సఖి కేంద్రం సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి

శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో సఖి సెంటర్ గురించి వివరిస్తూ మహిళలకుచెప్పడం జరిగింది.
సఖి వన్ స్టాప్ కేంద్రంహన్మకొండ నందు మహిళ అవగాహన సదస్సునిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సులో సఖి వన్ స్టాఫ్ కేంద్రం హరితమాట్లాడుతూ సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ మరియు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో సఖి వన్ స్టాప్ సెంటర్ నిర్వహించ బడుతున్నదని కేస్ వర్కర్ హరిత మాట్లాడుతూ చిన్నపిల్లలు లైంగిక వేధింపులకు గురి కావడం జరుగుతుందని వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టం తీసుకురావడం అయినదని వివరించడం జరిగింది అలాగే మహిళల కోసం గృహహింస చట్టం గురించి వివరించడం జరిగిందివిడిపోయే భార్యా భర్తలను కౌన్సిలింగ్ ద్వారా ఒకటిగా కలపడం చేస్తున్నదని,వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు,ఆడపిల్ల వద్దని అకారణంగా గర్భవిచ్చితి చేపించాలని వేధింపులకు గురి చేయడం మరియు ఇతర వేధింపుల పట్ల కృంగి పోయే మహిళలకు,బాలికలకు రక్షణ కల్పించడం కోసం సఖి వన్ స్టాఫ్ కేంద్రం కృషి చేస్తున్నదని,
సమస్యలపై సహాయం కోసం సఖి కేంద్రంకు వచ్చిన మహిళలకు ఉచితంగా కౌన్సిలింగ్ సహాయం ,న్యాయ సహాయం, పోలీస్ సహాయం ,వైద్య సహయం, తాత్కాలిక వసతి వంటివి సఖి కేంద్రం ద్వారా అందించ బడుతున్నదని తెలియ చేశారు.ఇట్టి అవకాశాన్ని సమస్యలు గల మహిళలు,బాలికలు ఉపయోగించు కోవాలని, అందుకోసం ఫోన్ నెంబర్స్ 0870-2452112 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 181 కు ఫోన్ చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో సఖి వన్ స్టాఫ్ కేంద్రం కేసు వర్కర్ హరిత వెన్నెల వివో మహిళలు తదితరులు పాల్గొన్నారు.

కేయూ లో జరిగే సదస్సును జయప్రదం చేయండి.

-విద్యార్థి సంఘల ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ
పాఠ్యపుస్తకాల్లో అశాస్త్రీయ భావజాలాన్ని పెంపొందించే నూతన జాతీయ విద్యా విధానం- 2020ని రద్దు చేయాలని కోరుతూ, కాకతీయ యూనివర్సిటీలో ఏప్రిల్ 23న విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కామర్స్ సెమినార్ హాల్ ఉదయం 10:30 గంటలకు సదస్సు జరుగుతుందని, ఈ సదస్సుకు విద్యార్థులు, మేధావులు ,ప్రజాస్వామికవాదులు హాజరై జయప్రదం చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలో కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది.
ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక రెడ్డి, ఓయూ ప్రొఫెసర్ పద్మజాషా తదితరులు పాల్గొని ప్రసంగిస్తారు. దేశంలో నూతన జాతీయ విద్యా విధానం అమలు వలన జరిగే పర్యవసనాలు ఈ సదస్సులో చర్చించి, భవిష్యత్ పోరాట కార్యాచరణను ప్రకటించడం జరుగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. ఏఐఎస్ఎఫ్, పి.డి.ఎస్.యు ఎస్.ఎఫ్.ఐ, యు.ఎస్.ఎఫ్.ఐ, బి.ఎస్.ఎఫ్, ఏ.బి. ఎస్.ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు మొగిలి వెంకట్ రెడ్డి, రహెమాన్, బి. నరసింహారావు, భాష బోయిన సంతోష్, మాలోత్ రాజేష్, శివ కుమార్, సాయి కిరణ్, పృధ్విరాజ్, జస్వంత్ ,పరిమళ, వేల్పుల చరణ్ మచ్చ పవన్ కళ్యాణ్, నరేందర్ , బండారి పృథ్వీరాజ్, అనూష, కావేరి, మమత, లక్ష్మి, వెన్నెల తదితరులు పాల్గొన్నారు.

అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పూర్తి చేయాలి

వేసవిలో మంచినీటి సమస్య రాకుండా చూసుకోవాలి

ప్రత్యేక అధికారి బద్రు నాయక్

శాయంపేట నేటి ధాత్రి:

అమ్మ ఆదర్శ పాఠశాల పనులు చేపట్టుటకు, పురోగతి చేయవలసిన కార్యాచరణ ప్రణాళికను మండల ప్రజా పరిషత్ శాయంపేట కార్యాలయo నందు సమావేశం ప్రత్యేకాధికారి బి.భద్రు నాయక్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమములో అమ్మ ఆదర్శ పాఠశాలల పురోగతి సాధించి పనులు మే 20 లోపు పూర్తి చేయాలని కోరారు.పూర్వము జరిగిన సమీక్ష సమావేశములో పంచాయతీ కార్యదర్శులతో జరిగిన చర్చలో భాగంగా మండలములోని అన్ని గ్రామాలలో తాగునీటి సమస్యలు ఉండకుండా ఉండుటకు చేపట్టవలసిన పనులను మండల ఫ్రత్యేక అధికారి ఏర్పాటు చేయడ మైనది ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఫణి చంద్ర,ఎంఈఓ రమాదేవి, ఐకెపి శ్రీధర్ రెడ్డి,అన్ని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, వివో ఎస్, సంబంధిత గ్రామ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.

గణపురం మండలంలో గడప గడప కు ప్రచారం చేస్తున్న బిజెపి నాయకులు

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో వరంగల్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అని మెయిన్ రోడ్ మీద డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించిన బీజేపీ నాయకులు
ఈ కార్యక్రమంలో బీజేపీ గణపురం మండల అధ్యక్షులు జిట్టబోయిన సాంబయ్య బీజేవైఎం కళాశాల రాష్ట్ర కన్వీనర్ మంద.మహేష్,బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మధసు మొగిలి, బీజేపీ సీనియర్ నాయకుడు బొద్దుల మొగిలి, గణపురం బూత్ కమిటీ అధ్యక్షులు దండుగుల శేషు,గుర్రం.శివ తదితరులు పాల్గొన్నారు

ఉపాధి హామీ పనులను పరిశీలించిన కార్యదర్శి విజేందర్

గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో గణప సముద్రంలో పూడిక తీత శనివారం రోజున ఉపాధి హామీ పనులు జరుగుతుండగా పని ప్రదేశాన్ని పరిశీలించి ఉపాధి హామీ కూలీలకు కావలసిన సదుపాయాలను కల్పిస్తామని గణపురం గ్రామపంచాయతీ కార్యదర్శి విజేందర్ అన్నారు. ఉపాధి హామీ కూలీలు ప్రతిరోజు కొలతల ప్రకారం పని చేసినట్లయితే ప్రభుత్వం నిర్ణయించిన కూలీ డబ్బులు ఖాతాలో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన మస్టర్లను పరిశీలించి వాటిలో ఉన్నటువంటి పేర్లు చదివి వినిపించారు. మస్టర్లలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని మేట్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ దూలం శ్రీదేవి ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

వనపర్తి లో ట్రాఫిక్ సమస్య రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్

వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి పట్టణంలో కమాన్ చౌరస్తా బస్ డిపో రోడ్డు గాంధీ చౌక్ పాత బస్టాండ్ కొత్త బస్టాండ్ రోడ్లపై వాహనాలు అడ్డ దిడ్డంగ పార్కింగ్ చేయడం వల్ల బాటసారులు ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . గతంలో సీఐ సూర్య నాయక్ ఎస్సై వెంకటేష్ గౌడ్ ప్రధాన కూడలిలో అనగా కమాన్ చౌరస్తా గాంధీ చౌక్ కొత్త బస్టాండ్ పాత బస్టాండ్ బస్ డిపో రోడ్ల మీద వాహనాలు పార్కింగ్ చేయకుండా అదుపు చేశారు .
భారీ వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల కమాన్ చౌరస్తా నుండి టౌన్ పోలీస్ స్టేషన్ వరకు రోడ్డు జామ్ అయితుందని ద్విచక్ర వాహనాదా రులు బాటసారులు ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే పోలీస్ సిఐ టౌన్ ఎస్సై స్పందించి ట్రాఫిక్ సమస్య లేకుండా భారీ వాహనాలు రోడ్లపై పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

