అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల పట్ల పిర్యాదు.

*అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల పట్ల డిఈఓ పిర్యాదు *

పాఠశాలలను సీజ్ చేయాలి…గడ్డం నాగార్జున

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలో అనుమతులు లేకుండా నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలలను సీజ్ చేయాలని కోరుతూ ఏఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ కు ఆయన కార్యాలయంలో మెమోరాండం అందజేశారు.

ఈ సందర్భంగా ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున మాట్లాడుతూ నర్సంపేట పట్టణ కేంద్రంలోని 25 ప్రైవేటు పాఠశాలలకు పర్మిషన్ ఉంటే , అనధికారికంగా 14 ప్రైవేట్ పాఠశాలలు అందులో గీతాంజలి స్కూల్, డఫోడిల్స్ హై స్కూల్ , విజ్డమ్ హై స్కూల్, మదర్స్ లాండ్ హై స్కూల్ , కేఎస్ఆర్ శ్రీఅభ్యాస్ హై స్కూల్, ఎస్.పి.ఎస్ హై స్కూల్ తదితరుల స్కూలు అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

నర్సంపేట పట్టణంలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టా రాజ్యాంగ వివరిస్తున్న కూడా స్థానికంగా ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారులు చూసి చూడకుండా వదిలేయడం సిగ్గుచేటని అన్నారు.

Education Officer.

 

పట్టణంలో అనధికారికంగా నడపబడుతున్న ప్రైవేట్ పాఠశాలలపై డిఈఓ సమగ్ర విచారణ జరిపించి తక్షణమే వాటిని మూసివేసి,విద్య శాఖను తప్పుదోవ పట్టిస్తున్న ఆ స్కూల్ యాజమాన్యాలపై చట్టరీత్యా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి,జిల్లా నాయకులు పోలబోయిన రాజు, జావాజి శ్రిజిత్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునే బాధ్యత ఊరి ప్రజలది.

ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునే బాధ్యత ఊరి ప్రజలది

రాత పుస్తకాలు అందజేసిన_మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి

నడికూడ నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి పాఠశాల విద్యార్థిని,విద్యార్థులకు ప్రభుత్వము అందించిన ఉచిత రాత పుస్తకాలను అందజేశారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరము నుండి ఒకటవ తరగతి నుండి 5వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా రాత పుస్తకాలను అందజేస్తుందని అన్నారు.దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు,రాత పుస్తకాలు,మధ్యాహ్న భోజనం,రాగి జావా,వారానికి మూడుసార్లు కోడిగుడ్లు,అన్ని ఉచితంగా కల్పిస్తున్నది. కావున విద్యార్థిని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని,ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునే బాధ్యత ఊరి గ్రామ ప్రజలది మరియు తల్లిదండ్రులదని అన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఒకటవ తరగతికి మూడు,రెండవ తరగతి మూడు,మూడో తరగతి నాలుగు,నాలుగవ తరగతికి ఐదు,ఐదవ తరగతి ఆరు నోటుబుక్కులను ఉచితంగా అందజేసిందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా నోట్బుక్కులు అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్,ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచ రాజు కుమార్ మేకల సత్యపాల్, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల్లో 9000 వేల కోట్ల రూపాయల రైతుల ఖాతాలో జమ కావడంతో రైతు సంబరాలకు రాష్ట్ర పార్టీ ఆదేశించగా మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రైతులు బాణాసంచా కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, ఇస్తారు శేఖర్ గౌడ్, నాయకులు ఏడాకుల సంపత్ రెడ్డి, జెట్టి రామ్మూర్తి, జిల్లా మునీందర్, చిట్యాల ఉపేందర్ రెడ్డి బత్తిని మహేష్, తదితరులు పాల్గొన్నారు.

పక్క ఇల్లు ఉన్న… ఐనా.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు..

పక్క ఇల్లు ఉన్న… ఐనా.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు..

#అసలైన లబ్ధిదారులకు అందని ద్రాక్షల ఇందిరమ్మ ఇల్లు.

#ప్రభుత్వ పథకానికి తూట్లు పొడుస్తున్న నాయకులు.
నల్లబెల్లి, నేటి ధాత్రి;

 

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నాయకుల వ్యవహార శైలితో గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు చేయకుండా. తమకు నచ్చిన వ్యక్తులకు ఇండ్లు మంజూరు చేయించి ఆర్థికంగా బలోపేతం కావడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారని అర్హులైన లబ్ధిదారులు వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలో భాగంగా ప్రతి ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు నిర్మించేందుకు ఐదు లక్షల రూపాయలను వెచ్చించి ఇల్లు నిర్మాణం చేపట్టే దిశగా ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా పథకాన్ని దిగ్విజయం చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంటే గ్రామాలలో ఉన్న చోటామోటా నాయకులు వారి స్వార్ధ ప్రయోజనాల కోసం అర్హులైన లబ్ధిదారులను పక్కనపెట్టి. కమిషన్లు ఇచ్చే వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు అందజేసి పబ్బం గడుపుతున్నారని పలువురు ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అవకతలపై సమగ్ర విచారణ చేపట్టి అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే విధంగా అధికారులు కృషి చేయాలని నిరుపేద కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

గ్రామ గ్రామాన M R P S జండా ఎగరవేయాలి.

