడి చేస్తున్నారు. ఖమ్మం సభ వేళ తెలంగాణ కాంగ్రెస్ లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఖమ్మం చేరుకున్న రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. పార్టీ నేతలతో కలిసి వైరా రోడ్డులోని ఎస్‌ఆర్ గార్డెన్ సమీపంలో వంద ఎకరాల స్థలంలో చేస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జనగర్జన సభకు ముందు రాహుల్ గాంధీ ఖమ్మం చేరుకునే సమయంలో యువజన కాంగ్రెస్ నేతలు భారీ బైకు ర్యాలీకి ప్లాన్ చేసారు. ఆ ర్యాలీలో రాహుల్ గాంధీ పొల్గొంటారు. అంచనాలకు మించి జనం హాజరయ్యే అవకాశం ఉందని నేతలు అంచనా వేస్తున్నారు.
అటు బీజేపీలో గందరగోళం కొనసాగుతోంది. పార్టీలో నుంచి నేతలు వీడుతారనే భయం వెంటాడుతోంది. పార్టీ నాయకత్వం మార్పు పైన డైలమాలో నేతలు ఉన్నారు. రాహుల్ వస్తుండటంతో బీజేపీ అగ్ర నాయకత్వం చూపు ఇప్పుడు ఖమ్మం వైపు ఉంది. అనూహ్యంగా కాంగ్రెస్ తెలంగాణలో పంజుకోవటం, బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదు. ఈ సమయంలోనే ఖమ్మం సభకు అధికార బీఆర్ఎస్ అవాంతరాలు కలిగించే ప్రయత్నం చేస్తోంది. సభకు ముందు బస్సులు ఇవ్వటానికి అంగీకరించిన ఆర్టీసీ..
ఆ తరువాత నో చెబుతోంది. మంత్రుల ఒత్తిడితో నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో లేని చెక్ పోస్టులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సభ – భట్టి విక్రమార్క యాత్ర – రాహుల్ రాక – నేతల చేరికలు పైన ప్రగతి భవన్ లో చర్చలు సాగుతున్నాయి. నిఘా నివేదికల పైన తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. ఇప్పుడు ఖమ్మం సభ చుట్టూ తెలంగాణ రాజకీయం కాంగ్రెస్ వైపు టర్న్ తీసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.
` 65 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నుల దిగుబడి ఎలా సాధ్యమౌతోంది?
` కొత్తగా ఎనభై లక్షల ఎకరాల సాగు పెరగలేదా?
` తెలంగాణలో పారుతున్న కాలువలు కనిపచడం లేదా?
` పచ్చని పొలాలు నిజం కాదా?
` చెరువుల్లో మత్స్య సంపద చూడడం లేదా?
` తెలంగాణ నుంచి చేపలు ఎగుమతి కావడం లేదా?
` ఇరవై నాలుగు గంటల కరంటు అందడం లేదా?
` భూగర్భ జలాలు పెరిగి ఫ్లోరైడ్ పారిపోలేదా?
హైదరబాద్,నేటిధాత్రి:
నిజం చెప్పడానికి దమ్ముండాలి. ధైర్యముండాలి. అబద్దం చెప్పడానికి ఇవేవీ అవసరం లేదు. నోరుంటే చాలు. మోసపూరితమైన మనసుంటే చాలు. మభ్యపెట్టే గుణముంటే చాలు. కాని నిజం మాట్లాడాలంటే కూడా మంచి తనం వుండాలి. మంచి గుణం కూడా కావాలి. అవేవీ ప్రతిపక్షాలలో లేవు. ప్రతిపక్షాలు నిజాలు చూడలేవు. నిజాలు వినలేవు. నిజాలు మాట్లాడలేవు. దేశమంతా తెలంగాణ వెలుగులను చూసి ఆశ్యర్యపోతోంది. సంబరపడుతోంది. తొమ్మిదేళ్లలో జరిగిన సర్వతోముఖాభివృద్దిని చూసి అబ్బురపడుతోంది. మా రాష్ట్రాలు కూడా తెలంగాణలాగా అభివృద్ది చెందితే బాగుండు అని వివిధ రాష్ట్రాల ప్రజలు ఆశపడుతున్నారు. తెలంగాణ ప్రజలు గర్వపడుతున్నారు. సంతోషపడుతున్నారు. ప్రతిపక్షాలకు మాత్రం తెలంగాణ అభివృద్ధి కళ్లముందు కనిపిస్తున్నా చూడలేకపోతున్నారు. తెలంగాణ అభివృద్ధి కావడం వాళ్లకు గిట్టడం లేదు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు ఎప్పుడూ ఇబ్బందుల్లో వుండాలి. కష్టాలలో వుండాలి. అనే కోరుకుంటున్నాయి. తెలంగాణ బాగు పడుతుంటే కాంగ్రెస్, బిజేపి నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. మాకు ఇక భవిష్యత్తులో అధికారం రాదన్న అక్కసుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నిత్యం పనికి రాని వాదనలు ముందేసుకుంటున్నారు. అసలు సమస్యలు పక్కదోవ పట్టిస్తూ, పొద్దుపుచ్చకుంటున్నారు. అదికారం కోసూం గోతి కాడ ఎదరుచూసినట్లు చూస్తున్నారు. ప్రజలు బాగు పడుతుంటే చూడలేకపోతున్నారు. ప్రజలు గతంలో పడిన గోసను గుర్తు చేసుకొని, ఇప్పుడు తెలంగాణ అభివృద్దిని చూసి మురిసిపోతుంటే, ప్రతిపక్షాలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాయి. ఇంత సత్వర తెలంగాణ అభివృద్ది ప్రతిపక్షాలకు కళ్ల కనిపించడం లేదా? తెలంగాణలో ప్రతి మూలలో పారుతున్న నీళ్లు కనిపించడంలేదా? ఒకనాడు ఎండిన బీడులన్నీ పొలాలుగా మారి సిరుల పంటలు పండిస్తుంటే కనిపించడం లేదా? తెలంగాణలో వెల్లివిరిస్తున్న పచ్చదనం కనిపించడం లేదా? భూగర్భజలాలు పెరిగి, అటు చెరువులు నిండి, బావులు, బోర్లలో ఎండ కాలంలో కూడా పొలాలకు నీళ్లందుతుంటే కనిపించడం లేదా? ప్రతిపక్షాలలో రైతులు లేరా? వాళ్లకు పొలాలు లేవా? ఆయా పార్టీల నాయకులు సాగు చేయడం లేదా? రైతు బంధు పొందడం లేదా? ఒకనాడు పడావు బడ్డ భూములన్నీ కళకళలాడం లేదా? సాగు మా వల్ల కాదని, ఊళ్లలో వుంటే బతకలేమని పదుల ఎకరాలు వున్న రైతులు కూడా పట్టణాలకు వలసలు పోయిన బతికిన రోజులు గుర్తులేదా? ఆనాడు వలసలు పోయిన ప్రజలు మళ్లీ పల్లెలు బంగారు పంటలు పండిస్తూ, రైతే రాజు అన్న నానుడిని నిజం చేయడం లేదా? తెలంగాణ రైతన్న కాలు మీద కాలేసుకొని బతకడం లేదా? ఆఖరుకు అకాల వర్షాలకు ధాన్యం తడిసినా, ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన సందర్భం ఎప్పుడైనా చూశామా? ఇన్ని మంచి పనులు మన కళ్లముందు కనిపిస్తుంటే కళ్లుండి చూడలేని ప్రతిపక్షాలను ప్రజలు కూడా ఏవగించుకుంటున్నారు. అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ కళ్లలో వున్న కుళ్లును కాళేశ్వరం నీళ్లతో కడుక్కొని పారుతున్న తెలంగాణ గంగమ్మ తల్లికి దండం పెట్టుకోవాలి. తప్పుడు మాటలు మాట్లాడమని వారి నోళ్లు శుభ్రం చేసుకోవాలి. వారిలో అణువణువూ ఆహించిన అహాన్ని ఆ నీటిని తాగి పోగొట్టుకోవాలి. పారుతున్న జలంలో చేస్తున్న నిందలు వదిలేసి, ఒళ్లంతా కడుక్కోవాలి. తప్పైందని లేంపలేసుకోవాలి. తెలంగాణలో నీటి సిరులకు కారణమైన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఎవరైనా జేజేలు పలకాలంటున్న ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్న తెలంగాణ అభివృద్ధి విశేషాలు… ఆయన మాటల్లోనే…
అసలు కలగన్నామా? తెలంగాణ వస్తుందని ఊహించామా? అరవైఏళ్ల నిర్లక్ష్యాన్ని అనుభవించాం.
నీరు లేకున్నా కన్నీళ్ల సాగు చేశాం. కరంటు లేక పంటలు ఎండుతున్నా కన్నీళ్లను దిగమింగుకున్నాం. ఎప్పుడొస్తుందో..ఎప్పుడు పోతుందో తెలియని కరంటుకు చార్జీలు చెల్లించాం. ఎప్పటికిప్పుడు ఎంత పెంచినా, నోరు మెదపకుండా బిల్లులు కట్టుకున్నాం. ఎండిన పంటలు చూసి కుమిలి ఏడ్చాం. ఆ గోసలన్నీ పోయాయి. ఇప్పుడు ఆకుపచ్చ తెలంగాణ ఆవిషృతమైంది. తెలంగాణ కోసం పద్నాలుగేళ్ల పాటు సుధీర్ఘ పోరాటం చేసి, తెలంగాణ సాధించిన నాయకుడు కేసిఆర్. తెలంగాణను అభివృద్ధి నమూనాగా మార్చిన నాయకుడు కేసిఆర్. తెలంగాణ గోస చూసి చలించిన నాయకుడు కేసిఆర్. తెలంగాణ తెచ్చి గోస తీర్చిన నాయకుడు కేసిఆర్. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా..ఇదే సత్యం…ఇదే నిత్యం..అసలు పదేళ్ల కిందట తెలంగాణ ఎలా వుంది? ఇప్పుడు ఎలా వుంది? అన్నది ప్రతిపక్షాలకు తెలియందా? సరిగ్గా 2014లో తెలంగాణ వచ్చే నాటికి పండిన పంటలకు, ఇప్పుడు పండుతున్న పంటలు ఎన్ని రెట్లు పెరిగాయో! ప్రతిపక్షాలు చూడడం లేదా? ఆనాడు పండిన పంటలకు 70లక్షల టన్నులు మాత్రమే. మరి నేడు 3కోట్ల టన్నులకు పైగా వరి పండుతోంది. దానికి తోడు ఆరు తడి పంటలు పండుతున్నాయి. మొక్క జొన్న పండుతోంది. పప్పు దినుసలు పండుతున్నాయి. ఫామ్ ఆయిల్ సాగౌతోంది. ఇవన్నీ నీటి వసతులు కల్పించడం మూలంగా పంటలు సాగౌతున్నాయా? లేదా? అన్నది ప్రతిపక్షాలకు తెలియదా? ప్రతిపక్షాల నాయకులు రైతు బంధు తీసుకోవడం లేదా? నీటి సౌలత్ అందుకోవడం లేదా? వాళ్ల ఊర్లలో చెరువులు నిండిరది కనిపించడం లేదా? వాల్ల పొలాలకు నీళ్లు రాకుండానే సాగు చేస్తున్నారా? వాళ్ల ఊరి చెరువులో గతంలో నీటి చుక్క జాడ లేని రోజులే ఎక్కువ. అందులోనూ కాంగ్రెస్‌పార్టీ నేతలదే పాలన. మరి అప్పుడు చెరువుల్లో నీళ్లెందుకు లేవు?నేడు చెరువుల నిండా నీళ్లెందుకున్నాయి. ఆ చెరువుల్లో ఎప్పుడైనా చేపలు చూసిన చరిత్ర వుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపదనను తెలంగాణ ఎందుకు మించిపోయింది? ఒకప్పుడు తెలంగాణకు ఆంధ్రనుంచి చేపలు వచ్చేవి. ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చేపలు సరఫరా చేస్తున్నారు. తెలంగాణలో సంపద సృష్టి ప్రతిపక్షాలకు కనిపించదు. పెరిగిన మత్స్య సంపద చూడలేరు. కాని ఇంటికి కొనుక్కెళ్లి తింటున్నారు. ఇదీ ప్రతిపక్షాల తీరు.
ప్రపంచంలోనే అతి పెద్ద బహులార్ధక ఎత్తిపోతల పధకం కాళేశ్వరం.
ఇది మొత్తంగా కేవలం రాష్ట్ర ప్రభుత్వంచే నిర్మాణం చేయబడిన ప్రాజెక్టు. కేంద్రాన్ని ఎన్ని సార్లు కోరినా, రూపాయి సాయం చేయలేదు. పైగా తెలంగాణ రావడమే ఇష్టంలేని ప్రధాని మోడీ, తెలంగాణకు సాయం చేస్తాడని ఆశించలేదు. తెలంగాణ అంటేనే కళ్లలో నిప్పులు పోసుకునే బిజేపి పెద్దలకు తెలంగాణ అభివృద్దిని కోరుకుంటారా? అసలు తెలంగాణను నిధుల విషయంలో అన్యాయం చేస్తూ వున్నా, తెలంగాణ ఆత్మగౌరవంతో తలెత్తుకొని నిలబడేలా చేసిన ఘనత ఒక్క కేసిఆర్‌కే దక్కుతుంది. చరిత్రలో కేసిఆర్ లాంటి నాయకుడు మరొకరు కనిపించరు. ఎందుకంటే తన పుట్టిన నేల రుణంతీర్చుకున్న నాయకుడు కేసిఆర్. అలాంటి యుగపురుషుడు, త్యాగధనుడు, ఉద్యమ కారుడు ప్రపంచ చరిత్రలోనే లేరు. అంత గొప్ప నాయకుడి పాలనలో తెలంగాణ అన్ని రంగాలలో పరుగులు పెడుతుంది. తొమ్మిదేళ్లలో సర్వతోముఖాభివృద్ధి సాధించింది. ఏ రంగంలో చూసినా అన్ని విజయాలే. చిగురించిన ఆశలను ఆశయ ఫలాలుగా మార్చి ప్రజలకు అందించిన గొప్ప దార్శనికుడు కేసిఆర్. అలాంటి కేసిఆర్ పాలనను తెలంగాణ ప్రజలు ఎప్పుడూ వదులుకోరు. అధికారంలో వున్న నాడు తెలంగాణ కోసం పట్టించుకోలని కాంగ్రెస్ నాయకులను ప్రజలు ఆదరించరు. తెలంగాణకు సాయం చేసే స్ధానంలో వుండి కూడా తెలంగాణ ఏర్పాటును ఇప్పటికీ నిందిస్తూ, తెలంగాణపై విషయం కక్కుతూ, తెలంగాణలో పాలన కోసం అర్రులు చాచే బిజేపిని ప్రజలు ఎప్పుడూ దరి చేరనివ్వరు. ఆ పార్టీకి చోటే కల్పించరు. తెలంగాణ అంటే కేసిఆర్. కేసిఆర్ అంటే తెలంగాణ. తెలంగాణలో బిఆర్‌ఎస్ తప్ప మరోపార్టీకి తావులేదు. ఆ పార్టీల జెండాలకు చోటు లేదు.
తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ మొదలైంది. భట్టి విక్రమార్క పాదయాత్రతో మొదలైన మార్పు, ముగింపు వేళకు వచ్చే సరికి పూర్తి అనుకూలంగా మారింది. భట్టి పాదయాత్రకు ముందు – తరువాత అన్నట్లుగా పార్టీలో మార్పు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు హైకమాండ్ ను కదలించిన అంశం. భట్టి పీపుల్స్ మార్చ్ ముగింపు సభకు రాహుల్ ను తరలి వచ్చేలా చేసింది కూడా ఇదే అంశం. 109 రోజుల పాటు మండుటెండల్లో 1300 కిమీ నడిచిన భట్టిని పార్టీ తరపున రాహుల్ సత్కరించనున్నారు. ఖమ్మం వేదికగా పార్టీలో ముఖ్య నేతల చేరికలు జరగనున్నాయి. తాజా పరిణామాల నడుమ సెంట్రల్ టీమ్స్ రంగంలోకి దిగి మేధావులతో భేటీలు నిర్వహిస్తున్నారు. సభ సక్సెస్ అవ్వటం ఖాయమని గ్రహించిన రేవంత్ అలర్ట్ అయ్యారు. ఖమ్మం సభ ఏర్పాట్ల పైన పర్యవేక్షణకు రంగంలోకి దిగారు.
తెలంగాణలో కాంగ్రెస్ కు ఈ స్థాయి ఆదరణ తిరిగి దక్కుతుందని పార్టీ ముఖ్యులే అంచనా వేయలేదు. పార్టీ కోసం భట్టి చొరవ తీసుకొని పీపుల్స్ మార్చ్ పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. ప్రభత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో బాధ పడుతున్న వారికి అండగా నిలిచారు. పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలతో మమేకం అయ్యారు. ఈ బాధల నుంచి విముక్తి కావాలంటే కాంగ్రెస్ పాలన, ఇందిరమ్మ రాజ్యం అవసరమని వివరించారు. ఈ ఆదరణ కాంగ్రెస్ నేతలను కదలించింది. శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అప్పటి వరకు ఎవరికి వారుగా ఉన్న నేతలంతా ఒక్కటయ్యారు. ఈ ఐక్యత, ఆదరణ కాంగ్రెస్ హైకమాండ్ ను ఆకర్షించింది. భట్టి యాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ కు కారణమైన భట్టి యాత్ర ముగింపు సభకు రాహుల్ తరలి వస్తున్నారు. లక్షలాది మంది సమక్షంలో భట్టి విక్రమర్కను సన్మానించనున్నారు.ఇప్పుడు ఖమ్మం సభ పైన భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. పార్టీకి పెరిగిన ఆదరణ..భవిష్యత్ కార్యాచరణ పైన వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
ఖమ్మంలో జరగనున్న జనగర్జన తెలంగాణ రాజకీయ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు ఏర్పాట్లు భారీ ఎత్తున ఉండటం, కాంగ్రెస్ పై ప్రజల ఆదరణ, కార్యకర్తల్లో జోష్, ఇవన్ని పెరగటం చూసిన అధికార పార్టీలో ఆందోళన మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా పొరుగు జిల్లాల పైన ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని ఇప్పటికే నిఘా సంస్థలు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. ఖమ్మంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా తమ పట్టు జారుతోందనే ఆందోళన బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. ఖమ్మం సభా వేదికగా జరిగే చేరికలు, రాహుల్ తెలంగాణ ప్రజల కోసం ఇవ్వనున్న హామీలు ఇప్పుడు ఎన్నికల వేళ బీఆర్ఎస్ – బీజేపీకి సవాల్ గా మారుతున్నాయి.ఖమ్మం సభ వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది. ఖమ్మం సభ నిర్వహణపైన ఇప్పటి వరకు రేవంత్ అంటీ ముట్టనట్లు ఉన్నారు. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రే నేరుగా భట్టి వద్దకు వెళ్లి సభా నిర్వహణ పైన చర్చించారు.
అ చర్చలకు పొంగులేటిని ఆహ్వానించారు. సభకు జనగర్జన గా అక్కడే పేరు ఖరారు చేసారు. థాక్రే రాష్ట్రంలోనే మకాం వేసారు. సభ జరిగే రోజున రాహుల్ గాంధీ వస్తుండటంతో మొదట టీపీసీసీ అధ్యక్షుడిగా సభ వరకు పరిమితం అయ్యేందుకు రేవంత్ సిద్ధమయ్యారు. కానీ మారుతున్న పరిణామాలు, నేరుగా రాహుల్ టీమ్ సభ పైన ఫోకస్ చేయటం, సభ గ్రాండ్ సక్సెస్ అవ్వటం ఖాయంగా కనిపిస్తుండటంతో ఇప్పుడు రేవంత్ ఖమ్మం బాట పట్టారు. ముందస్తు ఏర్పాట్ల పై పర్యవేక్షణకు రంగంలోకి దిగారు. ఆలస్యం చేస్తే అసలుకే మోసం వస్తుందని గ్రహించారు. ఇప్పుడు ఖమ్మం మొత్తం భట్టి పాదయాత్ర ముగింపు, పొంగులేటి చేరిక కేంద్రంగా నిర్వహణకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000000)
క్వీన్ ఆఫ్ పాప్’గా ప్రఖ్యాతిగాంచిన మడోన్నా (64) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత వారం తన ఇంట్లో అచేతన స్థితిలో పడి ఉన్న ఆమెను వ్యక్తిగత సిబ్బంది ఆస్పత్రిలో చేర్చారు. తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో ఆమె బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
మడోన్నా ఆరోగ్య పరిస్థితిపై ఆమె వ్యక్తిగత సహయకుడు ఒసారీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘గత శనివారం మడోన్నా ఇంట్లో అచేతన స్థితిలో పడి ఉన్నారు. దీంతో ఆమెను న్యూయార్క్‌లోని ఓ ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం మడోన్నా ఐసీయూలో ఉన్నారు. పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నా, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. పూర్తిగా కోలుకోవడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది’ అని అన్నారు.
64 ఏళ్ల మడోన్నా జులై 15 నుంచి కెనడాలోని వాంకోవర్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని షెడ్యూల్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఒసారీ తెలిపారు. మరోవైపు, మడోన్నా త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. మ్యూజిక్ ప్రపంచంలో పాప్‌స్టార్‌గా చెరగని ముద్రవేసిన ఆమెకు అశేష సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అత్యధిక ఆల్బమ్స్ విక్రయమైన సింగర్స్ జాబితాలో మడోన్నా టాప్‌లో నిలిచారు. గాయనిగానే కాకుండా పలు సినిమాల్లోనూ ఆమె అలరించారు.
నేటిధాత్రి న్యూఢిల్లీ.. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ టూర్ ఖరారైంది. జూలై 8న వరంగల్ జిల్లాలో నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.
ఈ మేరకు ప్రధాని టూరు కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైనట్లు తెలిసింది. ఈ సందర్భంగా కాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్, వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కుకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నట్లు ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు..
అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రధాని మోడీ పర్యటన పురస్కరించుకుని రాష్ట్ర బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.*
రాష్ట్ర బీజేపీలో తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని తెలంగాణ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
మరోవైపు 8న హైదరాబాద్లో జేపీ నడ్డా అధ్యక్షతన జరగాల్సిన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం వాయిదా పడినట్లు సమాచారం.
ఆ ఒక్క అడుగు నేడు కాంగ్రెస్కు పునర్జీవం అయిం ది. కొత్త చరిత్రకు శ్రీకారం
చుట్టిం ది. ఉద్య మాన్ని తలపిం చేలా పీపుల్స్ మార్చ్ సాగిం చిన పోరాట
యోధుడు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ చరిత్రలో నిలిచిపోనుం ది.
భట్టి పాదయాత్ర వలన పార్టీలో సైలెంట్ సునామీగా మారిం ది. కేడర్ లో జోష్
పెం చిం ది. ఎన్ని కల వేళ సమరానానికి సైన్యం లో పోరాట కసిని పెం చిం ది.
దీనిని గుర్తిం చిన హైకమాం డ్ భట్టికి అరుదైన గౌరవం అం దిస్తోం ది. ఖమ్మం
గడ్డపైన లక్షలాది మం ది కార్య కర్తల సమక్షం లో భట్టిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
పార్టీ తరపున సత్క రిం చనున్నా రు. ఇదే సభలో ముఖ్య నేతల
చేరికలు…తెలం గాణ భవిష్య త్ పై భరోసా ఇస్తూ ఎన్ని కల సమరశం ఖం
పూరిం చేం దుకు ఖమ్మం జనగర్జన వేదికగా నిలవనుం ది.
ఒక్క తెలం గాణలోనే కాదు…కాం గ్రెస్ పార్టీలో గల్లీ నుం చి ఢిల్లీ వరకు వినిపిస్తున్న
పేరు మల్లు భట్టి విక్రమార్క . దక్షిణాదిని కర్ణాటక తరువాత కాం గ్రెస్ నాయకత్వం
ఫోకస్ చేసిన రాష్ట్రం తెలం గాణ. తెలం గాణ ఇచ్చిన రాష్ట్రం గా కాం గ్రెస్ క
అధికారం దక్కా లి…రాహుల్ ప్రధాని కావాలి. ఈ రెం డు అం శాలే లక్ష్యం గా
బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్య తిరేక నిర్ణయాల పై ప్రజల మధ్య నుం చే భట్టి
నిలదీసారు. వారికి అం డగా నిలిచారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకం
అయ్యా రు. ఎన్ని ఇబ్బం దులు వచ్చినా..అనారోగ్య సమస్య లు తలెత్తినా వెనుకడుగు
వేయలేదు. ఈ యాత్రతో నేతలం దరు ఏకం అయ్యా రు. కాం గ్రెస్ శ్రేణులు తరలి
వచ్చారు. అగ్ర నేతలు సం ఘీభావం ప్రకటిం చారు. ప్రజలు మద్దతుగా నిలిచారు.
అం దుకే ఇప్పు డు భట్టి పీపుల్స్ మార్చ్ కు ఇం త పాపులారిటీ వచ్చిం ది.
భట్టి యాత్ర ద్వా రా తెలం గాణ కాం గ్రెస్ లో వచ్చిన మార్పు ను హైకమాం డ్
గుర్తిం చిం ది. దీం తో భట్టి యాత్రకు సరైన గుర్తిం పు ఇవ్వా లని నిర్ణయిం చిం ది.
ఇదే సమయం లో పార్టీలో ముఖ్యు ల చేరికల పైన భట్టి చేసిన ప్రయత్నా లు
సఫలం అయ్యా యి. అన్నిం టికీ సరైన వేదిక ఖమ్మం గా నిర్ణయిం చారు. ఇక్క డ
నుం చే పార్టీ నేత రాహుల్ గాం ధీ తెలం గాణ పైన తమకున్న అభిమానం
చాటుతూ..భవిష్య త్ లో ఏ విధం గా తెలం గాణ కోసం ఎటువం టి నిర్ణయాలు
అమలు చేసేది ప్రకటిం చనున్నా రు. ఇక్క డ నుం చే బీఆర్ఎస్ ప్రభుత్వం పై
గర్జనకు సిద్ధమయ్యా రు. ఈ సభకు జనగర్జనగా పేరు ఖరారు చేసారు.
సీఎల్పీ నేత భట్టితో తాజాగా పార్టీ రాష్ట్ర వ్య వహారాల ఇం ఛార్జ్ థాక్రే
సమావేశమయ్యా రు, ఖమ్మం సభ ఏర్పా ట్ల పైన చర్చిం చారు. పార్టీలో చేరనున్న
మాజీ ఎం పీ పొం గులేటిని సమావేశానికి ఆహ్వా నిం చారు. ఖమ్మం సభ వం ద
ఎకరాల్లో నిర్వ హిం చేలా కసరత్తు ప్రారం భిం చారు. భట్టి చారిత్రాత్మ క యాత్ర
ముగిం పు సభగా.. పొం గులేటి చేరిక వేదికగా ఈ సభను నిర్వ హిం చేం దుకు
నిర్ణయిం చారు. ఈ సభ ద్వా రా కాం గ్రెస్ అధికారం లోకి వస్తూనే దగా పడిన
తెలం గాణ ప్రజల కోసం ఏం చేయనుం దో స్ప ష్టత ఇవ్వ నున్నా రు. ఖమ్మం సభకు
రాష్ట్ర వ్యా ప్తం గా కాం గ్రెస్ శ్రేణులు తరలి వస్తున్నా రు. కాం గ్రెస్ ప్రభం జనం ఖమ్మం
నుం చే మొదలు కానుం ది. కర్ణాటక ఎన్ని కల్లో విజయం తరువాత ఇప్పు డ
కాం గ్రెస్ వరుస నిర్ణయాలతో దేశ వ్యా ప్తం గా అం దరి చూపు ఖమ్మం జనగర్జన
సభ వైపే చూస్తోం ది. ఈ సభ కోసం ఏర్పా ట్లు ప్రతిష్ఠాత్మ కం గా జరుగుతున్నా యి.