కాంగ్రెస్ అభ్య‌ర్థి డాక్టర్ రంజిత్ రెడ్డికి ఓటు వేయండి

శేరిలింగంపల్లి నియోజ‌క‌వ‌ర్గం ఇంఛార్జి జగదీశ్వర్ గౌడ్

కూకట్పల్లి, ఏప్రిల్ 20 నేటి ధాత్రి ఇన్చార్జి

శనివారం ఉదయం కొండాపూర్ డివిజన్ పరిధిలోని
అమర్ సొసైటీలో అనేక కాలనీ అసోసియేషన్ సభ్యు
లతో అల్పాహారం కార్యక్రమంలో పాల్గొన్నారు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ
ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…..హ‌స్తం గుర్తుకు ఓటు వేసి గెలిపిం చాల‌ని,ప్రభుత్వం తరపున అన్ని విధాలా కాలనీ
లలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు,ప‌దేళ్ల బీజేపీ పాల‌న‌లో దేశంలో అభివృ
ద్ధి మాటే లేకుండా పోయింద‌న్నారు.సంక్షేమ ప‌థ‌
కాలు క‌నుమ‌రుగ‌య్యాయ‌న్నారు.కార్పొరేట్ శ‌క్తుల
కోస‌మే బీజేపీ ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌న్నారు.పేద‌
,మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల సంక్షేమాన్ని పూర్తిగా విస్మ‌
రించార‌ని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎంలను రిటర్నింగ్ ఆ దికారి కి అప్పగింత

వనపర్తి నేటిదాత్రి :
పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు మొదటి ర్యాండమైజేషన్ అనంతరం ఈ వి.యం లను వనపర్తి సహాయ రిటర్నింగ్ అధికారి యం. నగేష్ కు అప్పగిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద లాల్ పవార్ తెలిపారు.
శనివారం ఉదయం K ఆర్డీవో కార్యాలయ ఆవరణలోని ఈ .వి.యం గోదాం నుండి ప్రజా ప్రతినిదుల సమక్షంలో క్లోజ్డ్ కంటైనర్ లో పోలీస్ భద్రతతో చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు గోడౌన్ కు తరలించారు.
ఎన్నికల కమిషన్ సూచనల మేరకు బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్​, వీవీ ప్యాట్స్ లను పోలీసు బందోబస్తు నడుమ చిట్యాలలోని వ్యవసాయ మార్కెట్ యార్డు గోడౌన్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. జిల్లా సహాయ రిటర్నింగ్ అధికారి యం. నగేష్, తహసిల్దార్ యాదగిరి, రమేష్ రెడ్డి, భాజపా ప్రతినిధులు దాసరాజు ప్రవీణ్, కుమారస్వామి, సీపీఎం ప్రతినిధి పరమేశ్వరాచారి, కాంగ్రెస్ ప్రతినిధి వేణాచారి, బీఎస్పీ నుంచి భరత్, తెలుగుదేశం పార్టీ నుండి కొత్త గొల్ల,శంకర్ ఎంఐఎం ప్రతినిధి రహీమ్ ల సమక్షంలో తరలిం చారు

