పోడు పట్టాలకు పంట రుణాలు ఇవ్వాలి.

తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

ఐటీ పరిశ్రమల శాఖ మరియు శాసనసభ్యులు వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ సత్యనారాయణ రాజు గారు ఈ సమస్యకు పరిష్కారం చూపాలి.

తెలంగాణ ఆదివాసి తెలుగు సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అటవీ పట్టాలకు రెవెన్యూ కొత్త పట్టాలకు పంట రుణాలు ఇవ్వాలని ఎల్డిఎం శ్రీనివాస రావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఆ సంఘం నాయకులు తెలియజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసి సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందినటువంటి రైతులు 5000కుటుంబాలు పదివేల ఎకరాలకు పొంది ఉన్నారని వారికి పంట రుణాలు ఇవ్వడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని ఒక వైపున రైతు భరోసా రాక మరోవైపున బ్యాంకర్లు పంట రుణాలు చార్జ్ క్రియేట్ అయితలేదు అనే పేరుతోటి ఇవ్వకపోవడం చేత, రైతులు ఆందోళన చెందు తున్నారు అన్నారు, రైతులు చేసేదేమీ లేక ప్రైవేటు వడి వ్యాపారస్తులని ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొనడానికి,ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనం అని వారు మండి పడ్డారు. వెంటనే ఈ సమస్యపై ఐటీ పరిశ్రమల శాఖ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ సమస్యని పరిష్కరించే బాధ్యత తీసుకోవాలని వారు గుర్తు చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పోడు పట్టాలు వచ్చినటువంటి జిల్లాలలో ఇప్పటికే రైతులు పంట రుణాలు బ్యాంకుల నుండి తీసుకున్నారని, ఈ జిల్లాలోనే ప్రభుత్వ అధికారులు గానీ ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోకపోవడం అత్యంత బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టవలసి ఉంటుందని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘ అధ్యక్షులు సూదుల శంకర్ మరియు జిల్లా కమిటీ సభ్యులు మేకల రాజు కుమ్మరి గణేష్ అసోదుల కుమార్, కొవ్వూరి కిష్టయ్య, ఓలపు శంకరయ్య తదితరులు పాల్గొన్నారుపోడు పట్టాలకు పంట రుణాలు ఇవ్వాలి.
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్

వీణవంకలో కలకలం రేపుతున్న దొంగలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక

వీణవంక, ( కరీంనగర్ జిల్లా).

నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రంలోని నల్ల పోచమ్మ వైన్స్ అలాగే వెంకటరమణ ఎలక్ట్రిషన్ లో ఆదివారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. సోమవారం తెల్లవారుజామున రోజులాగే షాప్ వద్దకు వచ్చిన షాపు యాజమాన్యం చూసేసరికి తాళాలు పగల గొట్టి ఉన్నాయని తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి పరిశీలించగా పక్కన ఉన్న వైన్ షాపులో దొంగలు పడ్డారని తెలిసిపోయింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. దొంగలు షాపులోని సీసీ కెమెరాలను హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు. మద్యం షాపులో వెనకాల ఉన్న గోడను పగలగొట్టి మద్యం బాటిల్స్ ను ఎత్తుకెళ్లారు. వెంకటరమణ ఐరన్ ఎలక్ట్రిషన్ షాపులో సుమారుగా 14 వేల రూపాయలను ఎత్తుకెళ్లారని యజమాని అన్నాడు యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తోట తిరుపతి తెలిపారు.

అంగన్వాడి కేంద్రంలో సామూహిక శ్రీమంతాలు

నిజాంపేట: నేటి ధాత్రి

నిజాంపేట మండల పరిధిలోని నందగోకుల్ గ్రామంలో గల అంగన్వాడి కేంద్రంలో టీచర్ జ్యోతి ఆధ్వర్యంలో సోమవారం నాడు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, పసిపిల్లలకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి, పాఠశాల చైర్మన్ వడ్ల నర్మద, గర్భిణీ స్త్రీలు, పసి పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కుషాయిగూడ హోల్ సేల్ కాంటా లకు శాశ్వత స్థలం కేటాయింపుకు చర్యలు

కలెక్టర్ తో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి

జడ్సీ దృష్టికి తీసుకెళ్లిన పరమేశ్వర్ రెడ్డి, బొంతు శ్రీదేవి యాదవ్

కాప్రా నేటిధాత్రి 23:

కాప్రా సర్కిల్ లోని కుషాయిగూడ హోల్ సేల్ కాంటాలకు మరియు ఇతర వ్యాపారులకు శాశ్వత పరిష్కారం లభించనుంది. మార్కెట్ పై మూడు దశాబ్దాలుగా ఆధారపడి జీవిస్తున్న హోల్ సేల్ వ్యాపారులకు నష్టం లేకుండా ప్రత్యామ్నాయం చూపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే రంగంలోకి దిగి ఇదే విషయమై జిల్లా కలెక్టర్ తో చర్చించడం జరిగింది. ప్రత్యామ్నాయంగా స్థలాన్ని కేటాయించాలని కూడా కలెక్టర్ కూ ఆదేశించారు.

