రాష్ట్ర ప్రభుత్వం ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి
స్థానిక ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో రైతుల పంటలు ఎండి పోయాయి దుఃఖిస్తున్న రైతన్నకు సహాయంగా ప్రభుత్వం ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నీరు వెంటనే అందించి రైతులను ఆదుకోవాలని స్థానిక ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు వేసుకుంటే చేతికి అందే సమయంలో పంటపొలాలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయని వాపోయారు. వరి,మొక్కజొన్న పంటలకు ఇంకా రెండు, మూడు సార్లు నీళ్లు అందిస్తే పంటలు చేతికి వస్తాయని అన్నారు. కాబట్టి ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే కొన్ని చోట్ల వరి, మొక్కజొన్న పంటలు నీళ్లు అందక ఎండి పోయాయని, వెంటనే ఎండిపోయిన పంటలను సందర్శించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు ,స్థానిక ఎమ్మెల్యే వెంటనే చొరవ తీసుకొని ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని అన్నారు. ఎండిపోయిన పంటలపై సమగ్ర విచారణ జరిపి రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి కోరారు.