నూతన వదూవరులను ఆశీర్వాదించిన మోకుదెబ్బ నాయకులు.

నర్సంపేట,నేటిధాత్రి :

గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్లెపు సమ్మక్క-వెంకట నారాయణ గౌడ్ ల పుత్రుడు చందన -వంశీగౌడ్ ల వివాహ విందుకార్యక్రమం సోమవారం
ఖానాపురం మండలం అశోకనగర్ గ్రామంలో జరిగింది.కాగా మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై నూతన వదూ వరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోడిశాల సదానందం గౌడ్, రాష్ట్ర నాయకులు గంప రాజేశ్వర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు జూలూరి హరిప్రసాద్ గౌడ్,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట పంజాల వెంకట్, నాగేల్లి శివ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

పార్లమెంట్ అభ్యర్థి విజయమే కాంగ్రెస్ లక్ష్యం.

కాంగ్రెస్ ప్రభుత్వం లోనే అందరికీ సమన్యాయం.

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గాదే రమేష్ పటేల్.

రఘునాథపల్లి (జనగామ) నేటి ధాత్రి :-
వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కావ్య విజయం లక్ష్యంగా ప్రతి కార్యకర్త నాయకులు పనిచేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ పటేల్ జెడ్పిటిసి సభ్యులు బొల్లం అజయ్ మణికంఠ,మారుజోడు రాంబాబు,మండల అధ్యక్షులు కోళ్ల రవి గౌడ్ అన్నారు సోమవారం మేకలుగట్టు, వెళ్లి,రఘునాథపల్లి మండల్ గూడెం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం విచ్చేయాలని వారు కోరారు. రానున్న రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి వస్తాయని వారు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం లోని బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం జరుగుతుందని వారు వివరించారు. ఆగస్టు 15 రైతులకు రుణమాఫీ ఏకకాలంలో అమలు చేయడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈనెల 24న బుధవారం వరంగల్ లో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని వారు కోరారు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని వారు తెలిపారు.. మాజీ ఎంపీటీసీ మల్కాపురం లక్ష్మయ్యగౌడ్, రాష్ట్ర నాయకులు మహమ్మద్ బోస్మియా,గాదె మహేందర్ రెడ్డియు రవి.ఎంపీటీసీ పేర్ని ఉషా రవి,సింగిల్ విండో చైర్మన్ చీమలపాటి రవీందర్ జి,కడారి రవి, రంగు రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

గురుకుల్ సెట్ లో లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు..

నర్సంపేట,నేటిధాత్రి :

ఇటీవల తెలంగాణ గురుకుల్ సెట్ ఫలితాల్లో దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు అర్హత పొంది ఉచిత సీట్లను సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్, చైర్మన్ గట్టికొప్పుల విజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గురుకుల ప్రవేశాలలో తమ పాఠశాల నుండి 22 విద్యార్థులు పోటీ పరీక్షలలో నెగి సీట్లు సాధించాలని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో ఉన్నతమైన విద్యను అందించడమే లక్ష్యంతో పాటుగా ప్రభుత్వ కాంపిటేటివ్ ఎగ్జాంలలో పేద విద్యార్థులను తరలించేందుకు ఈ అవకాశాలను కల్పిస్తున్నట్లు విజెందర్ తెలిపారు. ఈ సందర్భంగా అర్హత పొందిన విద్యార్థులను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్, విష్ణు, రాధిక, అనిత, ప్రవళిక, శ్రావణి, కొమురయ్య విద్యార్థులు పాల్గొన్నారు.

కల్తీ కల్లు విక్రయం….?

– కాళ్లు చేతులు గుంజులు… వివిధ గ్రామాల ప్రజల ఆరోపణలు….

– మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు…

కొల్చారం (మెదక్) నేటిధాత్రి :-

కొల్చారం మండలం వ్యాప్తంగా పలు గ్రామాల్లో కల్తీకల్లు జోరుగా సాగుతుందని వివిధ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు . ఎక్సైజ్ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. కల్తీ కళ్ళకు యువత బానిస గా మారి రోడ్డు ప్రమాదాలు గురవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయినా ఎక్సైజ్ అధికారులు మాత్రం ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజల ఆరోపిస్తున్నారు. కల్తీ కళ్ళను అరికట్టి ఎక్సైజ్ అధికారులు నామమాత్రంగా కళ్ళు శాంపిల్ సేకరించడం
తదనంతరం చర్యలు చేపట్టకపోవడం? అదేవిధంగా ఇంత జరుగుతున్న కల్తీకల్లును హరి కట్టకపోవడం సందేహం ప్రజల్లో కలుగుతుంది. ఇంత పెద్ద మొత్తంలో పెరుగుతున్న ధరలు తక్కువ ధరకు మత్తు, గంజాయి, క్లోరోఫామ్ లాంటి మత్తు పదార్థం కలుపుతున్నారని సందేహం లేకపోలేదు, తక్కువ ధరకు కళ్ళు దొరుకుతుందని మందుబాబులు ప్రభుత్వ వైన్స్ దుకాణాలకు బదులు, కళ్ళు దుకాణాలను ఎంచుకుంటున్నారు. కుత్రిమ కల్తీకల్లు ద్వారా అనారోగ్యంతో పాటు వ్యాస నరుపలుగా, బానిసత్వానికి లోనే, సైకో లు గా మారుతున్న యువత, ప్రకృతి ప్రసాదించే ఈత లేదా తాటికల్లు బదులు, కల్తీ బాబులు వ్యాపారంగా మార్చుకున్నారు. మత్తుకు బానిస అయిన వారిని అదుపు చేసుకొని వ్యాపారాన్ని బహిరంగ విచ్చలవిడిగా కళ్ళు సీసాలలో కల్తీకల్లు అమ్ముకుంటూ ప్రజలకు హాని చేసే ప్లాస్టిక్ కవర్ల తో విచ్చలవిడిగా కళ్ళు ప్యాకెట్లో అమ్ముతున్నారు. ఇప్పటికైనా కల్తీ కల్లును అరికట్టాల్సిన బాధ్యత ఎక్సైజ్ అధికారుల పై ఉందని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఎక్సైజ్ అధికారులు ఎంతవరకు కల్తీ కల్లును హరి కడతారో వేచి చూడాలి మరి.

