మహనీయుని ఆశయాలు మరిచిపోకండి

నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి….

కొల్చారం,( మెదక్) నేటిధాత్రి :-

నవభారత నిర్మాత భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘసంస్కర్త గొప్ప మహనీయుని 133వ జయంతి వేడుకలు ఈనెల 14న ఆదివారం ప్రపంచవ్యాప్తంగా కన్నుల పండుగగా జరుపుకొనుటకు ప్రజల సిద్ధమయ్యారు, 1891 ఏప్రిల్ 14న జన్మించిన మహనీయుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న మరణించారు, నేటికీ బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించి 133 సంవత్సరాలు పూర్తి కావస్తుంది ఈ సందర్భంగా ప్రపంచ మేధావిగా ప్రపంచ దేశాలలోనే ఒక దళిత కుటుంబంలో జన్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రపంచంలో ఆరడుగుల ఆ జాను బావుడు ఈ దేశంలో జన్మించడం ఈ దేశ ప్రజల కు ఎంతో గర్వకారణం కానీ ఆయన ఆశయాలు ఆదేశాలు సిద్ధాంతాలు మాత్రం పాలక ప్రభుత్వాలు నీరు కారుస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి, కుల నిర్మూలన కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతగానో కృషి అంతా ఇంతా కాదు, భారతదేశ మొట్ట మొదటి న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు అరుదైన పీ, హెచ్, డి పట్టా తోపాటు లండన్ లో డాక్టరేట్ పట్టా కూడా పొందారు, ఎన్నో పీ. హెచ్, డి ల తోపాటు డాక్టర్ రేటు పట్టాలు పొందిన ఏ కైక వ్యక్తిగా ఈ ప్రపంచంలో అంబేద్కర్ కు సాటి లేరు, న్యాయ సామాజిక ఆర్థిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశారు ఆయన, 1956 సంవత్సరంలో హిందూ మతం నుంచి బౌద్ధ మతాన్ని స్వీకరించారు ఈ బౌద్ధమతంలో ఆయనతోపాటు లక్షలాది మంది దళితులు సామూహికంగా బౌద్ధమతంలోకి మార్పిడి అయ్యారు, రాజ్యాంగం పుస్తకం లోని అనేక అంశాలను పాలక ప్రభుత్వాలు కుటిల రాజకీయాల కోసం రాజ్యాంగ పుస్తకాన్ని రూపుమాపడానికి చేయడానికి కుట్రలు చేస్తున్నారని దేశ ప్రజలు గాండ్రిస్తున్నారు , ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు, రోజు రోజుకు రాజ్యాంగాన్ని పూర్తిగా రూపుమాపే విధంగా కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని పదే పదే విమర్శలు వస్తున్నాయని ఇందుకోసం పాలక ప్రభుత్వాలు తక్షణమే రాజ్యాంగం సవరణ పేరుతో రాజ్యాంగాన్ని నిర్మూలిస్తే సహించేది లేదని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు 1990లో ఆనాటి భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది 1956లో అక్టోబర్ 29న నాగపూర్ కేంద్రంగా బౌద్ధమతం ధర్మదీక్షలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు ఇప్పటికీ ముంబైలో డియర్ అంబెడ్కర్ రాజగృహం ప్రస్తుతం రాజగిరి భవనంగా పేరు పెట్టారు అంబేద్కర్ స్మారక చిహ్నం ఇల్లు ముంబై నగరంలోని దాదర్ హిందూ కాలనీలో ఉంది ఈ రాజాగృహం రాజగిరి ని డిసెంబర్ 6న దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు సందర్శిస్తుంటారు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర గురించి ఆయన విద్యాభ్యాసం గురించి ఆయన చిన్ననాటి నుంచి అంటరానివాడిగా పాఠశాలలో అగ్రవర్ణాలు అంబేడ్కర్ పట్ల చూపిన వివక్షత వంటి అనేక సంఘటనలు ఇప్పటికీ రక్తపు మరకలు వెంటాడుతున్నాయి,ఎంత చెప్పినా అంబేద్కర్ గురించి తక్కువనే ఆయన జీవిత చరిత్ర ఎన్ని సంవత్సరాలు అయినా చెప్పడానికి సరిపడదు దేశవ్యాప్తంగా మొక్కుబడిగా జయంతి వేడుకలు వర్ధంతి వేడుకలు జరుపుకోవాలని ఆయన ఆశయాలను ఆ దేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ తాను రచించిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఈ సందర్భంగా ఈ దేశ రాజకీయ పార్టీల నాయకులు పాలక ప్రభుత్వాలకు చెందిన ప్రజాప్రతినిధులు చట్టసభల్లోని రాజ్యాంగ సభలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

పేద ప్రజల పక్షాన నిలబడేది సీపీఐ మాత్రమే

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్

కమ్యూనిస్టు పార్టీలో పలువురు చేరికలు

చేర్యాల నేటిధాత్రి….

పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడేది సీపీఐ పార్టీ మాత్రమేనని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు. చేర్యాల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కొమురవెల్లి, మద్దూరు మండలాలకు చెందిన పలువురు భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐలో చేరగా వారికి జిల్లా కార్యవర్గ సభ్యుడు అశోక్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన పార్టీ నాడు తెలంగాణ రైతంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి దున్నేవాడికే భూమి దక్కాలని 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచి 4500 మంది కమ్యూనిస్టులు రక్త తర్పణం చేసిన ఘనమైన చరిత్ర సిపిఐకే ఉందన్నారు. సాయుధ పోరాటం, స్వతంత్ర ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలలో కీలక భూమిక పోషించి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తూ పేద ప్రజల పక్షాన ఉండేది సీపీఐ మాత్రమే అని అన్నారు. బీఆర్ఎస్ నియంత, దొరల పాలనకు చరమగీతం పాడి ప్రజా సంక్షేమం కోరే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు సిపిఐ మిత్రపక్షంగా నిలబడి మార్పు కోసం సిపిఐ కృషి చేసిందని వారన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సిపిఐ ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ప్రజా సమస్యలే ఏకైక లక్ష్యంగా పనిచేస్తుందని గుర్తు చేశారు. సీపీఐలో చేరిన వారిలో పుల్లూరి మంజుల, తుప్పతి రాజు, తుప్పతి చిన్న రాజు, రమేష్, కృష్ణ, బాల రాజు, అనిల్ చేరారు. వారికి అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, డివిజన్ నాయకుడు జంగిలి యాదగిరి, మండల కమిటీ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి, అందె బాబు, జింకల బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా రైతులకు నీరు అందించాలి

రాష్ట్ర ప్రభుత్వం ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి

స్థానిక ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో రైతుల పంటలు ఎండి పోయాయి దుఃఖిస్తున్న రైతన్నకు సహాయంగా ప్రభుత్వం ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నీరు వెంటనే అందించి రైతులను ఆదుకోవాలని స్థానిక ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు వేసుకుంటే చేతికి అందే సమయంలో పంటపొలాలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయని వాపోయారు. వరి,మొక్కజొన్న పంటలకు ఇంకా రెండు, మూడు సార్లు నీళ్లు అందిస్తే పంటలు చేతికి వస్తాయని అన్నారు. కాబట్టి ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే కొన్ని చోట్ల వరి, మొక్కజొన్న పంటలు నీళ్లు అందక ఎండి పోయాయని, వెంటనే ఎండిపోయిన పంటలను సందర్శించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు ,స్థానిక ఎమ్మెల్యే వెంటనే చొరవ తీసుకొని ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని అన్నారు. ఎండిపోయిన పంటలపై సమగ్ర విచారణ జరిపి రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి కోరారు.

అమ్మ ఆదర్శ కమిటీల సమీక్ష సమావేశం.

చిట్యాల, నేటి దాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం రోజున రోజున అమ్మ ఆదర్శ కమిటీలతో మరియు పాఠశాల హెడ్మాస్టర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జడ్పీ సీఈవో విజయలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలైన డ్రింకింగ్ వాటర్ మరియు స్కూల్ కు సంబంధించిన ఏ పనులైన ఇకనుంచి అమ్మ ఆదర్శ కమిటీలు పర్యవేక్షణలో నిర్వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎంపీవో ఏపీవో పంచాయతీ కార్యదర్శులు అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్లు ఎంఈఓ పంచాయత్ రాజ్ ఇంజనీర్లు మరియు ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.

