కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలి.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు.

చిట్యాల, నేటి ధాత్రి :

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలంలోని కాంగ్రెస్ పార్టీ కమీటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గారితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యగారు మాట్లాడుతూ..
రాష్ట్రంలో కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య అన్నారు. శనివారం రోజు చిట్యాల మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కేంద్రంలో బీజేపీ పార్టీ పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రనికి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోగా 32 వేల ఉద్యోగాలను కల్పించిదన్నారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టి ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ప్రజల ఆదరణను పొందుతుందని అన్నారు. వరంగల్ జిల్లాలో పేదలకు వైద్యం అందించడంతో పాటు, కడియ ఫౌండేషన్ ద్వారా అనేక సేవలు అందించాని ఎంపీ అభ్యర్థి కడియం కావ్య తెలిపారు. భారతీయ జనతా పార్టీ పదేళ్ల పాలనలో వరంగల్ జిల్లా అభివృద్ధికి చేసింది ఏమీ లేదు. కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, స్థానికులకు ఉపాధి అవకాశాలు లేక నష్టం పోయారని పేర్కొన్నారు. బీజేపీ అంటేనే మతతత్వ పార్టీ, దుర్మార్గపు పార్టీ అని అన్నారు.
బీజేపీ సర్కార్‌లో దళితులకు అన్యాయం జరుగుతోందని వెల్లడించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒక్కటే అని ఎవరికి ఓటు వేసిన నష్టపోయేది ప్రజలే అన్నారు. భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పవని పేర్కొన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 14 ఎం.పీ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదిస్తే మీతో ఉండి ఈ నియోజకవర్గన్ని మరింత అభివృద్ధి చేస్తానని వరంగల్ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, జాతీయ కార్యదర్శి కత్తి వేంకట స్వామి, మహిళా జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి, మార్క విజయ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాం నరసింహారెడ్డి, జడ్పిటిసిలు తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ అనిల్, మాజీ జడ్పిటిసి సాయిలు, వర్కింగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్ జిల్లా నాయకులు కిషన్ మధు వంశీకృష్ణ , కామిని రత్నాకర్ రెడ్డి మరియు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ ని భారీ మెజార్టీ తో గెలిపించాలి

భద్రాచలం నేటి ధాత్రి

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి – రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ మరియు జిల్లా డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య

ఈరోజు భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడు, వెంకటాపురం మండలాల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం లో ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మరియు రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ పోదెం వీరయ్య పాల్గొన్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ బలరాం నాయక్ ఎంపీ గా,కేంద్ర మంత్రి గా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి రోడ్ సౌకర్యం మరియు ఆస్పత్రిల నిర్మాణం, కొత్త గ్యాస్ కనెక్షన్లు, వెనుకబడిన ఈ ఏజెన్సీ ప్రాంతానికి అభివృద్ధి పథంలో నడిపించిన బలరాం నాయక్ ని మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని వీరయ్య పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ,పార్లమెంట్ ఎన్నికల కోఆర్డినేటర్ దుర్గ ప్రసాద్,సీనియర్ నాయకులు చింతిరియాల రవి,కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ,మోహన్ రావు,మండల పార్టీ అధ్యక్షులు జానర్జన్,హుస్సేన్,బ్లాక్, మండల గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరైనారు

ఎస్సీ కాలనీ గణపురంలో పైపులైన్ మరమ్మత్తులు

గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో గల అన్ని గ్రామ పంచాయతీల్లో ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా ప్రతి గ్రామంలో చేతిపంపులు బోరు మోటార్లను పైపులైన్లు గేట్ వాల్ రిపేర్ చేయడం జరిగింది అత్యవసరం అయితే ట్యాంకర్ల ద్వారా ప్రతి వార్డుకు నీటి అందజేయడానికి తగిన ఏర్పాటు చేస్తామని అన్ని గ్రామం ల లో ఇంకా అత్యవసరం అనుకుంటే కమ్యూనిటీ బోర్ వెల్స్ రైతుల వ్యవసాయ భూముల వద్ద గల బోర్వెల్స్ ను అద్దెకి తీసుకొని నీటి ని అందజేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు అంతేకాకుండా మండలంలోని ఎవరు నీటిఎద్దడి పై ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని నీటికి పొదుపుగా వాడుకోవాలని మండల ప్రజల ను ఎంపీడీవో ఎల్ భాస్కర్ కోరారు

మోకుదెబ్బ అధ్వర్యంలో గౌడ సంఘానికి సన్మానం.