బిజెపిపార్టీ గెలుపు కోసం ఇంటింటా విస్తృత ప్రచారం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలోని 306 బూతులో భూత్ అధ్యక్షుడు బాసని నవీన్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి మండల కో ఆర్డినేటర్ నరహ రిశెట్టి రామకృష్ణ హాజరై ఇంటింటి ప్రచార నిర్వహిం చారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చి దాదాపుగా 5 నెలలు గడుస్తున్నా చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదు మహాలక్ష్మి స్కీమ్ , రైతుబంధు,భూమిలేని రైతులకు రైతుబంధు, రెండువేల పెన్షన్లు నాలుగు వేలకు పెంచుతామని కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తామని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇలాంటి ఎన్నో మాయమాటలు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇవే మాటలు దేశ మొత్తం చెప్పి అధికారంలోకి రావాలని చూస్తుంది కానీ దేశ ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మకుండా దేశంలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా నిలవాలంటే ఈ దేశానికి మోడీ నాయకత్వం చాలా అవసరం ఉన్నదని మూడోసారి కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉంటే ఎన్నో సంస్కరణలకు ఆయన స్వీకారం చుట్టే అవకాశాలు ఉంటాయని ఈ దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తారు కనుక మే 13న జరగబోవు లోక్ సభ ఎన్నికలలో బిజెపి తరఫున పోటీ చేస్తున్న ఆరూరు రమేష్ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలి. ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కానుగుల నాగరాజు సీనియర్ నాయకులు బాసని విద్యాసాగర్, బూత్ అధ్యక్షులు కడారి చంద్రమౌళి, బాసాని నవీన్, కోమటి రాజశేఖర్, మేకల సుమన్ తదితరులు పాల్గొన్నారు.

టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిక

సీనియర్ నాయకులు గొట్టిముక్కల జస్వంత్ రావు (దేశాల్), ఎం. భీమ్ రావు సీఎం సమక్షంలో చేరిక

కూకట్పల్లి, ఏప్రిల్ 22 నేటి ధాత్రి ఇన్చార్జి

కూకట్ పల్లి చెందిన పలువురు నాయ కులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.గ తంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఈ నేతలు కొంతకాలంగా స్తబ్దతగా ఉన్నా రు.అయిత ఎమ్మెల్సీ మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి భర్త పట్నం మహేందర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అంగీకరించారు.ఇందు లో భాగంగా గొట్టిముక్కల జస్వంత్ రావు (దేశాల్),మొదలుగు భీమ్రావు,తులసి వర్ధన్ రావు,రామాంజన్ రెడ్డి,కొమ్ము బాబు,జాన్ తదితరులకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుందని,కూకట్ పల్లికి చెందిన పలు వురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరినం దుకు వారిని అభినందించారు.దేశాలు మాట్లాడుతూ పట్నం మహేందర్రెడ్డికి ఎమ్మెల్సీ,కూకట్పల్లి ఇన్చార్జి అయిన బండి రమేష్కి,కూకట్పల్లి కోఆర్డినేటర్ వినయ్ రెడ్డికి కూకట్పల్లి మాజీ అధ్య క్షులు శేరి సతీష్ రెడ్డికి,కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా పేరుపేరునా వీరికి ధన్యవాదాలు తెలియజేశారు.

భారత రాజ్యాంగాన్ని మారుస్తానన్న పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలి.

ఏ వై ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో సోమవారం రోజున అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన జరిగిన సంఘం సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య మాట్లాడుతు 16 డిగ్రీలు పూర్తి చేసి 16 డిగ్రీ పట్టాలు పొందిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని తెలిపారు. ఆ భారత రాజ్యాంగం ఆమోదం పొంది అమల్లోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలనను కొనసాగిస్తున్నాయని చెప్పారు. ఈ భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగులు పాఠశాలలో మరియు వార్డు సభ్యులు మొదలు కొని రాష్ట్రపతి వరకు రిజర్వేషన్ల ద్వారా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క కార్యక్రమం కొనసాగుతోందని అన్నారు. ఈ రాజ్యాంగమే భారత దేశానికి దిక్సూచి అని తెలిపారు. మనకు రాజ్యాంగమే లేకపోతే అనేక ఇబ్బందులు పడేవారమని అన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం ఈ రాజ్యాంగం ద్వారా జరుగుతుందని తెలిపారు
ఈ పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి 400ల సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామనడం సరియైనది కాదని అన్నారు. ఈ రాజ్యాంగం ప్రకారమే 75 సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలనను కొనసాగించిందన్నారు ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుస్తే రాజ్యాంగాన్ని మారుస్తామనడం సిగ్గు చేటన్నారు భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు తో బడుగు బలహీన వర్గాలందరు ఏకమై ఆ పార్టీకి తగిన బుద్ది చెబుతామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యాదర్శి గుర్రపు రాజేందర్ జిల్లా సాంస్కృతిక కార్యాదర్శి జన్నే యుగేందర్ మండల ప్రధాన కార్యదర్శి మ్యాదారి సునీల్ ఉపాధ్యక్షుడు కట్కూరి శ్రీనివాస్ నాయకులు పుల్ల ప్రతాప్ గురుకుంట్ల కిరణ్ గడ్డం సదానందం ఆరేపెల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా షిరిడీ సాయిబాబా దేవాలయ 24వ వార్షికోత్సవం

రామకృష్ణాపూర్ ,నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ ప్రాంతంలో గల షిరిడి సాయిబాబా దేవాలయపు 24వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని సోమవారం ఆలయ కమిటీ ప్రధాన అర్చకులు గట్టు సుభాష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాయిబాబా విగ్రహానికి పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఆలయ ప్రాంగణంలో సాయినాథుడికి ప్రత్యేక అభిషేకము, హోమము, తీర్థప్రసాదాలు సాయినాధుడికి హారతులు, భక్త బృందం భజన కార్యక్రమం, పల్లకి సేవ వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గట్టు సుభాష్ శర్మ మాట్లాడుతూ… దేవాలయపు 24 సంవత్సరాల వార్షిక మహోత్సవ కార్యక్రమాన్ని శాస్త్ర యుక్తంగా షిరిడి సాయి నాధుడికి సమస్త భక్తుల సహకారంతో సాయిబాబా కు అనేక రకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. సాయినాధుడి మహిమతో దేవాలయం బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని,భక్తులు సాయి బాబా పట్ల భక్తి శ్రద్ధ వహించి దేవాలయ అభివృద్ధికి పాల్పడుతున్నారని అన్నారు.

బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి రమేష్ గెలుపుకై ఇంటింటి ప్రచారం

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సుభాష్ కాలనీ 17వవార్డులో బిజెపి పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయాలని ప్రచారం నిర్వహించిన ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దొంగల రాజేందర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడానికి ప్రజలను మోసం చేస్తుందని అన్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయట పడుతుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ మీద నమ్మకం లేక ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కేవలం ఓట్ల కోసం ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజల కు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యాయరు ప్రజలు ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తాండ్ర హరీష్ చెటగొప్పుల అర్జున్ సిల్వర్ కార్తిక్ గట్ట శ్రీనివాస్ ఆవుల సంతోష్ బొట్టే రాజేష్ శ్రీకాంత్ వేణు శ్రీధర్ రవి తదితరులు పాల్గొన్నారు

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘము జిల్లా వర్కింగ్ సెక్రటరీగా కనగర్తి గ్రామ వాసి

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

పెద్దపల్లి జిల్లాలో అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘము జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశంలో లోక సభ ఎన్నికలో అనుసరించాల్సిన విధానాలను , అంబేద్కర్ ప్రవేశ పెట్టిన రాజ్యాంగ చట్టానికి లోబడి అనుసరించాలని దిశ నిర్దేశం చేయడం జరిగింది అలాగే ఈ సమావేశంలో పెద్దపల్లి జిల్లా వర్కింగ్ సెక్రటరీగా ఓదెల మండలం కనగర్తి గ్రామా వాసి అంబాల కుమార స్వామి(కుమార్) నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘము జాతీయ ఉపాధ్యక్యులు మామిడిపల్లి. బాపయ్య పెద్దపల్లి అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘము జిల్లా అడ్వైసర్ కోటగిరి పాపయ్య నియామక పత్రం అదించారు ఇందులో కార్యవర్గ సభ్యులైన సదయ్య, రవి, శ్రీనివాస్ పాల్గొన్నారు

మెదక్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయం…

-కొల్చారం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ముత్యం ప్రవీణ్ …

కొల్చారం,(మెదక్) నేటిధాత్రి :-

మెదక్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి జరగబోయే ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని కొల్చారం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ముత్యం ప్రవీణ్ దీమా వ్యక్తం చేశారు. బి ఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పథకాలను చూసి ప్రజలు తప్పకుండా కారు గుర్తుకు ఓటేసి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని బారి మెజారిటీతో గెలిపిస్తారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో కల్యాణ లక్ష్మి , షాది ముబారక్, రైతుబంధు, రైతు బీమా , పలు పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన గుర్తు చేశారు. మెదక్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ముత్యం ప్రవీణ్ కుమార్ అన్నారు.

సమసమాజ స్థాపన లక్ష్యంగా సిపిఐ ఎంఎల్ ఆవిర్భావo

# డివిజన్ కార్యదర్శి ఎలకంటి రాజేందర్.

నర్సంపేట,నేటిధాత్రి :

పీడిత ప్రజల విముక్తి సమసమాజ స్థాపన లక్ష్యంగా సిపిఐ ఎంఎల్ పార్టీ ఆవిర్భవించిందని డివిజన్ కార్యదర్శి ఎలకంటి రాజేందర్ అన్నారు. నర్సంపేటలోని న్యూ డెమోక్రసీ కార్యాలయం వద్ద లెనిన్ 154 వ జయంతి, సిపిఐ ఎంఎల్ ఆవిర్భావం పురస్కరించుకొని అరుణ పతాకాన్ని ఎగురవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎలకంటి రాజేందర్ మాట్లాడుతూ ప్రపంచ కమ్యూనిస్టు, సోషలిస్ట్ యోధుడు, ప్రపంచ ప్రజలకు మార్గదర్శిగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప కమ్యూనిస్టు నాయకుడని కొనియాడారు.నేడు ఎర్రజెండా పేరుతో కొనసాగుతున్న సిపిఐ,సిపిఎం రివిజనిస్టు పార్టీలు పాలకవర్గాలతో సీట్ల కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. ఆనాడే వీరి విధానాలను తిప్పికొడుతూ తరిమెల నాగిరెడ్డి పార్లమెంటును బాతాకాని క్లబ్ గా విమర్శిస్తూ పార్లమెంటు ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం కావని నమ్మి రాజీనామా చేసి సాయుధ పోరాట పందాకు ఊతమిచ్చాడని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు గట్టి కృష్ణ, భోగి సారంగపాణి,భీమగాని మల్లయ్య,వేముల వెంకట్ రెడ్డి, కొంపెల్లి సాంబయ్య, ఐలయ్య, పివైఎల్ జిల్లా అధ్యక్షులు ఆకుల వెంకటస్వామి, పిడిఎస్యు డివిజన్ కార్యదర్శి గుర్రం అజయ్,పిఓడబ్ల్యు డివిజన్ నాయకురాలు సౌందర్య, సంధ్య, తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి సంపద పనులు ప్రారంభం, పేదల కండల్లో ఆనందం.

ఇసుక క్వారీల ప్రారంభానికి ముహూర్తం ఖరారు ఆనందంలో ఉమ్మడి మండల ప్రజలు.

ఇసుక రవాణాకు “మ్యానువల్ డంపింగ్ “ప్రారంభం త్వరలో ఇసుక రవాణాకు సిద్ధం. గ్రామ ప్రజలు క్వారీ యజమాన్యానికి సహకారం అందించాలి.

