బాధిత కుటుంబాలను పరామర్శించిన కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు..
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని అంగరిగూడెం, చొప్పాలా, రేగుళ్ళ, గొల్లగూడెం గ్రామాలలో నిన్న ఉరుములు గాలి దుమ్ముతో కురిసిన వర్షానికి కూలిపోయిన ఇల్లులను పైకప్పులను పరిశీలించి, అదేవిధంగా పిడుగుపాటుకు మృతి చెందిన గోగు రాంబాబు రైతు కు చెందిన రెండు ఎడ్లను,సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
ఈ సందర్భంగా మాట్లాడుతూ,
ఎవరు అధైర్య పడొద్దు అని వారికి జరిగిన నష్టాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చూస్తామని భరోసా కల్పించారు..
ఈ కార్యక్రమంలో
మండల నాయకులు ఎర్ర సురేష్ , భూక్య అర్జున్ , భూక్య రామదాసు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..