నర్సంపేట పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన సిపి

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మిక తనిఖీ చేసారు.ఈ తనిఖీల్లో భాగంగా ముందుగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారుల వివరాలతో పాటు పెండింగ్ కేసులు, స్టేషన్ పనితీరును పోలీస్ కమిషనర్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న నర్సంపేట రూరల్ ఇన్స్ స్పెక్టర్ రాజగోపాల్ ను అడిగి తెలుసుకున్నారు.

బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :

అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసిన సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామంలో చోటుచేసుకుంది. గిర్నిబావి గ్రామంలోని కిరాణా షాపుల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారన్న సమాచారం టాస్క్ ఫోర్స్ పోలీసులకు చేరింది. ఈ నేపథ్యంలో సదరు షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి సోదాలు చేశారు.ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తుల షాపుల నుండి రూ.75, 950 విలువ గల మద్యాన్ని పట్టుకున్నారు. షాపు యజమానులు రామోజీ, రాజు, ప్రభాకర్ లను మద్యంతో సహా దుగ్గొండి పోలీసులకు అప్పగించారు. అక్రమ మద్యం అమ్ముతున్న వారిపై కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బెల్ట్ షాపుల్లో మద్యం నిల్వ చేయడం, అమ్మకాలు చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ఏఎస్ఐ విజయ్ కుమార్ హెచ్చరించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు , దుగ్గొండి ఏఎస్సై అనిశెట్టి విజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది గుండెబోయిన వీరస్వామి గౌడ్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబ్ పేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎంపీ అభ్యర్థి సి డబ్ల్యూ సి ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ చల్లా వంశీ చంద్ రెడ్డి, జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి, డిసిసి అధికార ప్రతినిధి దుశాంత్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, పాల్గొన్నారు. శ్రీ చెల్లా వంశీ చంద్ రెడ్డి మాట్లాడుతూ,ఈ ఎన్నికలలో జడ్చర్ల నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి 50వేల మెజారిటీ ఇస్తామని అనిరుద్ రెడ్డి అన్న మాట ఇచ్చారన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే మాటను నెరవేర్చే బాధ్యత కార్యకర్తలదే ననిఅన్నారు. అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన విధంగానే మహబూబ్ నగర్ ఎంపీగా నన్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్నివేళలా అందుబాటులో ఉంటామని మీకు సేవ చేసే బాధ్యత మాదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జహీర్ అక్బర్,వాసు యాదవ్, మండల అధ్యక్షులు నీరేటి రామచంద్రయ్య, తులసి రామ్ నాయక్, కొల్లూరు కాజా పాషా, అమ్మపూర్ నర్సింలు, అంతయ్య, వివిధ గ్రామాల నాయకులు పెద్దలు కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమకారులకు ఆసరా ఎప్పుడు

కెసిఆర్ టిఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు గుర్తొస్తుందా

రామయంపేట (మెదక్) నేటి ధాత్రి 

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యమకారులకు ఉపాధి ఇవ్వాలి ఉద్యమ సమయంలో లాఠీ దెబ్బలకు చెరసాలలకు బలైన వారిని గుర్తించాలి ఆధారాలతో పోలీస్ రికార్డులలో ఉన్నవారికి తప్పనిసరిగా హాజరై ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది అమరవీరుల త్యాగాలు యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాలు యువకుల ప్రభుత్వ ఉద్యోగుల బలిదానాలు తెలంగాణ రావడానికి నిదర్శనాలు కేసీఆర్ మాయ నాటకాలతో అధికారం చేపట్టి పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన ఉద్యమకారులను గుర్తించిన పాపాన పోలేదు ఓట్లు అడగడానికి రావడానికి బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం అధికారం లేదు టిఆర్ఎస్ నాయకులను అభ్యర్థులను తరిమి తరిమి కొట్టండి మాజీ టిఆర్ఎస్ నాయకుడు పోలీస్ కేసుల్లో ఇరుక్కొని జీవితాన్ని బలిదానం చేసుకున్న లెక్చరర్ పోలీస్ దేవేందర్ ఆవేదన.. ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రచారానికి రావడం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులను ఆదుకుంటామని ఎన్నికల్లో హామీ ఇవ్వడం స్వాగతిస్తున్నామన్నారు. వీలైనంత తొందరగా ఉద్యమకారులకు మంచి శుభవార్త చెప్పాలని ఆయన కోరారు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఉద్యమకారులను గుర్తించి ఆలోచించిందని గతంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కనీసం ఆ ఊసు కూడా తీయలేదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యమకారులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

భాజపా విజయ సంకల్ప సభ బయలుదేరిన నాయకులు.