గ్రామ గ్రామాన M R P S జండా ఎగరవేయాలి
భూపాలపల్లి నియోజక వర్గ ఇంచార్జ్ జిల్లా సీనియర్ నాయకులు
అంబాల చంద్రమౌళి మాదిగ
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మొగుళ్లపల్లి మండల కేంద్రంలో M R P S మొగుళ్లపల్లి మండల ఇంచార్జ్ నేరెళ్ల ఓదెలు మాదిగ మరియు రేణుకుంట్ల సంపత్ మాదిగ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ముఖ్య కార్యాలర్తల సమావేశానికి ముఖ్య అతిధులుగా M R P S భూపాలపల్లి నియోజక వర్గ ఇంచార్జ్ జిల్లా సీనియర్ నాయకులు అంబాల చంద్రమౌళి
ముఖ్య అతిథిగా హాజరైన
మాట్లాడుతూ
జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ జన్మదిన వేడుకలు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా జరపాలని పిలుపునివ్వడం జరిగింది
మహాజన నేత మంద కృష్ణ మాదిగ అన్న ఎస్సీ లలో మాదిగ , ఉపకులాల కు ఉమ్మడి రిజర్వేషన్ల ద్వారా అన్యాయం జరుగుతుందని గుర్తెరిగి మాదిగ దండోరా (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) స్థాపించి పల్లె పల్లేనా మాదిగలను, ఉపకులాలను ఏకం చేసి సబ్బండ వర్గాల ప్రజలందరి మద్దతు కూడగట్టి ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని అలుపెరుగకుండా ముప్పై ఏండ్లు సాగించి ఫలితాన్ని సాధించి పీడిత వర్గాల ఉన్నత భవిష్యత్ కు బాటలు వేసాడని అన్నారు. మాదిగల, ఉపకులాల పక్షాన ఉద్యమిస్తూనే సమాజం లో ఏ వర్గం కు ఆపద వచ్చిన ఆయా సామాజిక వర్గాలకు అండగా నిలిచాడని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు అంతడుపుల సారంగ పాణి జీడీ సంపత్ రొంటాల రాజ్ కుమార్ బండారి రామస్వామి నిమ్మల భద్రయ్య మంగళ పల్లి శ్రీనివాస్ గుడిమల్ల రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు

సీఎం రేవంత్ చిత్ర పటానికి పాలాభిషేకం.

జహీరాబాద్: సీఎం రేవంత్ చిత్ర పటానికి పాలాభిషేకం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

వానాకాలం రైతు భరోసా రైతుల ఖాతాల్లో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు జమ చేసి రికార్డు సృష్టించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మక్సుధ్ హైమద్ ఆన్నారు. మంగళవారం మొగుడంపల్లిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులకు వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా భారీగా నిధులు విడుదల చేయడం అభినందనీయమన్నారు.

ఉప్పర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిమెంట్ పంపిణీ.

ఉప్పర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిమెంట్ పంపిణీ.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ మండల్ వెల్దండ గ్రామపంచాయతీ జోగు రవి కుమార్ s/o యాదయ్య గారు,రాష్ట్ర నాయకులు మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్ రిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇండ్ల నిర్మాణంలో భాగంగా ఇల్లు నిర్మాణం కోసం సిమెంట్ పంపించారు. మంగళవారం నిరుపేద కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం మాజీ వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ తన ట్రస్టు ద్వారా సిమెంట్, ఇప్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్ ధన్యవాదాలు తెలిపారుసిద్ధగొని రమేష్ గౌడ్ , మధుసూదన్ రెడ్డి, జోగు రవి కుమార్, ప్రభాకర్ కార్యక్రమంలో
తదితరులు పాల్గొన్నారు.

యువకులారా యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ గా మారండి భావితరాలకు.

యువకులారా యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ గా మారండి భావితరాలకు మంచి భారతాన్ని అందిద్దాం

మాదకద్రవ్య రహిత సమాజం కోసం పాటుపడదాం

రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

 

 

 

మాదక ద్రవ్యాలు,గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు భాగస్వామ్యలై భావితరాలకు మంచి భవిష్యత్తుని,అందమైన భారతాన్ని అందించాలని ఒక మంచి ఉద్దేశంతో మత్తుపదార్థాల వారోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ లో విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.

అందులో భాగంగా మంగళవారం రోజున జైపూర్ మండలంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్ ముఖ్య అతిదిగా పాల్గొనడం జరిగినది.

 

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మాధకద్రవ్యాలకు దూరంగా ఉండాలని,భవిష్యత్తు రోజుల్లో మాధకద్రవ్యాల నిర్మూలన నేటి తరం విద్యార్థుల చేతిలోనే ఉంది అని అన్నారు.

 

విద్యార్థుల దృష్టి తమ భవిష్యత్తు జీవిత లక్ష్యం పై మాత్రమే ఉండాలని,నిషేధిత గంజాయి డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని సీపీ సూచించారు.

 

గంజాయి డ్రగ్స్ అలవాటు వలన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని కావున చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు.

