శోక సంద్రలో గొర్రెల కాపరులు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T120723.513.wav?_=1

 

శోక సంద్రలో గొర్రెల కాపరులు
* పిడుగుపాటుతో 94 గొర్రెలు మృతి
* వీదినపడ్డ గొర్రెల కాపరులు

 

 

 

మహదేవ్ పూర్ సెప్టెంబర్ 12 నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని అంబటిపల్లి, లెంకలగడ్డ గ్రామాల గోదావరి తీర ప్రాంతంలో పిడుగుపాటుతో 94 గొర్లు మృతి చెందాయని శుక్రవారం రోజున పశు వైద్యాధికారి రాజబాబు ఒక ప్రకటనలో తెలిపారు. గొర్రెల కాపరులు తెలిపిన వివరాల ప్రకారం అంబటి పెళ్లి, లింకలగడ్డ గోదారి తీర ప్రాంతంలో గొర్రెలను మేతకు తీసుకెళ్లి అక్కడే కంచ ఏర్పాటు చేసి ఉంచి రాత్రిపూట భోజనానికి ఇంటికి వచ్చి తిని వెళ్దామని సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వర్షం కురవడంతో అదే వర్షానికి పిడుగు పడి 94 గొర్లు మృతి చెందాయని, జీవనోపాధి కోల్పోయామని మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటూ కన్నీరు మున్నీ రౌతూ గొర్ల కాపర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న వైద్యాధికారులు తోటి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని వైద్య పరీక్షలు నిర్వహించి 94 గొర్రెలు మృతి చెందాయని వారి వివరాలు కాట్రేవుల ఆది 20 గొర్రెలు, కాట్రేవుల కత్తెరసాల 21 గొర్రెలు, కాట్రేవుల మల్లేషు 10 గొర్రెలు, పున్నమి చందర్ 15 గొర్రెలు, కాట్రేవుల శ్రీశైలం 11 గొర్రెలు, కాట్రేవుల కళ్యాణ్ 17 గొర్రెలు మృతి చెందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి రాజబాబు, అంబటి పెళ్లి పంచాయతీ కార్యదర్శి, పశు వైద్య సిబ్బంది, గొర్రెల కాపర్లు, ప్రజలు పాల్గొన్నారు.

వివాహ వేడుక లో పాల్గొన్న టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T120723.513.wav?_=2

 

 

వివాహ వేడుక లో పాల్గొన్న టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

హైదరాబాద్ బహదూర్పుర ఎక్స్ రోడ్లో సవేరా ఫంక్షన్ హాల్ లో ఎల్గోయి మతిన్ గారి మేనకోడలి వివాహ వేడుక లో పాల్గొని వరుణ్ కి శుభాకాంక్షలు తెలిపిన టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ గారు వారితోపాటు మాజీ సర్పంచ్ బాబు మియా బాబి ఖిజార్ ఖాన్ అంజద్ తదితరులు ఉన్నారు,

నిమ్జ్‌ ను పరిశీలించిన టీజీఐఐసీ ఎండీ

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T120135.650-1.wav?_=3

 

నిమ్జ్‌ ను పరిశీలించిన టీజీఐఐసీ ఎండీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్‌) ఏర్పాటు కోసం సేకరించిన భూమి చుట్టూ కంచెను ఏర్పాటు చేయాలని, పంటల అనంతరం స్వాధీనం చేసుకోవాలని, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ నిమ్జ్‌ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, సీఈవో మధుసూదన్, అదనపు కలెక్టర్ మాధురి లతో కలిసి నిమ్జ్‌ ప్రాంతానికి పరిశీలించారు. ఇప్పటివరకు ప్రభుత్వం సేకరించిన భూమి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు
2.369 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. 3.245 ఎకరాలలో రోడ్లు, సాగునీరు, విద్యుత్తు మౌలిక సదుపాయాలను ఏర్పాటు కృషి చేయాలి అన్నారు. రైతులకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించిన భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని అన్నారు. మౌలిక వసతుల కల్పన కోసం రోడ్లు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వారి వెంట టీజీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.

ఆశపడే…మళ్లా గోసపడే!

-మంది మాటలు నమ్మితె..ఎనుకటి కాలం ముందటికొచ్చే!

-రైతు బంధు కేసిఆర్‌ ఇంట్లకేలి ఇస్తుండా అంటే నమ్మితిరి!

-పదికి ఐదు కలిపి ఇస్తామంటే గంతేస్తిరి

-కాళేశ్వరం కేసిఆర్‌ జేబుల పైసలా అంటే జేజేలు కొడితిరి

-యాభై ఏండ్లలో నీళ్లియ్యనోళ్లను నమ్మితిరి
అబద్దాలు చెప్పీ, చెప్పి ప్రజలను కాంగ్రెస్‌ నాయకులు నమ్మించి, వంచించారు. సంతోషంగా కేసిఆర్‌ పాలనలో కడుపు చల్లగా బతుకిన, రైతుల నోట్లో కాంగ్రెస్‌ పాలకులు మట్టికొడుతున్నారు. నీళ్లియ్యలేరు. కరంటు ఇయ్యలేరు. ఎరువులియ్యలేరు. వడ్లు కొనలేరు. రైతును బతకనీయరు. యాభై ఏండ్లు పుచ్చుకున్న గోస చాలదని, అధికారంలోకి వచ్చి రైతులను అరిగోస పెడుతున్నరు. తెలంగాణ ప్రజలు, రైతులు ఇంక జన్మల కాంగ్రెస్‌ ను నమ్మరు. కాంగ్రెస్‌ నాయకులు కూడా ప్రజల్లోకి రావాలంటే సిగ్గు పడుతున్నరు. భయపడుతున్నరు. అంటున్న మాజీ ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు చల్లా ధర్మారెడ్డి, ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు’’ తో చెప్పిన విషయాలు.. ఆయన మాటల్లోనే…

-పదేళ్లలో అరవై ఏళ్ల గోస తీర్చినా కేసిఆర్‌ ను ఒద్దనుకుంటిరి

-ఆరునెలలల్ల ఇరవై నాలుగు గంటల కరంటిచ్చిడు గొప్పేనా అంటే ఓట్లేస్తిరి

-అవద్దాలు చెప్పినోళ్ల మాటింటిరి

-కండ్ల ముందుకు కష్టం రాకుంట సూశిన కేసిఆర్‌ ను దింపితిరి

-కోరికోరి కొరివితో తలగోక్కుంటిరి

-ఎండిపోయిన బావుల్ల నీళ్లొచ్చినా మర్చిపోతిరి

-బతకపోయి, మళ్లోచ్చి బతుకు బంగారమైనా నియ్యత్‌ తప్పితిరి

-మోసం చేసినోళ్లనే నమ్మితిరి..నరకం సూడవడితిరి

-తీరిన గోస తిరిగొచ్చే..

