రఘునాథపల్లి నుండి కొండగట్టుకు హనుమాన్ దీక్ష భక్తులు.
రఘునాథపల్లి. ( జనగామ) నేటి ధాత్రి :-
మండల కేంద్రంలోని శ్రీ మహాదేవ స్వామి దేవాలయ ప్రాంగణంలో సోమవారం హనుమాన్ దీక్ష భక్తులు ఇరుముడి కట్టుకున్న సందర్భంగా ఆలయంలో జై హనుమాన్ జై జై హనుమాన్ అంటూ హనుమాన్ భక్తులు ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఆలయ అర్చకులు పిండిప్రోలు శ్రీనివాస్ శర్మ నేపథ్యంలో హనుమాన్ దీక్ష భక్తులకు ఇరుముడి కట్టారు.ఆలయంలో భక్తులు ప్రజలు హనుమాన్ జయంతి కి ముందు రోజు జై హనుమాన్ జై జై హనుమాన్ నినాదంతో రఘునాథపల్లి నుండి కొండగట్టు పుణ్యక్షేత్రానికి వెళ్లారు స్వామి వారి కృప ఉంటుందని పూజారి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాలధారణ వేసుకున్న స్వాములు కందుల అనిల్ కుమార్, కొన్నే సతీష్, కోళ్ల సందీప్, పెర్నె అనిల్,శ్రీ మహాదేవ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ కూరెళ్ళ పెద్ద ఉపేందర్ గుప్తా… బచ్చు చిరంజీవి గుప్తా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోళ్ల రవి గౌడ్,ఎంపీటీసీ సభ్యురాలు పేర్ని ఉషా రవి దంపతులు,పద్మశాలి యువజన సంఘం జిల్లా నాయకులు కరీం కొండ ప్రదీప్ కుమార్, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.