 

మాదక ద్రవ్యాల నిర్ములన గంజాయి రహిత ప్రాంతమే లక్ష్యం గా రామగుండం కమీషనరేట్ పోలీస్ శాఖ కృషి చేస్తోందని అందులో బాగంగా విద్యాసంస్థలు,గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

 

మత్తుకు బానిస అవడానికీ అనేక కారణాలు ఉంటాయి పరిసరాల ప్రభావం,చెడు స్నేహితులు, సన్నిహితుల వలన చెడు మార్గాల వైపు వెళ్లకుండా జాగ్రత్త ఉండాలని అన్నారు.

 

గంజాయి,డ్రగ్స్‌ జీవితాన్ని నాశనం చేయడంతో పాటు భవిష్యత్‌ లేకుండా చేస్తుందనే విషయాన్ని విద్యార్థులు గ్రహించి అలాంటి చెడు అలవాట్లకు ఆకర్షితులవ్వద్దని విజ్జప్తి చేశారు.మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత,విద్యార్థులు అంతా యాంటీ డ్రగ్స్ కమిటీలలో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా సహకరించాలని తెలిపారు.

 

 

ఈరోజు ఇక్కడ తెలుసుకున్న విషయాలను కుటుంబ సభ్యులకు,స్నేహితులకు, బంధువులకు తెలియజేసి డ్రగ్స్ నివారణలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.

 

 

Police Commissioner Amber Kishore Jha IPS

 

అదేవిధంగా విద్యార్థులు ఎక్కువ సమయం స్కూల్స్,హాస్టల్ లలో ఉంటారు కావున ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ,వారు ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా జాగ్రత్త వహించాలన్నారు.

 

మీ మీ ప్రాంతాలలో ఎక్కడైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు, సేవిస్తున్నట్టు తెలిస్తే వెంటనే సమాచారాన్ని స్థానిక పోలీసులకు ఇవ్వాలని కోరారు.యువతను లక్ష్యంగా చేసుకొని గంజాయి,డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అమ్ముతూన్న వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు.

 

ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మిన,సరఫరా చేసిన,సేవించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

ఈ సందర్భంగా విద్యార్థులు అధికారులతో కలిసి మాదక ద్రవ్యాలు,గంజాయి వాడకంపై పోస్టర్లను ఆవిష్కరించారు.

మేము డ్రగ్స్ తీసుకొము,బంధుమిత్రులు, చుట్టుపక్కల వారు,స్నేహితులు మాధకద్రవ్యాలకు అలవాటు బారిన పడకుండా వారిని చూసుకునే బాధ్యత మాదే అని డ్రగ్స్ వల్ల కలిగే అనార్ధాల గురించి వారికి వివరిస్తాం అని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేపించారు.

 

 

 

Police Commissioner Amber Kishore Jha IPS

 

ఈ కార్యక్రమం లో మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ ఐపిఎస్.జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లా రెడ్డి,ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్,శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్,నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్,జైపూర్ ఎస్సై శ్రీధర్,భీమారం ఎస్సై శ్వేతా,శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్,సిసి హరీష్,కస్తూర్బా ప్రిన్సిపాల్.ఫణి బాల,సాంఘిక సంక్షేమ ప్రిన్సిపాల్,కోలా నాగేశ్వరరావు,సాంఘిక సంక్షేమ కోటపల్లి ప్రిన్సిపాల్ బి.రమేష్ బాబు, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు,నార్కోటిక్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయం దండుగ కాదు..

తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయం దండుగ కాదు…పండగ

◆ రైతు భరోసా విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్న

◆ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి

 

 

 

 

న్యాలకల్ మండలంలోని ముంగి చౌరస్తా వద్ద నిర్వహించిన రైతు నేస్తం,రైతు భరోసా విజయోత్సవ సభలో కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద నిధులు రైతుల ఖాతాలో విడుదల చేసిన శుభ సందర్భన్నీ పురస్కరించుకుని మాజీ మంత్రి డా౹౹చంద్రశేఖర్ మండలంలోని రైతులు మరియు పార్టీ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగుంది.అనంతరం రైతులందరు ప్రజా ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తంచేశారు, మరియు మాజీ మంత్రి డా౹౹ఎ.చంద్రశేఖర్ మాట్లాడుతూ కేవలం18 నేలలో రైతు రుణమాఫీ,రైతు భరోసా,రైతు బోనస్లు అందించిన ఏకైక ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అని వారు వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ డీసీసీ ప్రధాన కార్యదర్శి.భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సామెల్,pacs చైర్మన్లు.సిద్దిలింగయ్య స్వామి,జగ్గానాథ్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ.గౌసోద్దీన్,మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్,కాంగ్రెస్ నాయకులు హుగ్గేల్లి రాములు,తదితరులు పాల్గొన్నారు.

పోగొట్టుకున్న మొబైల్ బాధితునికి అందజేత.