ఇదే విషయంలో కూరగాయల మార్కెట్ హోల్ సేల్ వ్యాపారులు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, స్థానిక చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు వ్యాపారులు . దీంతో పరమేశ్వర్ రెడ్డి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ సమక్షంలో వ్యాపారులు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కుమార్ పాటిల్ ను కలిశారు.

కూరగాయల హోల్ సేల్ వ్యాపారులకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జడ్సీ త్వరలోనే సమస్యను పరిష్కరించనున్నట్టుగా హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో
హోల్సేల్ కాంట సభ్యులు

పుప్పాల వెంకన్న, శ్రీనివాస్, నరేష్ కుమార్, రమేష్, నందిమ్, హరిచరణ్, రాజు రాఘవేందర్ పాల్గొన్నారు..

తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు కొనసాగించాలి

కమలాపూర్ ఆర్యవైశ్య ఆధ్వర్యంలో తహసిల్దార్ కు వినతిపత్రం……………

నేటిదాత్రి కమలాపూర్ (హన్మకొండ)హైదరాబాదులో గల తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగించకుండా అలానే కొనసాగించాలని మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భూపతిరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ కమలాపూర్ తహసిల్దార్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కమలాపూర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొనిశెట్టి మునిందర్ మాట్లాడుతూ ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఇబ్బందుల గురవుతూ,నానా అగచాట్లు పడుతున్న తెలుగు ప్రజలందరిని ఒక్కచోటికి చేర్చాలనే లక్ష్యంతో,తెలుగు ప్రజలందరికీ ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కావాలనే పట్టుదలతో 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాములు పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వం వారి పేరు మార్చేందుకు సిద్ధపడటం చాలా దురదృష్ట సంఘటనని పొట్టి శ్రీరాములు ఒక ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి కాదని,తెలుగు ప్రజలందరి ఐక్యత, క్షేమం కోసం పోరాడి అసువులు బాసిన మహామేధావి అని, అంతే కాకుండా భారత జాతీయ ఉద్యమంలో కూడా మహాత్మా గాంధీ తో పాటు పలు కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు అని కొనియాడారు. 1985 లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హైదరాబాదులో తెలుగు విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాడని తదనంతరం పరిణామాల్లో ఆ విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును పెట్టడం జరిగిందని,విభజన అనంతర ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు విశ్వవిద్యాలయం శాఖలు కొనసాగుతున్నాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలని పొట్టి శ్రీరాములు గారి పేరును కొనసాగించాలని హెచ్చరించారు.ఒక మహానీయుని పేరు తొలగించేటప్పుడు వారి త్యాగనిరతిని,వారి పూర్వపరాలు పరిశీలించాలని అలా కాకుండా నచ్చని వ్యక్తుల పేర్లు
తొలగించి, తనకు ఇష్టమైన వారి పేర్లు పెట్టడం మంచి సంప్రదాయం కాదని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం సురవరం ప్రతాపరెడ్డి గారి పేరున వేరే సంస్థకు గాని లేదా నూతనంగా ఏర్పాటు చేసే మరో సంస్థకైనా పెట్టుకోవచ్చని ప్రతాప రెడ్డి గారి పై మాకు ఎలాంటి వ్యతిరేక భావన లేదని పేర్కొన్నారు.ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి శ్రీరాములు గారి పేరు కొనసాగించాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్యులందరు ఉద్యమించక తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల సంఘం అధ్యక్షుడు భూపతి రాజు,పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొనిశెట్టి మునిందర్,వైశ్య సంఘం నాయకులు నూక సాంబమూర్తి,భూపతి ప్రవీణ్,శివశంకర్,శింగి రికొండ యుగంధర్, దొంతుల నాగేశ్వరరావు, తోడుపునూరి జగదీశ్వర్, దోమకుంట్ల ఓం ప్రకాష్, మాడిశెట్టి రమేష్, నంగునూరి సాగర్ బాబు,నూక వీరభద్రయ్య, రమేష్,కృష్ణమూర్తి, మాడిశెట్టి సంపత్, అల్లాడి వేణు,ఉప్పుల ఓం ప్రకాష్,గుండా రాజు,తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్ లో రైతులు దోపిడీకి గురికాకుండా చర్యలు చేపట్టాలి

# మార్కెట్ బైలాను తూచా తప్పకుండా అమలు చేయాలి

# రైతుల వద్ద అధిక కమిషన్ తీసుకునే వ్యాపారుల గుర్తింపు రద్దు చేయాలి

# అమ్మకానికి వచ్చిన రైతుల అన్ని రకాల పంటలను మార్కెట్ లోనే తూకం వేయాలి

# ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్

# మార్కెట్ కార్యదర్శిని కలిసి మెమోరాండం ఇచ్చిన ఏఐకెఎఫ్ ప్రతినిధి బృందం

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి :

వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో బైలాను తూచా తప్పకుండా అమలు చేసి రైతులు పండించిన పంటలను దళారీలు దోచుకోకుండా, కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకెఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకెఎఫ్) వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో నెలకొన్న సమస్యలపై మార్కెట్ కార్యదర్శి పోలేపాక నిర్మలను కలిసి మెమోరాండం ఇచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయ సీజన్ లో రైతులు అష్ట కష్టాలు పడి పండించిన పంటలు చేతికస్తున్న దశలో అమ్మకానికి మార్కెట్ కు తీసుకువస్తున్నారని ఇలాంటి తరుణంలో రైతుల పంటలకు రక్షణ కల్పిస్తూ అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ కనుగుణంగా రైతుల పంటలకు డిమాండ్ కల్పిస్తూ చర్యలు చేపట్టాలని అన్నారు. రైతులు అమ్మకానికి తీసుకచ్చిన అన్ని రకాల ఉత్పత్తులను మార్కెట్ లోనే తూకం వేయాలని అలాగే మార్కెట్ బైలాను తూచా తప్పకుండా అమలు చేస్తూ అధిక కమిషన్ వసూలు చేసే ఏజెంట్లు వ్యాపారుల లైసెన్సులను శాశ్వతంగా రద్దుపరిచి కఠిన చర్యలు చేపట్టాలని అలాగే రైతుల పంటలను దాచుకునే కోల్డ్ స్టోరేజీలలో అధిక చార్జీలను అరికట్టాలని డిమాండ్ చేశారు. మార్కెట్ లో మౌలిక సదుపాయాలు కల్పించి రైతులను కాపాడాలని, సీసీఐ పత్తి కొనుగోళ్ల సందర్భంలో జరిగే దోపిడిని నివారించేందుకు మార్కెట్ సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని కోరారు.రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగిన నష్టం వాటిల్లిన రైతుల పక్షాన ఏఐకేఎఫ్ ముందుండి పోరాడుతుందని తెలిపారు. తన పరిధిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నష్టం జరగకుండా చర్యలు చేపడతారని మార్కెట్ కార్యదర్శి పోలేపాక నిర్మల ఈ సందర్భంగా హామీ ఇచ్చారని తెలిపారు.రైతులకు మార్కెట్ లో కలిగే ఇబ్బందుల గురించి మీ దృష్టికి వచ్చిన విషయాలను తనకు తెలియజేయాలని మార్కెట్ కార్యదర్శి సూచించారని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర బాధ్యులు గోనె కుమారస్వామి, ఏఐసిటియు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నర్ర ప్రతాప్, జిల్లా కార్యదర్శి సుంచు జగదీశ్వర్, ఏఐకేఎఫ్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఇస్మాయిల్,జిల్లా నాయకుడు ఐతం నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

సీఎస్సీ కామన్ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, చైర్మన్ రవీందర్ రావు

హసన్ పర్తి / నేటి ధాత్రి

హాసన్ పర్తి మండల పరిధిలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 2 వ డివిజన్ వంగపహాడ్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పాక్స్) నూతన భవనము, గోదాం, సీఎస్సీ కామన్ సర్వీస్ సెంటర్ ను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం దేశంలో ఏ రాష్ట్రం చెయ్యని విధంగా మూడు దఫాలుగా రైతులకు సుమారు 39వేల మేర రుణమాఫీ చేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కి దక్కుతుంది. రైతు రుణమాఫీ కానీ వారు ఎవరు అధైర్య పడవద్దని టెక్నికల్ ఇబ్బంది ఉన్న వారిని వ్యవసాయ శాఖ మంత్రి సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రుణమాఫీ అయ్యే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు వర్ధన్నపేట నియోజక వర్గ వ్యాప్తంగా రైతులకు సుమారు రుణమాఫీ 436 కోట్ల రూపాయల మేర రుణమాఫీ ఇప్పటి వరకు జరిగింది. అలాగే రుణమాఫీ కానీ వారికి కూడా త్వరలో వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దసరా కానుకగా రైతులు పండించే వరి ధాన్యానికి రూ. 500 బోనస్, అదేవిధంగా దసరా నాడు రైతులకు రైతు భరోసా ఇవ్వనున్న సీఎం రేవంత్ రెడ్డి. రైతు బిడ్డగా రైతు కష్టం తెలిసిన ముఖ్య మంత్రిగా రైతులు అప్పులో పుట్టి అప్పులతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి సుమారు రాష్ట్రవ్యాప్తంగా 39 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకోవడం జరిగింది. కానీ ప్రతిపక్షాలు అవాక్కులు చేవాక్కులు పేలుతూ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు దీనిని రాష్ట్ర ప్రజానికం చూస్తున్నారు ప్రజలు రెండు సార్లు కర్రు కాల్చి వాత పెట్టిన కూడా బుద్ధి లేకుండా ఫామ్ హౌస్ లో కూర్చొని రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో కూర్చొని విమర్శలు చేస్తూ, మాజీ మంత్రి ట్విట్టర్ టిల్లు సోషల్ మీడియా వేదికల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు కానీ మన ప్రజా ప్రభుత్వం లో మన సిఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎల్లప్పుడూ అందుబాటు ఉంటూ ప్రజా సమస్యల మీద సమయం కల్పిస్తూ వాటిని పరిష్కరిస్తున్న వ్యక్తి మన సీఎం. ప్రజల కోసమే ప్రజల వద్దకు ప్రజాపాలన తీసుకువచ్చిన ఒక గొప్ప వ్యక్తి మన సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో తెలంగాణ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావు, పాక్స్ చైర్మన్ మెరుగు రాజేష్ గౌడ్, పాక్స్ డైరెక్టర్, రైతులు, అధికారులు, డివిజన్ కార్పొరేటర్ లావుడ్య రవి నాయక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పింగిళ్లి వెంకట్ రెడ్డి, హాసన్ పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగేళ్లపల్లి తిరుపతి, 2 వ డివిజన్ అధ్యక్షుడు పొన్నాల రఘు, మాజీ ఫాక్స్ చైర్మన్ పొలం అనిల్ రెడ్డి, మాజీ గ్రంథాలయ డైరెక్టర్ సముద్రాల మధు, గ్రామ పార్టీ అధ్యక్షుడు నలుబోలు రవీందర్, రిజిస్టార్ జగన్ మోహన్ రావు, డిసివో, ఏవో, మార్క్ఫెడ్ డిఈ, అగ్రికల్చర్ ఏడి, అధికారులు రైతులు మహిళా నాయకురాలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ఉర్సు దసరా ఉత్సవ కమిటీ సర్వసభ్య సమావేశం