` ఆ నలుగురు కుటుంబ సభ్యులే కాదు.. తెలంగాణ పోరాట వీరులు … ఉద్యమ సైనికులు.
` అపుడువాళ్లే …ఇప్పుడూ వాళ్లే!?
` వాళ్లు వారసులు కాదు..ఉద్యమ బాధ్యులు.
` పోరాట యోధులు..తెలంగాణ రక్షకులు.
`ఆనాడు తెలంగాణ అన్యాయం కాకుండా చూశారు.
` ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.
` ప్రగతిలో తెలంగాణ ను ఉన్నతంగా నిలబెడుతున్నారు.
` మూడు పదుల వయసులో జీవితం ఉద్యమానికి అంకితం చేశారు.
`దశాబ్ద కాలం తెలంగాణ పోరాటం చేశారు.
`ఉన్నత ఉద్యోగాలు వదిలి తెలంగాణ కోసం కొట్లాడారు.
` విలాస వంతమైన జీవితాలు కాదనుకొని తెలంగాణ పోరాటం చేశారు.
` ఏ బిజేపి నాయకుడు తెలంగాణ ఉద్యమం చేయలేదు.
` ఏ కాంగ్రెస్ నాయకుడి వారసులు పోరాటం చేయలేదు.
` కేసిఆర్ ఉద్యమం మొదలు పెట్టిన నాడు ఎవరూ కలిసి రాలేదు?
` కుటుంబ సభ్యులతో కలిసి ఉద్యమ అడుగుల వేశారు?
`ఆనాడు ఏ నాయకుడు మేమున్నామని అడుగులు వేయలేదు?
`హేళన చేశారు… రాజకీయ స్వార్థమన్నారు?
` ఇప్పుడు కుటుంబ పాలనంటున్నారు?
`తెలంగాణ తెచ్చేనాడు ఎవరూ కలిసి రాలేదు?
`ఇప్పుడు మాట్లాడుతున్న వారెవరూ తెలంగాణ కోసం కదిలిన వాళ్లు కాదు?
`బిజేపి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు?
` బిజేపి ఏ నాయకుడిది కేసిఆర్ స్థాయి కాదు?
` కేసిఆర్ రాజకీయాలతో ఎదిగిన నాయకుడు కాదు?
` తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన నాయకుడు.
` కొట్లాడి తెలంగాణ తెచ్చిన యుగపురుడు.
`తెలంగాణ ప్రజల గుండెల్లో దేవుడు.
`కేసిఆర్ తో పోల్చుకునే స్థాయి బిజేపి లో ఒక్కరికి కూడా లేదు?
`తెలంగాణ కోసం కొట్లాడిన నాడు అదే కుటుంబం…
` ఇప్పుడు తెలంగాణకు వన్నె తెచ్చింది అదే కుటుంబం.
` తెలంగాణ లో కుటుంబ పాలన కాదు.
` నరం లేని ప్రతిపక్షాల నాలుకల మాటలు తెలంగాణ ప్రజలు పట్టించుకోరు.
` తెలంగాణ పాలించే అర్హత బిజేపి కి అసలే లేదు.
`తెలంగాణ ప్రజలు బిజేపిని ఆదరించరు.
` బిజేపి మాయ మాటలు ఎవరూ నమ్మరు.
హైదరబాద్,నేటిధాత్రి:
తెలంగాణలో వున్నది కేసిఆర్ కుటుబ పాలన కాదు.. ప్రజా పాలన. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల వసుదైక పాలన. తెలంగాణలో కేసిఆర్ కుటుంబం బాగుపడిరదన్న మాటలు మాట్లాడడం అందరూ అలవాటు చేసుకున్నారు. వారితో పాటు కుటుంబ పాలన అంటూ ఇటీవల ప్రధాని మోడీ కూడా మాట్లాడడం విడ్డూరంగా వుంది. కుటుంబ పాలన అనేది ఎక్కడైనా వర్తిస్తుందేమో కాని తెలంగాణలో కాదు. ఎదుకంటే తెలంగాణ స్వయంగా ఏర్పాటైన రాష్ట్రం కాదు. అరవైఏళ్లపాటు ఇతర ప్రాంతాల పెత్తనం కింత నలిగిన ప్రాంతం. ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా వున్న ప్రాంతాన్ని సీమాంధ్రతో కలిపిన ప్రాంతం. ఆ ఉమ్మడి రాష్ట్రం నుంచి అరవైఏళ్ల పాటు అస్ధిత్వంకోసం పోరాటం చేసిన ప్రాంతం. అయినా తెలంగాణ సాధన జరగక, తెలంగాణ ఆత్మగౌరవాన్ని పొందలేక, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడలేక, నాటి పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం. అప్పుడు గతంలో ఏనాయకుడు చేయనంత సుధీర్ఘమైన పోరాటం చేసిన నాయకుడు కేసిఆర్. తెలంగాణ కోసం కేసిఆర్ తన ప్రయాణం మొదలు పెట్టిన నాడు ఎవరూ కలిసి వచ్చిన వారు కాదు. కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్ కుటుంబ సభ్యులే కొందరు ఆయనతో అడుగులు వేశారు. కాని ఏ ఒక్క బిజేపి నాయకుడు ఆనాడు జై తెలంగాణ అనలేదు. తెలంగాణ ఉద్యమం చేపట్టలేదు. తెలంగాణ వాదాన్ని పిడివాదమంటూ హేళన చేసింది కూడా బిజేపి నేతలే అన్నది మర్చిపోవద్దు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన నాటి నేతల కేసిఆర్ తెలంగాణ కోసం బయలు దేరినప్పుడు రాజకీయ స్వార్ధం అన్నారు. మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే కేసిఆర్ తెలంగాణ వాదం ఎత్తుకున్నాడన్నారు. అయినా ఎవరు ఎన్ని రకాలా మాటలు మాట్లాడినా అన్నింటినీ దిగమింగుకొని తెలంగాణ ఉద్యమం సాగించిన నాయకుడు కేసిఆర్. ఆయనకు తోడుగా వచ్చి కుటుంబం మొత్తం తెలంగాణ కోసం కొట్లాడిన చరిత్ర ఒక్క కేసిఆర్ కుటుంబానిదే. అమెరికాల విలాసవంతమైన జీవితాలు. లక్షల్లో జీతాలు వదులుకున్నారు. జీవితం సంతోషంగా గడపాల్సిన నిండా మూడు పదులు వయసులేని సమయంలో తెలంగాణ కోసం అమెరికానుంచి వచ్చిన నాయకుడు కేటిఆర్. కవిత కూడా అంతే. భూతల స్వర్గంగా చెప్పుకునే అమెరికాలో జీవితం వదులుకొని, ప్రజలు తెలంగాణ కోసం కొట్లాడుతుంటే, నేనేందుకు కొట్లాడొద్దు అని వచ్చిన ఆడపడుచు కవిత. తెలంగాణ జాగృతి కోసం తెలంగాణ వికాసం కోసం, తెలంగాణ సాధన కోసం వచ్చిన ఉద్యమం చేసిన బతుకమ్మ కవిత. ముఖ్యమంత్రి కేసిఆర్‌తో మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో మమేకమైన నాయకుడు హరీష్‌రావు. ఉద్యమ కాలం నుంచి కేసిఆర్‌తో పాటు ఉద్యమంలో బాగస్వామ్యమైన నాయకుడు సంతోష్‌రావు. వీళ్లెవరు తెలంగాణ వచ్చిన తర్వాత బిఆర్‌ఎస్‌లోకి రాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత పదవులు అందుకోలేదు. తెలంగాణ కోసం కొట్లాడిన పోరాట యోధులు. అంతే కాదు ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి కేసిఆర్‌ది పెద్ద కుటుంబం. అయినా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఈ నలుగురు తప్ప ఉద్యమంలో కీలకం కాని ఏ బంధువునూ ప్రభుత్వంలో బాగస్వాములను చేయలేదు. ఇదీ కేసిఆర్ నిబద్దత. అసలు తెలంగాణ ప్రభుత్వాన్ని కుటుంబ పాలన అనే అర్హత బిజేపి నేతలు ఎవరికీ లేదు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు కనీసం జై కొట్టని పార్టీకి ప్రశ్నించే అర్హత లేదు. అసలు బిజేపికి తెలంగాణలో చోటే లేదు.
ఒక్కసారి జన బాహుళ్యంలోకి రండి…తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో చూడండి…వారినే నేరుగా అడగండి…వారు చెప్పింది వినండి…అంతే కాని ఏనాడైనా బిజేపి జాతీయ నాయకత్వం ప్రజలతో మమేకమైన సందర్భం వుందా?
ఎంత సేపు డిల్లీనుంచి రావడం..నాయకులు చెప్పింది వినడం. అంతే కాని నాయకులతో, కార్యకర్తలో కలిసి మాట్లాడిన సందర్భం వుందా? మాట్లాడినట్లు చరిత్ర వుందా? లేదు. కాని మేం చెపిందే నిజం…అనుకునే భ్రమలో వున్న బిజేపి ప్రజలను మాయ చేయాలని చూస్తే ఇంకా చెల్లదు. తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్య వంతులు. కనీసం మీకు మీరుగా తెలంగాణలో ఏం జరుగుతోందన్నదానిని తెలుసుకోలేకపోయినా, కనీసం కొంతమంది మేధావులు, ఇతర రాజకీయ నాయకులు చెబుతున్న మాటలైనా వినండి. అప్పుడైనా తెలంగాణ రాష్ట్రం ఎంత బాగా పురోగమిస్తోందో..తెలుస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కూడా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఏం చెప్పాడో వినండి. కనీసం అలా అయినా తెలంగాణ ఎంత వేగంగా అభివృద్ది చెందిందో తెలుస్తుంది. ఒకప్పుడు ఆంధ్రలో ఒక ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో నాలుగు ఎకరాలు కొనుగోలు చేసే పరిస్ధితి వుండేది. కాని ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం భూమి అమ్మితే ఆంధ్రప్రదేశ్‌లో 50 నుంచి 100 ఎకరాలే కాదు, అంతకన్నా ఎక్కువ కూడా కొనుక్కోవచ్చు అని సాక్ష్యాత్తు నారా చంద్రబాబు నాయుడు అన్నారంటే తెలంగాణలో భూములకు ఎంత డిమాండ్ ఏర్పడిరదో అర్ధమౌతుంది. ఒకనాడు తెలంగాణ ప్రాంతాన్ని తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేసిన వాళ్లే ఇప్పుడు తెలంగాణను చూసి అబ్బురపడుతున్నారు. ఆశ్యర్యపోతున్నారు. తెలంగాణలో వుండడానికే ఇష్టపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఎందుకు తెలంగాణ నుంచి విడిపోయామా? అని మధనపడుతున్నారు. ఇక మరో నాయకుడు లగడపాటి రాజగోపాల్. తెలంగాణకు తీవ్రంగా వ్యతిరేకించిన నాయకుల్లో కీలకమైన నాయకుడు. సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించి, సమైక్యాంధ్రకోసం ఎంతో చేసిన నాయకుడు లగడపాటి రాజగోపాల్. తెలంగాణ వస్తే జనజీవనం అస్తవ్యవస్ధమౌతుందని చెప్పిన నాయకుడు. తెలంగాణ కరువుతో అల్లాడుతుందన్నారు. ఆకలి కేకలు వినిపిస్తాయన్నాడు. కరంటు వుండదన్నాడు. ఆంధ్రప్రదేశ్ తో కలిసి లేకుంటే తెలంగాణ మనుగడ సాధ్యం కాదన్నాడు. అంతే కాదు తాను కూడా దీక్ష చేయగలనని నిమ్స్‌లో చేరాడు. రకరకాల రాజకీయ విన్యాసాలు వేశాడు. ఆఖరుకు తెలంగాణ బిల్లు ఆమోదిస్తున్న సమయంలో లోక్‌సభలో పెప్పర్ స్ప్రే చేసి, పార్లమెంటు పరవు తీశాడు. ఎంతకైనా తెగించి బిల్లు ఆపాలని ప్రయత్నించిన నాయకుడు లగడపాటి రాజగోపాల్. ఆయన కూడా తెలంగాణ ఇలా అభివృద్ది జరుగుతుందని కలలో కూడా అనుకోలేదని అంటున్నాడు. సాగు నీరు లేని తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మాణం చేయడం, రిజర్వాయర్లు కట్టడం, చెరువులు బాగు చేయడం, చెరువులు పునరుద్దరించడం, ఇరవై నాలుగు గంటలు కరంటు ఇవ్వడం , ఇంటింటికీ సురక్షితమైన మంచి నీరు అందించడం అంటే మాటలు కాదు. వాటిని ఇంత తక్కువ సమయంలో సాక్ష్యాత్కరించడం అన్నది ఎంతో చిత్తశుద్ది వుంటేనే పూర్తి చేయగలరు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌పై ప్రశంసంలు కురిపించారు. ఇక తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన అసలు నేను హైదరాబాద్‌లో వున్నానా? లేక లండన్, అమెరికాలో వున్నానా? అన్న అనుమానం కల్గిందని చెప్పారు. ఇవన్నీ ఎవరో చెప్పమంటే చెప్పిన మాటలు కాదు. వాళ్లకు వాళ్లుగా తెలంగాణ అభివృద్ధిని చూసి చెప్పిన మాటలు. అంతే కాదు మరో సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ తెలంగాణ అభివృద్దిపై ఎంతో ప్రశంసలు కురిపించారు. కేసిఆర్ లాంటి నాయకుడు దేశానికి అసవరమని అన్నారు. అరవై ఏళ్లపాటు తెలంగాణ ప్రజలు మాకు నీళ్లు కావాలంటే ఇవ్వలేదు. అసలు ప్రాజెక్టులు కట్టడం సాధ్యం కాదన్నారు. అదే ఆనాడు తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే తెలంగాణ ఏనోడో బాగు పడేది. కాని అప్పటి పాలకులు చేసిన నిర్లక్ష్యం చాల వుందని కూడా చెప్పారు. అంతే కాదు ఒక దశలో తానే స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుకి తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు పూర్తిచేస్తే బాగుంటందని సలహా ఇచ్చాను. కాని చంద్రబాబు తెలంగాణలో సాధ్యం కాదన్న కాదన్నారు. కాని ఇప్పుడెలా సాధ్యమైందంటే అది కేసిఆర్ గొప్పదనం అన్నాడు. ఇక మరో నటి లయ కూడా చాలా కాలం తర్వాత ఆమె అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్‌లో దిగిన తర్వాత నేను ఎక్కడ దిగాను అన్నంత ఆశ్చర్యపోయారట. నేను హైదరాబాద్‌కే వచ్చానా? అన్న అనుమానం కల్గిందంట. అంటే ఇంత తక్కువ సమయంలో హైదరాబాద్ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ అభివృద్ధిలో ముఖ్యమంత్రి కేసిఆర్ కు తోడుగా, నీడగా నిలిచి, రాత్రనక, పగలనక పనిచేసిన మంత్రి కేటిఆర్, మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ హరితవనం కావడంలో ఎంపి. సంతోష్ కృషి ఎంత వుందో చూస్తేనే అర్ధమౌతుంది.