బిజెపి అభ్యర్థి ఆరూరి గెలుపుకై భారీ ర్యాలీ.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లో ఎన్నికల ప్రచారంలో భాగంగా చిట్యాల మండలం జూకల్ గ్రామం నుండి చిట్యాల మండల కేంద్రం వరకు బిజెపి నాయకులు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్ ఈ సందర్భంగా
అరూరి రమేష్ మాట్లాడుతూ*.బిజెపి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి గా మీ ముందుకు వస్తున్న నన్ను ఆశీర్వదించి గెలిపించండి.ఈ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికలు కాదు, కేంద్ర ఎన్నికలు ఆలోచించి ఓటు వేసి మోడీ ని మళ్లీ కేంద్రంలో అధికారంలో ఉంచాలి.గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎప్పుడు అల్లర్లు, బార్డల్లో లొల్లిలు, మత ఘర్షణలు, బాంబు పేలుళ్లు ఉండేవి.మోడీ ప్రధాన మంత్రి అయ్యాక దేశం అన్నిట్లో అగ్రగామిగా నిలిచింది.కరోనా సమయంలో దేశ ప్రజలు ఇబ్బంది పడోద్దని ఉచిత వ్యాక్సిన్ లు పంపిణీ చేసి ప్రజలకు అండగా ఉన్నారు.చిట్యాల మండలంలో పేద ప్రజలు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములకు పట్టాలు మంజూరు చేయించే బాధ్యత నేను తీసుకుంటా.నేను వర్ధన్నపేట నియోజకవర్గంను 10 సంవత్సరాలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిపాను.అదే విధంగా వరంగల్ పార్లమెంట్ ని కూడా అదే విధంగా అభివృద్ధి చేసే బాధ్యత నాది.భూపాలపల్లి చీరకాల కోరిక రైల్వే లైన్ తీసుకొని వస్తాను.ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కీల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను.నాపాక మరియు కోటంచ ఆలయాలను టూరిజం కింద అభివృద్ధి చేస్తాను..కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు పూర్తిగా విఫలమైనవి.రాష్ట్రంలో బిజెపి – మోడీ హవా కొనసాగుతోంది.మీ అమూల్యమైన ఓటు బీజేపీ కమలం పువ్వుకి వేసి నన్ను ఆశీర్వదించాలని కోరారు…
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు నిషిదర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తి రెడ్డి, క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు మార్తినేని ధర్మరావు, రాష్ట్ర నాయకులు గరికపాటి మోహన్ రావు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, హన్మకొండ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, గంటా రవి, పార్లమెంటరీ ప్రబారి మురళిధర్, పార్లమెంట్ కన్వీనర్ కుమారస్వామి, అసెంబ్లీ కన్వీనర్ రవీందర్ రెడ్డి, మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులలో వేగం పెంచండి: జిడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే

క్షేత్రస్థాయిలో పలు అభివృద్ధి పనుల పరిశీలన

నేటిధాత్రి, వరంగల్

వరంగల్ మున్సిపల్ కమిషనర్ వరంగల్ లోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. అభివృద్ధి పనులలో వేగం పెంచాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా శనివారం కమిషనర్ హన్మకొండ పరిధి వడ్డేపల్లి బండ్ పై కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాంపౌండ్ పనులతో పాటు సందర్శకులు వీక్షించడానికి వీలుగా (వ్యూ డెక్)పనులు, సైకిల్ ట్రాక్ ల్యాండ్ స్కేపింగ్ పనులను జూన్ నెల వరకు పూర్తి చేయాలని, కాంట్రాక్టర్ పిఎంసి ఇరువురు సమన్వయంతో పనిచేసి బండు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. అలాగే కరీంనగర్ ప్రధాన రహదారి ఏల్లాపూర్ వద్ద గ్రాండ్ ఎంట్రెన్స్ ఏర్పాటు పనులను పరిశీలించిన కమిషనర్ నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అన్నారు. ఏనుమాముల ప్రాంతంలోని బాలాజీ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించిన కమిషనర్ ఏర్పాటు బాగుందని, హనుమకొండ ప్రాంతంలో కూడా ఇదే తరహాలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఎస్.ఈ కు సూచించారు. నర్సంపేట ప్రధాన రహదారి వద్ద గల గ్రాండ్ ఎంట్రన్స్ పనులను పరిశీలించిన కమీషనర్ నెల లోగా స్టీల్ ఏర్పాటు పనులు పూర్తి చేయాలన్నారు. క్రిస్టియన్ కాలనీలో పర్యటించి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు పనులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్.ఎన్.ఎమ్ క్లబ్ వద్ద కొనసాగుతున్న జంక్షన్ బ్యూటిఫికెషన్ పనులలో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులను ఈ సందర్భంగా కమీషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర, సిఏంహెచ్ఓ డా.రాజేష్, హెచ్ఓ రమేష్, ఈఈ లు రాజయ్య, సంజయ్ కుమార్, డి.ఈ లు సంతోష్ బాబు, రవికుమార్, సారంగం, రంగారావు, కృష్ణమూర్తి, అజ్మీరా శ్రీకాంత్, ఏ.ఈ హరి కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ లు కరుణాకర్, సంపత్ రెడ్డి, ఇశ్రం శ్రీను, స్మార్ట్ సిటీ ప్రతినిధి ఆనంద్ ఓలేటి తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొలమోని రాములు కొత్త గొల్ల శంకర్ డి బాలరాజ్ ఎండి దస్తగిరి అప్పాయిపల్లి బాలయ్య మేదరి బాలయ్య గంధం కృష్ణయ్య టాక్టర్ బాలయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు సందర్భంగా బి రాములు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు

ఆదర్శ పాఠశాల గొల్లపెల్లి విద్యార్థులకు అంతర్జాతీయ బహుమతుల పంట

ఆనందంతో ఉప్పొంగిన విద్యార్థులు, తల్లిదండ్రులు

గొల్లపల్లి నేటి ధాత్రి:
రంగోత్సవ్ ఫౌండేషన్‌ ముంబాయి వారు నిర్వహించిన అంతర్జాతీయ పోటీలలో ఆదర్శ పాఠశాల గొల్లపల్లి విద్యార్థులు ప్రతిభ చూపారు. పాఠశాల విద్యార్థులు ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్, గ్రీటింగ్, కలరింగ్, కొలాజ్, టాటూ,ఫొటోగ్రఫి, తదితర తొమ్మిది రకాల పోటీల్లో పాల్గొనగా జాస్యా బేగం ద్వితీయ బహుమతి పొంది అమేజాన్ అలెక్సా పరికరం , కాస వైశ్విక, తొట్ల మనోజ్ కుమార్ కు బోట్ స్మార్ట్ వాచ్ లు, గ్రీష్మ ,రిషిత,దివ్య, సాహితి లకు అర్ట్ మెరిట్ అవార్డులు , పద్నాలుగు ఇంటర్నేషనల్ మెడల్స్,ఏడు కన్సోలేషన్ బహుమతులు,మెమెంటోలు , సర్టిఫికెట్లు, ఇతర బహుమతులు లభించాయి.
ఉపాధ్యాయులు ,విద్యార్థులు, తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.
విద్యార్థులను ప్రోత్సహించినందుకు పాఠశాల ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ కు ‘వరల్డ్ పర్ఫార్మెన్స్ అవార్డు’, వైస్ ప్రిన్సిపల్ కె.నగేష్ కు ‘గ్లోబల్ అవార్డు’ పోటీల జిల్లా కన్వీనర్ వనపర్తి రాజశేఖర్ అందజేసారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ పోటీల్లో తమ విద్యార్థులు బహుమతులు సాధించడం ఆనందంగా వుందని , భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు సాధించడానికి విద్యార్థులకు ఇది స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.
బహుమతులు సాధించిన విద్యార్థులకు పాఠశాల ఆంగ్లోపాధ్యాయులు జి.వి.రమణ మార్గదర్శకత్వం వహించారు.
ఈ కార్యక్రమంలో రంగోత్సవ్ జిల్లా కన్వీనర్ రాజశేఖర్, పాఠశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తో పాటు, వైస్ ప్రిన్సిపల్ నగేష్,గైడ్ టీచర్ రమణ, విద్యార్థులను ప్రోత్సహించిన ఉపాధ్యాయులు అరుణ్ కిరణ్, మురళీధర్, రాకేష్ , ప్రవీణ్, రవికుమార్, సంధ్యారాణి, రమాదేవి,హరిప్రియ,అర్చన,అన్నపూర్ణ విద్యార్థులకు బహుమతి ప్రధానం చేసారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులతో పాటుగా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.