-ఎరువు కరువు మళ్లోచ్చే…

-చెప్పుల లైన్లు మళ్ల కనిపించే..

-బస్తా కోసం కొట్టుకోవాల్సి రావట్టే..

-ఎరువు లేక పంట ఏడ్వవట్టే..

-పంట చేతికెలా వస్తుందని రైతు కంటతడిపెట్టే

-కాలమైనా నీళ్లు లేవాయే..

-కాళేశ్వరం నీళ్లు ఉత్తగ పోవట్టే

-నమ్మితే బతుకులు ఆగంకావట్టే!

అబద్దాలు చెప్పి చెప్పి ప్రజలను కాంగ్రెస్‌ నాయకులు నమ్మించి వంచించారు. సంతోషంగా కేసిఆర్‌ పాలనలో కడుపు చల్లగా బతికిన రైతుల నోట్లో కాంగ్రెస్‌ పాలకులు మట్టి కొడుతున్నారు. నీళ్లియ్యలేరు. కరంటియ్యలేరు. ఎరువులియ్యలేరు. పూర్తి స్ధాయిలో వడ్లు కొనలేరు. రైతును బతకనీయలేరు. యాభై ఏండ్లు పుచ్చుకున్న గోస చాలలేదని తెలంగాణ ప్రజలను నమ్మించి, అలవి కాని హమీలిచ్చి, ఒక్క అవకాశమివ్వండని కోరి అధికారంలోకి వచ్చి మళ్లీ ప్రజలను రాచి రంపాన పెడుతున్నారు. పాలన చేతగా రైతులను అరి గోసకు గురి చేస్తున్నారు. కనీసం ఎరువులు కూడా సకాలంలో సరఫరా చేసేదిక్కులేదు. మరో వైపు అన్ని వర్గాలను అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఇంక జన్మలో ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరు. కాంగ్రెస్‌ నాయకులు ప్రజల్లోకి రావాలంటే కూడా జంకుతున్నారు. భయపడుతున్నారు. ప్రజలకు ముఖం చూపడం లేదు. పల్లెల్లోకి వస్తే ప్రజలే కాంగ్రెస్‌ నాయకులను తన్ని తరమిస్తారని భయపడుతున్నారంటునన్న మాజీ ఎమ్మెల్యే , బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు చల్లా దర్మారెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే….
చరిత్రలో ప్రజలను మోసూం చేసిన పాలకులు వున్నారు. ప్రభుత్వాలున్నాయి. ప్రజలకు ఇచ్చిన హమీలను తుంగలో తొక్కిన పాలకులున్నారు. ఇచ్చిన హమీలను కనీసం గుర్తు చేయలేకుండా పాలించిన వారున్నారు. ఏం హమీలిచ్చారో కూడా తెలియని పాలకులున్నారు. ప్రజలను మోసం చేసిన, అదికారం కోసం అలవి కాని హమీలు ఇచ్చిన పాలకులను చూస్తున్నాం. కాని ప్రజలు ఒక నాయకుడిని మోసం చేసిన సందర్భం కూడా తెలంగాణలో చూశాం. అరవై సంవత్సరాలుగా ప్రజలు అనుభవిస్తున్న గోసను చూడలేక, ప్రత్యేక రాష్ట్రం సాధన తప్ప తెలంగాణ ప్రజలకు విముక్తి లేదని జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు కేసిఆర్‌. పద్నాలుగు సంవత్సరాల పాటు సుధీర్ఘమైన అలుపెరగని పోరాటం చేసి, కేందర్ర మెడలు వంచి తెలంగాణను సాధించిన ధీరుడు కేసిఆర్‌. తెలంగాణ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తెలంగాణను ఎలా అభివృద్ది చేసుకోవాలో కూడా ఉద్యమ కాలం నాడే బ్లూ ప్రింట్‌ తయారు చేసిన ఉద్యమ కారుడు కేసిఆర్‌. తెలంగాణ తెచ్చి తెలంగాణను ఎలా ముందుకు తీసుకెళ్లాలో రూపొంచిందించిన బ్లూ ప్రింట్‌ను పదేళ్ల కాలంలో అమలు చేసి బంగారుతెలంగాణను తయారు చేసిన పాలకుడు కేసిఆర్‌. దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఒక రాష్ట్రాన్ని ఇంత వేగంగా అభివృద్ది చేసిన పాలకుడు ప్రపంచంలో ఒక్క కేసిఆర్‌ తప్ప మరొకరు లేరు. ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా వున్న తెలంగాణను బాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఎస్‌ఆర్‌సీ స్టేట్‌ రీ ఆర్గనైజేషన్‌ కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల జీవితాలను ఆగం చేసిన పార్టీ కాంగ్రెస్‌పార్టీ. తెలుగు మాట్లాడే ప్రాంతమంతా కలుపుతున్నామని చెప్పి, బాష ఒకటైనా యాసలో, వేషదారణలో, సంస్కృతీ సంప్రదాయాలలో ఏ మాత్రం సంబంధం లేని రెండు ప్రాంతాలను కలిపి 1956లో కాంగ్రెస్‌ పార్టీ దిద్దుకోలేని తప్పు చేసింది. తెలంగాణ పాలిట మరణ శాసనం రాసింది. అలా 1956లో మొదలైన గోస తెలంగాణ ప్రజలు 2014 వరకు అనుభవించారు. అరిగోస పడ్డారు. ఆకలికి ఏడ్చారు. బతుకు దెరువుకు ఏడ్చారు. ఆత్మగౌరవం కోసం తపించారు. ఆత్మాభిమానం లేకుండా ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ పౌరులుగా బతికారు. బతకలేక వలసలు పోయారు. వున్న ఊరును,కన్నతల్లిని వదిలి పొట్ట చేత పట్టుకొని పొరుగు రాష్ట్రాలకు వెళ్లారు. ఇలా బతుదెరువు కోసం వలసలు వెళ్లారు. తెలంగాణను అన్ని రంగాల్లో ఉమ్మడి పాలకులు నిర్లక్ష్యం చేశారు. అభివృద్దిని అలక్ష్యం చేశారు. తెలంగాణ ప్రగతిని పక్కన పెట్టారు. తెలంగాణ అంటేనే ఉమ్మడి పాలకులు మండిపడ్డారు. తెలంగాణకు సాగు నీరివ్వలేదు. సరిగ్గా కరంటు ఇవ్వలేదు. సాగుకు ఇచ్చే కరంటు చార్జీలు విపరీతంగా పెంచారు. రైతులు బోర్లు వేసుకునేందుకు అవకాశమివ్వలేదు. వాల్టా చట్టం తెచ్చి రైతులపై కేసులు నమోదు చేశారు. జైలు పాలు చేశారు. తెలంగాణ రైతాంగాన్ని ఎంత హింసించాలో అంత హింసించారు. మొత్తంగా తెలంగాణలో సాగు లేకుండా చేశారు. సాగు పడావు పడేలా చేశారు. తెలంగాణ భూముల్లో తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేశారు. తెలంగాణ ప్రజలకు తెలివి లేదన్నారు. పాలించడం చేత కదన్నారు. నాయకత్వ లక్షణాలు లేవన్నారు. ఉమ్మడి పాలకుల చెప్పినట్లు వినే ఉత్సవిగ్రహాలు మార్చారు. తెలంగాణ అంటే వెనుబడిన ప్రాంతంగా మార్చారు. చెరువులు ద్వంసం చేశారు. ప్రాజెక్టులు కట్టలేదు. కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదు. నల్లగొండ లాంటి జిల్లాలో ఫ్లోరైడ్‌ మహమ్మారి వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే చూశారు. చిన్న వయసులోనే ప్రాణాలు పోతుంటే కనికరం చూపలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని చేశారు. అలాంటి తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన సాధించిన పోరాట యేధుడు కేసిఆర్‌. తెచ్చిన తెలంగాణలో బతుకు విలువ పెంచారు. తెలంగాణ బతుకు దేశానికే ఆదర్శం చేశారు. ఏ తెలంగాణలో అయితే తొండలు గుడ్లు కూడా పెట్టవని ఎగతాళి చేశారో అదే తెలంగాణలో బంగారు పంటలు పండేలా చేశారు. బంగారు తెలంగాణ తయారు చేశారు. సాగు, తాగు నీటి సమస్య తీర్చారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని సాగు అద్భుతాలు సృష్టించారు. కాళేశ్వరం లాంటి గొప్ప సాగునీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేశారు. ఐదేళ్లలో చింతలు లేని తెలంగాణ తయారు చేశారు. పదేళ్లలో బంగారు తెలంగాణ తయారుచేశారు. ఒకప్పుడు మెతుకు కోసం ఆరాటపడిన తెలంగాణను దేశానికి అన్న పూర్ణను చేశారు. చుక్క చుక్క ఒడిసిపట్టి తెలంగాణకు మళ్లించాడు. ఎండిన వాగులు పారించారు. ఎండా కాలంలో చెరువులు మత్తలు దుంకించాడు. ఎండిపోయిన బావును మళ్లీ కళకళలాడేలా చేశారు. ఇవన్నీ ప్రజలు కళ్లారా చూశారు. ఉమ్మడిరాష్ట్రంలో కాంగ్రెస్‌ దుష్ట రాక్షస పాలన చూశారు. తెలంగాణ తెచ్చిన కేసిఆర్‌ బంగారు పాలన చూశారు. ఒకప్పుడు చీకటి బతుకులు చూసిన తెలంగాణకు వెలుగులు తెచ్చిన కేసిఆర్‌ పాలన చూశారు. ఎకరాల కొద్ది భూములున్నా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేసిన రైతులున్నారు. ఆటోలు నడుపుకున్నారు. హోటళ్లలో సర్వర్లుగా పనిచేశారు. ఏ చేతితో బంగారు పంటలు పండిరచారో అదే చేతితో, రాళ్లు కొట్టారు. ఎంగిలి ప్లేట్లు కడిగారు. ఇలా తెలంగాణ రైతులు అనుభవించిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అవన్నీ మరిపించిన కేసిఆర్‌ పాలన చూశారు. కాలు మీద కాలేసుకొని సాగు చేసుకునేలా రైతుకు అన్ని సౌకర్యాలు కల్పించారు. పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇచ్చాడు. పండిన పంటలను కల్లం నుంచే నేరుగా కొనుగోలు చేశారు. రెండు మూడు రోజుల్లో రైతుల అక్కౌంట్లలో డబ్బులు పడేలా చేశారు. ఇన్ని చేసిన కేసిఆర్‌ను కాదుకొని కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించుకున్నారు. కేసిఆర్‌ పాలనలో చీకు చింత లేని జీవితాలు అనుభవించారు. కాంగ్రెస్‌ను గెలిపించుకొని మళ్లీ చింతలు కొని తెచ్చుకున్నారు. విద్య, వైద్యం లేకుండా చేశారు. ఏ ప్రజలు పాలించమని నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే ఆ ప్రజలనే ఇబ్బందుల పాలు చేయడం కాంగ్రెస్‌ పార్టీకి అనాదిగా అలవాటే. కేసిఆర్‌ రైతు బంధు ఇస్తే ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నారా? మేం అదికారంలోకి వస్తే ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని ప్రజలను నమ్మించారు. ఏమైంది? ఆనాడు కేసిఆర్‌ చెప్పినట్లే రైతు బంధుకు రాం..రాం అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజల మేలు కోరి కేసిఆర్‌ ఎన్నో సార్లు చెప్పారు. నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. కాంగ్రెస్‌ వస్తే కష్టాలు వస్తాయన్నారు. కరంటు కటకట మొదలౌతుందని కేసిఆర్‌ చెప్పి చూశారు. కాని కాంగ్రెస్‌ మాటలు ప్రజలు నమ్మారు. ఇప్పుడు బాధపడుతున్నారు. కాంగ్రెస్‌ను నమ్మితే ఆగం చేస్తుందని కేసిఆర్‌ ఎంత మొత్తుకున్నా ప్రజలు వినలేదు. అలా ప్రజలను మాయ చేసిన కాంగ్రెస్‌ నాయకులు అధికారం తప్ప ప్రజా సేవను గాలికి వదిలేశారు. కాంగ్రెస్‌ పాలన అంటేనే రాక్షస రాజ్యమని మరోసారి తేలిపోయింది. తెలంగాణ అంతా మళ్లీ కేసిఆర్‌ జపం మొదలైంది. సారే రావాలని కోరుకుంటున్నారు. ఇక వచ్చేదంతా బిఆర్‌ఎస్‌ కాలమే. తెలంగాణ రైతులకు పండుగ రోజులు మళ్లీ కేసిఆర్‌ పాలనలోనే..