Rahul Gandhi enquiry about the Bhatti Vikramarka People’s March :
తెలంగాణపైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో రాజకీయాల పైన ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటున్నారు. ఆ నివేదికల ఆధారంగా మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ యాత్ర గురించి తాజాగా రాహుల్ గాంధీ ఆరా తీసారు. రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రేతో పాటుగా ముఖ్య నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. సుదీర్ఘంగా యాత్ర కొనసాగిస్తున్న భట్టి ప్రధానంగా పేద ప్రజలతో మమేకం కావటం..వారి సమస్యల పైన సానుకూలంగా స్పందించటం పార్టీకి కలిసొచ్చే అంశంగా నేతలు రాహుల్ కు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యల పైన భట్టి ఎక్కువగా దృష్టి పెట్టారని..వాటి పైన స్పందిస్తున్న తీరుతో ప్రజల్లో పార్టీకి మరింత ఆదరణ పెరుగుతోందని రాహుల్ కు నివేదికలు అందాయి.
కర్ణాటక తరువాత దక్షిణాదిన తెలంగాణ కాంగ్రెస్ కు కీలకంగా మారింది. తెలంగాణలో భట్టి విక్రమార్క్ పీపుల్స్ మార్చ్ యాత్ర కాంగ్రెస్ అగ్ర నేతల దృష్టిని ఆకర్షించింది. తెలంగాణలో పార్టీకి అధికారం.. ప్రధానిగా రాహుల్ లక్ష్యంగా భట్టి ప్రకటించారు. రాహుల్ నిర్వహించిన జోడో యాత్ర స్పూర్తిగా భట్టి విక్రమార్క్ ప్రజలతో మమేకం అవుతూ తన పీపుల్స్ మార్చ్ యాత్ర కొనసాగిస్తున్నారు. మార్చి 16న ఆదిలాబాద్‌లోని పిప్పిరి గ్రామంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర జూలై 2న ముగియనుంది. ఖమ్మంలో జరిగే ఈ సభకు రాహుల్ గాంధీ హాజరు కనున్నారు. భట్టి యాత్ర ద్వారా తెలంగాణ కాంగ్రెస్ కేడర్ లో జోష్ పెరిగింది. ఈ వేదిక అప్పటి వరకు ఎవరికి వారుగా ఉన్న నేతలు ఒక్కటయ్యారు. వీరందరినీ భట్టి పాదయాత్ర ఒకే వేదిక మీదకు తీసుకొచ్చింది.
ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాల పైన భట్టి ప్రజల మధ్యనే ఉంటూ పోరాటం ప్రారంభించారు. పేద ప్రజల సమస్యల పైన ఫోకస్ చేసారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ..పేద వర్గాలతో మమేకం అయ్యారు. అన్ని వర్గాల సమస్యలను తెలుసుకుని, ముఖాముఖి మాట్లాడుతూ, సభలు పెడుతూ.. ప్రజలతో నడుస్తూ భట్టివిక్రమార్క ప్రజలకు చేరువయ్యారు. పార్టీ నేతలతో భట్టికి ఉన్న సత్సంబంధాలతో అందరివాడుగా నిలిచారు. భట్టి యాత్రలో నేతలతా పాల్గొని సంఘీభావం ప్రకటించారు. పార్టీ జాతీయ నేతలు హాజరైన మద్దతిచ్చారు. రాష్ట్రంలోని సమస్యలపైన ఎక్కడిక్కడ స్పందిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరిగే ప్రయోజనం ప్రజలకు వివరిస్తూ భట్టి తన యాత్ర సాగిస్తున్నారు.
ఈ నెల 15న భట్టి జన్మదినం నాడు రాహుల్ గాంధీ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. పాదయాత్ర గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మమేకం అవుతున్న తీరును అభినందించారు. పార్టీ నాయకత్వం తోడుగా నిలుస్తుందని రాహుల్ హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలోనూ భట్టి పాదయాత్ర గురించి ఆరా తీస్తున్నారు. భట్టి పాదయాత్ర చేసిన ప్రాంతాల్లో ఆ వెంటనే బీఆర్ఎస్ నేతలు పర్యటించటం.. భట్టికి స్థానికులు ఫిర్యాదు చేసిన అంశాల పరిష్కారినికి చొరవ తీసుకోవటం ద్వారా భట్టి యాత్ర ఆ పార్టీలో ఎంత కలవరపాటుకు గురి చేస్తుందనేది స్పష్టం అవుతోంది. పాదయాత్ర సమయంలోనే పార్టీలో నేతల చేరికల పైన భట్టి ప్రత్యేకంగా దృష్టి సారించారు. పొంగులేటి వంటి నేతలు భట్టిని కలిసి ముందుకు సాగాలని నిర్ణయించారు. జూలై 2న ఖమ్మంలో జరిగే సభకు రాహుల్ హాజరు కానున్నారు. ధృఢ సంకల్పంతో ముందుకు దూసుకెళ్తున్న భట్టి విక్రమార్క పాదయాత్ర ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలకు స్పూర్తిగా మారుతోంది.
రాష్ట్ర కాంగ్రెస్‌లో జోష్..ఇది నిజమైన మాటేనా? ఎవరు చెప్పారు? ఎవరు చెబుతున్నారు? ఎవరు సంకేతాలు ఇచ్చారు? కర్నాకట ఎన్నికలకు తెలంగాణకు సంబంధం ఏమిటి? కర్నాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో బూమ్ ఎందుకొస్తుంది? అక్కడి స్ధానిక పరిస్ధితులు, అవసరాలకు , తెలంగాణ వాస్తవ పరస్ధితులకు వ్యత్యాసం లేదా? తెలంగాణ గడ్డలో వున్న రాజకీయ చైతన్యం ఏమైనా తక్కువా? పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందా? గతంలో కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం అధికారంలోకి రాలేదా? కర్నాకటలో 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వుంది. కాని చంద్రబాబు నాయుడు రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయ్యారు. రెండోసారి తెలుగుదేశమే అధికారంలోకి వచ్చింది. పొరుగు రాష్ట్రంలో వున్న రాజకీయ పరస్ధితులు వేరు. మన పరిస్ధితులు వేరు. తర్వాత ఇక్కడ, అక్కడా కాంగ్రెస్ ప్రభుత్వాలు వున్నప్పటికీ కర్నాకట ప్రభుత్వాలు ఆల్మట్టి ఎత్తు పెంచుతూ వెళ్లి తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేశాయి. రాజకీయాలను అంచనా వేయడం అంటే అక్కడ గెలిస్తే, ఇక్కడ గెలుస్తామన్న లెక్కలు ఎక్కడైనా వర్తిస్తాయేమోకాని రాజకీయాల్లో కాదు. పైగా కర్నాటక ప్రజలు బిజేపి పాలనపై విసుగెత్తి వున్నారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాల్సిన జేడిఎస్ కర్నాకటలో గోడ మీది పిల్లి వాటం రాజకీయాలు చేస్తూ వస్తోంది. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్ధానాలు కైవసం చేసుకున్నా, వారిలో కొంత మందిని లాగేసి, బిజేపి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత పరిపాలనలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నది. అందుకే ప్రజలు బిజేపిని ఓడిరచారు. అక్కడ కాంగ్రెస్ తప్ప ప్రత్యామ్నాయం లేదు. దాంతో కాంగ్రెస్ గెలిచింది. అంతే కాని కాంగ్రెస్ పార్టీ ఏదో కొత్త లోకాన్ని సృష్టిస్తుందని కాదు…ఇది తెలిసికూడా కాంగ్రెస్ ఎగిరెగిరి పడుతోంది. ఊపు వాపుగా మార్చుకొని రాజకీయం మొదలుపెట్టినట్లు కలలుకంటోంది.
కర్నాటక ఎన్నికల దాకా బిజేపి మురిసింది.
ఇక మాకు ఎదురులేదని చెప్పుకున్నది. అధికార బిఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకుంటూ వచ్చింది. ప్రజలు మావైపే వున్నారు. ఇక ఎన్నికల జరగడమే తరువాయి…? అంటూ సన్నాయి నొక్కులు మూడేళ్లపాటు నొక్కారు. ఏమైంది? కర్నాకట ఎన్నికలతో ఒక్కసారిగా బిజేపిలో నిస్తేజం ఆవహించింది. అంతా సైలెంట్ అయ్యింది. ఆధిప్యత రాజకీయాలు ఒక్కసారిగా చల్లారాయి. ఆ పార్టీ వెంట పడుతున్నారంటూ చెప్పిన మాటలన్నీ నీటి మూటలయ్యాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారంటూ చెప్పిన మాట చెప్పకుండా చెప్పి, చెప్పి ఆశ పల్లకిలో ఊరేగారు. కనీసం బలమైన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయినప్పుడైనా బిజేపి కళ్లు తెరవాల్సివుండే! కాని ఆ పని చేయలేదు. ప్రజల మద్దతు మాకే వుంటూ ఊదరగొట్టింది. ఉట్టికెగురుదామనుకొన్నది. కాని వాస్తవ పరిస్ధితులు ఏమిటో కర్నాకట ప్రజలు చూపించే సరికి దిక్కులు చూస్తున్నది. ఇలాంటి సమయం కాంగ్రెస్‌కు బాగా కలిసి వచ్చినట్లు వుంది. అందుకే తెగ హడావుడి చేస్తోంది. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రజలకు కొన్ని రోజులు ఎంటర్మైంట్‌ను ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
అసలు కాంగ్రెస్‌లో చేరుతున్న నేతలు ఎవరు?
అన్నది ఒకసారి బాగా ఆలోచించాలి. ముందుగా ఖమ్మం జిల్లాకు చెందని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. అనూహ్యంగా తెలంగాణ రాజకీయాలపైకి వచ్చారు. 2014 ఎన్నికల్లో వైసిసి తరుపున ఎంపిగా గెలిచారు. కాని తెలంగాణలో వైసిపి పార్టీని నిర్వహించడం తన వల్ల కాదని తేల్చుకున్న ఆంధ్రప్రదేశ్ సిఎం. జగన్ , అక్కడి రాజకీయాల మీదనే దృష్టిపెట్టారు. తెలంగాణలో వైసిపిని వదిలేసుకున్నారు. అదే సమయంలో తెలంగాణలో అధికారంలో వున్న బిఆర్‌ఎస్‌లోకి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరిపోయారు. ఇంత వరకు బాగానే వుంది. నిజంగా పొంగులేటి ఎంతో సమర్ధవంతమైన నేత అని తనకు తాను గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప, ఆనాడు వైఎస్. జగన్ మూలంగా గెల్చిన నేతలే తప్ప, వ్యక్తిగత ప్రతిష్ట అంతగా వున్న నేత కాదు. కాని తనకు తాను అతిగా ఊహించుకున్న శ్రీనివాస్‌రెడ్డి రాజకీయ పరిమితి, పరిజ్ఞానం ముఖ్యమంత్రి కేసిఆర్‌కు తెలుసు. అందుకే ఎక్కడ వుంచాలో అక్కడ శ్రీనివాస్‌రెడ్డిని వుంచారు. అయితే గత ఎన్నికల్లో తాను జిల్లా మొత్తం గెలిపించుకొస్తా అని చెప్పిన శ్రీనివాస్‌రెడ్డి మూలంగానే బిఆర్‌ఎస్ అనుకున్నంత మేర సీట్లు సాధించలేదన్నది నిజం. అందుకే ఆయన తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదు. ఆనాటి నుంచి ఆయన ఎప్పుడు సమయం దొరుకుతుందా? అనుకుంటూ ఎదురుచూస్తున్నాడు. రాష్ట్రంలో బిజేపి కొంత ఊపు మీదకు వచ్చిందన్నది గ్రహించి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలోని కొంత మందిని ఇబ్బందులకు గురి చేయడం మొదలు పెట్టడంతో శ్రీనివాస్‌రెడ్డి తన అసమ్మతి గళం వినిపించడం మొదలు పెట్టారు. వీలు చిక్కినప్పుడల్లా తన అసంతృప్తిని వెల్లగక్కుతూ వచ్చారు. ఆఖరుకు బిఆర్‌ఎస్‌నుంచి బైటకు వెళ్లి, బిజేపిలో చేరాలని అనుకున్నాడు. కర్నాకటలో కాంగ్రెస్ గెలవడంతో ఆయన తన రూట్ మార్చుకున్నారు. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయంతీసుకున్నాడు. ఖమ్మం జిల్లానుంచి బిఆర్‌ఎస్‌ను అసెంబ్లీ గేట్ దాకా రానివ్వను అంటూ శపథాలు చేస్తున్నాడు. నిజంగా ఆయనకు అంత శక్తి వ ఉంటే గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఎందుకు సీట్లు తేలేకపోయాడు? నిజానికి అప్పుడు బిఆర్‌ఎస్ మంచి ఊపు మీద వున్నది. ఎవరూ ఊహించనంత మెజార్టీని సొంతం చేసుకున్నది. మరి అలాంటప్పుడే పొంగులేటి పనితనం ఎక్కడా కనిపించలేదు.
