ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని అంగరిగూడెం, చొప్పాలా, రేగుళ్ళ, గొల్లగూడెం గ్రామాలలో నిన్న ఉరుములు గాలి దుమ్ముతో కురిసిన వర్షానికి కూలిపోయిన ఇల్లులను పైకప్పులను పరిశీలించి, అదేవిధంగా పిడుగుపాటుకు మృతి చెందిన గోగు రాంబాబు రైతు కు చెందిన రెండు ఎడ్లను,సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎవరు అధైర్య పడొద్దు అని వారికి జరిగిన నష్టాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చూస్తామని భరోసా కల్పించారు..
ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎర్ర సురేష్ , భూక్య అర్జున్ , భూక్య రామదాసు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..
వరంగల్ ఎస్సి పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మారెపల్లి సుధీర్ కుమార్, రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య కు సోమవారం ఒక సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. సుధీర్ కుమార్ వెంట ఎమ్మెల్సీ బండా ప్రకాష్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారు .
పోరిక బలరాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ ముమ్మర ప్రచార నిర్వహిస్తున్న మాజీ గ్రంధాల చైర్మన్ భోగల శ్రీనివాసరెడ్డి
ఈరోజు మాజీ గ్రంధాల చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ భద్రాచల నియోజకవర్గంలో ప్రచారణ నిర్వహిస్తున్నారు.
ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ
రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరటం ఖాయమని, గతంలో ఉన్నటువంటి పాలకుల అసమర్థత వల్ల అభివృద్ధి కుంటుపడిందని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగల సమర్థుడు బలరాం నాయక్ గారెనని ప్రజలు నేను గెలిపించేందుకు దృఢ సంకల్పంతో ఉన్నారని ఆయన మాట్లాడారు
ఈ ఎన్నికల ప్రచారంలో ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాసి మల్ల రాము, కాంగ్రెస్ నాయకులు అన్నేం రామిరెడ్డి, మహిళ కాంగ్రెస్ నాయకులు తుమ్మల రాణి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ఈనెల 28వ తేదీన పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవానికి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శీనన్నను సారం పెళ్లి ముదిరాజ్ సంఘం సభ్యులు వివాహ మహోత్సవానికి రావాలని ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో సారంపల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మునిగల్ అంజయ్య ఉపాధ్యక్షులు దాసరి గణేష్ తిరుపతి పరిసరాములు వినోద్.సభ్యులు తదితరులు పాల్గొన్నారు
తంగళ్ళపల్లి మండలం నుండి పలు గ్రామాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ నామినేషన్ సందర్భంగా మద్దతుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో మండలంలోని గ్రామాల నుండి తంగళ్ళపల్లి మండల కేంద్రం నుండి పెద్ద ఎత్తున బయలుదేరారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని బయలుదేరినారు
రఘునాథపల్లి నుండి కొండగట్టుకు హనుమాన్ దీక్ష భక్తులు.
రఘునాథపల్లి. ( జనగామ) నేటి ధాత్రి :-
మండల కేంద్రంలోని శ్రీ మహాదేవ స్వామి దేవాలయ ప్రాంగణంలో సోమవారం హనుమాన్ దీక్ష భక్తులు ఇరుముడి కట్టుకున్న సందర్భంగా ఆలయంలో జై హనుమాన్ జై జై హనుమాన్ అంటూ హనుమాన్ భక్తులు ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఆలయ అర్చకులు పిండిప్రోలు శ్రీనివాస్ శర్మ నేపథ్యంలో హనుమాన్ దీక్ష భక్తులకు ఇరుముడి కట్టారు.ఆలయంలో భక్తులు ప్రజలు హనుమాన్ జయంతి కి ముందు రోజు జై హనుమాన్ జై జై హనుమాన్ నినాదంతో రఘునాథపల్లి నుండి కొండగట్టు పుణ్యక్షేత్రానికి వెళ్లారు స్వామి వారి కృప ఉంటుందని పూజారి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాలధారణ వేసుకున్న స్వాములు కందుల అనిల్ కుమార్, కొన్నే సతీష్, కోళ్ల సందీప్, పెర్నె అనిల్,శ్రీ మహాదేవ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ కూరెళ్ళ పెద్ద ఉపేందర్ గుప్తా… బచ్చు చిరంజీవి గుప్తా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోళ్ల రవి గౌడ్,ఎంపీటీసీ సభ్యురాలు పేర్ని ఉషా రవి దంపతులు,పద్మశాలి యువజన సంఘం జిల్లా నాయకులు కరీం కొండ ప్రదీప్ కుమార్, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి నేటిదాత్రి: వనపర్తి నియోజకవర్గం లో జాంబ్లా తాండకు చెందిన 150 మంది గోపాల్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యశీలరెడ్డి అచ్యుత రామారావు ఆధ్వర్యంలో కొందరు గిరిజనులు వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారున్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగా రెడ్డి గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా మెగా రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తున్నామని హామీ తెలిపారు ఎన్నికల తర్వాత ఇందిరమ్మ ఇళ్ల ప్రోజెడింగ్ నా దగ్గర ఉన్నదని ఇల్లు నిర్మించి ప్రభుత్వం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ విష్ణు శ్రీదేవి మాజీ సర్పంచ్ మా జీ వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
బిఆర్ఎస్ మాజీ సర్పంచి భర్తతో సహా 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గుంటూరు పల్లె గ్రామ బిఆర్ఎస్ మాజీ సర్పంచి భర్తతో సహా దాదాపు 20 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది, ఈ సందర్భంగా పువ్వాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి మా గ్రామంలోని బిఆర్ఎస్ కార్యకర్తలు అందరం మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అన్నారు, రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని అన్నారు, బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు పువ్వాటి రాని వెంకటేశ్వర్లు మాజీ సర్పంచ్, పువ్వాటి వెంకటేశ్వర్లు, కొంక అప్పారావు, మన్యం శ్రీనివాసరావు*( బుజ్జన్న ), ఆదినారాయణ, కడియాల సాంబశివరావు, కడియాల పూర్ణచందర్, కడియాల వెంకన్న, నర్రెచౌదరయ్య, నర్ర వెంకటయ్య, నల్లూరి శ్రీనివాసు, దాదాపు 20 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరినారు.
సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో, రోలింగ్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా, వరంగల్-ఆదిలాబాద్, తిరుపతి వెళ్లు కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలును ఈనెల 28 నుంచి, మే 22 వరకు వరంగల్ రాకుండా దారి మళ్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రైళ్ల దారి మళ్లింపులను దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు చేయాలని ప్రయాణికులను కోరారు.
400 కోట్ల సంవత్సరాల భూగోళం మరో100 సంవత్సరాల అభివృద్ధి పేరుతో బీభత్సం కానుందా..!
సమస్త జీవకోటి భారాన్ని మోసే భూమి. నేడు కన్నీరు పెట్టుకుంటుంది.
ఈ అనంత విశ్వంలో జీవ సంచారం కలిగిన ఏకైక గ్రహం మన భూగ్రహం ఒక్కటే.
సకల కోటి ప్రాణులకు అనుకూలంగా మారుటకు ఎన్నో కోట్ల సంవత్సరాలు పట్టింది. అయితే భూమి ఎలా మార్పు చెందుకుంటూ వచ్చిందో అదే విధంగా మార్పు చెందుకుంటూ చనిపోతుంది అన్నది నిజం. అది ఎలా.?
ఓదెల చంద్రమౌళి సైన్స్ టీచర్.
చిట్యాల, నేటిధాత్రి :
ధరిత్రి దినోత్సవం సందర్భంగా భూమి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు. సైన్స్ టీచర్ ఓదెల చంద్రమౌళి నేటి దాత్రితో పంచుకున్న విషయాలు భూమి అంత గురించి మన మత గ్రంధాలు. భగవద్గీత, బైబిల్ ,ఖురాన్ , త్రిపీటకాలు ఇలా ఎన్నో. భూమి చావక తప్పదు అని చెప్తున్నాయి. వాటి ప్రకారం పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు అని. అదే విధంగా. నోస్ట్రో డామస్ మరియు బ్రహ్మంగారి కాలజ్ఞానo ప్రకారం కూడా ఈ భూమి అంతమవుతుందని తెలుస్తుంది మరి నిజంగా భూమి చనిపోతుందా? దీని గురించి మరి సైన్స్ ఎం చెప్తుంది చూద్దాం…సైన్స్ ప్రకారం 100% భూమి చనిపోతుంది అనేది వాస్తవం దీనికి గల కారణాలు సైన్స్ ప్రకారం ఎన్నో ఉన్నాయి.
1. భూమి పైన ఆహారపు గొలుసు నాశనం అవడం 2. భూమి యొక్క సరాసరి ఉష్ణోగ్రత పెరగడం 3. సౌర తుఫాను సంభవించడం 4. అష్టరాయిడ్స్ తోకచుక్కలు ఢీకొనడం 5. బ్లాక్ హోల్స్ భూమికి దగ్గరగా రావటం
ఇలా ఎన్నో ఇంకెన్నో……
*ఆహారపు గొలుసు నాశనం అవ్వడం..*
ప్రకృతికి సహజసిద్ధంగా ఉన్న జీవవైవిద్యం ఎంతో అవసరం సున్నితమైన ఈ ఆహారపు గొలుసు దెబ్బతింటే ప్రకృతిలో జీవజాతులు మనుగడకే ప్రమాదం జీవజాతులు నశించి పోవడం వలన మానవ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చుకున్నవి. ఎందుకంటే ఈ భూమ్మీద ప్రతి ప్రాణి ఏదో ఒక ప్రాధాన్యతను కలిగి ఉంది ఇందులో ఏ జాతి కనుమరుగైన ఆహారపు గొలుసు దెబ్బతింటుంది ఇది అనేక ఇతర జాతుల వినాశనానికి దారితీస్తుంది ప్రస్తుతం కొన్ని రకాలైన జాతులు కనుమరుగైతూనే ఉన్నాయి. ఇదిలా కొనసాగితే చివరికి మానవ జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది భూమి మీద జీవజాతి అంతరించిపోయే ప్రమాదం దగ్గరలోనే ఉంది.