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో గీత కార్మిక పారిశ్రామిక సహకార సంఘం అధ్వర్యంలో శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయ మూడవ వార్షికోత్సవం సందర్భంగా గత నాలుగు రోజులుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఈ నేపధ్యంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గౌడ సంఘం నూతన కమిటీ సభ్యులకు శాలువాలతో ఘనంగా సన్మానించారు.లక్నేపల్లి సంఘం అధ్యక్షుడు మర్ధ సురేష్ గౌడ్
అధ్యక్షతన జరుగగా ముఖ్య అతిదులుగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్,జిల్లా అధ్యక్షుడు గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్ హాజరైయ్యారు.ఈ కార్యక్రమంలో సంఘంఉపాధ్యక్షులు మర్ధ సదయ్య గౌడ్,కార్యదర్శి గోడిశాల సురేష్ గౌడ్,
మోకుదెబ్బ రాష్ట్ర నాయకులు మచ్చిక రాజు గౌడ్,మద్దెల సాంబయ్య గౌడ్,జిల్లా ఉపా జూలూరి హరిప్రసాద్ గౌడ్,డివిజన్ ఆధ్యక్షుడుకందుల శ్రీనివాస్ గౌడ్,లక్నేపల్లి సంఘం సహ కార్యదర్శి గోడిశాల క్రాంతి గౌడ్,కమిటీ సభ్యులు మడ్డి రమేష్ గౌడ్,కక్కేర్ల సమ్మయ్య గౌడ్,కత్తి విక్రమ్ గౌడ్,కత్తి వేణు గౌడ్,మర్ధ లక్ష్మినర్సు గౌడ్,మునిగల రాజేందర్ గౌడ్,మర్ధ సంతోష్ గౌడ్,గోడిశాల కృష్ణ గౌడ్,కోల రవీందర్ గౌడ్,గొట్టేపర్తి రమేష్ గౌడ్,మాజీ సర్పంచ్ గోడిశాల రాంబాబు గౌడ్,మచ్చిక రాజ్ కుమార్ గౌడ్,గుండెబోయిన సాగర్ గౌడ్ పలువురు గౌడ కులస్తులు పాల్గొన్నారు.

సాంఘిక విప్లవ మూర్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని జయప్రదం చేద్దా

మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ.

భద్రాచలం నేటిదాత్రి

స్థానిక అంబేద్కర్ సెంటర్లో మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశన్ని ఉద్దేశించి మహనీయుల జయంతుల ఉత్సవ కమిటీ నిర్వాహకులు ముద్దా పిచ్చయ్య, అలవాల రాజా పెరియర్, గురుజాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…..

సామాజిక విప్లవ మూర్తి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్ టి, బి సి , మైనార్టీ, అంబేద్కర్ వాదుల ఆధ్వర్యంలో ఘనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి నిజమైన అంబేద్కర్ వాదులు, ఉద్యోగస్తులు, న్యాయవాదులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగబద్ధ రిజర్వేషన్, హక్కులు పొందుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థ ఉద్యోగస్తులు కార్మికులు, కర్షకులు, అంబేద్కర్ అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కొప్పుల శేఖర్, ఆదివాసి నాయకులు మర్మం చిట్టిబాబు, ఇర్పా శీను, కొమ్మ గిరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

పెద్ది చౌకబారు రాజకీయాలు మానుకో.

#నిస్వార్థ రాజకీయాలు చేసే వ్యక్తి మాధవరెడ్డి.