నేటిధాత్రి, వరంగల్ తూర్పు

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఉర్సు గుట్ట, రంగలీల మైదానం కరీమాబాదులో “దసరా ఉత్సవ కమిటీ” ప్రతిఏటా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా 2024 దసరా ఉత్సవాల గురించి సోమవారం నాడు దసరా ఉత్సవ కమిటీ సర్వసభ్య సమావేశం కమిటీ అధ్యక్షులు నాగపురి సంజయ్ బాబు అధ్యక్షతన కరీమాబాదు లోని ఆదర్శ ట్రస్ట్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిటీ అధ్యక్షులు నాగపురి సంజయ్ బాబు మాట్లాడుతూ, గత ఏడాది సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలకు ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకున్నా, దాతల సహకారంతో దసరా ఉత్సవ కమిటీనే సొంత ఖర్చులతో నిర్వహించింది అని తెలిపారు. ఈ యేడాది నిర్వహించే ఉత్సవాలకు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ మురళీధర్ రావుల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దసరా ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి మేడిది మధుసూదన్, కోశాధికారి మండ వెంకన్న గౌడ్, సహాయ కోశాధికారి శివమూర్తి, ట్రస్ట్ చైర్మన్ వంగరి కోటేశ్వర్, ఉపాధ్యక్షులు గోనె రాంప్రసాద్, నాగపురి రంజిత్ గౌడ్, పొగాకు సందీప్, సహాయ కార్యదర్శులు సుంకరి సంజీవ్, పూజారి అజయ్, బొల్లం రాజు, కార్యదర్శులు నాగపురి మహేష్, కత్తెరసాల వేణు, వడ్నాల శ్రీను, నరిగే శీను, సభ్యులు బిట్ల క్రాంతి, గట్టు రమేష్, బత్తిని రవిచంద్ర, నాగపురి నాగరాజు, పార్వతీ కృష్ణంరాజు, వంశీ, వినయ్, రాజశేఖర్, బైరగోని మనోహర్, శ్రీరాముల చరన్, ఎలగందుల కృష్ణమూర్తి, గట్టు బాలసాయి, మహేష్ లు పాల్గొన్నారు.

రాజకీయాల మీద ఉన్న ధ్యాస ప్రాజెక్టులపై లేదు

బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు మానుకోవాలి
మాజీ ఎంపీ వినోద్ కుమార్
జమ్మికుంట: నేటి ధాత్రి
రాజకీయాలపై ఉన్న ధ్యాస కాలేశ్వరం ప్రాజెక్టుపై లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులపై అసత్య ప్రచారాలు మానుకోవాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయలు గోదావరిలో కలిసాయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు విమర్శించడం సరైనది కాదన్నారు. మూడు బ్యారేజీల ఖర్చు 94 58.91 కోట్ల రూపాయలని, కాలేశ్వరం ప్రాజెక్టు లోని మిగతా బ్యారేజ్ లకు లిఫ్టులకు టన్నెల్స్ కు కోసం ఖర్చయిందని అన్నారు. ఖాళీ విషయం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, 1964 ఎస్సారెస్పీ ప్రాజెక్టు తర్వాత కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్క ప్రాజెక్టు కట్టలేదన్నారు. కెసిఆర్ వచ్చిన తర్వాత కాలేశ్వరం దేవాదులతోపాటు ఎన్నో ప్రాజెక్టులు కట్టడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం దోసెడు నీళ్ల గురించి ఆలోచిస్తే కెసిఆర్ బిందెడు నీళ్ల కోసం ఆలోచించి పనులు చేశారని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ లో పిల్లర్లు రిపేర్ చేయాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఏ ఒక్క కాంగ్రెస్ బిజెపి ఎంపీలు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కాలేశ్వరం ప్రాజెక్టు ఉచిత విద్యుత్ తో నడుస్తుందని, సోలార్ పవర్ తో ఇరిగేషన్ స్టార్ట్ అవుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ దళిత బంధు ఎన్నికల తర్వాత ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని, రైతుబంధును ఇప్పటికీ రైతుల ఖాతాలో ఎందుకు జమ చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ 31 వేల కోట్లు చేయాల్సి ఉండగా కేవలం 17 ,934 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని అన్నారు. 47 లక్షల మందికి రుణమాఫీ కావలసి ఉండగా కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని అది పూర్తిస్థాయిలో చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్లు తక్కెళ్ళపల్లి రాజేశ్వరరావు,, గందె రాధిక శ్రీనివాస్ ,మాజీ ఎంపీపీ లు రాణి సురేందర్ రెడ్డి ,మూసి పట్ల రేణుక తిరుపతిరెడ్డి పావని వెంకటేష్ పిఎసిఎస్ చైర్మన్ పొన్నగంటి సంపత్, టంగుటూరి రాజకుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