దీనికి కారణం కాలుష్యం మానవుడు విపరీతంగా వాడుతున్నటువంటి రసాయనాలు .. భూమి ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు పెరిగితే భూమి అంతం తప్పదు. మనకు తెలుసు ఈ భూమిపైన భూభాగం కేవలం 30 శాతం 70% నీళ్లు ఉన్నాయని అయితే ఈ 30% భూమిలో కూడా చాలా ఎక్కువ మొత్తము మంచుతో కప్పబడి ఉంది .ఈ కాలుష్యం వల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ ల వల్ల భూమి సరాసరి ఉష్ణోగ్రత 15 డిగ్రీల నుండి 17 డిగ్రీలకు మారితే భూమిపై ఉన్నటువంటి మంచి ఖండాలు కరిగి సముద్రమట్టం పెరిగి అందులో ఈ కాస్త ఉన్న భూమి మునిగిపోబోతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం కొన్ని దీవులు సముద్ర గర్భంలో కలిసిపోతూనే ఉన్నాయి. దీనికి కారణము మనం విచ్చలవిడిగా వాడుతున్నటువంటి శిలాజి ఇంధనాలు ఇవి గ్రీన్ హౌస్ గ్యాస్ లను క్లోరోఫ్లోరో కార్బన్లను రిలీజ్ చేసి భూమి యొక్క ఉష్ణోగ్రతను పెంచుతూ ఉన్నాయి. మరొక కారణం ప్లాస్టిక్ వాడకం వల్ల కాలుష్యం పెరిగి భూ వినాశనానికి దారి తీస్తుంది. ఇదే విధంగా జరిగితే మరి కొద్ది సంవత్సరాల్లోనే భూమి మొత్తం నీళ్లలో మునిగిపోక తప్పదు.
*సౌర తుఫాను సంభవించటం*
సూర్యునిలో జరిగే ఎటువంటి చర్యల ఆధారంగా మనకు కాంతిని వేడిని ఇస్తున్నాడు ఈ చర్యలకు హైడ్రోజన్ ఎంతో అవసరం రెండు హైడ్రోజన్ కలిసి హీలియం గా మారి ప్రక్రియనే కేంద్రక సంలీన చర్య అంటారు ఈ విధంగానే కాంతి ఉత్పత్తి అవుతుంది. దీనిలో జరిగేటువంటి చర్యలు కొన్నిసార్లు సౌర తుఫానుకు దారితీస్తున్నాయి ఈ సౌర తుఫాను వల్ల భూమిపైన అత్యధిక వేడిని ప్రసరింపజేసేలా చేస్తుంది. దీనివల్ల భూమి నాశనం తప్పదు.
*ఆస్ట్రాయిడ్స్ మరియు తోకచుక్కలు ఢీకొనడం*
మనకు తెలుసు ప్రతినిత్యం ఈ విషయం నుండి ఎన్నో ఆస్టరాయిడ్స్ భూమ్మీద తరచూ పడుతూనే ఉంటాయి ఒక్క భూమి మీదనే కాదు ప్రతిగ్రహం మీద పడుతూనే ఉంటాయి. ఒకవేళ కొన్ని పెద్దపెద్ద ఆస్టరాయిడ్స్. కనక భూమిని ఢీకొంటే భూమిపైన ఎంతో పెద్ద విస్పోటం జరుగుతుంది దీనివల్ల పెద్ద మొత్తంలో భూమి కాలిపోతుంది ఈ విధంగా కూడా జీవులు అంతరించే ప్రమాదం ఉంది కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం భూమి పైన డైనోసార్ జాతి ఉండేది ఇది ఇలాంటి ఆస్టరాయిడ్ల దాడి వల్ల నాశనం అయిపోయింది ఇదే విధంగా ఏదో ఒక రోజు అష్టరాయిడ్స్ వల్ల ఈ భూమి నాశనం తప్పదు అంటున్నారు శాస్త్రవేత్తలు.
*బ్లాక్ హోల్స్ భూమికి దగ్గరగా రావడం*
ఈ అనంత విశ్వంలో సూర్యుని సైతం మింగేటువంటి బ్లాక్ హోల్సే ఎన్నో ఉన్నాయి అనేది నిజం. బ్లాక్ హోల్ అంటే నక్షత్రం చనిపోయిన తర్వాత అది బ్లాక్ హోల్గా మారుతుంది దానికి గల అత్యధికమైన గ్రావిటీ వల్ల దానికి దగ్గరలో ఉండేటువంటి ద్రవ్యరాశి లాక్కుంటుంది ఇది సూర్యుడు కావచ్చు గ్రహాలు కావచ్చు వేటిని నా లాక్కునేటువంటి ఎబిలిటీ అని ఉంటుంది మన పాలపుంత గెలాక్సీ లోపల కూడా ఎన్నో బ్లాక్ హోల్స్ ఉన్నాయి ఇవి భూమికి కాస్త దగ్గరగా వస్తే భూమిని సైతం ఒకేసారి మింగేయగలుగుతాయి, ఏ విధంగా కూడా భూ అంతం తప్పదు అంటున్నారు.
ఇలా ఎన్నో ఎన్నెన్నో కారణాలవల్ల సైన్స్ ప్రకారం భూమి అంతం తప్పదు అనే మాట వినబడుతుంది అయినా కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే భూమిపైన కాలుష్యాన్ని తగ్గిస్తూ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించగలిగితే భూమి ఇంకా కొన్ని బిలియన్ సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉంటుంది ఈ భూమిని మనం ముందు తరాలకు అందించాలి అంటే మనం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. అదేవిధంగా శిలాజి ఇంధనాల వాడకం తగ్గించాలి అప్పుడే భూమి ఇంకొన్ని సంవత్సరాలు బ్రతకగలుగుతుంది.