పోగొట్టుకున్న మొబైల్ బాధితునికి అందజేత

-బాధితునికి మొబైల్ ఫోన్ ను అందజేసిన ఎస్పై దీకొండ రమేష్..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

 

 

 

ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అనిల్ అనే వ్యక్తి మొబైల్ పోగొట్టుకున్నాడు సెంట్రల్ ఎక్యుప్ మెంట్ ఐడెంటిటి రిజిస్టర్ పోర్టల్ (సి ఈ ఐ ఆర్) ద్వారా రికవరి చేసి మొబైల్ ఫోన్ ను బాధితులకు అప్పగించిన ఎస్ ఐ దీకొండ రమేశ్ | పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తమ మొబైల్ ఫోన్ వ్యక్తి యొక్క ఆధార్ కార్డు ను, సంబంధిత మొబైల్ ఫోన్ల ఐ ఎం ఈ ఐ నెంబర్ల ద్వారా ఆతని వివరాలు తెలుసుకొని ఆతని నుండి మొబైల్ ను పోత్కపల్లి ఎస్ఐ రికవరీ చేశారు. మొబైల్ ను ఎస్ఐ పోలీసు స్టేషన్ నందు బాధితునికి అప్పగించారు. మొబైల్ విలువ సుమారు రూ.28,000/- ఉండును. ఈ సందర్భంగా పోత్కపల్లి ఎస్ ఐ మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా తమ మొబైల్ పోగొట్టుకున్నట్లయితే వారు సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా నెంబర్ ను వెబ్ సైట్ లోకి వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందపర్చాలని, అలా చేసినట్లయితే త్వరగా వారి మొబైల్స్ లను పట్టుకోవడం జరుగుతుందని, కావున ప్రజలు ఈ సి ఈ ఐ ఆర్ అప్లికేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.

బీసీ ఆజాద్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడీ జన్మదిన వేడుకలు.

బీసీ ఆజాద్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడీ జన్మదిన వేడుకలు

జిల్లా అధ్యక్షులు క్యాతం మహేందర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

బీసీ ఆజాద్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా ఘనంగా జిల్లా కేంద్ర లో వేడుకలు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు క్యాతం మహేందర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర లో జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ. జక్కన్న సంజయ్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనునిత్యం బీసీల హక్కుల కోసం పోరాడుతున్న యోధుడు అని అభివర్ణించాడు, బీసీల కోసం దేశంలోనూ రాష్ట్రంలోనూ బీసీల కులగణన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమర నిరాహార దీక్ష చేసి చావు చివరి అంచుల వరకు వెళ్లి కుల గణన సాధించిన వీరుడని , ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలకు కోసం మేమెంతో మాకు అంత సాధించాలనే అనే ఉద్దేశంతో బీసీలను చైతన్య పరుచుతూ గ్రామ గ్రామాన చైతన్యపరచాలని కొండ లక్ష్మణ్ బాపూజీ జన్మస్థలమైన వంకాడి నుండి అలంపూర్ వరకు రథయాత్ర నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాద్ ఫెడరేషన్ జిల్లా నాయకులు బండి రమేష్ , కృష్ణ , నేరెళ్ల కుమార్, కాటిపెల్లి సతీష్ , ఉమర్ ఆలీ, శ్రీను , రామకృష్ణ , అనిల్, తదితరులు పాల్గొన్నారు.

కొలనూరు లో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం..

కొలనూరు లో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం..
బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

 

ఓదెల మండలం కొలనూరు గ్రామంలో పెద్దపెల్లి బిజెపి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కొలనూరు గ్రామంలో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు.దీనితో పాటు గ్రామంలోని దేవాలయంలో మొక్కలు నాటడం జరిగింది. తదనంతరం ప్రభుత్వ ఆసుపత్రి మరియు పాఠశాల ను సందర్శించి అక్కడ ఒక సమస్యలను తెలుసుకోవడం జరిగింది. తదనంతరం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో బీజేవైఎం పెద్దపల్లి జిల్లా కార్యదర్శి పుల్లూరు పృథ్వీరాజ్ సుల్తానాబాద్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ సుల్తానాబాద్ పట్టణ అధ్యక్షులు నాగరాజు ఎలిగేడు మాజీ మండల అధ్యక్షులు నారాయణస్వామి సుల్తానాబాద్ మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ జిల్లా ప్రధాన కార్యదర్శి చౌదరి మహేందర్ కొలనూరు మాజీ సర్పంచ్ కైరునిస తాజ్ పుల్ల సదయ్య అనిల్ రావు దాత రాకేష్ సత్యం రెడ్డి శంకర్ బిక్షపతి కొంగర అనిల్ తదితర మూర్చ నాయకులు బిజెపి పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

ఇరాన్ పై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండించాలి.

ఇరాన్ పై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండించాలి.

సిపిఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ లో ఇరాన్ పై అమెరికా దాడులను ఆపాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇజ్రాయిల్ అమెరికా దేశాలు ఇరాన్ దేశంపై యుద్ధం వెంటనే ఆపాలని కోరారు.ప్రపంచ దేశాలు శాంతి నెలకు కొలపాలని వారన్నారు. యుద్ధం సరైన పద్ధతి కాదన్నారు.అమెరికా సామ్రాజ్య వాదాన్ని నెలకొల్పాలని పచ్చిమ ఆసియాపై ఆదిపత్యం చేసుకోవాలని దురుద్దేశంతో ఇరాన్ పై దాడులు చేపించడం జరుగుతుందన్నారు.ఇరాన్ ఆణుఅయుధాలను తయారు చేస్తుందని ప్రపంచానికి తప్పుడు సంకేతాలు తీసుకవచ్చి యుద్ధం చేస్తున్నారని అన్నారు. యుద్దాల వల్ల వేలాదిమంది ప్రజలు అన్యాయంగా చనిపోతున్నారని, పెద్ద ఎత్తున ఆస్తుల నష్టం జరుగుతుందని తెలిపార.
యుద్ధం వద్దు శాంతి ముద్దు అని ట్రంపుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్ సుధాకర్ రెడ్డి మాతంగి రాంచందర్ క్యాతరాజు సతీష్ నెరెళ్ల జోసెఫ్ వేముల శ్రీకాంత్ పీక రవికాంత్ గోనెల తిరుపతి రమేష్ చారి గోలి లావణ్య శ్రావణి పల్లెర్ల రజిత శ్రీలత వాసం రజిత రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

తీర్థయాత్రల కోసం రైల్వే శాఖ ప్రత్యేక ప్యాకేజీలు.