నర్సంపేట,నేటిధాత్రి :
భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో
మహబూబాబాద్ పార్లమెంట్ పోలింగ్ బూత్ అధ్యక్షుల విజయసంకల్ప సమ్మేళన సభకు నర్సంపేట నియోజకవర్గ యువ నాయకులు,చేరికలు కమిటీ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి,నర్సంపేట పట్టణ బీజేపీ అధ్యక్షులు శీలం రాంబాబు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని నాయకులు బయలుదేరి వెళ్లారు.ఈ
కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కమిటీ, వివిధ బూత్ అధ్యక్షులు,నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు మానుకొని ……..అభివృద్ధి పై దృష్టి పెట్టాలి

#అభివృద్ధి చేయండి అంటే….. కాంగ్రెస్ పార్టీకి భయమెందుకు.

#ఒక్క రోడ్డు నిధులు ల్యాప్స్ అయినా పూర్తి భాద్యత ఎమ్మెల్యే దొంతిదే.

# రోడ్ల పనులు ప్రారంభం అయ్యే వరకు మండలప్రజలకు మద్దతుగా ఉంటాం.

#కమిషన్ల కోసం కక్కుర్తి పడే వ్యక్తి ఎవరో…. నియోజకవర్గ ప్రజలకు తెలుసు.

#మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి..

నల్లబెల్లి, నేటి ధాత్రి: మండల కాంగ్రెస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు మానుకొని మండల అభివృద్ధిపై దృష్టి సారించాలని లేనియెడల రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల చేత గుణపాఠం తప్పదని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి అన్నారు శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృషితో గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక నిధులతో మండలంలో 14 బీటీ రోడ్లు మంజూరు చేస్తే ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం పట్ల గ్రామాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తు శాంతియుత నిరసన వ్యక్తం చేస్తుంటే జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు కమీషన్లు అంటూ మాజీ ఎమ్మెల్యే పై చిల్లర, చౌక బారు మాటలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు..ఏవరు కమిషన్లకు ఆశపడి ప్రాజెక్టు ఆపారో….. కాంట్రాక్టర్ల దగ్గర ఏవరు కమీషన్లు తీసుకుంటారో….. నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసన్నారు.ఇప్పటికైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉకదంపుడు మాటలు మానుకొని ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తే బాగుంటుందని.ప్రజలు మాకు ఈ ఐదేళ్లు ప్రతి పక్ష పాత్ర ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం మండల ప్రజల పక్షాన సమర్ధవంతంగా పోరాడుతామన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు గడవక ముందే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని మండలంలోని మంజూరైన14 బీటీ రోడ్లను వేసవికాలంలోపు పూర్తి చేయకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో తిరగడం కూడా కష్టమవుతుందని ఆయన ఎద్దేవా చేశారు. సమావేశంలో మాజీ ఎంపీపీ కక్కేర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, క్లస్టర్ భాద్యులు గందే శ్రీనివాస్ గుప్తా, ఇంగ్లీ శివాజీ, సట్ల శ్రీనివాస్ గౌడ్,ఎంపీటీసీ జన్ను జయరావ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్, ఎం.డి నన్నేసాహెబ్, గాదె కేశవరెడ్డి, యువ నాయకులు అంబరగొండ రాజు, గుమ్మడి వేణు తదితరులు పాల్గొన్నారు..