నిజానికి తెలంగాణలో బిఆర్‌ఎస్ అత్యంత బలంగా వుంది.
ప్రస్తుత తరుణంలో ప్రతిపక్షపాత్ర ఎవరిది అన్నదానిపై చర్చ జరగాల్సిన సమయంలో , పొంగులేటి చేస్తున్న వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుకుంటున్నారు. అసలు వారికున్న బలమెంత? వారి రాజకీయ అనుభవం ఎంత? పొంగులేటితో పాటు కాంగ్రెస్‌లో చేరుతున్నవారి రాజకీయ చరిత్ర ఎంత? గతంలో ప్రజలు ఎందుకు వారిని ఓడిరచారు? అన్నదానిని ప్రజలు పరిగణలోకి తీసుకోకుండానే ఎన్నుకుంటారా? ఇదిలా వుంటే కాంగ్రెస్‌లో చేరుకముందు వున్న ప్రాధాన్యత చేరిన తర్వాత గాని తెలియదు. కాంగ్రెస్ మహాసముద్రం. అందులో ఎవరికి ప్రత్యేక ప్రాధాన్యత వుండదు. గుర్తింపు అసలే వుండదు. అలాంటిది సిఎల్‌పి నాయకుడైన భట్టి విక్రమార్క ప్రాతినిధ్యాన్ని కాదని పొంగులేటికి ప్రాధాన్యత ఇస్తారని నమ్ముడం అంటే మబ్బులను చూసి, ముంత ఒలకబోసుకున్నట్లే…అంటే పొంగు చల్లారినట్లే? అంతే…!!
టీపీసీసీ చీఫ్ రేవంత్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్లాస్ తీసుకున్నా రు.
పార్టీని నడిపించాల్సి న వాడిని నీవే వెనకబడుతున్నా వు అంటూ సూచనలతో
పాటుగా హెచ్చరికలు చేసారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఆదరణ
చూపుతున్నట్లు తనకు అందుతున్న నివేదికల్లో స్పష్టం అవుతుందని పేర్కొ న్నట్లు
సమాచారం . పార్టీ పైన తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఆసక్తితో ఉన్నా
రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కా జ్ గిరి పార్లమెంట్తో పాటుగా సొంత
అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ లోనూ వెనుకబడి ఉన్నా రని రాహుల్ తేల్చి
చెప్పా రు. పార్టీ అధ్య క్షుడిగా అందరినీ సమన్వయం చేసుకోవాలని.. సీనియర్లకు
ఖచ్చితంగా గుర్తింపు ఇవ్వా ల్సిందేనని స్పష్టం చేసారు. ఉత్తమ్ చేసిన ఫిర్యా దు
పైన వివరణ కోరారు.
కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఆపరేషన్ తెలంగాణ ప్రారంభించారు.
ఎన్నికల్లో గెలిచేందుకు కార్యాచరణతో సిద్ధమయ్యా రు. కర్ణాటక గెలుపును
తెలంగాణలోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నా రు. కర్ణాటకలో కాం గ్రెస్
నేతలం తా కలిసి కట్టుగా పని చేయటం ద్వా రా అధికారంలోకి వచ్చిన అం శాన
రాహుల్ గెలుపు వ్యూ హం లో ప్రధాన అంశంగా గుర్తించారు. ఇప్పు డు తెలంగాణ
పీసీసీ చీఫ్ రేవంత్ కు అదే విషయాన్ని స్ప ష్టం చేసారు. పార్టీకోసం అందరూ
కలిసి కట్టుగా పని చేయాల్సిందేనని తేల్చి చెప్పా రు. ఎవరూ వ్యక్తిగత
అభిప్రాయాలు.. ఈగోలతో వ్యవహరించినా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పి నట్లు
విశ్వ సనీయ సమాచారం . తెలంగాణలో గెలుపే ప్రామాణికంగా నిర్ణయాలు
ఉండాలని స్పష్టంచేసారని పార్టీలో చర్చ జరుగుతోంది.
రేవం త్ పైన మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా సోనియా గాం ధీకి
ఫిర్యా దు చేసారు. తన పైన రేవం త్ టీం సోషల్ మీడియాలో దుష్ప్ర చారం
చేస్తున్నా రని ఆధారాలు సమర్పిం చారు. తనను పార్టీలో నుం చి బయటకు పం పే
విధం గా పొమ్మ నకుం డా పొగ పెడుతున్నా రని నేరుగా సోనియాకు
వివరిం చారు. ఈ అం శం పైన రాహుల్ నేరుగా రేవం త్ ను నిలదీసినట్లు
సమాచారం . ఇదే సమయం లో రేవం త్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఆదరణ
తగ్గటం పైనా రాహుల్ ఆరా తీసినట్లు సమాచారం . మల్కా జ్ గిరి పార్లమెం ట్
పరిధిలోని అసెంబ్లీ స్థానాల పై రాహుల్ గాం ధీ వద్ద ఆసక్తికర చర్చ జరిగిం ది.
మినీ ఇం డియాగా భావిం చే మల్కా జ్ గిరి పార్లమెం ట్ పరిధిలోని అసెంబ్లీ
స్థానాల్లో పార్టీ వెనుకబడి ఉన్న ట్లు సర్వే నివేదికలు అందాయని..పూర్తి
సమాచారం తోనే రేవంత్ ను రాహుల్ ప్రశ్నలు సంధించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రభావం చూపగల నేత పార్టీకి దూరం
అయ్యా రని..అందరినీ కలుపుకు వెళ్లాలని రేవం త్ కు రాహుల్ ఒకిం త గట్టిగానే
సూచన చేసారని పార్టీలో చర్చ జరుగుతోం ది. పార్టీకి వ్యూ హకర్తగా పని చేస్తున్న
సునీల్ టీం కొడం గల్ నియోజకవర్గం లో పరిస్థితులపై ఇచ్చిన నివేదిక ఆధారం గా
రాహుల్ ప్రశ్నిం చినట్లు సమాచారం . పార్టీని పటిష్టం చేయాలనే గుర్నా థ్ రెడ్డి ని
పార్టీ లోకి ఆహ్వా నిం చినట్లు రాహుల్ కి రేవం త్ వివరణ ఇచ్చారు. తెలంగాణలో
పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉం దని చెప్పి న రాహుల్ గాం ధ నేతల్లో సమస్య లు ఉం టే
చర్చలతో పరిష్క రిం చుకోవాలని సూచిం చారు. పార్టీలో సమస్య లు సృ ష్టిస్తే
ఎవరినీ ఉపేక్షిం చేది లేదని రాహుల్ గట్టిగానే చెప్పి నట్లు తెలుస్తోం ది. అం దరూ
సమన్వ యం తో సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఎన్ని కల్లో అధికారం దక్కే లా పని
చేయాలని సూచించారు. కేసీఆర్ హఠావో..తెలంగాణ బచావో అనే నినాదం తో
పార్టీ నేతలంతా పని చేయాలని స్ప ష్టం చేసారు. తెలం గాణలోని ప్రతీ
నియోజకవర్గం పైన రాహుల్ వద్ద పూర్తి సమాచారం ఉన్నట్లు గుర్తించిన నేతలు
అప్రమత్తం అయ్యారు.
`ఇవన్నీ ఎవరో చెబుతున్న మాటలు కాదు…సాక్ష్యాత్తు బిఆర్‌ఎస్ నేతలు చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలు?
`కనీసం మంత్రి జగదీష్ రెడ్డి పేరును కూడా నియోజకవర్గంలో కనిపించకుండా చూస్తున్నాడు?
`అందరినీ దూరం చేసుకుంటున్నాడు?
`పార్టీ పరువు తీస్తున్నాడు?
`ఇంతకీ కూసుకుంట్ల ఇదంతా ఎందుకు చేస్తున్నాడు?
`లోగుట్టు కూసుకుంట్ల కే ఎరుక?
హైదరబాద్,నేటిధాత్రి:
కూసుకుంట్ల వ్యవహారం రోజు రోజుకూ ముదిరిపాకాన పడుతోంది.పదవీ కాంక్ష తప్ప ప్రజా సేవ పట్టడం లేదు. గెలిపించిన ప్రజలను పట్టించుకోవడం లేదు. కార్యకర్తలను గుర్తించడం లేదు. వాళ్లకు సాయపడడంలేదు. వారు చేసిన పనులకు బిల్లులు కూడా ఇవ్వడం లేదనేది మునుగోడు నియోజకవర్గం లోని మెజారిటీ నాయకులు, కార్యకర్తల ప్రధాన ఆరోపణ. సాక్షాత్తు బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు తూర్పారపడుతున్నాడు. తాము చేసిన పనులకు బిల్లులు ఇప్పించకుండా, ఇతరులకు ఎమ్మెల్యే కొమ్ముకాస్తున్నాడని విమర్శించాడు. ఎమ్మెల్యే పార్టీ కోసం తన శ్రమ పడడు? శ్రమ పడేవారిని పడనివ్వడు. వారిని కళ్లలో పెట్టుకుంటున్నాడు. ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఇదీ మునుగోడు లో ఎమ్మెల్యే సాగిస్తున్న అరాచకం అని నాయకులు నిందిస్తున్నారు. పార్టీ కోసం పరితపించే వారిని ఓర్వడం లేదని కూడా తెలుస్తోంది.
ఇటీవల కొంత కాలంగా బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, నారబోయిన రవి ముదిరాజ్ పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు, బిఆర్‌ఎస్ పార్టీ వర్థిల్లాలి. అంటూ వాల్ రైటింగ్స్ రాయించాడు.
నియోజకవర్గం మొత్తం పెద్ద ఎత్తున ఖర్చుపెట్టి వాల్ రైటింగ్స్ రాయించాడు. నిజానికి ఈ పని చేయాల్సింది ఎమ్మెల్యే. తెలంగాణ వ్యాప్తంగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున ఇలాంటి వాల్ రైటింగ్స్ రాయించారు. ప్రభుత్వ పథకాలతో పాటు, ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటిఆర్ ల నాయకత్వాలను బలపరుస్తూ రాయించారు. మునుగోడు లో ఎమ్మెల్యే ఆ పని చేయలేదు. పార్టీ మీద అభిమానం, ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వం మీద గౌరవం తో నారబోయిన రవి ముదిరాజ్ ఆ పని చేపట్డారు. అది ఎమ్మెల్యే కు నచ్చలేదు. ఆ రాతలేటి అని ప్రశ్నిస్తున్నాడు. పలు కార్యక్రమాలలో వీటి గురించి ప్రస్తావిస్తూ, ఆ రాతలను తప్పు పడుతున్నాడు. నిజానికి ఎమ్మెల్యే కూసుకుంట్లకు రవి ముదిరాజ్ రాసిన రాతలు నచ్చకపోతే, అప్పుడు ప్రతిగా తాను కూడా వాల్ రైటింగ్స్ రాయించాలి. అంతకన్నా ఎక్కవ ఎమ్మెల్యే దృష్టి పెట్టాలి. ప్రభుత్వ పథకాలను ఎమ్మెల్యే ప్రచారం చేయడు? పైగా భూముల వ్యాపారాలు చేసి పైసలు చేతిలో పట్టుకొని కొందరు వాల్ రైటింగ్స్ రాస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నాడు. ఇలాంటి వాటిపై చిత్తశుద్ధి వుంటే ఎమ్మెల్యే సహకరించాలి. అంతే కాని రాసే వారిని ఇబ్బంది పెట్టకూడదు. తను రాయించడు.. రాయించే వారిని రాయనియ్యకపోగా, వాటిపై పోస్టర్లు అతికిస్తున్నాడు. పోస్టర్లు సరిగ్గా ముఖ్యమంత్రి కేసిఆర్ పేరుమీద, కేటిఆర్ పేరు మీద, ముదిరాజ్ అని వున్న చోట్లలో అతికించేలా ఆదేశాలు ఎమ్మెల్యే ఇచ్చినట్లున్నాడు. అందుకే పోస్టర్లు అతికించిన వాళ్లు అంతటా అదే పని చేశారు. నారబోయిన రవి ముదిరాజ్ రాయించిన రాతల మీద కావాలనే ఎమ్మెల్యే పోస్టర్లు అతికించేయించారని అంటున్నారు.
ఇక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పని తీరు , ప్రజల అభిప్రాయాలు, నాడి, సర్వే వివరాలు నేటిధాత్రి వరుస కథనాలు ప్రచురించింది.