#ఓటమిని తట్టుకోలేక ప్రభుత్వంపై ఆరోపణలు.

#మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి: గత ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గంలో తన అనుచర వర్గంతో కలసి చిల్లర రాజకీయాలు చేస్తూ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రజల చేత మళ్లీ గుణపాఠం తప్పదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి అన్నారు శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తను గెలిచినా తరువాత నియోజకవర్గని పట్టించుకోకుండా ఎన్నికల ముందు హడావిడిగా అమలు కాని జీవోలను తీసుకొచ్చి తన పార్టీ నాయకులకు కాంట్రాక్ట్ పనులను ఇప్పిoచుకొని వారివద్దనుండి ఐదు శాతం కమిషన్ తీసుకొని రోడ్ల పనులను ప్రారంభించారు ఎన్నికలలో ఓటమి చెందిన తరువాత పెద్దికి మతి బ్రమించి చిల్లర రాజకీయాలకు పాల్పడుతు తాను కాంట్రాక్ట్ పనులు ఇప్పించిన నాయకులచేత పనులను నిలిపివేంచి ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి పనులను అడ్డుకుంటున్నారని దుస్ప్రచారం చేస్తు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసి రాజకీయ పబ్బం గడుపుతున్నాడని ఇప్పటికైనాపెద్ది సుదర్శన్ రెడ్డి చౌకబారు రాజకీయాలు మానుకొని ప్రజలకి కల్గించిన అసౌకర్యానికి క్షమాపణ చెప్పి తాను పనులు ఇప్పించిన నాయకుల చేత రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయించని యెడల ప్రజల చేతిలో మరోసారి భంగపాటు తప్పదు అని ఆయన హెచ్చరించారు .ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి చార్ల శివారెడ్డి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాలఅశోక్, ఇస్తారీ శేఖర్ గౌడ్ ,నాయకులు మాలోత్ చరణ్ సింగ్ ,పురుషోత్తం సురేష్ , పెంతల కొమురరెడ్డి , బౌసింగ్ ,జెట్టి రామూర్తి ,ఎరుకల రవీందర్ ,బత్తిని మల్లయ్య, వడ్లురి రమేష్, పోగుల కుమారస్వామికృష్ణ, ఇమ్మడి కుమారస్వామి ,మధు ,రఘపతి, వైనాలపవన్, నల్లగొండ సుధాకర్, గండు మహేందర్, అంగోత్ రఘు, బోట్ల కుమారస్వామి, సారయ్య , మొగిలి తదితరులు పాల్గొన్నారు.

ఇంచార్జి ఎంపీపీని సన్మానించిన బిరెడ్డి కరుణాకర్ రెడ్డి

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో రామడుగు మండల పరిషత్ ఇంచార్జి ఎంపీపీగా ఇటివల బాధ్యతలు స్వీకరించిన పూరెల్ల గోపాల్ గౌడ్ ని ఆలిండియా రెడ్డి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బిరెడ్డి కరుణాకర్ రెడ్డి ఘనంగా సన్మానించిన అనంతరం స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో పంజాల శ్రీనివాస్, గాజుల శ్రీనివాస్, నీలం లక్ష్మీరాజ్యం, రాజమౌళి, రాజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ.. అందని కూలి…

మండు వేసవిలో పని చేసిన అందని కూలి

వేములవాడ రూరల్ నేటి ధాత్రి

జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో పనిచేసే కూలీలకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు వారం వారం చెల్లించాల్సిన బిల్లులని నెలల పాటు పెండింగ్ పెడుతున్నారు వేములవాడ రూరల్ మండలాల్లో పనిచేసే కూలీలు
మండు వేసవిలో పని చేసిన ఉపాధి కూలీల వేతనాల కోసం
తమ కష్టఫలాన్ని పొందేందుకు కండ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వస్తుందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీరంతా గ్రామీణ ప్రాంతంలోని నిరుపేదలే కాబట్టి ఇల్లు గడిచేందుకు కూడా అవస్థలు పడుతున్నారు ప్రస్తుతం వేసవి కావడంతో ఇతర పనులు కూడా కరువై కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని వాపోతున్నారు రెండు మూడు నెలలుగా డబ్బులు జమ కాకపోవడంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు దృష్టి సారించి తమ సమస్య తీర్చి పెంచిన కూలీ వేతనాలను ఖాతాల్లో జమ చేయాలని కూలీలు అభ్యర్థిస్తున్నారు

అవకాశవాదులకు మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడేది ఎర్రజెండానే….