చేయి చేయి కలుపుదాం ప్లాస్టిక్ ని పూర్తిగా నిర్మూలిద్దాం.
భూమిని మరికొన్ని సంవత్సరాలు బ్రతికిద్దాం మన ముందు తరాలకు స్వచ్ఛమైన భూమిని అందిద్దాం.
వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయం ఆర్చి ప్రక్కన నరేష్ వయస్సు 47 అనారోగ్యంతో హైదరాబాదులో మృతి చెందారు ఈ సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తు డి మేఘారెడ్డి వారి కుటుంబ సభ్యులకు 5000 రూపాయలు ఆర్థిక సాయం పంపారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూరగాయల రవి ఒక ప్రకటనలో తెలిపారు
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కాన్కూర్ గ్రామంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువనేత పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. కాన్కూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడుగుల సాగర్, మల్లేష్, వెంకటేశ్వర గౌడ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీని వీడి సుమారు 100 మంది నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. వీరందరినీ పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యువనేత గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నూతన కార్యకర్తలకు,నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ,తరతరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి సైన్యాన్ని పెంచుకుంటూ మళ్ళీ బలోపేతం అవుతుందని, ప్రజలు పార్టీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని, కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అందరిని ఆదరిస్తుందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధిక మెజారిటీతో ఘన విజయాన్ని అందించాలని కోరారు. అలాగే నూతనంగా పార్టీలోకి చేరిన నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా తమ సాయ శక్తుల కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడుగుల సాగర్, మల్లేష్, వెంకటేశ్వర్ గౌడ్ మరియు నూతన కార్యకర్తలు, నాయకులు ,గ్రామస్తులు పాల్గొన్నారు.
– ప్రతి కార్యకర్త సైనికుల పని చేయాలి మల్లేశం గౌడ్…
కొల్చారం, (మెదక్ )నేటి ధాత్రి :-
మెదక్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ వేయనున్న సందర్భంగా మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ వస్తున్న నేపథ్యంలో కొల్చారం మండలం నుండి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కొల్చారం మండల వ్యాప్తంగా భారీ ఎత్తున కార్యకర్తలు పార్టీ శ్రేణులు ప్రజలు తరలి వెళ్లారు . ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ నీలం మధు ముదిరాజ్ బీద కుటుంబంలో పుట్టి సర్పంచ్ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా వెళ్తున్న సందర్భంగా మండల వ్యాప్తంగా నినాదాలతో బయలుదేరారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటు వేయాలని మల్లేశం గౌడ్ తెలిపారు. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినందున మరింత బలం పెరిగిందని , ఆవుల రాజి రెడ్డి గారి కృషి వల్ల పార్టీని మరింత బలోపేతం చేయగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్చారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షులు గోవర్ధన్ , కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు శేఖర్ చంద్రశేఖర్ రెడ్డి, ఏళ్లుగారి శ్రీనివాస్ రెడ్డి, గజినీ వెంకట్ గౌడ్ , గొ oడ కృష్ణ , చంద్రశేఖర్ రెడ్డి, దేవన్న గారి శేఖర్, రుప్లా నాయక్, పిఎసిఎస్ ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య డైరెక్టర్ పండరి, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు , మాజీ ఎంపీటీసీలు , కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదపు అంచుల్లో కరెంటు లైన్ అనే కథనానికి విద్యుత్ ఉన్నత అధికారులు ఎట్టకేలకు స్పందించారు.,మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపూడి గ్రామం లో గత సంవత్సరం నుండి ప్రజలు విద్యుత్ తీగలు వల్లన ఇబ్బందికి గురయ్యారు. ఎట్టకేలకు నేటి ధాత్రి కథనానికి విద్యుత్ అధికారులు స్పందించి నూతన కరెంటు పొల్లు ఏపీయడం జరిగింది, అది చూసిన గుండెపూడి గ్రామా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. విద్యుత్ నుంచి ఎలాంటి సమస్య వచ్చినా, మా సిబ్బంది మేము 24 గంటల్లో మీకు అందుబాటులో ఉంటామని తెలిపారు.
వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి తాజా మాజీ సర్పంచ్ అడికే జైపాల్ రెడ్డి, సుమారు 200 మంది గ్రామస్థులతో భారీ బైక్ ర్యాలీతో వచ్చి శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
పెగడపల్లి నేటి ధాత్రి మాజీ మంత్రి ప్రస్తుత పెద్ద పల్లి పార్లమెంట్ బి ఆర్ ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మాట్లాడుతు,ప్రజా సేవకుడు, ముద్దుబిడ్డ,అన్నా అంటే నేనున్నానంటూ ప్రజాసేవ ధ్యేయంగా,ప్రజల కోసం అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడే సింగరేణి బొగ్గుగని కార్మికుడు పెద్దపెల్లి బి.ఆ.ర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల.ఈశ్వర్ జన్మదిన వేడుకలు పెగడపల్లి మండల బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించు కోవడం చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తు,వేడుకలు నిర్వహించి, అనంతరం స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో మండల బి.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.