ఎన్నికల సమయంలో రెండు నెలల పాటు నేటిధాత్రి ఎమ్మెల్యే గెలుపు కోసం కృషి చేసింది. అది మర్చిపోయిన ఎమ్మెల్యే కూసుకుంట్ల నేటిధాత్రి లో వచ్చే వార్తలను పిచ్చిరాతలనడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇక ప్రభుత్వం, పార్టీ ప్రతిష్ఠ పెంచే వాల్ రైటింగ్స్ ను అభినందించాల్సింది పోయి, నిందిస్తున్నాడు? మునుగోడు లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కూసుకుంట్ల కు టికెట్ ఇవ్వొద్దనేది చాలా మంది కోరుతున్న మాట. ఆశావహులైన బిసి నేతలను ఎమ్మెల్యే నిందిస్తున్నాడు? సొంత పార్టీ నేతలను చులకనగా చూస్తున్నాడు? అన్నది ప్రచారం జరుగుతున్నా ఎమ్మెల్యే తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. అందుకే నియోజకవర్గం మొత్తం ఎమ్మెల్యే కు తీవ్ర వ్యతిరేకంగా వుంది? సొంత పార్టీ నేతలు ఈసారి కూసుకుంట్ల ను మార్చాల్సిందే అని పదే పదే ఇప్పటి నుంచే అంటున్నారు. అయితే ఎలాగూ తనకు టికెట్ రాదని తెలిసే ఎమ్మెల్యే ఇలా వ్యవహరిస్తున్నాడని కొంతమంది అంటున్నారు. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఆలోచన తోనే ఎమ్మెల్యే పార్టీని, నాయకులను పట్టించుకోవడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా తనకు టికెట్ రాదనే ఎమ్మెల్యే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు? అనే చర్చ కూడా నియోజకవర్గంలో విసృతంగా సాగుతోంది. ఇదిలా వుంటే ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రతిపక్షాలకు ఉపయోగపడేలా పార్టీలో ఎమ్మెల్యే నే వైరి వర్గాలు సృష్టిస్తున్నాడు? అనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతే కాకుండా బిసిలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు? అంతే కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ బిసిలకు టికెట్ దక్కకుండా వుండాలని, తనకు కాకపోతే మరో రెడ్డి కే టికెట్ వచ్చేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. బిసి నాయకులకు పోటీగా మరో రెడ్డి నాయకుడిని కూసుకుంట్ల ప్రోత్సాహిస్తున్నాడు? అన్నది స్పష్టమౌతోంది. అయితే నాకు లేకుంటే నీకు, రెడ్లకే మునుగోడు టికెట్అన్నట్లు కూసుకుంట్ల వ్యవహరిస్తున్నాడు? పార్టీని భ్రష్టు పట్టించే పనిలో నిమగ్నమై వున్నాడు? ఇవన్నీ ఎవరో చెబుతున్న మాటలు కాదు…సాక్ష్యాత్తు బిఆర్‌ఎస్ నేతలు చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలే. కనీసం మంత్రి జగదీష్ రెడ్డి పేరును కూడా నియోజకవర్గంలో కనిపించకుండా చూస్తున్నాడు?అందరినీ దూరం చేసుకుంటున్నాడు? పార్టీ పరువు తీస్తున్నాడు? ఇంతకీ కూసుకుంట్ల ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? అనే దానిపై కూడా రకరకాల చర్చలు సాగుతున్నాయి. అదంతా లోగుట్టు కూసుకుంట్ల కే ఎరుక?.
`ఈటెల, రాజగోపాల్ డిల్లీలో చర్చలు జరుపుకుంటున్నారు?
`బిజేపి కి దూరమయ్యేందుకు సాకులు వెతుకుతున్నారు?
`పార్టీని బలోపేతం చేయలేమని గ్రహించారు?
`కుర్చీ వేసి కూర్చోబెడతారనుకున్నారు?
`కనీసం పట్టించుకోవడం లేదు?
`బిజేపి లో ఇంకా వుంటే ఎటూ కాకుండా పోతామని గ్రహించారు?
`నిన్నటి దాకా రాష్ట్ర బిజేపి మీద నిందలేశారు?
`ఇప్పుడు కేంద్ర పార్టీకి గట్టిగా చెప్పామని చెప్పుకుంటున్నారు?
`కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పామన్నారు?
`అవేంటో చెప్పమంటే ముఖం చాటేశారు?
`తెలంగాణ లో ఆత్మగౌరవంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు?
`కనీసం పార్టీ ఆఫీసులోకి వెళ్లలేక గేటు ముందు పడిగాపులు కాశారు?
`విధిలేక మాడిపోయిన ముఖాలతో వెనుదిరిగారు?
`ప్రగతి భవన్ ముందు నాడు పరువుపోయిందన్నారు. నేడు డిల్లీలో పరువు తీసుకున్నారు?
`పార్టీ మారే చాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు?
హైదరబాద్,నేటిధాత్రి:
వుండాలని లేదు. నచ్చజెప్పినా వినాలని లేదు. బలవంతం చేసినా ఆగాలని లేదు. బిజేపి లో ఇంకా కొనసాగితే భవిష్యత్తు బాగుంటుందన్న నమ్మకం లేదు. బిజేపి తెలంగాణలో అధికారం రాదు? ఆ పార్టీనే ఇంకా నమ్ముకుంటే లాభం లేదు? వాళ్లకు మంచి రోజులొస్తాయన్న విశ్వాసం అసలే లేదు ? బిజేపి బలపడుతుందనే ఆశలు లేవు. కళ్ల ముందు కనిపించడం లేదు. పార్టీ ఊపు మీదుందన్న ప్రచారం లేదు. దానికి తోడు వాళ్లకు పెద్ద ప్రాధాన్యత లేదు. ఒక రకంగా పార్టీలో పెద్దగా పట్టించుకునే వారు లేదు. పైకి కనిపించేదంతా నిజం కాదు. బిజేపి లో నిష్టూరాలు ఇంకా భరించడం వారి వల్ల కాదు. ఇంటా, బైట విలువ లేదు. ఎన్నికలొస్తే తప్ప వారికి పని లేదు. ప్రజల్లోకి నేరుగా వెళ్ల స్వేచ్చ లేదు. గతంలో లాగా అభిప్రాయాలు చెప్పుకునే వీలు లేదు. చర్చలకు ఆస్కారం లేదు. కలిసి సాగే పరిస్థితులు కనిపించడం లేదు. ఇంత కాలమైనా వలస వాదులన్న ముద్ర చెరిగిపోలేదు. పార్టీ కోసం ఎంత పని చేసినా గుర్తింపు లేదు. గౌరవం అంతకన్నా లేదు. వారి ప్రయత్నం వారు చేస్తున్నారనే వాళ్లు లేరు. మొదట్లో వున్నంత హడావుడి ఇప్పుడు లేదు. అక్కున చేర్చుకున్నంత గొప్పగా మాట్లాడుతున్న వారు లేరు. ప్రతి దానిని భూతద్దంలో చూస్తున్నారు. ప్రతి అడుగును శంకిస్తున్నారు. ఎవరు కలిసినా పెడర్థాలు తీస్తున్నారు. ఎవరితో మాట్లాడినా గుసగుసలు రాజేస్తున్నారు. ఊహాగానాలు సృష్టిస్తున్నారు. ట్రోల్ చేస్తున్నారు. సొంత పార్టీ నేతలే కొందరు కుంపటి పెడుతున్నారు. పొగ మా వైపునుంచి వస్తుందని ప్రచారం చేస్తున్నారు. అయినా వెళ్లడం లేదని అంటున్నారు. వెళ్లే వారిని ఆపాల్సిన అవసరం లేదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మమ్మల్ని తరిమేయాలనే చూస్తున్నారు. అయినా పట్టుకొని వేళాడుతున్నా అడుగడుగునా ఎలా అవమానానికి గురి చేయాలో అంతా చేస్తున్నారు. ఇది ఈటెల రాజేందర్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిల మనసులో వున్న ఆవేదన, ఆందోళన, ఆక్రోశం అంటూ వస్తున్న వార్తల సారాంశం. ఇవి నిజమా? కాదా? అన్న దానిపై చర్చతో పాటు వీళ్లిద్దరూ ఏం చేస్తారన్న దానిపై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.
చాలా మంది అంటున్న మాట. అనుకుంటున్న మాట. ఈటెల, కోమటి రెడ్డి ఇద్దరూ పోలేక పొగబెట్టుకుంటున్నారు?
అందుకే డిల్లీ లో మంత్రాంగం నడుపుతున్నారు. డిల్లీ వేదికగా ఈటెల, రాజగోపాల్ డిల్లీలో చర్చలు జరుపుకుంటున్నారు? ఎటు వెళ్తే బాగుంటుందన్న దానిపై మధనపడుతున్నారు. మల్లగుల్లాలు పడుతున్నారు. హైదరాబాదు లో వున్నా బాగుండేది. డల్లీ వచ్చి పరువుపోగొట్టుకున్నట్లైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలవాలని వస్తే ఆయన హైదరాబాదు వెళ్లారు. ఆ విషయం బిజేపి కేంద్ర కార్యాలయం వద్దకు వెళ్తే గాని తెలియలేదు. అంత పెద్ద పార్టీలో ఇంత చిన్న విషయం ఇద్దరు నేతలకే తెలియలేదు. ఇదిలా వుంటే వాళ్ళిద్దరూ కావాలనే డిల్లీ వెళ్లారు. కావాలనే తమకు సానుభూతి కోరుకుంటున్నారు. జాతీయ అధ్యక్షుడు హైదరాబాదు వస్తున్న సంగతి తెలిసి కూడా కావాలనే డిల్లీ వెళ్లారు. ఇది పార్టీలో చెప్పుకుంటున్న మాట. ఇందులో ఎవరిది నిజం, ఎవరిది అబద్దం అన్నది వాళ్లకే వదిలేద్దాం!!
బిజేపి కి దూరమయ్యేందుకు సాకులు వెతుకుతున్నారు? పార్టీని బలోపేతం చేయలేమని, అది కష్టమని ఇద్దరు నేతలు గ్రహించారు?
బిజేపి లో తమకు కుర్చీ వేసి కూర్చోబెడతారనుకున్నారు? కానీ రోజులు గడుస్తున్నా అది కనిపించడం లేదు. కనీసం తమ స్థాయిని కూడా పట్టించుకోవడం లేదు? బిజేపి లో ఇంకా వుంటే ఎటూ కాకుండా పోతామని గ్రహించారు? నిన్నటి దాకా రాష్ట్ర బిజేపి మీద నిందలేశారు? ఇప్పుడు కేంద్ర పార్టీకి గట్టిగా చెప్పామని చెప్పుకుంటున్నారు? అసలు జాతీయ అధ్యక్షుడు నడ్డా హైదరాబాదు లో నేరుగా ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే, ఇద్దరే డిల్లీ వెళ్లి చెప్పేంత సీక్రెట్ ఏముంటుంది? ఇక్కడ చెప్పలేనంత రహస్య విషయం ఏం దాగుంది? అధిష్టానానికి గట్టిగా చెప్పే అవకాశం రాష్ట్ర నాయకులకు వుంటుందా? వాళ్ల ముందు నోరు పెద్దది చేసుకునే అవకాశం ఇస్తారా? కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పామన్నారు? అవి ఏమిటో చెప్పలేకపోతే ప్రజలకెలా తెలుస్తుంది? అవేంటో చెప్పమంటే ముఖం చాటేశారు? తెలంగాణ లో ఆత్మగౌరవంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు? కనీసం పార్టీ ఆఫీసులోకి వెళ్లలేక గేటు ముందు పడిగాపులు కాశారు? గేటు ముందు పడిగాపులు కాసే వారి మాటలు ఎక్కడైనా విన్నట్లు చరిత్ర వుందా?
విధిలేక మాడిపోయిన ముఖాలతో వెనుదిరిగారు? ఇంతకన్నా పరువు తక్కువ ఏమైనా వుంటుందా?
ప్రగతి భవన్ ముందు నాడు పరువుపోయిందన్నారు. నేడు డిల్లీలో పరువు తీసుకున్నారు? ఇది స్వయం కృతాపరాధం కాదా? పార్టీ మారే చాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు? అనే దానికి సంకేతం కాదా? డిల్లీ పెద్దలను కలిశాం…అన్నీ చెప్పాం…అనుకున్నాక ఇంకా అక్కడే ఎందుకు మకాం వేశారు? లోకో భిన్న రుచి…ఇప్పుడు ఈ ఇద్దరిదీ ఎటు దారి!!
బీజేపీ అధినాయకత్వంలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. తెలంగాణలో సీన్ రివర్స్ అవుతోంది. కాంగ్రెస్ ఒక్క సారిగా తుఫానులా ప్రత్యర్థి పార్టీల పైన విరుచుకుపడుతోంది. సొంత పార్టీ నేతలే అల్టిమేటం ఇవ్వటం బీజేపీ ఢిల్లీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది. కాంగ్రెస్ లోకి వెళ్లాలంటూ మద్దతు దారుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని స్వయంగా తెలంగాణ బీజేపీ నేతలు హైకమాండ్ కు వివరించారు. పార్టీ ఎదుగుదలకు ఉన్న సమస్యలను ఏకరువు పెట్టారు. కానీ, హైకమాండ్ నుంచి వచ్చిన స్పందనతో వారు షాక్ అయ్యారు. పార్టీ వీడితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించిన తీరు ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కలకలం రేపుతోంది.
తెలంగాణ బీజేపీలో ఇంటర్నల్ వార్ మొదలైంది. ఇప్పుడు అది ఢిల్లీ వరకు చేరింది. బీజేపీలోకి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని అంచనాలు వేసినా సఫలం కాలేదు. బండి సంజయ్ నాయకత్వం పైన ఒక విధంగా పార్టీలో నేతలు తిరుగుబాటు చేసారు. పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదులు చేసారు బండిని మార్చాలంటూ డిమాండ్ చేసారు. పార్టీలో పరిణామాల పైన రిపోర్టులు ఇచ్చారు. బీజేపీ అధినాయకత్వం లైట్ తీసుకుంది. ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ఆదరణ స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని స్థాయిలోనూ నేతలు కాంగ్రెస్ వైపు క్యూ కడుతున్నారు. బీఆర్ఎస్ ..బీజేపీ నాయకత్వాల తెర వెనుక రాజకీయం తమ మనుగడకే ముప్పు తెస్తుందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ నేతలను కాంగ్రెస్ లో చేరాలంటూ కేడర్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఒక హైకమాండ్ తో చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకోవాలని తాజాగా ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. పార్టీలో పరిస్థితి వివరించారు. రాష్ట్ర పార్టీ నాయకత్వం మార్చాలని కోరారు. తమను ఢిల్లీకి పిలిచి అటు కేటీఆర్ కు అప్పాయింట్ మెంట్ ఇవ్వటం పైన సందేహాలు ఉన్నాయని స్పష్టం చేసారు. కవిత అరెస్ట్ కాకపోవటంతో అనుమానాలు బల పడుతున్నాయని వివరించారు. బీఆర్ఎస్ ను దెబ్బ తీసే నిర్ణయాలు తీసుకోకుంటే తాము పార్టీలో కొనసాగే అవకాశాలు లేవని.. నియోజకవర్గాల్లో తమ పైన ఒత్తిడి పెరుగుతుందని స్పష్టం చేసారు.
