వరంగల్ కు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.

⏩వరంగల్ నగర అభివృద్ధిని విస్మరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

⏩అండర్ డ్రైనేజీ, అంతర్గత రోడ్లను పటిష్టంగా ఏర్పరచాలి.

⏩పేదల ఇండ్లను బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలి.

⏩నగరాభివృద్ధికి ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి.

ఎంసిపిఐ(యు) వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

కాశిబుగ్గ నేటిధాత్రి

వరంగల్ నగర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నాయని ఎంసిపియు(ఐ) వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.ఈ క్రమంలో జనాభా పరంగా దినదినాభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరం అనేక సమస్యలతో సతమతమవుతున్నదని, పాలకులు మారిన, ప్రజా సమస్యలు తగ్గడం లేదని ప్రజా పోరాటాలే సమస్యలకు పరిష్కారం చూపుతాయని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. సోమవారం భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) ఎంసిపిఐ(యు) వరంగల్ నగరంలోని కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోట ఏరియా జనరల్ బాడీ సమావేశం కామ్రేడ్ ఎగ్గెని మల్లికార్జున్ అధ్యక్షతన స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ అనేక త్యాగాలతో, ఆశలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో వరంగల్ నగర ప్రజలకు ఒరిగింది శూన్యమని, కేవలం ఎన్నికల హామీలతో ప్రజలను మభ్యపెడుతూ అధికారం చేపట్టాక కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు,గత ప్రభుత్వం లాగానే ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వరంగల్ నగర సమస్యలను విస్మరిస్తున్నారని అన్నారు.ఈ గ్రామంలో నగర ప్రజలు అంతర్గత రోడ్లు,అండర్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక అనేక అవస్థలు పడుతున్నారని దాంతోపాటు వేలాదిమంది పేదలు తలదాచుకోవడానికి తమ స్థాయిలో ఇల్లు నిర్మించుకుంటే వాటిని రెగ్యులైజ్ చేయకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మరోవైపు కనీసం ఇంటి స్థలాలు లేక, కిరాయిలు కట్టలేక అవస్థలు పడుతున్న ప్రజలకు ఇంటి స్థలాలు,ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పినా కూడా వాటిని ఆచరణలో అమలు చేయకపోవడం అన్యాయం అన్నారు. గత ఎన్నికల ముందు వరంగల్ నగరాన్ని తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత పెద్ద పట్టణంగా తీర్చిదిద్దుతామని గత కేసీఆర్ వలే హామీ ఇచ్చిన ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఎప్పటికైనా గత ప్రభుత్వానికి తగిలిన గుణపాటాన్ని గుర్తుతెచ్చుకొని ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి,వరంగల్ నగర ప్రజల సమస్యలను పరిష్కరించి, సమగ్ర అభివృద్ధి చేపట్టాలని డిమాండ్ చేశారు.లేకపోతే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
ఈ సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్, ఏరియా కార్యదర్శి ఐతం నాగేష్, జిల్లా కమిటీ సభ్యులు అప్పనపురి నరసయ్య,స్థానిక నాయకులు ఆడెపు శంకర్,మార్కండేయ, కృష్ణ, ఆడెపు గణేష్, కొమ్మినేని రాజేందర్, దార శివ, దొంతుల రాజేందర్, శివ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version