ఆగమై పోతున్న అన్నదాతల బ్రతుకులు

నిజాంపేట నేటి ధాత్రి ఏప్రిల్ 20

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని పలు గ్రామాలలో ప్రొద్దున కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు ఆగమైపోయారు. కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి వచ్చిన సమయంలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పొద్దున కురిసిన వర్షంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వెంటనే ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు

తండాల అభివృద్ధి కేవలం బిజెపితోనే సాధ్యం..

బీజేపీ ఎస్టీ సేల్,నరేష్ నాయక్..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం లోని మర్లబాయి తండ బూత్ నెంబర్ 256 బిజెపి ప్రచారంలో ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ రాజేశ్వర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ మాట్లాడుతూ, సమ్మక సారలమ్మ పేరుతో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయటం గిరిజన ప్రజలందరూ గర్వించాల్సిన విషయమని అన్నారు.
బిజెపి చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ డీకే అరుణమ్మ ని గెలిపించాల్సిందిగా ఆయన ఆ తాండ ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో మిడ్జిల్ మండలఎస్టి మోర్చా అధ్యక్షులు నరేష్ నాయక్ మాట్లాడుతూ, తండ ప్రజలందరూ డీకే అరుణమ్మ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల గిరిజనప్రధాన కార్యదర్శి రాహుల్ నాయక్ మరియు బూత్ అధ్యక్షులు లక్ పతినాయక్, విష్ణు నాయక్, అరుణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ యువజన సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా జలంపెల్లి సృజన్ నియామకం

జైపూర్, నేటి ధాత్రి:

చెన్నూర్ నియోజకవర్గానికి జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామానికి చెందిన జలంపెల్లి సృజన్ ని ఐవైసి పెద్దపల్లి పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్చార్జి అరుణ్ వాల్మీకి మరియు మంచిర్యాల జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ శశి వదన్ సమక్షంలో నియమించడం జరిగింది. ఆ నియమిక పత్రాన్ని పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయిన గడ్డం వంశీ కృష్ణ చెన్నూర్ శాసనసభ సభ్యుడు వివేక్ వెంకటస్వామి చేతుల ద్వారా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సృజన్ మాట్లాడుతూ రాబోయే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినా గడ్డం వంశీ కృష్ణ ని భారీ మెజారిటీతో గెలిపించడాని కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీని బలపేతం చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చాడు.

హ్యాండ్ బాల్ అకాడమీకి ఎంపికైన మడ్డి వంశీ!!

అభినందనలు తెలిపిన ఉపాద్యాయులు,మిత్ర బృందం!!

ఎండపల్లి నేటి ధాత్రి

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి హ్యాండ్ బాల్ అకాడమీకి సెలక్షన్ ట్రయల్స్ లో అత్యంత ప్రతిభ కనబరిచిన హ్యాండ్ బాల్ అకాడమీకి ఎంపికయ్యాడు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని గుల్లకోట ఉన్నత పాఠశాలకు చెందిన హ్యాండ్ బాల్ క్రీడాకారుడు మడ్డి వంశీ ఫిబ్రవరి నెలలో 8,9 తేదీలలో ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి హ్యాండ్ బాల్ అకాడమీకి సెలక్షన్ ట్రయల్స్ లో అత్యంత ప్రతిభ కనబరిచిన హ్యాండ్ బాల్ అకాడమీకి ఎంపికయ్యాడని వ్యాయామ ఉపాధ్యాయులు మహేష్, సాయికుమార్ తెలియజేశారు. తన ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్రం గారు మాజీ సైనికులు ముదిగంటి రమణారెడ్డి, ఓజ్జల చారిటబుల్ ట్రస్ట్ ఓజ్జల మహేష్, సీనియర్ క్రీడాకారులు బాస మహేష్,వంశీ,అక్షయ్,జీవన్ అలాగే ఉపాధ్యాయ బృందం మరియు గ్రామస్తులు అభినందనలు తెలిపారు