కమ్యూనిస్టుల గెలిపే ప్రజల గెలుపు..

అవకాశవాద రాజకీయాలను తరిమికొట్టాలి…

ధన బలం , ప్రజాబలం మధ్య బోనగిరిలో పోటీ …

మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే , సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి..

సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జాంగిర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి..

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:

అవకాశవాదులకు , మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడేది ఎర్రజెండానే అని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే , సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు . శనివారం మండల కేంద్రంలోని సత్య ఫంక్షన్ హాలో నిర్వహించిన మునుగోడు మండల సిపిఎం జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడే సిపిఎం బోనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ ను పార్లమెంటుకు పంపేందుకు ప్రజలను కోరారు . భువనగిరి గడ్డపైన సిపిఎం గెలిస్తే ప్రజల పక్షాన పార్లమెంటులో ప్రజా గొంతుకై కమ్యూనిస్టులు వినిపిస్తారని పేర్కొన్నారు. పది సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్న బిజెపి ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బిజెపి పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ ప్రైవేట్ పరం చేస్తూ దేశంలో ఎన్నడు లేని విధంగా నిరుద్యోగమును పెంచి పోషించిందని అన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటాలు చేసిన చరిత్ర ఎర్రజెండదని అన్నారు . భువనగిరి పార్లమెంటు పరిధిలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలలో ఒకపక్క ధన బలంతో వస్తున్న అభ్యర్థులకు , మరోపక్క ప్రజల బలంతో వస్తున్న సిపిఎం అభ్యర్థికి జరుగుతున్న యుద్ధంలో ఎగిరేది ఎర్రజెండా అనే అని ధీమా వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే పేద ప్రజలకు అండగా ఉండి పేద ప్రజల న్యాయం కోసం పోరాడే ఎర్రజెండా పక్షాన నిలిచి ప్రజలు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్మికులు కర్షకులు కొట్లాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాస్తూ పెట్టుబడుదారులకు కొమ్ముగాసే విధంగా బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను ఎత్తివేసేందుకు కుట్ర పండడం సిగ్గుచేటని అన్నారు. రాజ్యాంగం రక్షించాలన్న , ప్రజాస్వామ్యంను పరిరక్షించాలన్న కేంద్రంలో బిజెపిని సాగనంపాలని అన్నారు . దేశాన్ని హిందూ దేశంగా మార్చి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు బిజెపి కుట్ర చేస్తున్నారని అన్నారు . రాముడు పేరుతో బిజెపి రాజకీయాలు చేస్తూ కులమతాల మధ్య చిచ్చులు పెట్టి , మత విద్వేషాలను రెచ్చగొడుతూ హిందుత్వ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. బూజోవ పార్టీలకు వ్యతిరేకంగా వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులను కూడగట్టి ముందుకు సాగాలని సూచించారు . బిజెపి గత ఎన్నికల ముందు రైతులను రెట్టింపు ధనవంతులను చేస్తామని ఎన్నికల హామీలు ఇచ్చి హామీలను అమలు చేయకుండా విస్మరించారని అన్నారు . నల్ల డబ్బును బయటికి తీసి దేశ ప్రజల ఖాతాల్లో ప్రతి ఒక్కరికి 15లక్షలు జమ చేస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు . ఎన్నికల్లో ఇచ్చిన మాట ఎక్కడికి పోయిందోనన్నారు మరోవైపు బిజెపి అధికారంలోకి వచ్చాక అవినీతికి చట్టబద్ధత కలిగించిందన్నారు. ఎలెక్ట్రోల్ బాండ్స్ రూపంల్ 1600 కోట్ల రూపాయల అవినీతి జరిగితే 800 కోట్ల రూపాయలు బిజెపికి పార్టీకి చేరాయన్నారు.
ఈ ఎలెక్ట్రోల్ బాండ్స్ చట్ట విరుద్ధమైనవని సిపిఎం పోరాడిందన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం వల్ల అవినీతి బయటికి వచ్చిందన్నారు. విద్యా రంగానికి కేవలం ౦,4% మాత్రమే నిధులు కేటాయించారని విద్యను పూర్తిగా ప్రయివేటికరణ చేశారన్నారు. ఆకలిశుచిలో మనదేశం 111 స్థానంలో ఉందన్నారు. లిక్కర్ కేసులో బిజెపికి ఆరవిండో పార్మా కంపెనీ అధినేత శరత్ చంద్రారెడ్డి ద్వారా 60 కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయన్నారు. మునుగోడు నియోజకవర్గవెనుకబాటుకు కారణం గత పాలకులే కారణమని ఆయన అన్నారు.