దుగ్గొండి మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి కందుల రామచంద్రయ్య గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ తో పాటు నాయకులు పరామర్శించారు.మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుమారులు ఐలయ్య గౌడ్,కుమారస్వామి గౌడ్,రమేష్ గౌడ్ లతో కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మల్లంపల్లి గౌడ సంఘం అధ్యక్షుడు గుండెబోయిన రమేష్ గౌడ్, అధ్వర్యంలో కార్యక్రమం జరుగగా మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్,రాష్ట్ర నాయకులు మద్దెల సాంబయ్య గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పంజాల వెంకట్ గౌడ్, జిల్లా ప్రచార కార్యదర్శులు జునూరి నరేష్ గౌడ్, దుగ్గొండి మండలం అధ్యక్షులు తడుక కొమురయ్య గౌడ్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అరెల్లి ప్రకాష్ గౌడ్, కక్కెర్ల సుభాష్ గౌడ్,ముత్యాల చంద్రమౌళి గౌడ్,కందుల పవన్ గౌడ్,సంవర్షన్ గౌడ్,నితిన్ గౌడ్,సిద్ధార్థ గౌడ్ తదితరులు పరామర్శలో ఉన్నారు.
`రొడ్డకొట్టుడు విద్యతో దెబ్బతింటున్న విద్యార్థుల భవిష్యత్తు
`ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ కరువు
`సృజనాత్మకతను ప్రోత్సహించని విద్యతో విద్యార్థులకు ఇబ్బందులు
`అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీపడలేని దుస్థితి
`న్కెపుణ్యం నేర్పని విద్య పిల్లలకు శాపం మాత్రమే
`లక్షల్లో ఫీజులు కట్టినా ఏమిటి ఫలితం?
`తల్లిదండ్రుల వేలంవెర్రి కూడా ఇందుకు కారణం!
`పెడత్రోవ పడుతున్న ప్రైవేటు విద్యాసంస్థల వ్యాపార ధోరణులు
హైదరాబాద్,నేటిధాత్రి:
విద్య ఎంతో పవిత్రమైంది…దాన్ని వ్యాపార దృక్పథంతో చూడకూడదు అనేది ఒకప్పటిమాట! ఇప్పుడు అది పక్కా వ్యాపారంగా మారిపోయింది. వ్యాపార దృక్పథం లేకపోతే ప్రైవేటు స్కూళ్లు ఏవిధంగా అభివృద్ధి చెందుతాయనేది, ‘ప్రైవేటు విద్య’ను సమర్థించేవారు చెప్పేమాట. అంతేకాదు లాభాలు పెరిగేకొద్దీ అవి మరింత నాణ్యమైన విద్యను అందిస్తాయనేది వారి వాదన! నేటితరం తల్లిదండ్రులు ప్రధానంగా వారి పిల్లలకు నాణ్యమైన విద్యను కోరుకుంటున్నారనేది వాస్తవం.పై తరాలకు చెందిన తల్లిదండ్రులు కూడా ఇదే కోరుకున్నప్పటికీ, నేటి కాలంలో ఉన్నన్ని విస్తృత వి ద్యావకాశాలు అప్పట్లో ఉండేవికావు. అయినప్పటికీ అందుబాటులో ఉన్న విద్యను తమ పిల్లలకుఅందించడానికి వారు ఎంతో తపనపడ్డారు. ఇక ప్రస్తుత కాలానికి వస్తే ప్రభుత్వ పాఠశాలలు నేటికాలానికి అవసరమైన స్థాయి విద్యను అందించడంలో విఫలం కావడమే తల్లిదండ్రులు ప్రైవేటు విద్యవైపు మొగ్గుచూపడానికి ప్రధాన కారణంగా చెప్పాలి. నాణ్యమైన విద్యపట్ల వారుచూపు తున్న ఆసక్తికి అనుగుణమైన విద్యను ప్రభుత్వ పాఠశాలలు అందించలేకపోవడమనే కార ణం, ప్రైవేటు స్కూళ్లు ‘నాణ్యమైన విద్య’ పేరుతో దోపిడీకి పాల్పడే దశకు తీసుకెళ్లింది. విద్య, వైద్య రంగాలు కేవలం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని వాదించేవారున్నారు. ఇది సహే తుకమే. కానీ ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే వైద్యరంగం ఎంత నిప్పచ్చరంగా పనిచేస్తున్నదీ, ప్రభుత్వ రంగ సంస్థలు ఏవిధంగా నష్టాల ఊబిలో కొనసాగుతున్నదీ మనకు తెలుసు. అదేమాదిరిగా విద్యారంగం కూడా ఆశించిన ఫలితాలివ్వడంలేదు. ప్రభుత్వ పాఠశాలలు తెలివైన విద్యార్థులకు అనువైన విద్యను అందించడంలో విఫలమవుతుండటమే ఈ విషాదానికి కారణం. అంతర్జాతీ యంగా ఎప్పటికప్పుడు అన్నిరంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణమైన విద్యను విద్యార్థులకు అందించడం తక్షణావసరం. కానీ అది వాస్తవరూపం దాల్చడంలేదు. ఇది విద్య ప్రైవేటీకరణకు ప్రధాన కారణం. 