*ప్రజలను చైతన్య పరచడంలో మీడియాది ముఖ్యపాత్ర..

*ప్రజలను చైతన్య పరచడంలో మీడియాది ముఖ్యపాత్ర..

*కుటుంబాన్ని పక్కనబెట్టి సమాజం కోసం కృషి చేసే నిజమైన కార్మికులు జర్నలిస్టులు..

*తుడా ఛైర్మెన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..

తిరుపతి(నేటిధాత్రి)సెప్టెంబర్
10:

 

 

 

వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని, పక్కనబెట్టి సమాజ శ్రేయస్సు తమ కర్తవ్యం గా భావించి పనిచేసే నిజమైన కార్మికులు జర్నలిస్టులని తుడా చైర్మన్, టిటిడి బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. ఆధునికరించిన తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, శ్యాప్ చైర్మన్ రవి నాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరి ప్రసాద్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో తిరుపతి ప్రెస్ క్లబ్ ను ఆధునికరించడం సంతోషంగా ఉందన్నారు. మొదటినుంచి మీడియా మిత్రులు తన సోదరులుగా భావించి వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతున్నానని ఇకపై కూడా వారితో కలిసి ప్రయాణం చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలను చైతన్యపరచడంలో మీడియా ముఖ్యపాత్ర పోషిస్తోందన్నారు. యువత చెడుదారి పట్టుకున్న వారిని మంచి మార్గంలో నడిపే బాధ్యతను మంచి కథనలతో మీడియా తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ను అన్నిరంగల్లో భారత దేశంలో మొదటి స్థానంలో నిలపడానికి మీడియా కృషి చేయాలని సూచించారు. తిరుపతి మీడియా మిత్రులకు ప్రెస్ క్లబ్ కు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను ముందుంటానని హామీ ఇచ్చారు,
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కమిటీ తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు..

బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గందరగోళం..

బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గందరగోళం..

◆:- స్పందించిన రాజ్‌భవన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

హైదరాబాద్: తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన న్యూస్‌ అవాస్తవమని రాజ్‌భవన్ అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇంకా పెండింగ్‌లోనే ఉందని తెలిపారు. రిజర్వేషన్ల బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో.. విలీనం చేస్తూ.. జారీ చేసిన మెమోతో ఈ గందరగోళం నెలకొందని వివరించారు.

అయితే.. గత కొన్ని గంటలుగా.. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయ్యిందని.. సోషల్ మీడియాలో, ప్రముఖ టీవీ ఛానల్స్‌లో ప్రచారం అయ్యింది. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్ట సవరణకు గవర్నర్‌ ఆమోదం తెలిపినట్లు, 50 శాతం రిజర్వేషన్ల క్యాప్‌ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ మేరకు స్పందించిన రాజ్‌భవన్ అధికారులు ఇదంతా అవాస్తవమని తేల్చి చెప్పారు..

పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా…

పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర జి ఎస్ ఆర్

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల కేంద్రంలో
గ్రామీణ ప్రాంత ప్రజలకు రాకపోకలు సులభతరం చేయడం, వ్యవసాయ ఉత్పత్తులకు రవాణా సౌకర్యం కల్పించడం, విద్యార్థులు, కార్మికులు, రోగులు సులభంగా ప్రయాణించేలా చేయడం లక్ష్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఈరోజు గురువారం గణపురం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మీ తో
రంగారావుపల్లి నుండి దశరథం తండా వరకు రూ. 20 లక్షలు, వీర్లపల్లి(బంగ్లాపల్లి) నుండి చక్రవర్తిపల్లి వరకు రూ.20 లక్షలు, బంగ్లాపల్లి ఎస్సీ కాలనీ నుండి మామిడి తోట వరకు రూ.20 లక్షలు, సీతారాంపూర్ నుండి కొండాపూర్ వరకు రూ.20 లక్షలు, అప్పయ్యపల్లి తూపురం నుండి కొండంపల్లి వరకు రూ.20 లక్షలు, గణపురం చర్ల పల్లి చింతల నుండి లద్దబండ వాగు వరకు రూ.130 లక్షలతో వ్యవసాయ పొలాలకు వెళ్లే అంతర్గత రోడ్ల నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ. గ్రామీణ రహదారులు బాగుంటేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అందుకోసం ప్రభుత్వ నిధులతో పాటు ఇతర పథకాల ద్వారా కూడా రహదారి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం అందే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి అన్నది పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా, పల్లెల్లో కూడా సమానంగా గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల్లో అవగాహన కల్పించి ముఖ్య పాత్ర పోషించిన భూపాలపల్లి పోలీసులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు ఉన్నారు.

ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సన్మాన కార్యక్రమం…

ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సన్మాన కార్యక్రమం

* ఎమ్మెల్యే చేతుల మీదుగా ఉత్తమ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులు.

చేవెళ్ల, నేటిధాత్రి:

 

 

 

చేవెళ్ల ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు జి. వెంకటరమణకుమార్. ఎం. సంతోషి ఉపాధ్యాయులు విద్యారంగంలో వారు చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా జిల్లా విద్యాశాఖ
ఉత్తమ ఉపాధ్యాయులకు వారి సేవలను గుర్తించి ఉత్తమ పురస్కారాలను అందించింది.
చేవెళ్ల ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ సాంఘీకశాస్త్రంలో ఉత్తమ సేవలు అందించిన జీ.

 

 

 

 

వెంకటరమణకుమార్ కలెక్టరేట్ లో బుధవారం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. గురువారం చేవెళ్ల మున్సిపల్ పట్టనకేంద్రంలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చేవెళ్ల మండల ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య చేతుల మీదుగా ఉపాధ్యాయురాలు సంతోషి మండల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు.