బిటీ రోడ్ల పనులను వెంటనే ప్రారంభించాలి

# భారాస మండల కమిటీ అధ్వర్యంలో నిరసన

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృషితో గత ప్రభుత్వ హయాంలో బిటి రోడ్లు మంజూరై పనులు ప్రారంభం కాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ పనులను ప్రారంభం చేయాలని భారాస పార్టీ నర్సంపేట మండల కమిటీ అధ్యక్షుడు నామాల సత్యనారయణ ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మండల అధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం గత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లి నుండి ధబ్బిడిపేట వరకు బిటి రోడ్డు, జంగాలపల్లి నుండి 365 జాతీయ రహదారి వరకు బిటి రోడ్డు,
చింతగడ్డ నుండి రాజుపేట వరకు బిటి రోడ్డు, బాంజిపేట నుండి ఇటుకాలపల్లి వరకు బిటి రోడ్డు,నాగూర్లపల్లి నుండి నారాయణ తండా వరకు బిటి రోడ్డు,
బాంజీపేట నుండి బోజ్యనాయక్ తండ వరకు బిటి రోడ్డు,నాగుర్లపల్లి నుండి కమలాపురం వరకు బిటి రోడ్డు,
నాగుర్లపల్లి నుండి ఎన్టీఆర్ నగర్ వరకు బిటి రోడ్డు,కమ్మపెళ్లి నుండి మహమ్మదాపురం వరకు బిటి రోడ్డు,
దాసరిపల్లి నుండి బాంజీపేట వరకు బిటి రోడ్డు, శివాని పబ్లిక్ స్కూల్ నుండి రామవరం వరకు బిటి రోడ్డు పనులు ఆగిపోవడం వలన ప్రస్తుత ఎమ్మెల్యే వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వం తరపున ఈ ఎండా కాలంలోపే పనులు ప్రారంభం అయ్యేలా కాంట్రాక్టర్లు, అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. ఎండాకాలం తర్వాత వర్షాకాలంలో పనులు చేయడం సాద్యం కాదని తద్వారా నిధులు ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహ రాములు, క్లస్టర్ బాధ్యులు కోమండ్ల గోపాల్ రెడ్డి, మోతే పద్మనాభరెడ్డి, తాళ్లపల్లి రాంప్రసాద్, భూక్య వీరన్న, కడారి కుమారస్వామి, స్థానిక సర్పంచ్ మండల రవీందర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు లకిడే రాజేశ్వరరావు, మాజీ ఉపసర్పంచ్ జమండ్ల చంద్రమౌళి, కన్నెబోయిన రాజు, ఉల్లిరావు సాంబయ్య, ఉల్లిరావు నరసింగం,సొనబోయిన కుమార్, స్థానిక రైతులు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గాంధీజీ స్కూల్ కు వాటర్ కన్జర్వేషన్ స్టేట్ లెవెల్ అవార్డు

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
నల్లగొండ జిల్లా చండూర్ లోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు జలమండలి సూచనల మేరకు, జల సంరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలు పిలుపుమేరకు చండూర్ గాంధీజీ స్కూల్ అపూర్వ స్పందనతో స్పందించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు జల సంరక్షణ పై అవగాహన కల్పిస్తూ వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేసి, జల సంరక్షణ పట్ల వారిలో ఆసక్తిని పెంపొందించడమే కాకుండా ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మార్చి 22న సామూహికంగా జల ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అందుకుగాను జలమండలి, మమత ఎడ్యుకేషనల్ సొసైటీ, సేవ్ ఎర్త్ ఫౌండేషన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల సమన్వయంతో జల ప్రతిజ్ఞను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. అందులో పాల్గొన్నందుకు మార్గదర్శకంగా జల సంరక్షణ కోసం వివిధ కార్యక్రమాలలో భాగస్వాములైన గాంధీజీ స్కూల్ చండూరు యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తూ, వాటర్ కన్జర్వేషన్ -2024 అవార్డును గాంధీ సంస్థల వైస్ చైర్మన్, మమత ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి, సేవ్ ఎర్త్ ఫౌండేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ టి. సురేందర్ లు గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ సరికొండ వెంకన్న, ఎ ఎస్ ఎన్ మూర్తి లకు అవార్డు ను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమం ముఖ్య అతిథులు డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఇంటిలో కనీసం మూడు మొక్కలు, ఒక ఇంకుడు గుంతను తప్పక నిర్మించుకొని, వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవాలి అన్నారు. భూగర్భ జలాల పెంపు కోసం కృషి చేస్తేనే భవిష్యత్తు తరాలకు నీటిని అందివ్వటం సాధ్యపడుతుందన్నారు. నీటి కొరత ఏర్పడకుండా ఉండాలంటే నీటి వృధాను ప్రతి ఒక్కరూ అరికట్టాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం కోసం సాంకేతిక సలహాలు, సూచనల కోసం జలమండలి భూగర్భజల విభాగం సహాయ సంచాలకులు జాల సత్యనారాయణ ను 998 998 5102 ఫోన్ నెంబర్ లో సంప్రదించవచ్చు. లేదా స్వచ్ఛంద సంస్థ ల ప్రతినిధులను సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మమత ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ యానాల రాధిక, సేవ్ ఎర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ టి సురేందర్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సీఈఓ చైతన్య రెడ్డి, పి. సాయి తదితరులు పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా బిజెపి కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా ముఖ్య నాయకుల సమావేశం శనివారం రోజు పాలమూరు జిల్లా ఎస్సీ మోర్చా కొంగలి శ్రీకాంత్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ బీజేపీ
జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంట్ మోర్చా ఇంచార్జ్ గోవర్ధన్ జి , కేంద్ర డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డు మెంబర్ నరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామ గ్రామాన దళిత సమ్మేలాలను ఏర్పాటు చేస్తూ బిజెపి గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేసి రాబోయే రోజుల్లో నియోజకవర్గస్థాయిలో దళిత సమ్మేళనాల కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎమ్మార్పీఎస్ నాయకులు మరియు దళిత సంఘ నాయకులు బిజెపి ఎస్సీ మోర్చా సర్పంచ్ లు వార్డ్ మెంబర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు..