పలిమేల మహాదేవపూర్ గోదావరి కి ఆనుకొని ఆరు ఇసుక క్వారీలు ప్రారంభానికి అనుమతులు.

పెద్దంపేట ఇసుక క్వారీ పనులు ప్రారంభం, ఇసుక రవాణా కొరకు మాన్యువల్ పద్ధతిలో ఇసుక సిద్ధం చేస్తున్న యజమాన్యం.

క్వారీల యజమాన్యం గ్రామస్తులకు ప్రత్యేక ఉపాధి కల్పించాల్సిన అవసరం, మాన్యువల్ పద్ధతితో గ్రామీణ పేద ప్రజలకు ఉపాధి.

ఇసుక రవాణా, క్వారీల నిర్వహణలో సమాచార సాంకేతిక అపుహాలను నమ్మి ప్రజలు అధికారులు మోస పోవద్దు, గత నాలుగు సంవత్సరాలు అపూహలతో ఉపాధికి కోల్పోయి అనేక ఇబ్బందులు.

మహాదేవపూర్- నేటి ధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ని గోదావరి పరివాహక ప్రాంతానికి ఆనుకొని ఉన్న మహాదేవపు ఉమ్మడి మండలం లో 2016 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పరివాహక ప్రాంతం నుండి ఇసుక క్వారీలను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖజానా ఆదాయం సమకూర్చడం లో సఫలీకృతం కావడం జరిగింది. మరోవైపు ఉమ్మడి మండలంలోని ప్రజలకు సుమారు ఐదు సంవత్సరాల పాటు ఉపాధి కూడా లబ్ధి పొందడం జరిగింది. కోవిడ్ అనంతరం 2021 మహాదేవపూర్ నుండి అంబడ్ పల్లి వరకు గోదావరి సరిహద్దుకు కొనసాగిన సుమారు 14 క్వారీలు మూసివేయడం కాలేశ్వరం పరిధిలోని మరో 8 క్వారీలు మూసి వేసి నామమాత్రంగా క్వారీలు నిర్వహణ కొనసాగడం నేటికీ జరుగుతుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో క్వారీల మూసివేత ప్రభుత్వ ఖజానాకె, కాదు పేదా మధ్య తరగతి కుటుంబాలకు ఒకేసారి ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులకు దారి తీసే పరిస్థితులు వచ్చాయి. ఉమ్మడి మండల ప్రజలు ఇసుక క్వారీల ప్రారంభంతో తమకు ఉపాధి కలుగుతుందని గత మూడు సంవత్సరాల నుండి అనేక ఆశలు పెట్టుకొని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ఆ ప్రజలకు ప్రకృతి సంపద తిరిగి ఆ పేద ప్రజలకు వరంగా మరే సందర్భం గ్రామంలో ఉపాధి ఉందే మరో సువర్ణ అవకాశం కలగడంతో ఆ ప్రజల్లో ఆనందానికి అంతు లేకుండా పోయింది. మహాదేవపూర్ ఉమ్మడి మండలం పలిమెల అంబడ్ పల్లి గ్రామాలకు ఆనుకుని ఉన్న గోదావరి నుండి ఇసుక రవాణాకు గత సంవత్సరం నవంబర్లో ఐదు ఇసుక క్వారీలు ఏర్పాటు చేస్తూ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం ప్రస్తుతం 6 నూతన ఇసుక క్వారీల్లో యజమానులు పనులు ప్రారంభించడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు కుతమకు ఉపాధికి డొక లేదు అని హర్షం వ్యక్తం చేయక తప్పడం లేదు.

ప్రకృతి సంపద పనులు ప్రారంభం, పేదల కండల్లో ఆనందం.

ఇట్టకేలకు ఉమ్మడి మండల ప్రజల కల సహకారం అయింది. మూడు సంవత్సరాలుగా ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్న ఆ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ముక్తేశ్వరుడు కరుణించడం ఆ ముక్తిశ్వరుడి సన్నిధిలో పారుతున్న గోదావరి మండల ప్రజలకు ప్రకృతి సంపదలను అందించే విధంగా ప్రకృతి సంపద ఇసుక క్వారీల ప్రారంభం పేద ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని వెళ్ళు విరిసేలా చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహదేవ్పూర్ ఉమ్మడి మండలంలో 6 నూతన ఇసుక క్వారీలను ప్రారంభించుటకు టి ఎస్ ఎం డి సి శాఖ అంబడ్ పల్లి గ్రామ గోదావరి సరిహద్దు నుండి మొదలుకొని పంకెన గ్రామం వరకు, అంబడ్ పల్లి 2 అంబడ్ పల్లి 3, అంబడ్ పల్లి 4, పంకెన1,పంకెన2, పెద్దంపేట 1, పేర్లతో ఇసుక క్వారీలను ప్రారంభించుటకు యజమాన్యులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. టెండర్ దక్కించుకొని అగ్రిమెంట్ పూర్తి చేసుకున్న యజమానులు ఇసుక రవాణాకు పనులను ప్రారంభం చేసుకునే క్రమంలో పడ్డారు. ఒక లక్ష మ్యాట్రిక్ టన్నులతో పాటు నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు అలాగే లక్ష అరవై వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను రవణ కొరకు శాఖ ఆరు క్వారీలకు అనుమతులు ఇవ్వడంతో పాటు, మాన్యువల్ పద్ధతిలో ఇసుక రవాణా మరియు డంపింగ్, ట్రాక్టర్లలో స్థానిక ప్రజల నుండి ఇసుకను లోడ్ చేయడం లాంటి నిబంధనలతో ఆరు ఇసుక క్వారీలను ప్రారంభానికి అనుమతులు జారీ చేయడం తో పనులు కొనసాగించడం జరుగుతుంది.

ఇసుక క్వారీల ప్రారంభానికి ముహూర్తం ఖరారు ఆనందంలో ఉమ్మడి మండల ప్రజలు.

