సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్
కమ్యూనిస్టు పార్టీలో పలువురు చేరికలు
చేర్యాల నేటిధాత్రి….
పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడేది సీపీఐ పార్టీ మాత్రమేనని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు. చేర్యాల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కొమురవెల్లి, మద్దూరు మండలాలకు చెందిన పలువురు భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐలో చేరగా వారికి జిల్లా కార్యవర్గ సభ్యుడు అశోక్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన పార్టీ నాడు తెలంగాణ రైతంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి దున్నేవాడికే భూమి దక్కాలని 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచి 4500 మంది కమ్యూనిస్టులు రక్త తర్పణం చేసిన ఘనమైన చరిత్ర సిపిఐకే ఉందన్నారు. సాయుధ పోరాటం, స్వతంత్ర ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలలో కీలక భూమిక పోషించి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తూ పేద ప్రజల పక్షాన ఉండేది సీపీఐ మాత్రమే అని అన్నారు. బీఆర్ఎస్ నియంత, దొరల పాలనకు చరమగీతం పాడి ప్రజా సంక్షేమం కోరే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు సిపిఐ మిత్రపక్షంగా నిలబడి మార్పు కోసం సిపిఐ కృషి చేసిందని వారన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సిపిఐ ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ప్రజా సమస్యలే ఏకైక లక్ష్యంగా పనిచేస్తుందని గుర్తు చేశారు. సీపీఐలో చేరిన వారిలో పుల్లూరి మంజుల, తుప్పతి రాజు, తుప్పతి చిన్న రాజు, రమేష్, కృష్ణ, బాల రాజు, అనిల్ చేరారు. వారికి అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, డివిజన్ నాయకుడు జంగిలి యాదగిరి, మండల కమిటీ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి, అందె బాబు, జింకల బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.