సెప్టెంబర్ 27 చలో కలెక్టరేట్ ను విజయవంతం చేయండి
జమ్మికుంట: నేటి ధాత్రి
రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, సెప్టెంబర్ 27న నిర్వహించే చలో కలెక్టరేట్ విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్ అన్నారు.వీణవంక మండల కేంద్రంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 85% ప్రయాణీకులు మరియు 66% వస్తువులు కేవలం రోడ్డు రవాణా ద్వారానే రవాణా చేయబడుతున్నాయి. కానీ కార్మికులకు చట్టపరమైన రక్షణ లేదా ఉద్యోగ భద్రత లేదు. పనిలో భాగంగా రోడ్లపైనే ఉంటూ వృద్ధాప్యానికి చేరుకున్న కార్మికులకు కేరళలో తప్ప మరెక్కడా సామాజిక, ఆర్థిక భద్రత లేదు. కేరళలో మోటార్ కార్మికుల కోసం సంక్షేమ నిధి బోర్డు ఏర్పాటు చేయబడింది. ఈ తరుణంలో జాతీయ స్థాయిలో అసంఘటిత రోడ్డు రవాణా కార్మికుల కోసం సామాజిక భద్రతా పథకాన్ని అమలు చేయడం భారత ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నిర్ణయాల వల్ల గతంలో ఆటోలలో ప్రయాణించే వారి సంఖ్య పూర్తిగా పడిపోయింది. ఫలితంగా ఆటో డ్రైవర్లకు పూట గడవడం కష్టంగా మారింది. విద్యాధికులై ఉండి ఉద్యోగం దొరక్క స్వయం ఉపాధి క్రింది ఆటో డ్రైవర్లుగా పని చేసుకుంటున్న వారు ఇప్పుడు తీవ్రంగా నష్టపోతున్నారు . అందుకని మహిళల ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో, టాటా ఏసీ, క్యాబ్ డ్రైవర్లకు గీత, నేత, బీడీ కార్మికులకిస్తున్న తరహాలో నెలకు రూ.4,500/- జీవనభృతి ఇవ్వాలని కోరుతున్నాము అని అన్నారు . ఈ కార్యక్రమంలో , మండల కన్వీనర్ పిల్లి రవి యాదవ్, రవాణ రంగా అధ్యక్ష కార్యదర్శులు పున్నం రవి , చెలికని శ్రీనివాస్ , వాసుదేవ రెడ్డి , దాసారపు వెంకటేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు .

జాతీయ సేవ పథకం ఫై అవగాహనా సదస్సు

నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో జాతీయ సేవ పథకంపై అవగాహనా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ మాట్లాడుతూ కళాశాలలో రెండు ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఉన్నాయని విద్యార్థులు ఈ జాతీయ సేవ పథకంలో నమోదు చేసుకోవాలని తెలిపారు.ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం ద్వారా వాలంటీర్లు క్రమశిక్షణ,న్యాయకత్వ లక్షణాలు పెంచుకొని సామజికసేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కళాశాల యన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు,డాక్టర్ ఎం.రాంబాబు,డాక్టర్.డి.సంధ్యలు జాతీయ సేవ పధకం యొక్క చారిత్రక నేపథ్యం అలాగే దాని యొక్క ప్రాధాన్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ భైరి సత్యనారాయణ,అకడమిక్ కో-ఆర్డినేటర్ డాక్టర్.కందాల సత్యనారాయణ,స్టాఫ్ సెకట్రరీ డాక్టర్.ఎం సోమయ్య మరియు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్.కమలాకర్,అధ్యాపకులు ఎం.ఎం.కే.రహిముదిన్,డాక్టర్.భద్రు భూక్య,డాక్టర్.జె.రాజీరు,ఎస్.రజిత,ఆర్.రుద్రాణి,డాక్టర్.బి.గాయత్రి,బి.వీరన్న,బి.గ్లోరి,ఆర్.మాధవి,నిజాము,డాక్టర్. భార్గవి,రాకేష్,లక్ష్మి,జి.అనిత, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