తెలంగాణ రాష్ట్ర వైన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మహదేవ్పూర్ మండల పరిధిలో నూతన ఇసుక క్వారీలకు అనుమతులు పనులు ప్రారంభం త్వరలో ఇసుక రవాణాకు ముహూర్తం ఖరారు రావడంతో ఉమ్మడి మండల ప్రజల్లో ఆనందానికి హద్దు లేకుండా పోయింది. సుమారు మూడు సంవత్సరాలుగా ఒకేసారి ఉపాధి కోల్పోయి వేయికండ్లతో ఉపాధి కొరకు చూస్తున్న ఆ నిరుపేద ప్రజలకు ఇసుక క్వారీల ప్రారంభం ప్రకృతి అందించిన వరం తో ప్రజలకు ఉపాధి ప్రభుత్వ ఖజానాకు ఆసరా చేసే ఇసుక క్వారీలు ఇసుక తరలింపునకు యజమాన్యం పనులు ప్రారంభిస్తూ మరికొద్ది రోజుల్లో ఇసుక రవాణాకు ముహూర్తం ఖరారు కావడంతో ఉపాధి లేక విలవిల బోయిన ఆ గ్రామాలు తమ గ్రామంలోని ఉపాధి కలిగే విధంగా ఇసుక క్వారీలు ప్రారంభం కావడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మిగతా క్వారీల ప్రారంభం కొరకు ఎదురు చూడడం జరుగుతుంది.

ఇసుక రవాణాకు “మ్యానువల్ డంపింగ్ “ప్రారంభం త్వరలో ఇసుక రవాణాకు సిద్ధం. గ్రామ ప్రజలు క్వారీ యజమాన్యానికి సహకారం అందించాలి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రవాణా విషయంలో ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా ఇసుక రవాణాలో ఔకత్వకలను జరగకుండా చర్యలు చేపట్టే క్రమంలో మరోవైపు ఇసుక క్వారీలు నిర్వహించే ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాలు ఉండడం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి కలిగేలా ప్రభుత్వం మరియు టిఎస్ఎండిసి శాఖ ప్రత్యేక నిబంధనలతో క్వారీలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది. ఇసుక రావణాలకు మాన్యువల్ డంపింగ్ లోడింగ్ అన్ లోడింగ్ చేసే క్రమంలో మిషనరీ ఇలాంటి వాటిని నిషేధిస్తూ గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రజలతో లోడింగ్ చేసి ట్రాక్టర్ల ద్వారా గోదావరి నుండి ఇసుక తీసుకువచ్చి డంపింగ్ చేసే విధానాన్ని అవలు పరచాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టి ఎస్ ఎన్ డి సి అలాగే ప్రభుత్వం జారీ చేసిన మాన్యువల్ డంపింగ్ పద్ధతిని అనుసరిస్తూ ఇసుక క్వారీ యజమానులు ఆయా గ్రామస్తులతో ఇసుక డంపింగ్ పనులు చేపట్టే క్రమంలో పడ్డారు. ఇక ప్రస్తుతం మహాదేవపూర్ మరియు పలిమెల గోదావరి ప్రాంతాల్లో నిర్వహించ పడుతున్న ఇసుక క్వారీలకు సంబంధించి ఆయా గ్రామాల ప్రజలు ఉపాధి కోల్పోకుండా ప్రజలు ఇసుక డంపింగ్ వ్యవహారంలో కూలి విషయాలతో పాటు ఇతర రవాణా సౌకర్యాలకు సంబంధించి గ్రామస్తులు క్వారీల యజమానులతో పాక్షికంగా వ్యవహరిస్తూ కూలి గిట్టుబాటు తోపాటు ఇతర వ్యవహారాలను యజమానులతో చర్చించి ప్రజలు మరియు వారి యజమానుల సమన్వయం పాటిస్తూ ఉపాధి కోల్పోకుండా ఇసుక క్వారీల యజమానులకు డంపింగ్ వ్యవహారంలో ఇబ్బందులు తలెత్తకుండా గ్రామస్తుల సహాయ సహకారాలు అందిస్తూ ఇసుక క్వారీల నిర్వహణ సాఫీల జరిగేలా ప్రజలు మరియు యజమాన్యులు కలిసి నడవాల్సిన అవసరం ఉంది.

పలిమేల మహాదేవపూర్ గోదావరి కి ఆనుకొని ఆరు ఇసుక క్వారీలు ప్రారంభానికి అనుమతులు.

గత మూడు సంవత్సరాల క్రితం ఉమ్మడి మండలంలో వాహనాల అలజడి ప్రజల అండల్లో ఆనందం ఎటు చూసినా ఏదో ఒక పనిలో నిమగ్నమైన గ్రామీణ ప్రజల ఆ కల మళ్ళీ తిరిగి ప్రారంభం కాబోతుంది. టీఎస్ ఎంబీసీ శాఖ గత సంవత్సరం నవంబర్లో మహాదేవపూర్ ఉమ్మడి మండలం వీడిగడ్డ ప్రాజెక్ట్ గోదావరి వద్ద ఆరు నూతన ఇసుక క్వారీలను మంజూరు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్థానిక అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇసుక కాంట్రాక్టర్లు క్వారీలను టెండర్ ప్రక్రియ ద్వారా దక్కించుకున్న అనంతరం ఎన్నికల నిబంధన అమలులో ఉండడంతో ముందుకు సాగించలేక పోవడం జరిగింది. తిరిగి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఇసుక క్వారీల రవాణా అవకతవకల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన ప్రభుత్వం మాన్యువల్ పద్ధతిని అనుసరిస్తూ నూతన 6 క్వారీల నిర్వహణకు అగ్రిమెంట్ చేస్తూ టిఎస్ఎండిసి శాఖ ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చింది. అంబడ్ పల్లి,2,3,4, లింకల గడ్డ 1,పంకేన,1,2 పేర్లతో ఆరు ఇసుక క్వారీలు 160 మ్యాట్రిక్ టన్ లక్ష క్యూబిక్ మీటర్లు నాలుగు క్వారీలకు కేటాయిస్తూ మరో రెండు క్వారీలకు నాలుగు లక్షల మెట్రిక్ టన్ ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తోడుటకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇసుక క్వారీల యజమానులు టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకున్న అనంతరం ఇసుక డంపింగ్ మాన్యువల్ పద్ధతిలో ప్రారంభించి ఇసుక రవాణా కొరకు సిద్ధం చేసుకోవడంలో నిమగ్నం కావడం జరిగింది.