తీర్థయాత్రల కోసం రైల్వే శాఖ ప్రత్యేక ప్యాకేజీలు

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

 

 

తీర్ధ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూలై 05 వ తేదీ నుండి జూలై 13 వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు IRCTC టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ DSGP కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు.

యాత్రకి సంబందించిన వివరాలు వెల్లడించారు.

ప్యాకేజీ వివరాలు : (ఐదు జ్యోతిర్లింగ యాత్ర – SCZBG43):* ఉజ్జయిని (మహాకాళేశ్వర్ – ఓంకారేశ్వర్) – త్రయంబకేశ్వర్ – భీమశంకర్ – ఘృష్ణేశ్వర్).

ఈ యాత్రలో మహాకాళేశ్వర్ / ఓంకారేశ్వర్ / త్రయంబకేశ్వర్ / భీంశంకర్ / ఘృష్ణేశ్వర్ / ఎల్లోరా / మోవ్/ నాగ్పూర్ ప్రాంతాలు సందర్శించవచ్చు.

ఈ యాత్ర జూలై 05 వ తేదీన ప్రారంభమై 13వ తేదీ వరకు ఉంట్టుంది.

దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 14700, 3 ఏసీ ధర 22900, 2 ఏసీ ధర 29900 ఉంటుంది.

ఈ యాత్ర సికింద్రాబాద్ కామారెడ్డి నిజామాబాద్ ధర్మాబాద్ నాందేడ్ ముధ్ఖడ్ మరియు పూర్ణ మీదుగా వెళ్తుంది.

సౌకర్యాలు :రైలు, బస్సు, హోటల్, అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, భోజనం మరియు రాత్రి భోజనం), వాటర్ బాటిల్ మరియు టూర్ ఎస్కాట్ సేవలతో సందర్శనా స్థలాలు, (అదనపు ఖర్చు లేదు), ప్రయాణ బీమా, ఇన్సూరెన్స్ అలాగే రైల్వే స్టేషన్ నుండి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగ ఉచితం.

ప్రతి రైలు లో 718 మంది ప్రయాణికులు ఉంటారు.

ప్రతి 70 మందికి ఇద్దరు కోర్డినెటర్లు అందుబాటులో ఉండి అన్ని సావకార్యాలు సమకురుస్తారు.

కోచ్ కి ఒక సెక్యూరిటీ గార్డ్ అలాగే రైలు లో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుందని తెలియజేశారు.

టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు వివరాలకు
9701360701,9281495843,9281030750,9281030749 లకు సంప్రదించాలని మరిన్ని వివరణలకు www.irctctourism.com వెబ్సైట్ ని సంప్రధించాలని తేలిపారు.

షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ బాలికల వసతి గృహం.

షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ బాలికల వసతి గృహం నందు అడ్మిషన్లు ప్రారంభం

★వార్డెన్ చంద్రకళ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ బాలికల వసతి గృహం ఝరాసంగం మండలం సంగారెడ్డి జిల్లా నందు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుచున్నవని గర్ల్స్ హాస్టల్ వార్డెన్ చంద్రకళ తెలిపారు. వసతి గృహంలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, జిరాక్స్ కాపీలు, పాఠశాల బోనఫైడ్ మరియు 3 పాస్పోర్ట సైజ్ ఫోటోలతో ఝరాసంగం బాలికల వసతి గృహము ను సంప్రదించాలని ఒక ప్రకటనలో తెలిపారు.వసతి గృహంలో సంప్రదించగలరు అడ్మిషన్లు కావలసినవారు ఈ యొక్క నెంబర్ను సెల్ 97010 88952 సంప్రదించగలరు.

న్యూ హీరోయిన్స్ హవా.

న్యూ హీరోయిన్స్ హవా

 

టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్స్ జోరు మామూలుగా లేదు.

ఒక్కొక్కరూ ఒక్కో రకంగా దూసుకుపోతూ ఇండస్ట్రీలో తమ స్థానం కోసం గట్టిగా పోటీ పడుతున్నారు.

ఈ అందాల తారల్లో ఎవరు ఏ రీతిలో దూసుకుపోతారో తెలుసుకుందాం…

 

 

ప్రతి ఏటా కొత్త ముద్దుగుమ్మలు వెండితెరపై సందడి చేస్తూనే ఉంటారు. టాలీవుడ్ లో కి ప్రెజెంట్ కొత్తగా చాలా మంది బ్యూటీస్ వచ్చి చేరారు.

తమ అందచందాలతో ఆడియెన్స్ అట్రాక్ట్ చేస్తూ..

అవకాశాలను కొల్లగొడుతున్నారు.