గత ఎర్రజెండా చరిత్రను పునరావృతం చేయాలి..

సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి..

పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడే ఎర్రజెండ చరిత్రను పునరావృతం చేయడానికి కార్మికులు కర్షకులు నడుం బిగించి భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎర్రజెండా కు పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా కార్యకర్తలు గ్రామ గ్రామాన ఎర్రజెండా చేసిన పోరాటాలను ప్రజలకు వివరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతంగ సాహిత పోరాటంలో కమ్యూనిస్టులు వీరవచిత పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేశారు. భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం జరిగిన రైతాంగ సాయుధ పోరాటంలో ఎంతోమంది కమ్యూనిస్టులు ప్రాణాలను అర్పించారని అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ కంటే అత్యధిక ఓట్లు సాధించి , గెలిచిన వ్యక్తి రావి నారాయణరెడ్డి అని అన్నారు. అలాంటి ఘనమైన చరిత్ర కలిగిన ఈ ప్రాంతం లో కమ్యూనిస్టుల పాత్ర ఏందో ప్రజలందరికీ తెలుసు అని అన్నారు . నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడే పార్టీ ఒక ఎర్రజెండానే అని అన్నారు. ఈ సమావేశం మండల సహాయ కార్యదర్శి వరుకుప్పల ముత్యాలు అధ్యక్షతన నిర్వహించారు . ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం , డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు అయితగొని విజయ్ , జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు సాగర్ల మల్లేష్ , మునుగోడు నియోజకవర్గ సోషల్ మీడియా బాధ్యులు జేరిపోతుల ధనంజయ గౌడ్ , మండల కమిటీ సభ్యులు యాస రాణి శ్రీను, వేముల లింగస్వామి , వి హనుమయ్య , జి రాములు , లింగస్వామి , కాంతయ్య , దొండ వెంకన్న , ఎట్టయ్య , బొందు అంజయ్య , జిల్లా పెళ్లి యాదయ్య , కట్ట లింగస్వామి , బి నరసింహ , వై ఈరయ్య తదితరులు పాల్గొన్నారు

పరశురాం పల్లి గ్రామపంచాయతీ పరిధిలో చేతి పంపు రిపేర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం పరశురాం పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రవి నగర్ కాలనీకి చెందిన చేతి పంపు పనిచేయకపోవడంతో కాలనీవాసులు రానున్న ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని నీటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఎంపీడీవో ఎల్ భాస్కర్ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ కార్యదర్శి శరత్ చంద్ర ,చేతిపంపు రిపేర్ మెకానిక్ గడ్డం బిక్షపతి, చేతి పంపును మరమ్మత్తు చేయడం జరిగింది. చేతిపంపు రిపేర్ కావడంతో ఆ కాలనీవాసులు నీటి ఇబ్బంది లేకుండా చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ పనులను పరిశీలించిన