వీరి వాదన విన్న తరువాత పార్టీ నాయకత్వం నుంచి వచ్చిన సమాధానంతో ఈ ఇద్దరు నేతలు షాక్ కు గురయ్యారు. కేటీఆర్ తో అమిత్ షా సమావేశం అయితే చివరి నిమిషంలో రద్దు అయింది. కానీ పార్టీ మారేలా తమ పైన ఒత్తిడి ఉంది..కాంగ్రెస్ కు ఆదరణ పెరుగుతుందంటూ సొంత పార్టీ నేతలు చెప్పిన సమాచారం మాత్రం బీజేపీ నాయకత్వం జీర్ణించుకోలేక పోయింది. పార్టీ వీడే ఆలోచన చేస్తే సహించేది లేదని పార్టీ అధినాయకత్వం హెచ్చరించినట్లు బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. సహజంగా బీజేపీ నాయకత్వం విచారణ సంస్థలతో వేధించే విధానం తెలిసిన ఆ ఇద్దరు నేతలకు ఏం చెబుతున్నారో క్లారిటీ వచ్చేసింది. అప్పటికప్పుడు ఏం చెప్పలేక బయటకు వచ్చేసారు. కానీ, నడ్డా తెలంగాణకు వచ్చినా ఆ ఇద్దరూ ఢిల్లీలోనే ఉండిపోయారు. మరోసారి ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. భవిష్యత్ నిర్ణయాల పైన మల్ల గుల్లాలు పడుతున్నారు.
పార్టీని బతికించమని అడిగితే హెచ్చరికలు చేయటం వారికి అంతు చిక్కటం లేదు. అటు వ్యాపారాలు..ఇటు రాజకీయాలు దేనిని పణంగా పెట్టలేక సతమతం అవుతున్నారు. ఇటు ఇదే రోజున ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశం అవుతున్నారు. పెద్ద ఎత్తున చేరికలకు రంగం సిద్దమైంది. ఇటు కాంగ్రెస్ లో పెరుగుతున్న జోరు.. నాయకత్వం నుంచి హెచ్చరికలతో ఈటెల, కోమటిరెడ్డితో సహా పలువురు నేతలు బేజారు అవుతున్నారు. మరి కొద్ది రోజులు వేచి చూసే నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఇప్పుడు తెలంగాణ బీజేపీలో వైరల్ అవుతోంది.
తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నేతలకు సీన్ రివర్స్ అవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ, వారికి కంటి మీద కునుకు దూరం చేసింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ లో ఉంటూనే పలువురు నేతలు కాంగ్రెస్ లోకి టచ్ లోకి వస్తున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఇదే ప్రయత్నం చేసారు. తనతో పాటుగా తన మద్దతుదారులకు సీట్ల గురించి మంతనాలు చేసారు. హమీ పొందరు. ఇంతలో ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. హామీలు గుప్పించారు. అక్కడ జీ హుజూర్ అన్నారు. తన స్వలాభం కోసం బీఆర్ఎస్ వైపు ఉండాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఇప్పుడు అనుచర వర్గానికి ఇది రుచించటం లేదు. ఇక్కడే సీన్ రివర్స్ అయింది. అనుచరుల తాజా వ్యూహాల్లో మహేందర్ రెడ్డి గేమ్ బూమ్ రాంగ్ అయింది.
బీఆర్ఎస్ తొలి విడత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పట్నం మహేందర్ రెడ్డి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున తాండూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని.. పార్టీ హైకమాండ్.. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తాండూర్ నియోజకవర్గంలో పోటీ చేసి, గెలిచిన పైలెట్ రోహిత్ రెడ్డి.. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఆయన పార్టీలో క్రియాశీలకంగా మారారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మళ్లీ ఆయనకే టికెట్ ఇస్తుందనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే.. పట్నం మహేందర్ రెడ్డికి ఛాన్స్ లేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ లో చేరేందుకు పట్నం రూట్ క్లియర్ చేసుకున్నారు.
తనతో పాటుగా తన మద్దతు వర్గానికి సీట్ల పైన కాంగ్రెస్ లో చర్చించారు. అదే సమయంలో కొందరి సీట్ల ఖరరు అంటూ ఒక జాబితా బయట పెట్టారు. అందులో వికారాబాద్ కు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ కు జహీరాబాద్, తీగల అనితకు మహేశ్వరం, కేఎస్ రత్నం కు చేవెళ్ళ, తాండూరు నుంచి మహేందర్ రెడ్డికి ఇవ్వాలని..మహేందర్ రెడ్డి సతీమణి సునీతకు చేవెళ్ల లోక్ సభ ఇస్తారంటూ వ్యూహాత్మక లీకులు వచ్చాయి. స్పష్టమైన హామీ తీసుకున్నారు. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో రంగారెడ్డి జిల్లాలోని ఒక ఎమ్మెల్సీ ప్రగతి భవన్ కు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి ఫోన్ రావటంతో పరుగున వెళ్లిన మహేందర్ రెడ్డికి ఆయన పాత చిట్టా బయట పెట్టారు. పార్టీ వీడితే జరిగేది ఏంటో సున్నిత హెచ్చరికలతో స్పష్టత ఇచ్చారు. అంతే..మహేందర్ రెడ్డి జీ హుజూర్ అంటూ గులాబీ తోట లోనే పని చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
మహేందర్ రెడ్డికి బీఆర్ఎస్‌లో తగిన గుర్తింపు లేదు. తాండూరు ఈ సారి పైలెట్ కు ఖాయం చేస్తూనే మహేందర్ రెడ్డికి ఆశ పెంచారు. అనుచరులు, సన్నిహిత నేతలకు కాంగ్రెస్ లోకి వెళ్దామని చెప్పి..ఇప్పుడు నో అంటూ వారందరికీ మహేందర్ రెడ్డి సమాచారం ఇచ్చారు. కానీ, వారంతా బీఆర్ఎస్ నాయకత్వాన్ని, మహేందర్ రెడ్డి మాటలను నమ్మేందుకు సిద్ధంగా లేరు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమనే నిర్ణయానికి వచ్చారు. ఎవరికి వారు కంగ్రెస్ నేతలతో మంతనాలు ప్రారంభించారు. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. మహేందర్ రెడ్డిని బేఖాతర్ అంటున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు ఊహించని మహేందర్ రెడ్డి వ్యూహం బెడిసి కొట్టింది. ఆయన ప్లాన్స్ అన్నీ బూమ్ రాంగ్ అయ్యాయి. ఒంటరి వాడయ్యాడు. ఇప్పుడు బీఆర్ఎస్ లోనూ ఇచ్చిన హామీ అమలు అవుతుందా లేదా అనేది సందేహమే!
`ఇప్పటికీ ఎలాంటి పదవులు ఆశించని త్యాగధనలు వరంగల్ లో లేరా?
`వాళ్లకంటే గొప్పదా నీ ఉద్యమ భాగస్వామ్యం?
`మళ్ళీ, మళ్ళీ పదవులంటే తోటి ఉద్యమ కారులకొద్దా?
`తెలంగాణ కోసం త్యాగమంటే, పదవుల పందేరమా?
హైదరబాద్,నేటిధాత్రి:
తెలంగాణ మాజీ ఉన్నత విద్యామండలి చైర్మన్ దశాబ్ది ఉత్సవాల సమయంలో కాంగ్రెస్ సభకు హజరై చేసిన వ్యాఖ్యలపై ఉద్యమ కారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అర్హత లేకున్నా అందలమెక్కిస్తే తన మిడిసిపాటును పాపిరెడ్డి చూపిస్తున్నాడని ఉద్యమ కారులు విమర్శిస్తున్నారు. అందరికంటే ముందు ముఖ్యమంత్రి కేసిఆర్ తగిన గౌరవం తనకు కల్పించాడన్న కృతజ్ఞత లేకుండా మాట్లాడడం విశ్వాస ఘాతకమని అంటున్నారు.
పరిటాల సుబ్బారావు లాంటి వారు చేసిన తెలంగాణ ఉద్యమంలో పది శాతం కూడా చేయని పాపి రెడ్డి, పదవీ కాంక్ష కోసం, కులం కోసం కాంగ్రెస్ పార్టీ పంచన చేరడం దౌర్భాగ్యం.
ఉద్యమం ముసుగులో నమ్మక ద్రోహుల కంటే దుర్మార్గుడు పాపిరెడ్డి అని ఉద్యమకారులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఉద్యమ కాలంలోనే అడుగు బైట పెట్టాలంటే తన అవసరాలు ఎవరు తీర్చుతారని చూసిన వ్యక్తి పాపిరెడ్డి. చివరకు వెహికల్ లో కూడా పెట్రోల్ పోయిస్తే తప్ప కదలని పాపిరెడ్డి నీతులు వల్లిస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు వున్నాయంటున్నారు. నిజానికి వరంగల్ లో ఉద్యమాన్ని ఉద్యోగ సంఘాలుగా తన భుజస్కందాల మీద మోసిన నాయకుడు పరిటాల సుబ్బారావు. ఆయన తెలంగాణ ఉద్యమం కోసం పడరాని పాట్లు పడ్డాడు. ఉద్యోగులను ఉద్యమంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించాడు. రూపాయి, రూపాయి పోగేసి ఉద్యమ కారుల అవసరాలు తీర్చాడు. చివరకు తన జీతం కూడా ఉద్యమానికే ఖర్చ చేసిన చరిత్ర సుబ్బారావుది. అయినా ఆయన ఇప్పటి వరకు తనకు పదవి కావాలని అడగలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. నిజానికి సుబ్బారావు లాంటి వారు పదవులకు వన్నె తెస్తారు. పాపిరెడ్డి లాంటి వారు తిన్నింటి వాసాలు లెక్కపెడతారని ఉద్యమ సహచరులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆనాడు ఉద్యమానికి ముందుండి నడిచిన వారెవరూ ఇప్పటి వరకు మాకు పదవులు కావాలని కోరలేదు. అదీ ఉద్యమ త్యాగం.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదవులు రాక ఎదురుచూపుల్లో ఎంతో మంది ఉద్యమకారులున్నారు.
వాళ్లంతా తెలంగాణ వస్తే భవిష్యత్తు తరాలు బాగుపడతాయని నిస్వార్థంతో పోరాటాలు చేశారు. అందుకే వాళ్లు ఎక్కడా రాజకీయాలు చేయడం లేదు. ఉద్యోగ సంఘాల నాయకులుగా తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన ఎంతో మంది రిటైర్డ్ ఉద్యోగులు తమ సేవలు అవసరమనుకుంటే చేయడానికి సిద్దంగా వున్నారు. కానీ తెలంగాణ ఉవ్వెత్తున ఎగిసిపడిన తొలినాళ్ళలో ఉద్యమం వైపు చూడని మాజీ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని ఉద్యమ నాయకులు తప్పు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఓ వైపు అన్ని రంగాలలో అన్ని రాష్ట్రాల కంటే ముందు దూసుకెళ్తుంటే పాపిరెడ్డి పిచ్చి ప్రేలాపణలు చేయడం కాదా? అని ఉద్యమ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమం మొత్తం ప్రస్తానంలో పాపిరెడ్డి పాత్ర ఎంత? రవ్వంత.
కాకతీయ విశ్వవిద్యాలయం లోని విద్యార్థులు, సిబ్బంది, సకల జనులందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంలో కూడా పాపిరెడ్డి జై తెలంగాణ అన్నది లేదు. ఉద్యాగ సంఘాల నాయకులు ఒత్తిడి చేయడంతో ఉద్యమంలోకి వచ్చినా, కొట్లాటలో ముందున్నట్లు నటించడం తప్ప, ఒంటరిపోరు పాపిరెడ్డి చేసింది లేదు. అయినా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ పిలిచి మరీ పాపిరెడ్డికి పెద్ద పీట వేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా పాపిరెడ్డి పని చేసిన నాడు కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేసేది. పరీక్షల నిర్వహణ ఎంత లోపభూయిష్టంగా పాపిరెడ్డి నిర్వహించారో అందరకీ తెలుసు. పాపిరెడ్డి మూలంగా ప్రభుత్వం ఎంతో అబాసుపాలైంది. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్ పాపిరెడ్డిని కడుపులోనే పెట్టుకున్నాడు. కానీ పాపిరెడ్డి మాత్రం తన అసలు స్వరూపాన్ని చూపుతున్నాడు. అప్పగించిన పనిని సక్రమంగా నిర్వహించలేదు. కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలతో పాపిరెడ్డి ఆడుకున్నాడు. అలాంటి పాపిరెడ్డి ఇప్పుడు తెలంగాణ కలలు నరవేరలేదని మాట్లాడడం విడ్డూరం. విద్యార్థుల జీవితాలను పాపిరెడ్డి చేతిలో పెడితే ఒళ్లు దగ్గర పెట్డుకొని పని చేయకపోగా, మళ్ళీ తన పదవి కొనసాగించలేదని ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడాన్ని ఉద్యమ నాయకులు తప్పు పడుతున్నారు. పదవిచ్చిన పార్టీకి ద్రోహం చేయడం, ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేయడం పాపిరెడ్డి ఆత్మ ద్రోహం చేసుకోవడమే అవుతుంది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా అవకాశం కల్పించిన పార్టీకి ద్రోహం చేసి, కులాభిమానం గుర్తొచ్చి కాంగ్రెస్ వైపు చూడడం అంటే పచ్చి అవకాశవాదం అంటున్నారు. ఆనాడు గుర్తించి పదవిచ్చినా ఇంత నీతిబాహ్యమా పాపిరెడ్డి అని తిట్టిపోస్తున్నారు. మళ్ళీ పదవి రాలేదని అక్కసు పెట్టుకొని పాపిరెడ్డి చిలకపలుకులు పలకడాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోంది? తెలంగాణ ఉద్యమం చేసింది పదవుల కోసమా? ఇప్పటికీ ఎలాంటి పదవులు ఆశించని త్యాగధనలు వరంగల్ లో లేరా? వాళ్లకంటే గొప్పదా నీ ఉద్యమ భాగస్వామ్యం? మళ్ళీ, మళ్ళీ పదవులంటే తోటి ఉద్యమ కారులకొద్దా? తెలంగాణ కోసం త్యాగమంటే, పదవుల పందేరమా? అని ఉద్యమకారులు పాపిరెడ్డిని తూర్పారపడుతున్నారు.