మమితా బైజు (Mamitha Baiju) పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్.

ఈ జూనియర్ బ్యూటీ సీనియర్ హీరోయిన్స్‌కు ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది.

వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం ‘డ్యూడ్‌’తో పాటు, సూర్య 46లో నటిస్తోంది.

అంతటితో ఆగకుండా దళపతి విజయ్‌ తో ‘జన నాయగన్’ లో పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుంది.

స్టార్ కిడ్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) టాలీవుడ్‌లో గట్టి మార్క్ వేస్తోంది.

‘దేవర’ సినిమాతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచిన ఈ అమ్మడు, ఇప్పుడు మరో బిగ్ ప్రాజెక్ట్‌తో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతోంది.
క్రేజ్, గ్లామర్, నటన మిక్స్ చేసి టాలీవుడ్‌లో హాట్ ట్రెండ్‌గా మారుతోంది.
మరో బ్యూటీ మాళవికా మోహనన్ (Malavika Mohanan) దూకుడు మామూలుగా లేదు.
పాన్ ఇండియా సినిమాలతో ఈ బ్యూటీ రచ్చ రేపుతోంది.
ప్రస్తుతం ‘ద రాజా సాబ్’ మూవీతో తెలుగు ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది.
‘అప్పుడో ఇప్పుడు ఎప్పుడో’ సినిమాతో గ్లామర్ డోస్ పెంచి అందరి దృష్టిని ఆకర్షించింది రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth).
ఇప్పుడు ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ‘డ్రాగన్’లో…
శివకార్తికేయన్‌ ‘మదరాసి’లో మెరవనుంది.
‘హిట్ 3’తో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి, ఇప్పుడు ‘తెలుసు కదా’ సినిమాతో బిజీగా ఉంది.
ఈ మూవీ హిట్ అయితే ఈ వయ్యారికి మరిన్ని అవకాశాలు లభించడం ఖాయం అని విశ్లేషిస్తున్నారు.
అలాగే ‘ఓం భూమ్ భుష్‌’లో నటించిన ప్రీతి ముకుందన్ (Prithi Mukundan) ‘కన్నప్ప’లో కథానాయికగా నటించింది.
ఆమె తన నటనతో అందరినీ ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది.
ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ లో అదరగొట్టేసిందీ భామ. 

ఐశ్వర్య మీనన్ కూడా తన సినిమాల స్పీడ్‌ను పెంచేసింది.

‘స్పై, భజే వాయు వేగం’ సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ, ఇప్పుడు పాన్ ఇండియా మూవీ ‘నాగబంధం’తో రాబోతోంది.

ఈ బ్యూటీ టాలెంట్, గ్లామర్ చూస్తే టాప్ లీగ్‌లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకో చిన్నది కాజల్ చౌదరి. ఆమె ‘అనగనగా’ సినిమాతో తన మార్క్ వేసింది.

ఇప్పుడు ‘కరాలి, అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ వంటి సినిమాలతో బిజీగా మారింది.

రితికా నాయక్ కూడా సైలెంట్‌గా వరుస సినిమాలతో రచ్చ చేస్తోంది.

‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ తర్వాత కొన్ని సినిమాలను లైన్ లో పెట్టింది.

ప్రెజెంట్ ‘మిరాయ్’, వరుణ్ తేజ్‌, ఆనంద్ దేవరకొండ ‘డ్యుయేట్’ ప్రాజెక్ట్‌ల్లో నటిస్తోంది.

ఇలా పలువురు నూతన తారలు తమ అందచందాలతోనూ, అభినయ పటిమతోనూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

మరి వీరిలో జనం మదిలో పదికాలాల పాటు నిలిచే దెవరో చూడాలి.

జగన్‌పై కేసు.. వైసీపీ నేతలకు నోటీసులు.

జగన్‌పై కేసు.. వైసీపీ నేతలకు నోటీసులు

 

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మిర్చియార్డు పర్యటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

 

అలాగే పలువురు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు.

 

 

 

గుంటూరు, జూన్ 24: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Mohan Reddy) మరో కేసు నమోదు అయ్యింది.

జగన్ మిర్చి యార్డ్ పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి వైసీపీ కీలక నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు.

గత ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం యార్డ్‌కు వెళ్లారు జగన్.

కానీ అనుమతి లేకుండా యార్డ్‌లోకి వచ్చి వైసీపీ నేతలు నానా హంగామా సృష్టించారు.

దీంతో జగన్‌తో పాటు పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫ్యాన్ పార్టీ నేతలకు 41 ఏ నోటీసులు అందజేస్తున్నారు.

మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు, అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి , అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు, కృష్ణా జిల్లాకు చెందిన కీలక నేతలు పేర్నినాని, కొడాలి నాని, తలశిల రఘురాంతో పాటు జగన్‌పై గతంలోనే నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లోనే కేసు నమోదు అయ్యింది.
ఇప్పుడు నాలుగు నెలల తర్వాత అందుబాటులో ఉన్న నేతలకు నోటీసులు జారీ చేశారు.
పిలిచినప్పుడు నల్లపాడు స్టేషన్‌కు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.

కాగా.. మిర్చి రైతులను పరామర్శించేందుకు గత ఫిబ్రవరి 19న గుంటూరులోని మిర్చియార్డుకు వచ్చారు వైఎస్ జగన్.