1980 దశకాల్లో క్రమంగా ప్రారంభమైన ఈ విద్యప్రైవేటీకరణ క్రమంగా వటవృక్షం మాదిరిగా రూపొందింది. ఇప్పుడు పాఠశాలలను సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలుగా గుర్తించి రుణాలు మంజూరు చేయాలన్న స్థాయికి ప్రైవేటు విద్యారంగం చేరుకోవడ మే విచిత్రం! విద్యారంగం కార్పొటీకరణ ఇవే పరిణామాలు వైద్యరంగంలో కూడా చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ వైద్యం, ప్రైవేటు డాక్టర్ల స్థాయినుంచి ఇప్పుడు కార్పొరేట్ స్థాయికి వైద్యరంగం చేరుకొని ఫీజులుగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్న విధంగానే, విద్యారంగం కూడా కార్పొరేటీకరణకు గురయి ఇప్పుడు లక్షల్లో ఫీజులు నిర్దేశించే దశకు చేరుకోవడం అశ్చర్యం కలిగించినా ఆమోదించాల్సిన వాస్తవం! ప్రభుత్వాలు కోట్లల్లో విద్యకు నిధులు కేటాయించి ‘క్వాలిఫైడ్’ టీచర్లను నియమించినా, ప్రభుత్వ బడులు నాణ్యమైన విద్యను అందించలేకపోవడానికి ప్రధాన కారణం, పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల్లోచాలామంది ‘క్వాలిఫై’కు మాత్రమే పరిమితమై, పాఠ్యాంశాలపై పట్టులేకపోవడం, మారుతున్న పరిణామాలకు అనుగుణంగా తమను తాము అప్‌డేట్ చేసుకోకపోవడం! ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంత మంది క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నప్పటికీ, తగిన విద్యార్హతలు లేని ఉపాధ్యాయులతో ప్రైవేటు పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రధాన కారణమేంటో గుర్తించాల్సిన అవసరం వుంది. వ్యాపారంగా మారిన ప్రామాణిక విద్య ప్రాచీనకాలంలో గురుకులాలుండేవి. కేవలం ప్రతిభ ప్రామాణికంగానే విద్యాబోధన జరిగేది. ధ నార్జన కాదు కేవలం జ్ఞానార్జనకే ప్రాధాన్యత! రాజు, ధనిక, పేద అనే తరతమ భేదాలు లేకుం డా అందరూ గురుశుశ్రూష చేసి విద్యను గడిరచేవారు. అది అప్పటి పద్ధతి! కాలక్రమేణా పరిస్థి తులు మారుతూ వచ్చాయి. విదేశీ దండయాత్రలు, పాశ్చాత్య ప్రభావం మన విద్యారంగంపై ప డిరది. క్రమంగా సంస్కృతంతో పాటు దేశీయ భాషల స్థానాన్ని ఆంగ్లం ఆక్రమించింది. ముఖ్యంగా ఉద్యోగాలకు ఆంగ్లవిద్య అవసరం కావడంతో, దేశీయ విద్య అడుగంటిపోయింది. గురుకు లాల స్థానాన్ని ప్రభుత్వ పాఠశాలలు ఆక్రమించాయి. ఇవి క్రమంగా ఉద్యోగార్థులను తయారుచే సే కర్మాగారాలుగా మారిపోయి, సృజనాత్మతకు ప్రాధాన్యమే లేకపోయింది. క్రమంగా పెరుగుతు న్న విద్యావంతుల్కెన నిరుద్యోగులకు, అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు పొంతనే లేకపోవడం, సామాజిక అస్థిరతకు దారితీసింది. ఉపాధి దొరకని నిరుద్యోగులు ఉద్యమాలపేరుతో ఆవిర్భవించిన రాజకీయపార్టీలకు ఆకర్షితులయ్యారు. ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా యూనియన్ల పేరుతో రాజకీయాల్లో మునిగిపోయి, తమ వృత్తి ధర్మాన్ని విస్మరించడం మొదల్కెంది. క్రమంగా విద్యాసంస్థల్లోకి రాజకీయాలు చేరుకొని విద్యార్థుల మధ్య సైద్ధాంతిక సంఘర్షణలు ప్రారంభమై, విద్యావ్యవస్థ అస్థిరతకు లోన్కెంది. ఈ పరిణామాలు సహజంగానే ప్రతిభావంతుల్కెన విద్యార్థులపై, నిబద్ధతకలిగిన బోధకులపై ప్రతికూల ప్రభావాన్ని కలిగించాయి. సైద్ధాంతిక ముసుగులో విద్యా ర్థులు తమ విద్యకు తిలోదకాలిచ్చే దుస్థితి ఏర్పడిరది. విద్యాసంస్థలు రాజకీయ చ్కెతన్యం పేరుతోసంఘర్షణలకు ఆలవాలంగా మారాయి. ఈ పరిస్థితే క్రమంగా విద్యారంగంలోకి ప్రైవేటు సంస్థలు రంగ ప్రవేశం చేయడానికి దోహదం చేసింది. అక్రమాల దిశగా ప్రైవేటు విద్య తొలినాళ్లలో ప్రైవేటు విద్యారంగం, ఎప్పటికప్పుడు ప్రభుత్వ బోధనతో సరిపోల్చుకొని తమను తాము సరిదిద్దుకోవడం లేదా మరింత మెరుగైన విద్యను అందించేందుకు కృషిచేయడం చేశాయి. కానీ క్రమంగా ఈరంగంలో కూడా పోటీ పెరిగిపోవడంతో ఇక్కడ కూడా అక్రమాలు చోటుచేసుకోవడం ప్రారంభమైంది. విద్యార్థి సహజ ప్రతిభకు సంబంధించిన వాస్తవాలను మరుగుపరుస్తూ పరీక్షల్లో వారి సహజ పరిజ్ఞానంకంటే