రాష్ట్ర బిజేపిలో పలు శిబిరాలు వున్నా, తెరమీదకు మాత్రం ఇరు శిబిరాలు ఇటీవల బాగా వార్తల్లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఈటెల రాజేందర్ కు పార్టీలో ప్రాధాన్యత పెరుగుతోందన్నప్పుడల్లా బిజేపిలో అలజడి మొదలౌతోంది. నిజానికి ఈటెల రాజేందర్ బిజేపి చేరిన నాటికి ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. ఆనాడు ఈటెల రాజేందర్ వస్తే బాగుంటుందని, రావాలని కోరుకున్న వారు కూడా ఇప్పుడు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. అసలు ఈటెల రాజేందర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో బిజేపిని వాడుకోలేదు. ఆ సమయంలో బండి సంజయ్ యాత్రలో వున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వారి ప్రచారం అవసరం రాలేదు. బిజేపి అగ్రశ్రేణి నేతలెవరూ వచ్చింది లేదు. పైగా వాళ్లు రావొద్దనే ఈటల కూడా సూచించారు. తమకు శ్రమ తప్పుతోందని, ఇక్కడికి ఇదే మంచిది అన్నట్లు బిజేపి పెద్దలు కూడా భావించారు. కానీ ఆ గెలుపు ఖాతా బిజేపి లో పడలేదు. కేవలం ఈటెల రాజేందర్ వ్యక్తి గత ప్రతిష్ఠ మూలంగానే గెలవడం జరిగిందనేది జగమెరిగిన సత్యం. అయితే ఈటెల రాజేందర్ గెలిచాక పార్టీలో ఆయన కు కీలక స్థానం కల్పిస్తారని అందరూ ఊహించారు. కానీ అదేదీ జరగలేదు. కనీసం అసెంబ్లీలో బిజేపి పక్ష నాయకుడుగా కూడా గుర్తించడానికి పార్టీకి మనసు రాలేదు. నిజానికి ఈటెల రాజేందర్ మనస్తత్వానికి బిజేపి పార్టీ తగదు. ఆయనే అనేక సార్లు చెప్పిన విషయం ఒకటుంది. తనకు రాజకీయాలలోకి రాకముందు గుడికి వెళ్లే అలవాటు లేదు. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం, రాజకీయాలు సాగుతున్న తరుణంలో ఏ గ్రామానికి వెళ్ళినా ముందు గుడికి తీసుకెళ్లడం జరిగేది. దాంతో ప్రజల అభిప్రాయం, మనో భావాలను గౌరవించడం అలవాటైందని చెప్పారు. అలాంటి ఈటెల రాజేందర్ బిజేపి మనుగడ అంటే కష్టమే. అయినా కొనసాగాలనే నిర్ణయించుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఒక దశలో ఈటెలపై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తర్వాత పరిస్థితులు సర్థకున్నాయి. ఆ తర్వాత ఈటెల పట్ల పార్టీలో కొంత వ్యతిరేకత మెల్లిగా మొదలైంది. పనిలో పనిగా ఈటెల రాజేందర్, మాజీ ఎంపి. వివేక్ వెంకటస్వామి వ్యవహారం తెరమీదకు తెచ్చారు. ఈటెల వ్యక్తిత్వాన్ని చిన్నది చేసే ప్రయత్నం చేశారు. అప్పటికీ ఈటెల ఇమిడిపోయేందుకే నిర్ణయించుకున్నారు. అనువుగాని చోట అధికుల మనరాదు..అనేది గుర్తు చేసుకుంటూ వచ్చినట్లున్నారు. అయితే బిఆర్‌ఎస్ నుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బయటకు పంపించడంతో ఈటెల తనకుపని దొరికింది అనుకున్నారు.
చేయాల్సినంత కృషి చేశారు. కానీ వ్యవహారం సాగలేదు. చేరికల కమిటీ పేరు మీద నమ్మకంతో ఎవరూ రావడం లేదు. అదే సమయంలో ఈటెల రాజేందర్ ఖమ్మం వెళ్లి పొంగులేటిని కలవడం తనకు తెలియదని బండి సంజయ్ చెప్పడం వివాదాలు ముదిరి పాకాన పడ్డాయన్నది అందరికీ అర్థమైంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తర్వాత బిజేపి గ్రాఫ్ పడిపోవడం, బిజేపి లో ఈటెలకు ప్రాధాన్యత పెరుగుతుందన్న వార్తలు గుప్పుమన్నాయి. ఇక్కడ కూడా ఈటెల స్వయం కృతాపరాధం మళ్ళీ ఆయనను మొదటికి తీసుకొచ్చింది. పొంగులేటి, జూపల్లి ని నేను బిజేపి లోకి రావాలని కోరితే, నాకే కౌన్సిలింగ్ ఇచ్చారని అనడంతో బిజేపి పని అయిపోయిందని ఈటెల నే స్వయంగా ప్రకటించినట్లైంది. తన అశక్తతను బైట పెట్టుకున్నట్లైంది. అంతే కాకుండా ప్రపంచంలో ఎక్కడ చేరికల కమిటీ అనేది వుండదు అని ఈటెల అన్నారు. అంటే నర్మగర్భంగా తాను అసంతృప్తి తో వున్నట్లు చెప్పకనే చెప్పినట్లైంది. ఇది బిజేపి అసలు శ్రేణులకు నచ్చలేదు. వాళ్లు జీర్ణించుకోలేదు. ఈటెల మీద ఆఫ్ ద రికార్డు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యల దుమారం ఎంత దూరం పోతుందో అనుకుంటున్నారు. అయితే తాజాగా ఈటెల రాజేందర్ తో పాటు, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక జట్టుగా మారారన్నది ఓ ప్రచారం. ఇద్దరూ అసంతృప్తి గానే వున్నారు. అందుకే ఇరు వర్గాల మనసులో ఒకటే వుంది? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
కర్ణాటక ఎన్నికల తర్వాత తన ప్రాభవం తగ్గుతుందేమో?
అన్న భావన బండి సంజయ్ లో మొదలైనట్లు తొలుత ప్రచారం మొదలైంది. ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదే సమయంలో ఈటెల పదే, పదే డిల్లీ ప్రయాణం, కేంద్ర బిజేపి శిబిరంలో ఏదో జరుగుతోందనేది విసృత చర్చకు దారి తీసింది. ఈటెల కు ప్రచార కమిటీ బాధ్యతలు ఇక అప్పగించినట్లే అన్నది కూడా వినిపించింది. అంతకు ముందు బండిని తొలగించి, ఈటెలతో భర్తీ చేస్తారని కూడా వినిపించింది. ఇది బండి సంజయ్ శిబిరంలో కలకలం రేపింది. ఆ తర్వాత ఈటెల పక్క చూపులు అనేది ప్రచారంలోకి వచ్చింది. ఇదే ఒకే ఒరలో ఇమడలేక ఇదంతా జరుగుతోంది.
మమ్మల్ని పట్టించుకోవడం లేదని సాక్షాత్తు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. దానికి తోడు బిజేపిలో కొత్త నేతలకు ప్రత్యేక ఆహ్వానాలు ప్రత్యేకంగా వుండవన్నది తేల్చి చెప్పారు. ఇక్కడ అందరూ ఒక్కటే అని బండి వర్గం కరాఖండిగా చెప్పినట్లు కూడా తెలుస్తోంది.
వెనుకొచ్చిన కొమ్ములు మాకొద్దని కూడా అసలైన బిజేపి వాదులు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మేము షార్ప్ అని ఈటెల వర్గానికి వుంది. అయినా మాలో ఎలాంటి దూరం లేదు… లేదు.. లేదనుకుంటూనే కుంపటి రగులుతోంది! ఇలాంటి సమయంలో బండి సంజయ్ పోతా అనుకునేవారిని ఆపేదేముంది? అని ప్రకటన చేశారు. బండి సంజయ్ మాటలు ఈ వివాదానికి ఆజ్యం పోసినట్లైంది! ఇప్పుడేం జరగనుంది? అనే దానిపై అంతటా ఆసక్తి నెలకొన్నది! ఈటెల, కోమటి రెడ్డి డిల్లీ లో… ఏం జరుగుతోంది? అనే చర్చనే కాదు, కాంగ్రెస్ లో చేరిక ఊహాగానాలే నని రాజగోపాల్ రెడ్డి అంటూనే..ఏదైనా వుంటే చెబుతా? కదా!? అని అన్నారు. దీని భావం విడమర్చి చెప్పాల్సినంత అవసరం వుండదేమో!!
తెలంగాణలో చేరికల పర్వం మొదలైంది. మాజీ ఎంపీ పొంగులేటి ఎంట్రీ తో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన పొంగులేటి కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయం ఆషామాషీగా జరగలేదు. సుదీర్ఘ కసరత్తు..పక్కా వ్యూహం..బీఆర్ఎస్ లక్ష్యంగా నిర్ణయం తో పక్కాగా డిసైడ్ అయింది. పొంగులేటి తన సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నేత. పొంగులేటి చేరిక పార్టీకి ఖచ్చితంగా మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పుడు పొంగులేటి కాంగ్రెస్ లో చేరటం వలన తమకు జరిగే నష్టం పై బీఆర్ఎస్ లోనూ చర్చకు దారి తీస్తోంది.
పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలంగాణతో పాటుగా ఢిల్లీ స్థాయిలోనూ మంచి పలుకుబడి ఉన్న నేత. 2014 లో ఖమ్మం ఎంపీగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలోనూ పొంగులేటికి అనుచర వర్గం ఉంది. వైఎస్సార్సీపీ ఎంపీగా గెలిచిన పొంగులేటి ఆ తరువాత టీఆర్ఎస్ కు దగ్గరయ్యారు, ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ కోసం పని చేసారు. 2018 ఎన్నికల్లో ఎంపీ సీటు ఆశించినా ముఖ్యమంత్రి హామీతో సీటు దక్కక పోయినా పార్టీ అభ్యర్ధి గెలుపుకు సహకరించారు. అప్పటి నుంచి పార్టీ కోసం పని చేస్తూ..వ్యయ ప్రయాసలను తట్టుకొని నిలబడ్డారు. యూజ్ అండ్ త్రో పాలసీ అమలు చేసే బీఆర్ఎస్ నేతల వైఖరితో మనస్థాపానికి గురైన పొంగులేటి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ వైపు అడుగులు వేసారు.
పొంగులేటిని చేర్చుకోవటానికి బీజేపీ అనేక ప్రయత్నాలు చేసింది. ఢిల్లీ నేతలు రంగంలోకి దిగారు. కోరిన సీట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. పార్టీలో పదవుల పై హామీలు గుప్పించారు. కానీ, క్షేత్ర స్థాయిలో.. ప్రజల్లో ఉన్న మూడ్ గుర్తించిన పొంగులేటి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ ను మట్టు బెట్టాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని తేల్చారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. ఖమ్మం జిల్లాలో సీట్ల గురించి మద్దతు దారుల నుంచి హామీ పొందాలనే ఒత్తిడి ఉన్నా..అవసరమైతే నాలుగు అడుగులు వెనక్కు తగ్గుదామని పొంగులేటి చెబుతున్నారు. అందరి లక్ష్యం బీఆర్ఎస్ ను ఓడించటమేనని తేల్చి చెప్పారు. ఆ దిశగా కాంగ్రెస్ లో ఏ బాధ్యతలు అప్పగించినా…పని చేసేందుకు సిద్ధమని పొంగులేటి స్పష్టం చేసారు.
తాజాగా సీఎల్పీ నేత మల్లు భట్టిని పొంగులేటి కలిసారు. మండుటెండల్లో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండ వంద రోజుల పాదయాత్ర చేయటం పైన అభినందించారు. పార్టీలో చేరిక అంశంతో పాటుగా ఖమ్మం జిల్లాలో రాహుల్ సభ పైన చర్చించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతల కలయిక తో వచ్చే ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది సీట్లు క్లీన్ స్వీప్ చేయటం ఖాయమనే అంచనాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడటం లేదు.
ఇక పొంగులేటి కాంగ్రెస్ లో చేరిక ద్వారా తమ పైన పడే ప్రభావం పైన బీఆర్ఎస్ ఆరా తీస్తోంది. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం పోలరైజ్ అయ్యే అవకాశం ఉందనే నివేదిక లు ఇప్పుడు బీఆర్ఎస్ కు గుబులు పెంచుతున్నాయి. ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గం గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో ఉంది. ఆ జిల్లాల్లోని ఆ వర్గానికి చెందిన నేతలతో పొంగులేటికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆర్దికంగానూ.. రాజకీయ వ్యూహాల్లోనూ పొంగులేటికి పట్టు ఉంది. బీఆర్ఎస్ ను ఓడించటం..తనను అవమానించిన వారిని రాజకీయంగా కనుమరుగు అయ్యేలా చేయటం తన లక్ష్యమని ప్రకటించిన పొంగులేటి రాక ఇప్పుడు కాంగ్రెస్ కు అదనపు బలంగా మారనుంది.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.