 

 

 

 

 

గణిత శాస్త్రంలో ఉత్తమ సేవలు అందించిననందుకు ఈ పురస్కారం దక్కింది. ఉత్తమ పురస్కారాలు అందుకున్న వెంకటరమణకుమార్, సంతోషి ఉపాధ్యాయులను, ఎంఈఓ పురందాస్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు నర్సింహా, సుధాకర్, శృతి, అలివేలు రజిత, అరుణ, అనిత పలువురు ఉపాధ్యాయులు మాజీ ప్రజా ప్రతినిధులు ఘనంగా సన్మానించి ప్రశంశించారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, మాట్లాడుతూ తమ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు అందుకోవటం అభినదనీయమని అన్నారు. ఒక ఉపాధ్యాయుడిగా ఆయన సాధించిన విజయాలు ఒక్క రోజులో వచ్చినవి కావు, అవి ఆయన పట్టుదల, నిరంతర కృషికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఉద్యోగులు…

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఉద్యోగులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్లో సెలెక్ట్ అయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉద్యోగులు.
ప్రతి సంవత్సరం జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే క్రీడా పోటీలలో భూపాలపల్లి జిల్లాకు చెందిన ఉద్యోగు లు జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సిహెచ్ రఘు తెలిపారు.

 

 

ఖో ఖో క్రీడా లో సి హెచ్ ఆనంద్, ఫిజికల్ డైరెక్టర్ టేకుమాట్ల, కబడ్డీ క్రీడకు గాన సిహెచ్ సరస్వతి ఫిజికల్ డైరెక్టర్ జెడ్ పి హెచ్ ఎస్ తాడిచర్ల, వాలీబాల్ క్రీడకు గాని కే జ్యోతి ఫిజికల్ డైరెక్టర్, జెడ్ పి హెచ్ ఎస్, మహా ముత్తారం, కే మమత ఫిజికల్ డైరెక్టర్, జెడ్ పి హెచ్ ఎస్, పెద్దాపూర్, పాపికొండలు జి విజయలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్, జి పూర్ణిమ ,ఫిజికల్ డైరెక్టర్, జడ్.పి.హెచ్.ఎస్, మహాదేవపూర్ గర్ల్స్, కే మమత ఫిజికల్ డైరెక్టర్ జెడ్ పి హెచ్ ఎస్ పెద్దాపూర్, అథ్లెటిక్స్ క్రీడకి గాను సిహెచ్ సరస్వతి ఫిజికల్ డైరెక్టర్, హెచ్ రమేష్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అజామ్ నగర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, చెస్ క్రీడకి గాను బీ.కొమలత, ఎస్ జి టి, ఎం పి పి ఎస్ కేశవాపూర్, స్పందన ,ఎస్ జి టి, ఎంపీపీ ఎస్ ఎల్కేశ్వరం.
జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైన ఉద్యోగులకు క్రీడా శాఖ తరుపున అభినందనలు, జాతీయ స్థాయి లో జిల్లా కి క్రీడా లలో మంచి పేరు తేవాలి అని ఆకాక్షించారు.
సి హెచ్ రఘు, తెలిపారు

పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా….

పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా

ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

గ్రామీణ ప్రాంత ప్రజలకు రాకపోకలు సులభతరం చేయడం, వ్యవసాయ ఉత్పత్తులకు రవాణా సౌకర్యం కల్పించడం, విద్యార్థులు, కార్మికులు, రోగులు సులభంగా ప్రయాణించేలా చేయడం లక్ష్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి మండలంతో పాటు గణపురం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మీ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొత్తం రూ.390 లక్షల వ్యయంతో వివిధ గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో కమలాపూర్ నుండి పెద్దాపూర్ వరకు రూ.20 లక్షలు, ఎస్ యం కొత్తపల్లి నుండి దొమ్మటిపల్లి చెరువు వరకు రూ.100 లక్షలు, గొర్లవీడు గ్రామంలో జడ్పీ రోడ్డు నుండి మల్లయ్యపల్లి వరకు రూ.20 లక్షలు, ట్రాన్స్ఫార్మర్ నుండి మొరంచవాగు వరకు రూ.20 లక్షలు.
గణపురం మండలం రంగారావుపల్లి నుండి దశరథం తండా వరకు రూ. 20 లక్షలు, వీర్లపల్లి(బంగ్లాపల్లి) నుండి చక్రవర్తిపల్లి వరకు రూ.20 లక్షలు, బంగ్లాపల్లి ఎస్సీ కాలనీ నుండి మామిడి తోట వరకు రూ.20 లక్షలు, సీతారాంపూర్ నుండి కొండాపూర్ వరకు రూ.20 లక్షలు, అప్పయ్యపల్లి తూపురం నుండి కొండంపల్లి వరకు రూ.20 లక్షలు, గణపురం చీరలపల్లి చింతల నుండి లబ్బదండ వాగు వరకు రూ.130 లక్షలతో వ్యవసాయ పొలాలకు వెళ్లే అంతర్గత రోడ్ల నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామీణ రహదారులు బాగుంటేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అందుకోసం ప్రభుత్వ నిధులతో పాటు ఇతర పథకాల ద్వారా కూడా రహదారి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం అందే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి అన్నది పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా, పల్లెల్లో కూడా సమానంగా ఉండాలి అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

గొర్లవీడు గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్.
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు. భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో గ్రామ దాతల సహకారంతో సుమారు రూ.2 లక్షల 50 వేల వ్యయంతో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. కాగా, సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎక్కడైతే శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటాయో, అక్కడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రజల రక్షణ, భద్రత గురించి పోలీసులు ఎల్లవేళలా పనిచేస్తున్నట్లు తెలిపారు. దొంగతనాలు, నేరాలు, రోడ్డు ప్రమాదాలు, నిందితులను తొందరగా పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయన్నారు. గొర్లవీడు గ్రామస్తులు దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచి విషయమన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు కూడా ముందుకువచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల్లో అవగాహన కల్పించి ముఖ్య పాత్ర పోషించిన భూపాలపల్లి పోలీసులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు

సిర్పూర్ గ్రామపంచాయతీ కొత్త భవనం ప్రారంభం…

మల్లాపూర్ సెప్టెంబర్ 11 నేటి ధాత్రి

 

 

సిర్పూర్ గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి నర్సింగరావు వారు వెంట మల్లాపూర్ మండల కేంద్ర పలు గ్రామాల కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు.