మార్నింగ్ వాక్ ప్రచారములో కావ్య తో కమలాపూర్ నాయకులు …

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)

వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య శనివారం హన్మకొండ లోని కాకతీయ యూనివర్సిటీలో మార్నింగ్ వాక్ లో వాకర్స్ ను కలిసి తనను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.శాసన సభ్యులు నాయిని నరసింహ రెడ్డి ఆధ్వర్యములో నిర్వహించిన ఈ ప్రచారములో టీపిసిసి కోఆర్డినేటర్ తౌటం రవీందర్,హుజురాబాద్ నియోజక వర్గ జనరల్ సెక్రటరీ విష్ణుదాస్ వంశిదర్ రావు,సీనియర్ నాయకులు నాంపల్లి ప్రభాకర్,మొగిలయ్య, సత్యం, తౌటం ఝాన్సి రాణి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన సుల్తాన్ పూర్ మాజీ సర్పంచ్ అంబాల చందు గౌడ్

కాంగ్రెస్ పార్టీ కండువా కప్పినా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి నియోజకవర్గం కొత్తపల్లిగోరి మండలం సుల్తాన్ పూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ అంబాల చందు గౌడ్ తో పాటు మరికొందరు ఆ గ్రామ వార్డు మెంబర్లు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కాగా, వారందరికీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో
గ్రామ తాజా మాజీ సర్పంచ్ అంబాల చందు గౌడ్, తాజా మాజీ వార్డు మెంబర్లు గాజర్ల పురుషోత్తం, కోడూరి శ్రీనివాస్, గట్టు రవి, బీఆర్ఎస్ గ్రామ మాజీ అధ్యక్షుడు కాశెట్టి వరదరాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గాజర్ల రామదాసు, అంబాల కుమారస్వామి, గాజర్ల వెంకటేష్ తో పాటు మరో 50 మంది చేరారు.
ఈ కార్యక్రమంలో సుల్తాన్ పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ తో పాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు

దివ్యాంగుల బస్సు పాసులకు దరఖాస్తులు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల రాజీవ్ చౌక్ ఆర్టీసి బస్టాండ్ దగ్గర జరిగిన దివ్యాంగుల బస్సు పాస్ దరఖాస్తులకు దాదాపుగా 30 మంది దివ్యాంగులు హాజరై బస్సు పాస్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రోగ్రాం ని సక్సెస్ చేసినందుకు గాను ఆర్టీసీ అధికారులకు, దివ్యాంగులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అమ్మ వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మారపల్లి నరేష్ అన్నాడు.

సంఘమిత్ర టెక్నో స్కూల్ విద్యార్థుల ప్రతిభ

నేటిధాత్రి, వరంగల్

వరంగల్ తూర్పు దేశాయిపేట రోడ్డులో ఉన్న సంఘమిత్ర టెక్నో స్కూల్ లోని విద్యార్థులకు, వివిధ విభాగాల్లో మెడల్స్ సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు సర్టిఫికేట్ లు, మెడల్స్ ప్రధానం చేశారు స్కూల్ ప్రిన్సిపాల్ మహేందర్. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ, విశ్వాసం మరియు జీవన నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడే అదనపు మద్దతు అతని/ఆమె భవిష్యత్తుపై ఖచ్చితంగా శక్తివంతమైన, శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది అని, ఐఐటీ ఫౌండేషన్ ప్రోగ్రామ్‌లో మంచి ర్యాంకులు సాధించేందుకు ప్రతి చిన్నారి కష్టపడి పనిచేశారు అని, అందరికీ అభినందనలు తెలిపారు. పేద ప్రజలకు అండగా, పేద విద్యార్థులకు అందుబాటులో అత్యున్నత విద్యను అందిస్తున్న సంఘమిత్ర టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ ను, టీచర్లను విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. సంఘమిత్ర టెక్నో స్కూల్ ఆవరణలో విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి సర్టిఫికేట్లు ప్రధానం చేసిన స్కూల్ యాజమాన్యం. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ మహేందర్, వెంకట్ రెడ్డి, స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version