పెద్దంపేట ఇసుక క్వారీ పనులు ప్రారంభం, ఇసుక రవాణా కొరకు మాన్యువల్ పద్ధతిలో ఇసుక సిద్ధం చేస్తున్న యజమాన్యం.

మహదేవ్ గుమ్మడి మండలంలో ఇసుక రవాణా నూతనంగా ఏర్పాటు చేయబడిన ఇసుక క్వారీలు మెన్యువల్ పద్ధతిలో ఇసుక డంపింగ్ పనులు ప్రారంభించడం తో గ్రామస్తులు ఉపాధి పొందడం ఆనందంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆరు ఇసుక క్వారీల్లో గత పది రోజుల నుండి పెద్దంపేట ఇసుక క్వారీ 160 మ్యాట్రిక్ టన్ లక్ష క్యూబిక్ మీటర్ల అనుమతి కలిగి ఉన్న ఈ క్వారీ స్థానికులకు ఉపాధి కల్పిస్తూ గోదావరి నుండి డాక్టర్లలో మాన్యువల్ పద్ధతి ద్వారా గ్రామస్తుల తో ఇసుకను నింపి రవాణా కొరకు స్టోర్ చేయడం ప్రారంభించడం జరిగింది. మాన్యువల్ పద్ధతిలో ఇసుక లోడింగ్ విషయంలో గ్రామానికి చెందిన అనేకమంది ఉపాధి పొందడంతోపాటు వారికి గిట్టుబాటు ధర కూలి అందడంతో గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేయక తప్పడం లేదు. పెద్దంపేట ఇసుక క్వారీ మరి కొద్ది రోజులపాటు మాన్యువల్ పద్ధతితో ఇసుకను స్టోర్ చేసి రవాణా చేయుటకు సిద్ధంగా ఉంది. అలాగే ఇతర ఐదు క్వారీలు కూడా ఇసుక స్టోర్ కొరకు భూముల లీజు వ్యవహారంతో పాటు గ్రామస్తులతో కూలి విషయంలో చర్చలు అలాగే ట్రాక్టర్ లోడింగ్ వ్యవహారంపై గిట్టుబాటు ధర తోపాటు రహదారి కొరకు భూముల లీజు లాంటి పనుల్లో ఇతర క్వారీల యజమానులు ఒప్పందాల కొరకు చర్చించుకోవడం కొనసాగుతుంది. మరికొద్ది రోజుల్లో మిగతా ఇసుక క్వారీలు కూడా ప్రారంభం కానున్నాయి.

క్వారీల యజమాన్యం గ్రామస్తులకు ప్రత్యేక ఉపాధి కల్పించాల్సిన అవసరం, మాన్యువల్ పద్ధతితో గ్రామీణ పేద ప్రజలకు ఉపాధి.

ప్రస్తుతం ఉమ్మడి మహాదేవపూర్ మండలంలో నూతనంగా ఏర్పడినటువంటి ఆరు ఇసుక క్వారీల కు సంబంధించి కాంట్రాక్టర్లు పలు క్వారీల ఇసుక డంపింగ్ మాన్యువల్ పద్ధతి ద్వారా ఇప్పటికీ పనులు ప్రారంభం కావడం జరిగింది అలాగే మరికొన్ని ఇసుక క్వారీలు ప్రారంభానికి మూసుకోలేదు. ప్రధానంగా గ్రామస్తులకు సంబంధించి మాన్యువల్ పద్ధతిలో ఇసుక లోడింగ్ వ్యవహారంలో గ్రామస్తులు కూలి విషయంలో వేయడం తోపాటు భూముల లీజు విషయాల్లో అలాగే స్థానిక ట్రాక్టర్ల ద్వారా గోదావరి నుండి ఇసుక రవాణా చేసి స్టోర్ చేసే వ్యవహారం ధర నిర్ణయంపై సుముఖత లేకపోవడం క్వారీల ఆలస్యానికి కారణమని చెప్పవచ్చు. క్వారీ యజమానులు మారుమూల ప్రాంత ప్రజలకు ఉపాధి విషయంలో కాస్త సహనాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఇసుక క్వారీల నిర్వహణ కాంట్రాక్టర్లకి కాకుండా ప్రజలతో పాటు ప్రభుత్వా ఆదాయానికి కూడా ఎంతో ఆసరా ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా కాంట్రాక్టర్లు స్థానిక ప్రజలు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. మానువల్ పద్ధతి స్థానిక ప్రజలకు అలాగే ఇతర వాహన దారులకు కూడా ఒక వరంగా భావించాల్సిన అవసరం ఉంది. మానువల్ పద్ధతిలో ఒక ఇసుక క్వారీలో సుమారు ప్రతిరోజు 200 ఒక ట్రాక్టర్ లు సుమారు 30 ట్రిప్పులు ఒక్కొక్క ట్రాక్టర్కు 20 నుంచి 40 కూలీలతో మాన్యువల్ పద్ధతి ద్వారా ఇసుక రవాణాకు అవసరం పడుతుంది అని అంచనా. దీని ప్రకారం 6 ఇసుక క్వారీలకు సుమారు 1200 ట్రాక్టర్లు అలాగే సుమారు మూడు వందల నుండి 450 వరకు ప్రతిరోజు గ్రామస్తులకు ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. అలాగే ట్రాక్టర్ మరియు కూలీల ధర విషయానికొస్తే ఒక ట్రాక్టర్ 30 ట్రిప్పులకు ట్రిప్పుకు 200 నుండి 350 రూపాయల వరకు యాజమాన్యం అందిస్తే ఒకరోజు 6000 నుండి 9000 వరకు ట్రాక్టర్ కిరాయి అలాగే కూలింగ్ విషయానికొస్తే 150 రూపాయల నుండి 250 రూపాయల వరకు సుమారు 30 ట్రిప్పుల విషయానికొస్తే ఒక్క కూలికి 1500 నుండి 2500 రూపాయల వరకు ఒక్కరోజు కూలి పొందే అవకాశం ఉంటుంది. కాంట్రాక్టర్ మరియు గ్రామ ప్రజలు పై తెలిపిన ధర కూలి మరియు కిరాయిలకు సంబంధం లేకుండా వారి యొక్క కష్టాలను ఎండ తీవ్రత దృశ్య పని ప్రభావాన్ని గుర్తించి గ్రామస్తులు ఏకతాటిపై వచ్చి చర్చించుకున్న అనంతరం వారి నిర్ణయం మేరకు ముందుకు సాగడం ఉత్తమం. కానీ ఇసుక క్వారీ నిర్వహణ యజమాన్యానికి సహాయ సహకారాలు అందిస్తూ గ్రామస్తులు అలాగే ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఇసుక రవాణా ఆదాయాన్ని సంపూర్ణంగా అందేలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