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి…

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి
ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి 
భూపాలపల్లి నేటిధాత్రి 

డబ్ల్యూపిఎస్ అండ్ జి ఎ (వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్  గేమ్స్) క్రీడలలో భాగంగా భూపాలపల్లి  ఏరియా  రామగుండం -3 లను కలుపుకొని బాడీబిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ రీజినల్ మీట్ పోటీలను  సింగరేణి కృష్ణ కాలనీ మినీ ఫంక్షన్ హాల్ లో ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా
 జి‌ఎం మాట్లాడుతూ  డబ్ల్యూపిఎస్ అండ్ జి ఎ క్రీడలు సింగరేణి సంస్థలో ప్రతి ఒక్కరిలో ఒక సెలబ్రేషన్ లాగా నిలుస్తాయన్నారు . క్రీడలు మనందరిలో మానసిక ఉల్లాసం, సానుకూలతను నింపుతాయి. మంచి ఆరోగ్యం, క్రమశిక్షణ, టీమ్‌ వర్క్ ను వికసింపజేస్తాయి. నేటి ఆధునిక జీవన విధానంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం క్రీడల పాత్ర మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. 
మహిళ ఉద్యోగులు క్రీడల్లో రాణించాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా మైనింగ్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ విభాగాల్లో గణనీయంగా మహిళా ఆఫీసర్లు నియమితులయ్యారు. వీరు పురుషులతో సమానంగా భూగర్భ గనుల్లో పనులు నిర్వహిస్తున్నారు. సింగరేణిలో మహిళా రెస్క్యూ టీమ్స్ కూడా ఏర్పాటు అయ్యాయి. ఈ అవకాశాలతో మహిళలు సింగరేణి లో అన్ని రంగాల్లో, ముఖ్యంగా క్రీడలలో, స్ఫూర్తిగా ముందుకు రావాలని సూచించారు. మహిళల పాత్రను మరింత ప్రోత్సహిస్తూ, మహిళా ఉద్యోగులు క్రీడల్లో విజయం సాధించాలని చెప్పారు. త్వరలో జరిగే  కోల్ ఇండియా క్రీడా పోటీలలో  సింగరేణి ని ముందు వరుసలో నిలబెట్టాలని,  ఆత్మవిశ్వాసంతో పతకాలను గెలుచుకు రావాలని  కోరారు సింగరేణి సంస్థలో ప్రతి ఏడాది లాగే ఈ క్రీడలను నిర్వహించడం ఆనందకరం. ఉద్యోగులు చెడు వ్యసనాలకు దూరంగా వుండి, క్రీడలు రోజు వారి మన కార్యకలాపాలలో భాగం చేసుకోవాలని సూచించారు.మనం   ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. క్రీడలను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు, పాల్గొనే ఉద్యోగులకు, అభినందనలు తెలియజేశారు.  
ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, క్రీడల గౌరవ కార్యదర్శి శ్రావణ్ కుమార్ ,స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, భూపాలపల్లి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పాక దేవయ్య, అర్జీ-3 స్పోర్ట్స్ ఆర్డినేటర్, అంజయ్య, న్యాయ నిర్ణేతగా జిమ్ సమ్మయ్య, సీఎం ఓ ఐ ఏ ప్రతినిధి నజీర్, ఏఐటీయూసీ ప్రతినిధి  ఆసిఫ్ పాషా, ఐఎన్టియుసి ప్రతినిధి హుస్సేన్, శ్రీనివాసరెడ్డి, పాక శ్రీనివాస్, ఆఫీసుద్దీన్, బానోతు రమేష్,   తదితర క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

గల్ఫ్ కార్మికునికి గల్ఫ్ కార్మికుల భరోసా….

గల్ఫ్ కార్మికునికి గల్ఫ్ కార్మికుల భరోసా
వి. వి. రావుపేట్ సంఘం తరపున 57.001 ఆర్థిక సాయం
మల్లాపూర్ సెప్టెంబర్ 11 నేటి ధాత్రి

 

 

 

జగిత్యాల జిల్లా మల్లపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన కండేల గంగాధర్ అనే గల్ఫ్ కార్మికుని పట్ల కాలం కనికరం చూపలేదు. తన కుటుంబం కోసం చిన్నతనం అందరిని కాల్పోయి మళ్ళీ కుటుంబం కోసం కష్టపడి మంచి కుటుంబాన్ని సంతోషంగా సాగుతున్న సమయం లో విషాదం నెలకొల్పింది.
కండెల గంగాధర్ తన భార్య అంజలి అనారోగ్యం బాగా లేనందున ఎంతో ఖర్చు చేసుకొని హాస్పిటల్లో లక్షలు ఖర్చు చేసుకున్న కూడా తన భార్యను కాన్సర్ నుండి రక్షించలేకపోయాడు.
తోటి గల్ఫ్ కార్మికునిక గా చిన్నతనం నుండి చూసిన ఎంతోమంది గల్ఫ్ కార్మికులు చలించి పోయారు. వి. వి. రావుపేట్ గల్ఫ్ కార్మిక సంఘం సభ్యులు ఏదో ఉడుతా సహాయంగా ఆర్థిక సాయం చేయడం జరిగింది. అక్షరాల యాభై ఏడు వేల రూపాయలు తోటి గల్ఫ్ కార్మికులకు ఇబ్బంది ఉందని చెప్పగానే వి. వి. రావుపేట్ గల్ఫ్ కార్మిక సంఘ సభ్యులు తన కుటుంబానికి ఆర్థికంగా మనందరం కూడా సహాయం చేద్దామని ముందుకు రావడం.జరిగింది
ఒకరికి ఒకరం భరోసానివ్వడం చాలా గొప్ప విషయం అని వి. వి. రావుపేట్ గల్ఫ్ సంఘo నాయకులు తెలిపారు.
అలాగే ఈ సంస్థ ఏర్పడిన నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి భరోసా, గల్ఫ్ కార్మికలకు అవగాహనా కల్పిస్తున్న అందున పలు నాయకులు సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమం లో వి వి రావుపేట గల్ఫ్ కార్మిక సంఘం సభ్యులు పెనుకుల అశోక్. ఆరేళ్లి మహేష్,విష్ణు రాజా. మచ్చర్ల అదిరెడ్డి నారాయణ గౌడ్.రఘపతి. నలిమేల ప్రసాద్. పోతు రఘు. గుగ్లావత్ శ్రీకాంత్ మెండే ప్రవీణ్. రొడ్డ రాజశేఖర్. శ్రీమాన్ గౌడ్. రొడ్డ నవీన్. ఒల్లలా మల్లేషం. సంఘ మహేష్.గోపినేని రమేష్. వేల్పుల గంగాధర్. జక్కని నరేష్. కాట్కామ్ గణేష్. అరెల్లి శ్రీనివాస్. మిట్టపల్లి శ్రీనివాస్. సురేందర్ రొడ్డ. నాణెం రంజిత్. పళ్ళికొండ నరేష్. ఒల్లలా శ్రీనివాస్. పంజర్ల సత్యనారాయణ. ఎండీ రహీమ్. కండెల వెంకటి. బాధనపెల్లి గంగారెడ్డి. ఇరిశెట్టి సాయిలు. కోమానాపెళ్ళి కాసాన్న. రొడ్డ రాజేందర్. కండెల భూమయ్య. వేల్పుల మహేష్. సకినాపెళ్ళి శేఖర్. కొడిమ్యాల లింగం చారి. సుతారి గణేష్. గుగ్లావత్ రాజేష్. యాళ్ల తిరుపతి రెడ్డి. అమరకొండ లక్ష్మి రాజాం. గుగ్లావత్ శ్యామల్. గుగ్లావత్ తిరుపతి. కండెల సాయిలు. లౌడ్య విష్ణు. అరే రాజేశం. నిమ్మల విజయ్. ఎండీ ఆమాన్. వెల్మలా ప్రవీణ్. ఎండీ అబిబి.అరెల్లి రాజేశం. సకినపెల్లి రమేష్. జోగుల రాకేష్. గుగ్లావత్ చిన్నా.ఈ కార్యక్రమంలో. పెనుకుల నరేష్. వేముల నరేష్. నలిమేల రాజు. సతీష్. శ్రీను . శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అధ్యాపకుడిగా జిల్లా కలెక్టర్…