రేగొండ మండలం,పోచంపల్లి గ్రామ వాస్తవ్యులు కీ.శే పాడి మల్లారెడ్డి దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్ని,వారి చిత్రపట్టం వద్ద నివాళులర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియచేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
ఈ కార్యక్రమంలో రేగొండ మండల పార్టీ ప్రెసిడెంట్ అంకం రాజేందర్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ పాపిరెడ్డి,భూపాలపల్లి పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి,పోచంపల్లి మాజీ సర్పంచ్ నల్ల భాస్కర్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షుడు మహేందర్, యూత్ అధ్యక్షుడు రాజేందర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మహిళా హక్కుల రక్షణకు పోరాటాలే శరణ్యం

# ఏఐఎఫ్ డిడబ్ల్యు జిల్లా విస్తృత సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగల రాగసుధ.

నర్సంపేట,నేటిధాత్రి :

మహిళలను పట్టిపీడుస్తున్న సమస్యల పరిష్కారానికి మహిళా హక్కుల రక్షణకు పోరాటాలే ఏకైక పరిష్కారమని ఆ దిశలో మహిళా ఉద్యమాలను క్షేత్రస్థాయిలో చేపట్టాలని ఏఐఎఫ్ డిడబ్ల్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగల రాగసుధ పిలుపునిచ్చారు.సోమవారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య జిల్లా విస్తృత సమావేశం గటికె మమత, తుత్తరు రాజక్కల అధ్యక్షతన నర్సంపేటలోని ఓంకార్ భవన్ లో జరిగింది.ముఖ్యఅతిథిగా హాజరైన వంగల రాగసుధ మాట్లాడుతూ మానవజాతి సృష్టికి మూలమైన మహిళలను సామాజికంగా,ఆర్థికంగా ఎదగనీయకుండా అణిచివేస్తున్న పురుషాధిక్య సమాజంలో మహిళ హక్కులను కాలరాస్తూ,పాలన కొనసాగిస్తున్న ప్రభుత్వాలను నిలదీసే విధంగా సమాజంలో సగభాగమైన మహిళా లోకం ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ క్రమంలో అన్ని రంగాలలో 50 శాతం మహిళ రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మనువాద పాలకులు మహిళలను వంటింటి కుందేలుగా అంగట్లో సరుకులుగా చిత్రీకరించి స్వేచ్ఛ సమానత్వం లేకుండా మూఢత్వంలోకి నెట్టివేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో దేశంలో పెరిగిపోతున్న లైంగిక దాడులు, హత్యలు,ఆడవాళ్లకు పెనుసవాలుగా మారాయని మహిళలు తమను తాము రక్షించుకునే విధంగా ధైర్యంగా ముందుకు సాగే ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలని అందులో భాగంగానే ఏఐఎఫ్ డిడబ్ల్యు క్షేత్రస్థాయిలో మహిళలను చైతన్య పరుస్తుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.లేకపోతే మహిళ ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.ఈ సమావేశంలో రైతు, వ్యవసాయ,కార్మిక,ప్రజానాట్యమండలి,విద్యార్థి సంఘాల రాష్ట్ర, జిల్లా బాధ్యులు పెద్దారపు రమేష్,గోనె కుమారస్వామి,నర్రా ప్రతాప్,కన్నం వెంకన్న,కొత్తకొండ రాజమౌళి,మార్త నాగరాజు,మహిళా సంఘం జిల్లా నాయకులు గటిక జమున, పేరబోయిన రమ,మంద మల్లికాంబ, మార్త సుధ,జన్ను జమున, గడ్డం స్వరూప,చొప్పరి పద్మ, పెండ్యాల లలిత, మామిండ్ల వీరలక్ష్మి, ఈక యమున, గణిపాక బిందు, ఈసంపెళ్లి గీత, తదితరులు పాల్గొన్నారు.

ఆవాల మణెమ్మ కుటుంబ సభ్యులు పర్మర్శించిన స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

వీణవంక, ( కరీంనగర్ జిల్లా),

నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని కొండపాక, హిమ్మత్ నగర్ గ్రామాల మాజీ ఎంపిటిసి సభ్యురాలు ఆవాల మణెమ్మ పరమపదించిన సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులను స్థానిక శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట మాజీ శాసనమండలి సభ్యులు నారదాసు లక్ష్మణరావు, మాజీ రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ,బండ శ్రీనివాస్ లు ఎమ్మెల్యే తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సేవలను గుర్తు చేసుకుంటూ, ఆమె భౌతికకాయాన్ని వైద్య కళాశాలకు ఇవ్వడాన్ని కుటుంబ సభ్యులను అభినందించారు. సమాజంలో ఇలాంటి ఘటనలు చాల అరుదుగా ఉంటాయన్నారు. ఈ ప్రాంతంలో నూతన ఉరువడిని ప్రారంభించారన్నారు .ఎమ్మెల్యే వెంట వీణవంక మండల మాజీ ఎంపిపి ముసుపట్ల రేణుక తిరుపతిరెడ్డి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ,మాజీ చైర్మన్ పోడేటి రామస్వామి ,మాజీ ఎంపీపీ చుక్క రంజిత్, తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సామ్రాజ్యం యువజన నాయకులు జెకె ,అఖిల్ నాగిడి మధుసూదన్ రెడ్డి, కాసర్ల సుధాకర్, భరత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 26న జిల్లా వర్క్ షాప్ ను జయప్రదం చేయండి

సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్

భూపాలపల్లి నేటిధాత్రి

ఈనెల 26న జిల్లా వర్క్ షాప్ ను జయప్రదం చేయండి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ భూపాలపల్లి జిల్లాలో సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ పార్టీ పార్టీ నిర్మాణం ప్రజాసంఘాల నిర్మాణం కై వర్క్ షాప్ జరుగుతా ఉంది ఈ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కేంద్ర కమిటీ సభ్యులు నైనాలశెట్టి మూర్తి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిళ్ళ రమేష్ రాజు హాజరవుతున్నారు ఈ వర్క్ షాప్ ను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను… ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఐసా.జిల్లా కార్యదర్శి శీలపాక నరేష్ వంశి రమేష్ పాల్గొన్నారు

మెగా లోక్ అదాలత్ రణం కంటే రాజీ నయం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలోఈ నెల 28 వ తేదీన నిర్వహించే మెగాలోక్ అదాలత్ విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మొగుళ్ళపల్లి మండల పారా లీగల్ వాలంటీర్ మంగళపల్లి శ్రీనివాస్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రజలను ఉద్దేంచి మాట్లాడుతూ రాజీ పడదగిన కేసులు,సివిల్ మరియు క్రిమినల్ కేసులు మరియు ఎక్సైజ్,భార్య భర్తల కేసులు యాక్సిడెంట్ కేసుల్లో లోక్ అదాలత్ ద్వారా కాలయాపన కాకుండా సత్వర న్యాయం అందించడం జరుగుతుందని, ప్రజల అందరు ద్వేష భావాలను తగ్గించుకుని, కేసుల్లో రాజీ మార్గాన్ని ఎంచుకోవాలని, రణం కంటే రాజీనయం అని తద్వారా విలువైన సమయం, డబ్బు ఆదా అవుతుందని అన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వాడుకుని పెద్ద సంఖ్యలో కేసులు రాజీ చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలోమొగుళ్ళపల్లి మండలంలోని ప్రజలు పాల్గొన్నారు…

నిరుపేదకు కుట్టు మిషన్ అందజేత

గంగాధర నేటిదాత్రి :

లయన్స్ క్లబ్ ఆఫ్ గర్శకుర్తి అధ్యక్షులు లయన్ మిట్టపెల్లి రాజశేఖర్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి చెందిన దాసరి వైష్ణవి తండ్రి రమేశ్ గారికి జీవనోపాధి నిమిత్తం కుట్టు మిషన్ అందించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో జిల్లా జి.ఎల్.టి.కో-ఆర్డినేటర్ లయన్ మిట్టపెల్లి ప్రవీణ్ కుమార్,జోనల్ చైర్ పర్సన్ లయన్ గుర్రం బాపురెడ్డి,ప్రధాన కార్యదర్శి లయన్ అన్నల్దాసు శ్రీనివాస్,కోశాధికారి లయన్ కముటం అనిల్, ఉపాధ్యక్షులు లయన్ కొలిపాక రమేశ్,ప్రోగ్రాం కన్వీనర్ లయన్ కొండవేని మల్లిఖార్జన్,లయన్ రేణికుంట రమేశ్, లయన్ ద్యావణపెల్లి అరవిందస్వామిపాల్గొన్నారు.

పోగొట్టుకున్న ఫోన్ ను అందజేసిన పోలీసులు

గంగాధర నేటిదాత్రి :*

గంగాధర మండల కేంద్రానికి చెందిన మల్యాల రాజేందర్ అనే యువకుడు ఈనెల 18వ తేదీన తన వివో v23 ఫోను పోగొట్టుకుని గంగాధర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు www.ceir.gov.in ఆన్లైన్ పోర్టల్ లో వివరాలు నమోదు చేసి విచారణ చేశారు. ఫోన్ దొరికిన వ్యక్తి తన సిమ్ కార్డును ఫోన్ లో వేయగా సమాచారం గంగాధర పోలీస్ స్టేషన్ కు చేరింది. దీంతో ఫోన్ దొరికిన వ్యక్తి నుండి స్వాధీనం చేసుకొని సోమవారం గంగాధర పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ నరేందర్ రెడ్డి రాజేందర్ కు అందజేశారు. అందజేసిన ఎస్ఐకి రాజేందర్ కృతజ్ఞతలు తెలిపాడు.

బెల్ట్ షాపులపై నిఘా ఉంచాం: చండూరు ఎస్సై వెంకన్న

నల్గొండజిల్లా, నేటిధాత్రి :
చండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలలో బెల్టు షాపులపై నిఘా ఉంచినట్లు దాడులు జరిపి కేసులు విధిస్తామని చండూరు ఎస్సైవెంకన్న అన్నారు.సోమవారంఓ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,చండూరు మండల వ్యాప్తంగా గ్రామాలలో బెల్ట్ షాపులు జోరుగా కొనసాగుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, ఇకనైనా గ్రామాలలో బెల్టు షాపుల నిర్వాహకులు జాగ్రత్త వహించి, ఇకనైనా మానుకోవాలనిలేనిపక్షంలోఎక్సైజ్ అధికారులతో కలిసి దాడులు జరిపి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామనివారు ఈ సందర్భంగా తెలియజేశారు.అంతేకాకుండాదేవాలయాల సమీపంలో, పాఠశాలల సమీపంలో సైతం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. దాడులు జరిపే క్రమంలో బెల్ట్ షాపుల్లో దొరికిన మద్యం సీసాల పై స్టిక్కర్ల ఆధారంగా వారికి విక్రయించిన వైన్స్ యజమానులపై కేసులు నమోదు చేస్తామని వారు అన్నారు.