ఇసుక రవాణా, క్వారీల నిర్వహణలో సమాచార సాంకేతిక అపుహాలను నమ్మి ప్రజలు అధికారులు మోస పోవద్దు, గత నాలుగు సంవత్సరాలు అపూహలతో ఉపాధికి కోల్పోయి అనేక ఇబ్బందులు.

ఇసుక రవాణా విషయంలో కాంట్రాక్టర్ మరియు గ్రామస్తులు ప్రత్యేకంగా టీఎస్ఎండిసి అధికారులు ఇసుక రవాణా విషయంలో క్వారీల నిర్వహణపై సాంకేతిక సమాచార మాధ్యమంలో అనేక అపూహలు రావడ జరుగుతుంది. కానీ అపూహలకు నమ్మి పేద ప్రజలకు ఉపాధికి దూరం చేసే విధంగా అధికారులు మరియు కాంట్రాక్టర్లు అపూహలు నమ్మి ఇబ్బందులకు గురి కావాల్సిన అవసరం లేదు. సమాచార సాంకేతిక మాధ్యమంతోపాటు సామాజిక మాధ్యమాల్లో ఇసుక రవాణా విషయంలో అనేక అపోహల కు సంబంధించి పోస్టులు రావడంతో పాటు పలువురు ఇబ్బంది కలిగేలా వ్యవహరించడం కూడా జరుగుతుంది. అలాంటి సందర్భంలో కాంట్రాక్టర్ మరియు అధికారులు ఇబ్బందులకు గురికాకుండా స్థానిక ప్రజల సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇసుక క్వారీలు నిర్వహించ బడి గ్రామాల ప్రజలు కూడా అపూహలను నమ్మి ఇసుక క్వారీల యజమానులపై నిరాశకు గురికాకుండా ఆయా గ్రామాల ప్రజలు టీఎస్ఎండిసి శాఖ తోపాటు ఇసుక క్వారీల నిర్వాహకులకు అపోహలపై వారికి సహకరించే విధంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. గతంలో నిర్వహించిన ఇసుక క్వారీలకు కూడా అనేక అపూహలతో నిర్వాహకులకు ఇబ్బందులకు గురి చేయడం భరించలేని ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు క్వారీలను వదిలిపెట్టి వెళ్లిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కేవలం స్థానిక ప్రజలు ఉపాధిని కోల్పోయి నేటికీ అనేక ఇబ్బందులు పడినటువంటి సందర్భం ప్రస్తుతం ప్రజల దగ్గరే ఒక సాక్ష్యంగా ఉంది. కాలేశ్వర ముక్తేశ్వరుని ఆశీస్సులతో కొత్తగా ఏర్పాటు అయిన ఆరు ఇసుక క్వారీలకు మండల ప్రజలంతా యజమానులకు సహాయ సహకారాలు అందిస్తూ సంపూర్ణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇసుక క్వారీల నిర్వహణ కొరకు తమ వంతు సహకారాన్ని అందిస్తూ సంపూర్ణంగా ఇసుక క్వారీ నిర్వహణ కొనసాగించేలా చేయడం యావత్ మండల ప్రజలకు రాబోయే మరో మూడు నుండి నాలుగు సంవత్సరాల వరకు ఉపాధికి ఎలాంటి డొక లేకుండా కొనసాగుతుందని గ్రామాల్లోని ఉపాధితో కుటుంబం పిల్లాపాపలతో సంతోషంగా తమ జీవితాలు కొనసాగుతాయి అన్న విషయాన్ని మండల ప్రజలు ప్రత్యేకంగా క్వారీలు ఏర్పాటు చేయబడిన గ్రామాల ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.

స్వయంకృషి అధ్వర్యంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో స్వయంకృషి సోషల్ వర్క్ ఆర్గనైజషన్, ప్రతిభ స్వచ్చంధ సంస్థ మరియు వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్బంగా బాలబాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాంతారావు అధ్యక్షతన జరిగింది. ప్రతిభ సంస్థ నిర్వాహకులు గిరగాని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ ధరిత్రి,భూమిని పరిరక్షించడం కొరకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. పెరుగుతున్న భూతాపం,వాతావరణ కాలుష్యాల నుండి భూమి,ధరిత్రిని కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు.1970 నుండి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 193 దేశాలలో ధరిత్రి దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాయని తెలియజేశారు. స్వయంకృషి సంస్థ నిర్వాహకులు బెజ్జంకి ప్రభాకర్” బాలబాలికలను ఉద్దేశించి మాట్లాడుచు ధరిత్రి, భూమిపైన మాత్రమే ప్రతీ జీవరాశి మనుగడ సాధ్యం అని, ఇతర గ్రహాల మీద అనుకూల వాతావరణం లేదని అన్నారు.సమస్త జీవకోటి భారాన్ని మోసేది ధరిత్రి భూమి మాత్రమే అని అలాంటి భూమిని కాపాడుకోవడం, పరిరక్షించడం ప్రతీ ఒక్కరు బాధ్యతగా స్వీకరించాలని కోరారు. నీటి వృధాను అరికట్టి నిల్వ చేయాలని, వీలైనన్ని మొక్కలు నాటి, కాలుష్యాలను అరికట్టి, ప్లాస్టిక్ ను విడనాడి భూమిని కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో కన్స్యూమర్ ఫోరమ్ జిల్లా విజిలెన్స్ మెంబర్ నాగేల్లి సారంగం గౌడ్, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది నరేందర్, రాజేష్, సురేష్, వాణి, స్వరూప, నిర్మల, షౌరి, పిఈటి స్వామి, బాలబాలికలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు పోదెం వీరయ్య ని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం నేటి ధాత్రి