ఎక్కువ మార్కులు వేస్తూ తల్లిదండ్రులను మభ్యపెట్టడం మొదల్కెంది. నిజం తెలిస్తే విద్యార్థిని వేరే సంస్థలో చేర్పిస్తారన్న భయమే ఇందుకు కారణం! ఈవిధంగా అధికమార్కులు వేయడం ద్వారా ప్రారంభమైన అన్కెతికత క్రమంగా, వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో లేదా ఇతర ప్రైవేటు విద్యాసంస్థల్లో ర్యాంకర్లను తమ జూనియర్ కళాశాలల్లో చేర్పించ కునేందుకు వేట స్థాయికి చేరుకుంది. దీని తర్వాతి పరిణామం ఏజెంట్లను నియమించుకొని మరీ పదవతరగతి ర్యాంకర్లకోసం ఎరవేసే ప్రక్రియ దాకా వెళ్లింది. ర్యాంకర్లకు రాయితీలిస్తూ, మ ధ్య స్థాయి అంతకంటే తక్కువ ర్యాంకులు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ముక్కుపిండి మరీ అధిక ఫీజులు వసూలుచేసే ప్రక్రియ మొదల్కెంది. ఈ విధంగా అధిక ర్యాంకులు వచ్చిన వి ద్యార్థులను చూపుతూ, పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులను ఆకర్షించే తర్వాతి దశ ప్రారంభమైంది. ఇదే సమయంలో కాన్సెప్ట్ స్కూళ్ల పేరుతో కొత్త పోకడలు మొదలయ్యాయి. ఐఐటీలు, ఐఏఎస్ కో చింగ్‌లు, టెక్నో, ఇంటర్నేషనల్, సెంట్రల్ సిలబస్ ఇలా ఎన్నోరకాల స్కూళ్లు కుప్పలుతెప్పలుగా వెలిసాయి. వీటికి తోడు జూనియర్, ఇంజినీరింగ్ కళాశాలలు కూడా పెరిగిపోవడంతో, విద్యార్థుల వేట నిత్యకృత్యంగా మారిపోయింది. క్రమంగా విద్యారంగాన్ని ప్రైవేటు యాజమాన్యాలు శాసించేస్థాయికి వచ్చిన తర్వాత, క్రమంగా ప్రభుత్వాలపై కూడా తమ పట్టును సాధించడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా తాము వసూలు చేసే ఫీజులపై నియంత్రణ లేకుండా చూసుకునేందుకు రాజకీయపార్టీలకు అనుకూలంగా వుండ టం, మీడియాకు అవసరమైన ప్రకటనలు జారీచేస్తూ తమ తప్పిదాలు బయటకు రాకుండా జా గ్రత్త పడటం దాకా ప్రైవేటు విద్యాసంస్థలు తమ సహస్రబాహువులను విస్తరించాయి. నాణ్యతకు తిలోదకాలు విద్యార్థి రాజకీయాల పేరుతో ప్రభుత్వ విద్య భ్రష్టుపట్టిన తర్వాత రంగంలోకి వచ్చిన ప్రైవేటు విద్యా సంస్థలు క్రమంగా తమ లాభాలను కాపాడుకునేందుకు, విద్యాబోధనలో తమద్కెన శ్కెలిని అనుసరించడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా విద్యార్థులను ఎ,బి,సి గ్రేడ్‌లుగా విడగొట్టి ఒక్కొక్కరికి ఒక్కోరకమైన విధానంలో బోధన కొనసాగించాయి. వీటి లక్ష్యం ఒక్కటే ఎ గ్రేడ్ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తే ప్రకటనల రూపంలో ప్రచారం చేసుకోవచ్చు. ఇది టెన్త్‌క్లాస్, ఇంటర్మీ డియట్ స్థాయిల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. వీరు బోధించే తీరువల్ల విద్యార్థులకు వాటిల్లిన ప్రధాన నష్టం సృజనాత్మకత లోపించడం. కేవలం తాము చదివిన ప్రశ్నలు వస్తేనే సమాధానాలు రాసే పరిస్థితి! సబ్జెక్టు అవగాహనపై ఇచ్చే ప్రశ్నలకు సమాధానాన్ని టాప్ ర్యాంక్ విద్యార్థులు కూడా రాయలేకపోవడంతో, ఇంజినీరింగ్ స్థాయి దాటిన తర్వాత కంపెనీలు అడిగే సృజనాత్మక ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఎంతోమంది విద్యార్థులు తాము చదివిన చదువు స్థాయికంటే తక్కువ స్థాయి ఉద్యోగాల్లో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఇక బి, సి గ్రేడ్ విద్యార్థులు కేవలం ప్రైవే టు పాఠశాలలు, కళాశాలల ర్యాంకుల చట్రంలో ఇరుక్కుపోయి, ఏదో ర్యాంకుతో బయటకు వచ్చి, ఏరంగంలో స్థిరపడాలో దిక్కుతోచని స్థితికి లోన్కె, తమ విద్యకు సంబంధంలేని ఏదో ఒక ఉద్యోగం లేదా ఉపాధిలో సర్దుకుపోవడం కొనసాగుతోంది. లక్షలు దండుకుంటున్న ప్రైవేటు స్కూళ్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదేళ్లు దాటితేనే పాఠశాలల్లో చేర్పించాలి. కానీ ఇప్పుడు ప్లే స్కూల్స్, కిండర్ గార్డెన్ అంటూ రకరకాల స్కూళ్లను నెలకొల్పి లక్షలు దండుకుంటున్నారు. కేవలం ప్లే స్కూల్‌లో చేర్పించడానికి రూ.4లక్షలు ఫీజు కట్టాల్సి వచ్చిందంటూ ఒక తండ్రి వాట్సప్‌లో పోస్ట్ పెట్టి వాపోవడం తాజా పరిణామం. ప్రైవేటు సంస్థలు ఈవిధంగా రెచ్చిపోవడానికి తల్లిదం డ్రులు కూడా కారణమే! తమ పిల్లల్ని పెద్ద స్కూళ్లలో చేర్పించాలన్న వీరిలోని బలహీనతను అ టువంటి సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. కొన్ని పాఠశాలలు ఎ.