అధ్యాపకుడిగా జిల్లా కలెక్టర్
మల్లాపూర్ సెప్టెంబర్ 11 నేటి ధాత్రి

 

 

మల్లాపూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల (మినీ గురుకుల)పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
గురువారం రోజున జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కేందంలోని గిరిజన పాఠశాలను సందర్శించిన కలెక్టర్.
పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
క్లాస్ రూమ్ లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని కలెక్టర్ ఆరా తీశారు. అదే విధంగా ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని కలెక్టర్ హాజరు పట్టికను పరిశీలించారు. పాఠశాలలోని ప్రతీ విద్యార్థి పై ప్రత్యేక దృష్టి సారించాలని, సర్కారు బడుల్లో క్వాలిఫైడ్ ఉపాద్యాయులు పనిచేస్తున్నారని, భావి తరాలకు అవసరమైన విద్యా బోధన చేయడం జరుగుతున్నదని తెలిపారు.
విద్యార్థులతో ముఖాముఖి సంభాషణ జరిపి వారికి పాఠాలు చదివించి వారి బోధన స్థితిగతులను ప్రత్యేకంగా పరిశీలించారు.

 

District Collector Inspects Tribal Girls School in Mallapur

 

పాఠశాలలో విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి అంశాలను పరిశీలించారు.. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అనే విషయాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, భోజన తయారీ విషయంలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అదేవిదంగా ఒప్పంద నిర్వాహకుడితో మాట్లాడి నాణ్యతతో కూడిన సరుకులు అందించాలని తెలిపారు.
పాఠశాల తరగతి గదులలో పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. వర్షాకాలం దొమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలు తొలగించి, శానిటేషన్ చేయించాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాల ఉపాధ్యాయులు సమయపాలన తప్పకుండా పాటించాలని చెప్పడం జరిగింది.
కలెక్టర్ వెంట మెట్ పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారి రాజ్ కుమార్, తహసీల్దార్, సంబంంధిత అధికారులు పాల్గొన్నారు.

సెప్టెంబర్ 13న నేషనల్ లోక్ అదాలత్: పెండింగ్ కేసులు పరిష్కారం…

సెప్టెంబర్ 13న నేషనల్ లోక్ అదాలత్: పెండింగ్ కేసులు పరిష్కారం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో, కోర్టులలో పెండింగ్ కేసులను పరిష్కరించడానికి, సత్వర న్యాయం అందించడానికి సెప్టెంబర్ 13, 2025న నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమాచారాన్ని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం నుండి పోచారం ప్రవీణ్ కుమార్ అందించారు. ఈ లోక్ అదాలత్ ద్వారా అనేక కేసులకు సత్వర పరిష్కారం లభించే అవకాశం ఉంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వరద,ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన…

వరద,ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన
.
వనపర్తి నేటిదాత్రి .

 

 

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ భారీవర్షాలకు వరదతో ముంపుకు గురైన లోతట్టు రాజీవ్ గృహ కల్ప ఎస్. సి,ఎస్.టి వసతి గృహాలు,జంగిడిపురం,భగీరథ కాలనీ వెంగల్ రావు కాలనీ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్రికుంట చెరువు అలుగు పారడం,పీర్లగుట్ట నుంచి వచ్చిన వరదలతో రాజీవ్ గృహ కల్పలో మోకాళవరకు నీళ్లు చేరడంతో ప్రజలను అప్రమత్తం చేసి మిగతా ప్రాంతాలంలో నిలిచిన నీటిని మున్సిపల్ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ రోజు అతిభారీ వర్షాలు ఉండడం వల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు అదేవిధంగా రాజీవ్ గృహ కల్పలో ఫస్ట్ ఫ్లోర్ ఇళ్ల లో కి వరద నీరు రావడంతో వార్డు ప్రజలు మాజీ వైస్ చైర్మన్ దృష్టి కి తెచ్చారు వెంటనే అధికారులు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వైస్ చైర్మన్ వెంట బీ ఆర్ ఎస్ కార్యకర్తలు ప్రజలు ఉన్నారు ఈసందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ బారి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వనపర్తి పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు

డైరెక్ట్ మార్కెట్ సేలింగ్ లో తీసుకెళ్తున్న వెస్టేజ్ కంపెనీ

డైరెక్ట్ మార్కెట్ సేలింగ్ లో తీసుకెళ్తున్న వెస్టేజ్ కంపెనీ

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా పద్మావతి గార్డెన్ లో బుధవారం ఏర్పాటు చేసిన వెస్టీజ్ డైరెక్ట్ మార్కెట్ సేలింగ్ కంపెనీ లో వి.ఎం.సి.ఎం సుబ్బయ్య శెట్టి,వి.ఎం.సి.ఎం ఎమ్.ఎస్.ఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వెస్టీజ్ కంపెనీ తన కార్యకలాపాలను 2004 సంవత్సరంలో న్యూఢిల్లీ,బెంగళూరులోని కార్యాలయంలో ప్రారంభించి ఇది ప్రపంచ స్థాయి ఆరోగ్య వ్యక్తిగత,సంరక్షణ ఉత్పత్తులను డీల్ చేస్తూ నేడు దేశంలోని ప్రతి మూల మూలాన సంచరించిందని అన్నారు.భారతదేశంలోని అతిపెద్ద ప్రత్యక్ష అమ్మకాల కంపెనీలో ఒకటైన వెస్టీజ్ మార్కెటింగ్ లిమిటెడ్ సహా వ్యవస్థాపకుడు,మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి,డైరెక్టర్స్ కన్వర్ బీర్ సింగ్,దీపక్ సూద్ 2004లో ప్రారంభమైనప్పటి నుండి 21 సంవత్సరాలు కార్యకలాపాలను పూర్తిచేసిన ఈ కంపెనీ ప్రస్తుతం ఇండియా తో పాటు దుబాయ్, బహ్రెయిన్,ఒమన్,సౌదీ అరేబియా,యుఏఇ,నేపాల్, బంగ్లాదేశ్ లలో ఉనికి కలిగి ఉందని వారు తెలిపారు. వెస్టీజ్ కంపెనీలో ఇప్పటివరకు భారతీయులు 5 కోట్ల మంది పని చేస్తూ ఉపాధి పొందుతున్నారని తెలిపారు.ఈ కంపెనీలో పనిచేయడానికి ఎలాంటి విద్య అర్హత గాని,ఎలాంటి పెట్టుబడి లేకుండా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పనిచేస్తూ లక్షలలో సంపాదించుకునే అవకాశం ఉందని వారు తెలిపారు.వెస్టీజ్ కంపెనీలోని ఉత్పత్తులు ఆరోగ్యానికి,వ్యవసాయానికి,బ్యూటీకి,హోమ్ కి సంబంధించిన ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుకుంటూ వాటితో వచ్చిన రిజల్ట్స్ ద్వారా పదిమందికి చెబుతూ ఉపాధి పొందవచ్చని తెలిపారు.ఈ ఉత్పత్తులు ఎలాంటి కెమికల్స్ వాడకుండా నాచురల్ పద్ధతిలో తయారు చేయబడ్డవని,ప్రజలు ఎలాంటి అపోహలు గురి కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు ఫుడ్ సప్లిమెంట్స్ వాడుతూ పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండొచ్చని అన్నారు.

యువత కి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వెస్టీజ్ కంపెనీ

యువతి,యువకులు ఎన్నో ఉన్నత చదువులు చదివి ఉద్యోగా అవకాశాలు లేకపోవడంతో వెస్టీజ్ కంపెనీ లో డైరెక్ట్ మార్కెటింగ్ సేలింగ్ చేస్తూ ఉపాధి పొందుతూ లక్షలలో సంపాదిస్తున్నారని అన్నారు.అలాగే రైతులు పండించే పంటలలో ఎక్కువగా క్రిమిసంహారక మందులు పిచికారి చేయడంతో భూమి పూర్తిగా కలుషితమై మనం తినే తిండి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా వెస్టీజ్ మార్గాన్ని ఎంచుకొని కంపెనీ ఏర్పరిచే ఫ్రీ ఐడి ద్వారా కంపెనీలో చేరి బిజినెస్ చేస్తూ డబ్బు సంపాదించుకోవచ్చని తెలియజేశారు.

మాజీ జెడ్పిటీసి అంతిమయాత్రలో పాల్గొన్న గజ్జి విష్ణు…

మాజీ జెడ్పిటీసి అంతిమయాత్రలో పాల్గొన్న గజ్జి విష్ణు

 

పరకాల నేటిధాత్రి

 

 

మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన సిలివేరు మొగిలి మాజీ జడ్పీటీసీ మరణించగా అంతిమయాత్రలో సూర్య హాస్పిటల్ ఎండి డాక్టర్.సురేష్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సూర్య ట్రస్ట్ చైర్మన్ గజ్జి విష్ణు మొగిలి పార్థివదేహానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు.వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని వారికి దైర్యం చెప్పి వారి కుటుంబానికి రూపాయలు 5000 ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో కొగిల్వయి చందు,పెంచల రాజెందర్,సిలివేరు చిరంజీవి,సిలివేరు వెంకటేష్,రాఘవ,వినయ్,రంజిత్,సాయి,దయ,ఈ అంతిమయాత్ర లో పాల్గొన్నారు.

పాఠశాలను తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి సునీల్…

పాఠశాలను తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి సునీల్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, రేగొండ మండల ప్రత్యేక అధికారి ఏ. సునీల్ కుమార్ ఎం.జె.పి.టి.బి.సి.డబ్ల్యూ.
ఆర్ బాలుర పాఠశాలను సందర్శించారు.
పాఠశాలలో కూరగాయల స్టాక్ రిజిస్టర్‌ను,
కూరగాయల తాజాదనంను పరిశీలించారు.
విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు.
వంటగది, భోజనశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.

యూరియా కోసం రైతుల తిప్పలు…

యూరియా కోసం రైతుల తిప్పలు
వర్షాన్ని లెక్కచేయని క్యూలైన్‌లు..

రామయంపేట సెప్టెంబర్ 11 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

రామాయంపేట మండలం కాట్రియాల, ధర్మారం గ్రామాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలకు అత్యవసరమైన యూరియా కోసం తెల్లవారుజాము నుంచే సొసైటీ ఎదుట బారులు తీరారు. ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా, తడుస్తూనే ఒక బస్తా యూరియా కోసం ఎనిమిది గంటలపాటు క్యూలైన్‌లలో నిలబడ్డారు.
“తడిసినా పర్వాలేదు… మా పంటలకు యూరియా లేకపోతే ఎండిపోతాయి” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రైతులు కూడా వర్షాన్ని లెక్కచేయకుండా లైన్లలో నిలబడటం గ్రామాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో
రైతులు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు.ఇక మాకు హామీలు వద్దు వెంటనే యూరియా సరఫరా చేయాలి. పంటల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి.

error: Content is protected !!
Exit mobile version