ఈ కార్యక్రమంలో డాక్టర్. కొంగళి శ్రీకాంత్ అడ్వకేట్ బీజేపీ ఎస్సీ మోర్చా పాలమూరు జిల్లా ప్రెసిడెంట్
పాలమూరు పార్లమెంట్ ఎస్సీ మోర్చా ఇంచార్జ్, ఎస్సీ మోర్చా పాలమూరు పార్లమెంట్ సహా ఇన్చార్జ్ ఎడ్ల కృష్ణయ్య ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండన్న ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి, మిట్టమీది నాగరాజు జిల్లా ఉపాధ్యక్షులు, రాము ఎస్సీ మోర్చా సింగిల్ విండో డైరెక్టర్, చిన్నప్ప ఎస్సీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు రిటైర్డ్ పోలీస్ ఎస్ఏ మోర్చా కార్యదర్శి ముక్కుని స్వామి రేపు జరగబోయే అంబేద్కర్ జయంతికి ప్రతి ఒక్క బీజేపీ దళిత నాయకులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు..

మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన నాగూర్ల వెంకన్న

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామ వాస్తవ్యులు పెద్దిరెడ్డి సమ్మిరెడ్డి శుక్రవారం నాడు చనిపోయాడు. వరంగల్ ఉమ్మడి జిల్లా ఫర్టిలైజర్ జిల్లా అధ్యక్షుడు నాగూర్ల వెంకన్న చనిపోయినచిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ఫర్టిలైజర్ డీలర్లు మరియు గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా పని చేయాలి:ఎమ్మెల్యే కృష్ణారావు

కూకట్పల్లి,ఎప్రిల్ 13 నేటి ధాత్రి ఇన్చార్జి

శనివారం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మల్కా జ్‌గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా బాలాజీన గర్ డివిజన్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సందర్భంగా కూ కట్‌పల్లి నియోజకవర్గం నుంచి అ త్యధిక మెజారిటీతో బిఆర్‌ఎస్‌ నిగెలిపించుకుందామని.ఎన్నోవేల కోట్ల రూపాయలతో బి.ఆర్.ఎస్ పార్టీ హయం లో నాటి ముఖ్య మంత్రి కేసీఆర్ కూక ట్పల్లి నియో జకవర్గంతో పాటు తెలంగా ణ రా ష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రం
గా నిలబెట్టారు.శాంతిభద్రతలు విష యంలో అత్యాధునిక టెక్నాలజీతో పోలీస్ కంట్రోల్ రూమ్,ఎక్కడికి అ క్కడఫ్లైఓవర్లు,భూగర్భ డ్రైనేజ్ వ్యవ స్థతో పాటు సిసి రోడ్లు,పార్కు లు ఇంకా ఎంతో అభివృద్ధి చేశార ని.అంతేకాకుండా మురుగునీటి వ్యవస్థను శుద్ధి చేయడానికి ఎస్ టి పి ప్లాంట్ల నిర్మాణం చేపట్టామన్నా రు.చేసిన అభివృద్ధికి మనం ఓట్లు వేసి బి ఆర్ ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డికి అత్యధిక మెజారిటీ ఇద్దామని పిలు పునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సుభాష్ రెడ్డి,కార్పొరేటర్ పగుడాల శిరీష బాబు రావు,నియోజకవర్గ కోఆర్డినేటర్
సతీష్ అరోరా,అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్,పాతూరి గోపి,పవన్,డాక్టర్ వెంకటేష్,నాయకులు,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బీ.పీ మండల్ వర్ధంతి