సి. సదుపాయాన్ని కల్పిస్తు న్నామంటూ పెద్దమొత్తంలో తల్లిదండ్రులనుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి. వీరు కూడా తమ పిల్లలు ఎ.సి. పాఠశాలలో చదువుతున్నారని గొప్పలు పోతారు తప్ప, అక్కడ విద్యాప్రమాణాల ను పట్టించుకోరు. ప్రభుత్వ ఉద్యోగాలన్నది ఒకప్పటి మాట! ఇప్పుడు ఎవరూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇ వ్వడంలేదు. ఐ.టి, సెమికండక్టర్స్, చిప్స్, స్పేస్ వంటి వివిధ రంగాల్లోకి వెళ్లడానికే యువకులు ఉత్సాహం చూపుతున్నారు. మరి సృజనాత్మకతకు పెద్దపీటవేసే ఈ రంగాల్లోకి ఈ ‘రొడ్డకొట్టుడు’ విద్యను అభ్యసించినవారు ఎంతమేర పనికొస్తారు? ఇక్కడే వస్తున్నది అసలు సమస్య! ఇవ్వాళ నేర్చుకున్న న్కెపుణ్యం రేపటికి పనికిరావడంలేదు. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉన్నవారు మాత్రమే నేటి ప్రపంచంలో మనగలుగుతారు. ఈ నేపథ్యంలో ఈ ప్రైవేటు సంస్థలు అందిస్తున్న విద్య నాణ్యతపై తప్పనిసరిగా పర్యవేక్షణ ఉండాలి. ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకొని, ముందుగా ప్రభుత్వ పాఠశాలలను సృజనాత్మక విద్యను అందించే విధంగా సమూలంగా మార్పులు చేపడితేనే ఈ ప్రైవేటు వేలంవెర్రికి అడ్డుకట్ట పడుతుంది. విద్యార్థి దశలో రాజకీయాలపట్ల అవగాహన కలిగించడంలో తప్పులేదు కానీ, సైద్ధాంతిక రాజకీయాల పేరుతో వారిలో సంఘర్షణాత్మక వైఖరిని ప్రోత్సహిస్తే, పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది! ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో వీటిని నియంత్రించి, సృజనాత్మకు పెద్దపీట వస్తేతప్ప ఈ ప్రేవేటు వేలంవెర్రికి అడ్డుకట్టవేయడం సాధ్యంకాదు.
వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపడుతున్నట్లు భూపాలపల్లి మున్సిపాలిటీ 6వ వార్డు క్రిష్ణకాలని కౌన్సిలర్ ఎడ్ల మౌనిక కరాటే శ్రీనివాస్ అన్నారు. అందులో భాగముగా శనివారం మున్సిపల్ సిబ్బందిచే మంచి నీటి బోర్లకు మరమ్మత్తులు చేయించారు. అనంతరం పారిశుధ్య కార్మికులచే సైడ్ కాలువలు శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.
జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి చంద్రశేఖర్
భూపాలపల్లి నేటిధాత్రి
విద్యార్థుల జీవితంలో పరీక్షలు అనేవి చాలా కీలకమని విద్యార్థుల్లో ఉన్న అంతర్గత సామర్ధ్యాలను బహిర్గతం చేసేవే పరీక్షలని జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి ఓం టేరు చంద్రశేఖర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లొ 24004 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలు రాసినారు. పరీక్షలు 22 ఏప్రిల్ నందు ముగిసే సందర్భంలో 23వ తేదీన అన్ని పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగులు ఏర్పాటు చేసి ఫలితాలను ప్రకటించాలని వారు తెలిపారు అదేవిధంగా ఫలితాలను విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు తెలిసే విధంగా రికార్డ్స్ నందు సంతకాలను తీసుకోవాలని కూడా ప్రధానోపాధ్యాయులకు సూచనలు చేశారు. రేగొండ మండలంలో ప్రైవేటు పాఠశాలను జిల్లా పరిషత్ హై స్కూల్ రేగొండ. చిట్యాల మండలం నందు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులందరూ వేసవి సెలవుచల్లగారిగె. జూకల్ ఉన్నత పాఠశాలలను వారు సందర్శించి ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేసినారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.