ఈరోజు భద్రాచలంలో పోదెం వీరయ్య క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీలోకి ధర్మన్న

-కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గండ్ర

-పూర్వవైభవం దిశగా కాంగ్రెస్ అడుగులు

-రాలిపోతున్న గులాబీ రేకులు

-వరుసగా బీఆర్ఎస్ ను వీడుతున్న నేతలు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
లోక్ సభ ఎన్నికల ముందు భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. మొగుళ్లపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మన్న తన అనుచరులతో కలిసి సోమవారం బీఆర్ఎస్ ను వీడి సొంతగూటికి వెళ్లారు. భూపాలపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మోటే ధర్మన్న చేరికతో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. గట్టిపట్టున్ననేతగా..బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కిరణంగా పేరుగాంచిన..ధర్మన్న చేరికతో..బీఆర్ఎస్ పార్టీకి ఊహించని రీతిలో భారీ షాక్ తగిలినట్లయింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ధర్మన్న, సర్పంచ్ గా విశేష సేవలందిస్తూ..సౌమ్యుడిగా..పిలిస్తే పలికే ఆపద్బాంధవుడిలా..మండల ప్రజల మన్ననలు పొందారు. ఆయన చేరిక కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తక్కలపల్లి రాజు ఎర్రబెల్లి పున్నం చందర్ రావు, ఏలేటి శివ రెడ్డి, క్యాతరాజు సాంబమూర్తి తదితరులున్నారు.

ప్రభుత్వ స్కూల్లో ఎస్ ఏ 2 పరీక్షల నిర్వహణ తీరు పరిశీలన.

ఉమ్మడి జిల్లా పరీక్షల బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ భద్రయ్య.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో నీ ప్రభుత్వ పాఠశాలలో జరుగుచున్న ఎస్ఏ 2 పరీక్షల పనితీరును సోమవారం రోజున ఉమ్మడి జిల్లా పరీక్షల బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ శనిగరపు భద్రయ్య పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
విద్యార్థులు లక్ష్యం నిర్ణయించుకొని ప్రణాళిక బద్ధంగా చదివితే ఉన్నత స్థానాలను చేరుకొని తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలను నిలుపుతారని అన్నారు,
మండలం లోని కస్తూర్బా గాంధీ పాఠశాలను పరిశీలించి విద్యార్థులు వేసవి సెలవులను మంచి అవకాశంగా భావించి సెలవులను వృధా చేయకుండా తర్వాత తరగతి టెక్స్ట్ బుక్స్ ను ఉపయోగించుకొని చదవాలని. రాత ప్రాక్టీస్ చేయాలని విద్యార్థులు లక్ష్యం నిర్ణయించుకుని దానిని చేరడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని సమాజంలో పేరు ప్రతిష్టలు గడించాలని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా పరీక్షలు పూర్తి అవుతున్నందున జవాబు పత్రములను మూల్యాంకనము చేసి ఐ ఎస్ ఎం ఎస్ పోర్టల్ నందు మార్కులను నమోదు చేయాలని అటు పిదప విద్యార్థుల ప్రగతి పత్రంలను ప్రింట్ తీసి తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు 23/04/2024నాడు అందజేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. మొగుళ్లపల్లీ మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ మొగుళ్ళపల్లి నందు ఎస్ ఎ 2 పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి ఏర్పాట్ల విషయంలో ప్రధానోపాధ్యాయులు విజయ పాల్ రెడ్డి తగు శ్రద్ధ తీసుకున్నందుకు సంతృప్తి .అభినందనలు వ్యక్తం చేశారు.
వీరితో జడ్పీహెచ్ఎస్ మొగుళ్ళ
పెల్లి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు విజయపాల్ రెడ్డి. కస్తూర్బా గాంధీ స్పెషల్ ఆఫీసర్ సుమలత. కోఆర్డినేటర్ చంద్రlమౌళి ఉన్నారు.

సిపిఐ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో 138వ మే డే పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం రాళ్ల పేట గ్రామంలో అమాలి సంఘం నాయకుల గౌరవ అంజయ్య శంకర్ కార్మికుల ఆధ్వర్యంలో 138 పోస్టర్ ఆవిష్కరించడం జరిగిందని ఇట్టి కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు సిపిఐ మండల కార్యదర్శి సోమ నాగరాజు అమాలి సంఘం నాయకులు సోమ లక్ష్మి రాజ్యం సోమ మల్లయ్య గణాది అంజయ్య బోయిని నారాయణ కుమ్మరి రాజు కనకయ్య నారాయణ ఎల్లయ్య మహేష్ దేవయ్య తదితరులు పాల్గొన్నారు

వనపర్తి లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన ‘— ?

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా కేంద్రంలో కామన్ సెంటర్లో మాజీ మంత్రి ఫోటోతో ఉన్న గొడుగులు కూరగాయల వ్యాపారులు పండ్ల వ్యాపారులు పెట్టుకున్నారు . పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ” కమాన్ సెంటర్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గొడుగులు వ్యాపారులు పెట్టుకోవడంపై ప్రజలు ఎన్నికల కోడు అమల్లో ఉన్నందున గోడుగులు పెట్టుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు జిల్లా ఎన్నికల అధికారులు వెంటనే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మాజీ మంత్రి ఫోటో తో ఉన్న గొడుగులను తొలగించాలని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఏం ఏ ఖాదర్ పాషా డిమాండ్ చేశారు

ఉదారత చాటుకున్న జన చైతన్య యూత్

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన ఏగోలపు మల్లేశం భారతి దంపతులు ఇటివల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు జనచైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో లక్ష రూపాయలను విరాళం అందజేశారు. ఈకార్యక్రమంలో కర్ర విద్యాసాగర్ రెడ్డి, రాగుల తిరుపతి, కోయల్కర్ శ్రీనివాస్, కొండ మునీందర్, కొలిపాక మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version