గణపురం ఎంపీడీవో ఎల్ భాస్కర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం కేంద్రంలో శనివారం రోజున ఉపాధి హామీ పనులను ఎంపీడీవో ఎల్ భాస్కర్ పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం కేటాయించిన 100 రోజుల పనులను ఉపాధి హామీ కూలీలు సద్వినియోగించుకోవాలని సూచించారు పనిచేసిన కూలి డబ్బులు 15 రోజుల క్లియర్ అవుతాయని చెప్పారు ఉపాధి హామీ మస్టర్లను పరిశీలించి హాజరులు తప్పులు లేకుండా రాయాలన్నారు కూలీలు ఎండాకాలం దృష్ట్యా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు పని చేయాలన్నారు ఉపాధి కూలీలకు వారు పనిచేసే ప్రదేశం వద్ద టెంటు నీళ్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఆశ వర్కర్ గాజుల సుమలత అందుబాటులో ఉంచామన్నారు ఒక్కొక్క కూలి నాలుగు మీటర్ల వెడల్పు రెండు మీటర్ల పొడవు ఫీట్ నర లోతు పని చేసినట్లయితే 300 రూపాయల కూలి రావడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పూడిక తీత పనుల ఇన్చార్జి ఏపీఓ రాజు టెక్నికల్ అసిస్టెంట్ శ్రావణ్ ఫీల్డ్ అసిస్టెంట్ దూలం శ్రీదేవి కార్యదర్శి విజేందర్ ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. కాగా ఉపాధి హామీ కూలీల్లో బీటెక్ డిగ్రీ పీజీలు చేస్తున్నవారు ఉండడంతో వారితో మాట్లాడి వారిని అభినందించారు.

గుల్లకోట లో ఉచిత గాలి కుంటూ నివారణ టీకాలు !!

ఎండపల్లి నేటి ధాత్రి
ఎండపల్లి మండలం గుల్లకోట లో శనివారం రోజున,తెలంగాణ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ ద్వారా, జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం ద్వారా, మండల పశు వైద్య అధికారిని శ్రీప్రియ, గేదెలకు ఆవులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది, అనంతరం పశు వైద్య అధికారిని శ్రీప్రియ మాట్లాడుతు,గ్రామంలో 143..ఆవులకు మరియు ఎడ్ల కు 76 గేదెల కు. ఉచిత గాలి కుంటు నివారణ టీకాలను వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో
.పశు వైద్యాధికారిని డాక్టర్ పి.శ్రీ ప్రియ ,సిబ్బంది.వెటర్నరీ సహాయకులు,నాగరాజు, కార్యాలయ,సహాయకులు,కుమార్, రాంకుమార్ .నవీన్ నారాయణ,చంద్రయ్య ,లక్ష్మి
పాల్గొన్నారు.

మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపే లక్ష్యంగా జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మాజీ గ్రంథాలయ చైర్మన్ బోగాల శ్రీనివాసరెడ్డి

భద్రాచలం నేటి ధాత్రి

పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో భద్రాచలం నియోజకవర్గంలో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుతూ మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగల శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది.

ఇంటింటి ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు ఉపయోగపడే విధంగా అమలు చేసిన విధానాన్ని వివరించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి కోరుతూ ఇచ్చిన హామీలను,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ ని గెలిపించుకోవడం ద్వారా భద్రాచల ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతామని ఆయన ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు.

పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు రాసమల్ల రాము, అన్నేం రామిరెడ్డి, మైనార్టీ సెల్ నాయకులు షబిర్ పాషా,మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఘనంగా శ్రీపాద రావు 25వ వర్ధంతి వేడుకలు

ప్రజల హృదయాలలో నిలిచిన శ్రీపాదరావు

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు విశ్లవత్ దేవన్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ పాద రావు 25వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అనంతరం మాట్లాడుతూ శ్రీపాద రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు స్పీకర్ గా ఎనలేని సేవలు అందించారు . మంథని నియజక వర్గం లో ఎస్సీ ఎస్టీ నీరు పేద కుటుంబాలకు పట్టలు ఇప్పించిన ఘనత శ్రిపదరావు కే దక్కుతుంది. దనువడ గ్రామ సర్పంచ్ గా. మహాదేవ పుర్ సమితి వైస్ ప్రెసిడెంట్ గా మంథని శాసన సభ్యులు గా 3 సార్లు వరుసగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు స్పీకర్ గా రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలు అందిం చి. అజాత శత్రువు గా పేరు గాంచిన నారని కొనియడినరు..
వారి మరణ o చిరస్మరణీయ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు. సల్లురి మధు ఐ ఎన్ టి సి ఉభయ రాష్ట్రాల కార్యదర్శి పసునూ టీ రాజేందర్ కౌన్సిలర్ లు దట్ల శ్రీనివాస్. ముంజల రవీందర్. పిల్లలమర్రి నారాయణ. ఐ ఎన్ టి సి బ్రాంచ్ ఉపాధ్యక్షుడు జోగ బుచ్చయ్య. ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణకర్ కాంగ్రెస్స్ పార్టీ సీనియర్ నాయకుడు సళ్లురి సమ్మయ్య . బేతెళ్ళి మధుకర్ రెడ్డి. వేముల మల్లేష్ గౌడ్ . పైడిపల్లి రమేష్ రమణ చారి. గోమస భమయ్య బౌత్ రాజేష్ . వెంకీ యాదవ్. నగపురి సమ్మయ్య. పులి వేణు గుడేపు చందర్. కప్పల రాజేష్. మహిళ నాయకురాలు కడరి మాలతి. జాంబోజు పద్మ. పుస్పా . లక్ష్మీ. వర లక్ష్మీ. సంపత్ యాదవ్. మోతే సుధాకర్. కె వి అశోక్ శబీర్ ఖాన్. సోషల్ మీడియా సతీష్ బోత్. గౌరీ కృష్ణ. సోతుకు సమ్మయ్య. కుదుడుల రాయమల్లు. తదితరులు పాల్గొన్నారు.

ఎంబీబీఎస్ డాక్టర్ పట్టా అందుకున్న రాజకుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి రూరల్ మండలం వెంకటేశ్వర్ల పల్లి పెద్దాపురం గ్రామం ఆకుదారి సమ్మక్క కృష్ణస్వామి కుమారుడు ఆకుదారి రాజ్ కుమార్ హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ పూర్తి చేసినాడు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో డాక్టర్ పట్టా తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆకుదారి రాజ్ కుమార్ మాట్లాడుతూ నేను డాక్టర్ కావడం మా అమ్మ నాన్న యొక్క కలను నేను నెరవేర్చడం జరిగింది నన్ను ఇంతగా చదివించిన మా తల్లిదండ్రులకు నాకు విద్యను బోధించిన గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు నిరుపేదలకు వైద్యం చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తాను నన్ను చదువు అని ప్రోత్సహించిన మా ఫ్రెండ్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో ఓప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం వ్యర్థ పదార్థాలను నిబంధనల ప్రకారం ఆసుపత్రి ఆవరణలోని చెత్తకుండీలలో వేయాలి. నిబంధనలను తుంగలో తొక్కి ఆసుపత్రి బయట నీడిల్స్ తో పాటు వ్యర్ధపదార్థాలను చెత్తబుట్టలో కాకుండా బహిరంగంగా పడవేశారు. ఇలా బహిరంగంగా పడవేయడం దాని పక్కన గల టిదుకాణానికి వచ్చే వ్యక్తులు పలు రకాలుగా మాట్లాడుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైనది. ఆసుపత్రి పర్యవేక్షణ లోపంతో వ్యర్థ పదార్థాల సంబంధిత విడిభాగాలు పక్కన ఉన్న సూపర్ మార్కెట్ ముందు స్థలం వరకు వ్యర్థ పదార్థాలు రోడ్డుపైనే కనిపించడం గమనార్హం. ఆసుపత్రి నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న ప్రభుత్వ వైద్యాధికారుల బృందం చూసి చూడనట్లు వ్యవహరించడంపై ప్రజలు మండిపడుతున్నారు. మండల వైద్యాధికారులు ఆస్పత్రుల పర్యవేక్షణ క్రమం తప్పకుండా చేయాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టనట్లు ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ఆసుపత్రులతో కుమ్మక్కై పర్యవేక్షణ తూతు మంత్రంగా కొనసాగిస్తున్నారని విమర్శలు ప్రజలలో వెలువెత్తుతున్నాయి. మరి ఇప్పటికైనా జిల్లా ఉన్నత వైద్యాధికారి ఈఘటనపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత ఆసుపత్రి పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