 

ఆ సమయంలో గుంటూరు – కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని పెద్ద సంఖ్యలో ర్యాలీలు, పరామర్శకు అనుమతి లేదని పోలీసులు ముందుగానే చెప్పారు. అయినప్పటికీ…

 

జగన్, వైసీపీ నేతలతో కలిసి భారీగా మిర్చియార్డుకు వచ్చి నానా హంగామా సృష్టించారు.

మిర్చి బస్తాలను ధ్వంసం చేశారు.

అంతేకాకుండా కొన్ని మిర్చి బస్తాలను అపహరించారనే ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలో నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫిబ్రవరి 19న తొమ్మిది మందిపై కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు..

వారికి నోటీసులు పంపిస్తున్నారు.

ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలని, తమకు చెప్పకుండా ఊరు వదిలి, దేశం వదిలి పోవొద్దని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

వైసీపీ నేతలకు నోటీసులు ఇస్తున్న పోలీసులు జగన్‌కు నోటీసులు ఇస్తారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది.

గతంలో నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో రఘురామకృష్ణం రాజుపై కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి జగన్‌పై కేసు నమోదు చేసి ఏడాది దాటింది.

ఇంత వరకు ఆయనకు నోటీసులు ఇవ్వలేదు.

ఇప్పుడు నాలుగు నెలల క్రితం మిర్చి యార్డులో ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించి యార్డులో హంగామా సృష్టించిన కేసులో వైసీపీ నేతలకు నోటీసులు ఇవ్వడం మొదలు పెట్టారు.

మరి జగన్‌కు నోటీసులు ఇవ్వడంపై ఉత్కంఠ నెలకొంది.

ఐదో రోజు శ్రీధర్‌ను విచారిస్తున్న..!

ఐదో రోజు శ్రీధర్‌ను విచారిస్తున్న ఏసీబీ

 

అక్రమాస్తుల కేసులో అరెస్టయిన ఈఈ శ్రీధర్‌ను కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఐదో రోజు మంగళవారం విచారిస్తున్నారు. ఈ రోజు మరికొన్ని లాకర్లు కూడా తెరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ రోజుతో ఆయన విచారణ ముగియనుంది.

 

 

 

Hyderabad: అక్రమాస్తుల కేసు (Illegal Assets Case)లో ఐదో రోజు (5th Day) మంగళవారం నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్‌ (EE Sridhar)ను కస్టడీ (custody)లోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు (ACB investigation). ఈ రోజుతో ఆయన కస్టడీ ముగియనుంది. కోర్టు అనుమతితో మరోసారి శ్రీధర్‌ను కస్టడీకి తీసుకునే ఆలోచనలో ఏసీబీ అధికారులు అన్నారు. ఇంత వరకు జరిగిన విచారణలో శ్రీధర్ అక్రమంగా సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. శ్రీధర్ బ్యాంకు లాకర్లలో భారీగా ఆస్తి పత్రాలు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లలో స్వాధీనం చేసుకున్న ఆస్తులు విలువ సుమారు రూ. 5 కోట్లు పైనే ఉంటుందని అంచనా వేశారు.

లాకర్‌లో రూ. 5 కోట్లు స్వాధీనం..

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 6, 7, 8 పనులు పర్యవేక్షించిన నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్‌ అక్రమాస్తుల చిట్టా అంతకంతకు పెరుగుతోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే రూ. వందల కోట్ల విలువైన ఆస్తుల్ని గుర్తించిన అధికారులు.. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో మరికొన్ని ఆస్తుల్ని కనుగొన్నారు. జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న శ్రీధర్‌ను కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. సోమవారం అతని బ్యాంకు లాకర్లను తెరిచారు. వాటిలో దొరికిన స్థిరాస్తుల పత్రాలు, బంగారం విలువ రూ.5 కోట్లపైనే ఉంటుందని అంచనా వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతికి సంబంధించి అరెస్టయిన మిగతా వారు కూడా అక్రమంగా సంపాదించిన సొమ్మును రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడులుగా పెట్టినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. శ్రీధర్‌ కస్టడీ గడువు మంగళవారంతో ముగియనుంది. ఈ క్రమంలో కోర్టు అనుమతితో అతన్ని మరోసారి కస్టడీకి తీసుకుని ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

మరిన్ని లాకర్లు తెరిచే అవకాశం..

అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటూ కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈగా పనిచేసిన శ్రీధర్‌పై ఏసీబీ అధికారులు ఈ నెల 11న కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అధికారుల సోదాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు గుర్తించారు. వాటి విలువ మార్కెట్‌ లెక్కల ప్రకారం రూ. 150 కోట్ల మేర ఉంటుందని అంచనా. శ్రీధర్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించిన అధికారులు తదుపరి దర్యాప్తులో భాగంగా న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని ఈనెల 20వ తేదీ నుంచి విచారిస్తున్నారు. దీనిలో భాగంగా ఎస్‌బీఐలో శ్రీధర్‌ పేరు మీద ఉన్న లాకర్‌ను ఆయన సమక్షంలోనే అధికారులు తెరిచారు. ఇందులో పెద్దఎత్తున ఆస్తిపత్రాలు, బంగారు ఆభరణాలు గుర్తించారు. వాటికి పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో చివరి రోజైన మంగళవారం మరికొన్ని లాకర్లు కూడా తెరిచే అవకాశం ఉంది.