గొల్లపల్లి నేటి ధాత్రి:
గొల్లపల్లి మండల కేంద్రంలో వైస్ ఎంపీపీ ఆవుల సత్యం ఆధ్వర్యంలో బిందేశ్వరి ప్రసాద్ మండల్ ( బి. పి. మండల్)వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది .ఈ సందర్బంగా ఆవుల సత్యం మాట్లాడుతూ (ఓ బిసి) రిజర్వేషన్ పితామహుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు, దివంగత ప్రజా నాయకుడు 40 ప్రతిపాదనలతో మండల్ నివేదికను పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టాలని 1990వ సంవత్సరంలో ఆగష్టు 7వ తేది రోజు పార్లమెంట్ లో మండల్ నివేదికను ప్రవేశ పెట్టిన ఓబిసి రిజర్వేషన్ పితామహుడని అయన అన్నారు. దివంగత బిందేశ్వరీ ప్రసాద్ మండల్ ( బి పి మండల్) … అందరివాడు అందరిలో కలిసి మెలిసి ఉండే మనిషి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. ఈ సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు .ఈ కార్యక్రమం లో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు నర్సాపురం రవీందర్, కురుమ సంఘం రాష్ట్ర నాయకులు కచ్చుకొమురయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గంగాధర నరేష్, యాదవ సంఘం గొల్లపల్లి మాజీ అధ్యక్షులు ఆవుల లచ్చన్న , సంఘం ఉపాధ్యక్షులు సందేవేని సతీశ్ ,ప్రధాన కార్యదర్శి ఆవుల వెంకటేష్ ,కాలువ కొమురయ్య, కృష్ణ ,కొమల్ల జలంధర్, మల్లయ్య, కన్ను తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ విరమణ సన్మానోత్సవం

ఆటపాటలతో చిందులేసిన విద్యార్థులు

ఉపాధ్యాయవృత్తి మహోన్నతమైనది ఎంఈఓ రమాదేవి

శాయంపేట నేటి ధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో ప్రైమరీ స్కూల్ ప్రధానోపా ధ్యాయులు పదవి విరమణ సన్మానోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. 1983 సంవత్సరంలో ఉపాధ్యా యురాలుగా ఎంపికై 40 సంవత్సరాలు విద్యాక్షేత్రంలో అమూల్యమైన సేవలందించిన 2024 సంవత్సరం ఏప్రిల్ ఉద్యోగ విరమణ పొందుతున్న చిదురాల శశికళ దేవి పదవి విరమణ మహోత్సవం జరిగిందిఈ పదవీ విరమణ మహోత్సవంలో విద్యార్థులు ఆటపాటలతో అలరించి శశికళ దేవి దంపతులను మండల పరిధిలోని ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు పూలమాలలు, శాలువాలు సత్కరించారు . విద్యార్థులు వీడ్కోలు శుభాకాంక్షలు తెలిపారు.జననం ఆదర్శవంతమైన ఉపాధ్యాయ వృత్తిలో 40 సంవత్సరాలు అమూల్యమైన సేవలందించిన తెలంగాణ ప్రభుత్వం చే ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు గ్రహీత, ఎందరో మన్నలను పొందిన ఓరుగల్లు గడ్డపై పుణ్య దంపతులైన చిదు రాల వీరయ్య చిలకమ్మా దంపతుల ఐదవ సంతానంగా 12-04-1963 లో జన్మించారు. ఉపాధ్యాయ వృత్తి ,కుటుంబ బాధ్యతలు, మార్గదర్శకాలు పాటిస్తూ అనంతరం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం ఉండాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో ఎం ఎన్ ఓ వెంకటేశ్వర రావు, పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు తిరుప తిరెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీహరి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యా యురాలు మాధవి చంద్రమౌళి శ్రీలత పి ఆర్టియు మండల అధ్యక్షులు రాజా యుగేందర్ ప్రధాన కార్యదర్శి బానోతు సుధాకర్ రాథోడ్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