కార్మిక చట్టాలను రక్షించుకుందాం.

నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా పోరాడుదాం.

సిఐటియు జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి.

కాశిబుగ్గ నేటిధాత్రి.

కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు అవలంబిస్తున్న దానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 23న బ్లాక్ డే కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది.అందులో భాగంగా సిఐటియు వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీమాబాద్ ప్రాంతంలోని ఎస్ఆర్ఆర్ తోట ఎస్బిఐ బ్యాంకు వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డ్స్ పట్టుకొని బిజెపి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 2019 సంవత్సరంలో వేతనాల కోడ్ ను,2020లో ఐ ఆర్ కోడ్ ను ఓ ఎన్ హెచ్ కోడ్ ను,సామాజిక భద్రత కోడ్ మొత్తము నాలుగు లేబర్ కోడ్ లను బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ లో ఆమోదించిందన్నారు. అంతకుముందు కార్మికులకు ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దుచేసి,వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ,విదేశీ,స్వదేశీ పెట్టుబడుదారులకు, యాజమాన్లకు అనుకూలంగా చట్టాలను కట్టబెట్టే ప్రయత్నం కొనసాగుతుందన్నారు. తద్వారా కార్మిక వర్గానికి తీరని నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ప్రజాస్వామ్య బద్దంగా చర్చలు జరపకుండా యాజమాన్యాల కు కొమ్ముకాస్తు గత నాలుగు సంవత్సరాలుగా ఈ లేబర్ కోడ్లను రద్దు చేస్తూ, రెండుసార్లు దేశవ్యాప్త సమ్మెలు జరిగిన,సమరశీల ఉద్యమాలు జరిగిన కూడా బిజెపి ప్రభుత్వం కార్మికుల ప్రాణాలు,పోరాటాలను లెక్కచేయకుండా 2024 పార్లమెంట్లో ఎన్నికల సందర్భంలోనూ,వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా రద్దు చేయాలని వ్యతిరేకించినప్పటికీ కూడా బిజెపి పార్టీ కార్మిక వర్గానికి ద్రోహం చేయడానికి నిశ్చయించుకుందని ఆయన అన్నారు. దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ లేబర్ కోడ్లను అమలు చేసేందుకు రూల్స్ తీసుకొచ్చిందని,కొన్ని రాష్ట్రాల్లో అమలు చేయడం కోసం ప్రయత్నం కొనసాగుతుందని అన్నారు. కార్మిక వర్గం హక్కులను ఉరితాల్లుగా మార్చే విధంగా బిజెపి ప్రభుత్వం కొనసాగించే దశలో ఉందని అన్నారు. మారిన లేబర్ కోడ్ లను దేశవ్యాప్తంగా కార్మిక వర్గం రైతాంగం వ్యతిరేకిస్తూ 2024 సెప్టెంబర్ 23 న బ్లాక్ డే పాటించాలని కేంద్ర,కార్మిక సంఘాలు నిర్ణయించాలని, అందులో భాగంగానే ఈరోజు ఈ ప్రాంతంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగిందని అన్నారు. అందుకోసమే మహిళా కార్మికులు హక్కులు, ఆరోగ్యం, సంక్షేమం,తదితర అనేక ప్రాథమిక హక్కులను భంగం కలిగించే ఈ లేబర్ కోడ్ లను నిరసిస్తూ కార్మికులు వేలాది మంది పాల్గొని వీటికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని అన్నారు.
కార్మికులు హక్కుల కోసం 8 గంటల పని దినాల కోసం ప్రాణ త్యాగాలు చేసి, పోరాటాలు చేసి,హక్కులను సాధించుకుంటే ఈరోజు బిజెపి వాటిని కాలరాసి కార్మికుల పొట్టలు కొట్టే విధంగా ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఒక పక్క భారతదేశంలో నిత్యవసరాల సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న వాటిని పట్టించుకోకుండా గాలికి వదిలేసి కార్మికులకు కనీస వేతనం పెంచకుండా ఇబ్బందుల పాలు చేసే ప్రయత్నం బిజెపి ప్రభుత్వం చేస్తుందని పేర్కొన్నారు.అందుకోసమే మనం బ్రతకడం కోసం కనీస వేతనాలు నెలకి 26 వేల రూపాయలు వేతనం కావాలనీ, కార్మిక హక్కులను రక్షించుకోవాలనీ,8 గంటల పని దినాలను అమలు చేసుకునేందుకు పెద్ద ఎత్తున బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

error: Content is protected !!
Exit mobile version