ఈ రంగు చెప్పులు వేసుకుంటున్నారా..!

ఈ రంగు చెప్పులు వేసుకుంటున్నారా.. జాగ్రత్త.. దురదృష్టం వెంటాడుతుంది..

 

చెప్పులు కొనేటప్పుడు ఈ పొరపాటు అస్సలు చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఈ రంగు చెప్పుల్ని వేసుకుంటే దురదృష్టం వెంటాడుతుందని అంటున్నారు.

కాబట్టి, ఏ రంగు చెప్పులు అస్సలు వేసుకోవడం మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

 

మనం చెప్పులు కొనేటప్పుడు ఎక్కువగా స్టైల్, బ్రాండ్, ధర వంటి విషయాలకే ప్రాముఖ్యత ఇస్తాం. కానీ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పుల రంగు కూడా మన జీవితంపై ప్రభావం చూపుతుంది. కొన్ని రంగుల చెప్పులు మనకు ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, వృత్తి సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, చెప్పులు కొనేటప్పుడు ఈ పొరపాటు అస్సలు చేయకూడదని సూచిస్తున్నారు. ఈ రంగు చెప్పుల్ని వేసుకుంటే దురదృష్టం వెంటాడుతుందని అంటున్నారు. కాబట్టి, ఏ రంగు చెప్పులు వేసుకోవడం మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం..

పసుపు రంగు చెప్పులు

పసుపు రంగు అనేది సాధారణంగా పవిత్రతకు, మంచి శక్తికి సంకేతంగా భావిస్తారు. కానీ, పసుపు రంగులో ఉన్న చెప్పులు కొన్ని నమ్మకాల ప్రకారం అంత శుభప్రదం కాదు. జ్యోతిష్యంలో బృహస్పతి గ్రహంకు పసుపు రంగు ప్రతీక. బృహస్పతి అనేది జ్ఞానం, సంపద, గురుత్వానికి సూచిక. పసుపు రంగు చెప్పులను ధరించడం ద్వారా బృహస్పతి ప్రభావం బలహీనపడుతుందని కొంతమంది నమ్మకం. దీని వల్ల ఆర్థిక సమస్యలు, వివాహ బంధంలో కలహాలు, పిల్లల పెళ్లిళ్లు ఆలస్యం వంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఏం చేయాలి?

చెప్పులు కొనేటప్పుడు ముఖ్యంగా చదువుకునే వాళ్లు, ఉద్యోగం లేదా వ్యాపార అభివృద్ధి ఆశిస్తున్నవాళ్లు పసుపు రంగు చెప్పులను తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నలుపు, లేత గోధుమరంగు, బూడిద రంగులు ఎంచుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు. అలాగే, శనివారం రోజు బ్లాక్ కలర్ చెప్పులు శని దోష నివారణకు సహాయపడతాయని కొందరు విశ్వసిస్తారు.

ఒప్పందాన్ని ఉల్లంఘించ వద్దు: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఒప్పందాన్ని ఉల్లంఘించ వద్దు: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

 

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి.

దీంతో ఇరుదేశాల మధ్య యుద్దం ముగిసింది.

ఈ నేపథ్యంలో ఆ రెండు దేశాలకు అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప కీలక సూచన చేశారు.

 

 

 

 

 

వాషింగ్టన్, జూన్ 24: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వీటిని దయ చేసి ఉల్లంఘించవద్దని ఆయా దేశాలకు ఆయన సూచించారు. మంగళవారం ట్రూత్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లోని పలు భూభాగాలపై ఇరాన్ దాడులు చేసింది. కొన్ని గంటల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ రెండు దేశాల మధ్య గత 12 రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధం నేటితో ముగిసిందన్నారు. ఇరాన్ అన్ని కార్యకలాపాలను తొలుత నిలిపివేసిందని.. మరో 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ సైతం ఆ బాటను అనుసరిస్తుందని చెప్పారు.

ఇజ్రాయెల్ ఆక్రమించిన ప్రదేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు నిర్వహించింది. అనంతరం ఈ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ దాడుల్లో ఏడుగురు మరణించారని వివరించింది. ఇక క్షిపణి దాడులు ముగియడంతో.. ప్రజలు ఆశ్రయం పొందుతున్న ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ వైదొలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం గత కొద్దిరోజులుగా కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా నిలిచింది. ఆ క్రమంలో ఇరాన్‌లోని పలు కీలక స్థావరాలపై దాడి చేసింది. అనంతరం ఇరాన్‌ సైతం ఇజ్రాయెల్‌లోని పలు కీలక ప్రాంతాలపై దాడి చేసింది. అయితే అణుస్థావరాలపై దాడి నేపథ్యంలో ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేని ఘాటుగా స్పందించారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారని స్పష్టం చేసింది. కానీ అమెరికాపై ఖమేని ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇక ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ రాయబారి అమీర్ ఇర్వానీ మాత్రం అమెరికతోపాటు ఇజ్రాయెల్‌పై మండిపడిన విషయం విదితమే. ఇరాన్‌కు చెందిన ఈ ఇద్దరు ఇలా వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ పై విధంగా స్పందించారు.

error: Content is protected !!
Exit mobile version