చలివేంద్రం ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఎండపల్లి నేటి ధాత్రి


ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చలివేంద్రం ప్రారంభించారు,ఎండపల్లి, మండలం కొత్తపేట గ్రామం వద్ద జేఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ,జిరెడ్డి మహేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన చలివేంధ్రాన్ని శనివారం రోజున ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించడం జరిగింది ,ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థి అక్షితను సన్మానించిన మాజీ విద్యాకమిటీ చైర్మెన్

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన పారునంది అక్షిత ఇటివల వెలువడిన ఆరవ తరగతి నవోదయ పరీక్ష ఫలితాల్లో అర్హత సాధించారు. ఈవిషయం తెలిసిన గుండి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాజీ విద్యా కమిటీ చైర్మన్ పొన్నం శ్రీనివాస్ గౌడ్ విద్యార్థినిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో పొన్నం అభిషేక్, కత్తి సాయి కుమార్, పారునంది శంకర్, మంది రాజశేఖర్, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఎంబీబీఎస్ డాక్టర్ పట్టా అందుకున్న అన్నదమ్ములు

పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల మండల పరిధిలోని మళ్ళక్కపేట గ్రామనికి చెందిన దొమ్మటి సారయ్య సునీత,దొమ్మటి భద్రయ్య సుజాత దంపతుల కుమారులు దొమ్మటి సనత్ కుమార్, దొమ్మటి సుజిత్ కుమార్ లు 2018లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు సంపాదించి కాలేజీలో ఇరువురు ఎంబిబిఎస్ పూర్తి చేసారు.శుక్రవారం రోజున ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ పట్టా ఇరు కుటుంబాల సమక్షంలో పొందడం జరిగింది.ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ నన్ను డాక్టర్ గా తీర్చిదిద్దిన కళాశాల ఉపాధ్యాయ బృందానికి,నా ఎదుగుదలకు నాంది పలికిన మా తల్లిదండ్రులకు ఎప్పుడు రుణపడి ఉంటామని మా డాక్టర్ వృత్తిని పేదలకు సహాయకరంగా మా తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా నిర్వరిస్తామని అన్నారు.పట్టా అందుకున్న అన్నదమ్ముల పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

ఎంపీ వద్దిరాజు అభయ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం నగరం ఖానాపురం హవేలిలో కొలువైన స్వయంభు అభయ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.ఎంపీ రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి శనివారం ఉదయం ఖమ్మం ఖానాపురం హవేలి యుపీహెచ్ కాలనీలో నెలకొన్న శ్రీవెంకటేశ్వర స్వామి 20వ వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి సభ్యులు, అర్చకులు ఎంపీలు రవిచంద్ర, నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ మధులకు మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.స్వామి వారిని దర్శించుకుని తమ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేశారు,వేద పండితులు ఆశీర్వచనాలు పలికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీలు వద్దిరాజు,నామ, ఎమ్మెల్సీ తాతా మధుల వెంట నగర మేయర్ నీరజ, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం,సుడా మాజీ ఛైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.

error: Content is protected !!
Exit mobile version