నిత్యావసర సరుకులను అందించిన యువజన కాంగ్రెస్ నాయకులు

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని చిట్యాల పద్మ, బత్తిని విజయ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుర్రం శ్రీకాంత్ తండ్రి లక్మిరాజం మరణించగా వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి. అనంతరం ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం, వంట నూనె నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో యువజన కాంగ్రెస్ చొప్పదండి అసెంబ్లీ ఉపాధ్యక్షులు మామిడి దిలీప్ కుమార్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్, యువజన కాంగ్రెస్ చొప్పదండి అసెంబ్లీ నాయకులు అనుపురం పరశురామ్ గౌడ్, గ్రామస్తులు పూరేళ్ళ మనోజ్, అనుపురం శ్రీనివాస్, బత్తినీ విజయ్, కారుపాకల నరేష్, తదితరులు పాల్గొన్నారు.

కోటగుళ్ళను సందర్శించిన జర్మన్ దేశస్థుడు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళను శనివారం జర్మన్ దేశస్థుడు తుబి యాస్ సందర్శించారు. కొచ్చి నుండి ద్విచక్ర వాహనంపై వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ కోటగుళ్ళకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటగుళ్ల శిల్ప సంపద అద్భుతంగా ఉందని ఫోటోలు వీడియోలను చిత్రీకరించుకున్నారు. మరోసారి తమ బృందంతో కోటగుళ్ళు కు వస్తామని తుబి యాస్ తెలిపారు.

ముదిగుంట అడవులలో అగ్ని ప్రమాదాలు జరగకుండా అవగాహన సదస్సు

ప్లాంటేషన్ మేనేజర్ జి. సురేష్ కుమార్

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం సహజసిద్దంగా పెరిగే అడవులు, పెంచుతున్న ప్లాంటేషన్ లు మానవ నిర్లక్ష్యం తో కాలితే పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతుందని అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ -1 ప్లాంటేషన్ మేనేజర్ జి. సురేష్ కుమార్ అన్నారు.శనివారం జైపూర్ మండలం ముదిగుంట గ్రామ సమీపంలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కు చెందిన నీలగిరి ప్లాంటేషన్ లో మంచిర్యాల రేంజ్ -2 ప్లాంటేషన్ మేనేజర్ ఇ.లక్ష్మణ్ తో కలిసి గ్రామస్థులకు అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ వేసవి కాలంలో అటవీ ప్రాంతం మీదుగా వెళ్లే వారిలో కొందరు బీడీలు, సిగరెట్ లు తాగి నిర్లక్ష్యం తో పడేయడం వల్ల అడవికి నిప్పు అంటుకునే ప్రమాదాలు ఉన్నాయన్నారు.అగ్ని ప్రమాదాల నివారణకు మేము అన్ని జాగ్రత్త లు తీసుకున్నప్పటికీ కొందరి నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.అడవులు, ప్లాంటేషన్ లు కాలితే అవి ప్రాణ వాయువు ఆక్సిజన్ ను విడుదల చేయలేవని, తద్వారా పర్యావరణానికి విఘాతం కలుగుతుందన్నారు.దీంతో మానవాళి మనుగడతో పాటు ఇతర జీవరాశుల కు నష్టం కలుగుతుందన్నారు. చెట్లు సమృద్ధిగా పెరిగితే మంచి వర్షాలు వస్తాయని, కాలుష్యం తగ్గి పర్యావరణ సమతుల్యత ను కాపాడతాయన్నారు. కావున అడవులలో, ప్లాంటేషన్ లలో అగ్ని ప్రమాదాల నివారణకు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. ఒకవేళ ప్రమాదవశాత్తు మంటలు అంటుకుంటే అటవీ అధికారులకు వెంటనే సమాచారం ఇచ్చి సామాజిక భాద్యత గా మంటలు అర్పివేయాలన్నారు.ఈ కార్యక్రమం లో మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ లు సురేష్ కుమార్, లక్ష్మణ్ లతో పాటు ఫీల్డ్ సూపర్వైజర్ లు రాజేష్, శ్రీనివాస్, వాచర్ లు శంకర్, సాయికిరణ్, లచ్చన్న, ఓదెలు, రాకేష్,సాయికృష్ణ,గ్రామస్తులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version