కొమురంభీమ్ అసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం పిక్ల తాండా మామిడిపల్లి గ్రామానికి చెందిన రాథోడ్ దిలీప్ అనే 28సంవత్సరాల వ్యక్తి మద్యానికి బానిసై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చికిత్సపొందుతూ మృతి చెందాడు. మృతునికి గత నాలుగు నెలల క్రితం సత్యసాయి నగర్ కి చెందిన అరుణతో వివాహం అయ్యింది. స్వగ్రామంలో మద్యం తాగి జులాయిగా తిరుగుతున్నడని తల్లి తండ్రులు అత్తగారి ఊరు అయిన లక్షెట్టిపేట లో ఏదైనా పని చేసుకోమని నెల క్రితం పంపారు. ఇక్కడ ఒక మార్బుల్ దుకాణంలో పనిచేసుకుంటూ వచ్చిన డబ్బులతో తరుచుగా మద్యం తాగుతున్నాడు. మద్యం మానమని చెబితే వినలేదు. ఈనెల 27న అతిగా మద్యం తాగి రావడంతో ఇంట్లో వాళ్ళు మండలించగా మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేపించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయాడు. మృతుని తల్లి సోబాబాయి ఫిర్యాదు మేరకు ఎస్సై చంద్రకుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కొప్పుల ఈశ్వర్ ను బారీ మెజారిటీ తో గెలిపించాలని కొప్పుల స్నేహ లత ప్రచారం!! ఎండపల్లి నేటి ధాత్రి
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా సోమ వారం, వెల్గటూర్ మండలం చెగ్యం, తాళ్లకొత్తపేట గ్రామాల్లో పెద్దపల్లి పార్లమెంట్ బి ఆర్ ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ని అధిక మెజారితో గెలిపించాలని ఆయన సతీమణి కొప్పుల స్నేహాలత ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా కొప్పుల స్నేహ లత మాట్లాడుతూ గతం లో ఈ ప్రాంతానికి శాసన సభ్యులు గా మంత్రి గా ఉండి ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసారని, ప్రతి గడపకు ఈశ్వర్ ఒక కుటుంబంలో ఒక ఆత్మీయునిగా ఉన్నారని, ఏ క్షణం పిలిస్తే అక్షణం పలికే నాయకుడిగా కాకుండా సేవకుడిగా ఉన్నాడని, ఆయన సేవలుఇంకా ఈ ప్రాంతానికి కావాలని, ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తు కు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ గారిని అధిక మెజారితో ఎంపీ గా గెలిపించాలని ఆమె కోరారు,ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ కునమల్ల లక్ష్మీ లింగయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, పత్తిపాక వెంకటేష్, అల్లం దేవమ్మ, పార్టీ ప్రధాన కార్యదర్శి జూపాక కుమార్, ఎస్ సి సెల్ అధ్యక్షులు కొప్పుల సురేష్,సర్పంచులు రామిల్ల లావణ్య సనీల్, ద్యావనపెళ్లి లక్ష్మీ ఎల్లయ్య, మూగల సత్యం, పెద్దూరి భరత్, ద్యావనపెళ్లి సుధాకర్, కొళ చరణ్, గాజుల భానిష్, బాలసాని రవి, కుశనపెళ్లి రవి, కుశనపెళ్లి రాజమని, ఒల్లల విజయలక్ష్మి, కాల్వ శిరీష, రంగు భూమయ్య, దస్తగిరి, రాం రెడ్డి, శ్రీను, మాదాసు రమేష్,కునమల్ల లింగయ్య, ఎల్కాటూరి స్వామి, తదితరులు పాల్గొన్నారు.
గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్ ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ మంగళవారం రోజున మధ్యాహ్నం జరగబోయే రేగొండ జన జాతరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విచ్చేయుచున్నారు కావున గణపురం మండలంలోని ప్రజా ప్రతినిధులు మహిళాలు నాయకులు ఎస్సీ సెల్ బీసీ సెల్ ఎస్టీ సెల్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు మండల యువజన నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం.మీ గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి వాహనాలు మధ్యాహ్నం 1:00 కు బయలుదేరి రావలసిందిగా అన్నారు ముఖ్యంగా ఎండను దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలతో రావాలి అని వారు కోరారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి గండ్ర భీమారావు నిన్న రాత్రి అనారోగ్యంతో మరణించగా నేడు ఉదయం వారి నివాసానికి చేరుకొని మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు వారితో గణపురం మండలం వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ నల్లబెల్లి సంపత్ రావు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు
కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తుంది, ఆంధ్రాలో మిలీనమై ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలిపి అభివృద్ధి చేయగల సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉంది….
రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిని చేయాలని దేశ ప్రజలకు నిర్ణయించుకున్నారు….
ఇండియా కూటమి దేశంలో అత్యధిక సీట్ల సంపాదించి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది….
*మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి
ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలంలోని స్థానిక రెవిన్యూ కాలనీ,అయ్యప్ప కాలనీ, అశోక్ నగర్ కొత్త కాలనీలలో మాజీ గ్రంథాల చైర్మన్ *భోగాల శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి *పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుకుంటూ విస్తృతంగా కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బోగాల శ్రీనివాసరెడ్డి ప్రజలతో మమేకమై మాట్లాడుతూ….
భద్రాచలంలో ప్రతి సమస్యను ఎరిగిన వ్యక్తి, భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ బరిలో ఉన్న *పోరిక బలరాం నాయక్
మన ప్రాంత సమస్యల గురించి, అభివృద్ధి కోసం ఆలోచించే వ్యక్తి *బలరాం నాయక్ ని గెలిపించుకోవడం ద్వారానే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని, గతంలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి పనులు నియోజకవర్గంలో చేయటం జరిగిందని, ప్రజలందరూ తప్పనిసరిగా ఆలోచించి *బలరా నాయక్ బలపరచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
దేశంలో హింసాత్మక, మతపరమైన పాలన కొనసాగిస్తున్నటువంటి బిజెపి ప్రభుత్వాన్ని,రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలా ప్రజల తరిమికొట్టారో,అదే విధంగా దేశంలో బిజెపిని తరిమికొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
దేశ ప్రజలందరికీ సమన్యాయ పాలనా అందించడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఐదు న్యాయాల మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకు వచ్చిందని, దేశ ప్రజలందరి మద్దతుతో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని,తద్వారా రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలుపరిచిన విధంగానే దేశంలో ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ న్యాయమైన పాలన అందిస్తుందని ఆయన ప్రజలకు వివరించారు.
ఈ ఎన్నికల ప్రచారంలో ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాసమల రాము,ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నెం రామిరెడ్డి, మహిళ కాంగ్రెస్ నాయకులు తుమ్మల రాణి, కట్ట కళ్యాణి,పద్మప్రియ, ఎస్సీ సెల్,ఎస్టీ సెల్, మహిళా కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గడ్డం వంశీని బారీ మెజారిటీ తో గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను కోరిన ప్రభుత్వ విప్ అడ్లూరీ ఎండపల్లి నేటి ధాత్రి వెల్గటూర్ మండలం కప్పారావు పేట గ్రామంలో సోమవారం రోజున నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంల్లో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలను కలిసి. పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశి ని భారీ మెజారిటీతో గెలిపించాలని,ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఉపాది హామీ కూలీని 200 నుండి 400 వందలకు పెంచుతామని,ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో పీసీసీ కార్య వర్గ సభ్యులు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలెందర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,గెల్లు శ్రీనివాస్ విజయ్ , తదితరులు పాల్గొన్నారు.
చేర్యాల పట్టణంలో పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జనగామ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి చేర్యాల పట్టణంలో రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించి తీరుతామని మరియు జనగామ చేర్యాల అభివృద్ధికి నేను ఎంపీగా ఉన్నప్పుడు పలు సంక్షేమ పథకాలకు అమలు చేశానని మా నల్గొండ కంటే జనగామ నాకు అత్యధిక మెజారిటీ ఇచ్చిందని కొనియాడారు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలిపించి నన్ను పార్లమెంటుకు పంపాలని విజ్ఞప్తి చేశారు జనగామ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ 6 గ్యారంటీలు పథకం కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తుందని ఇక్కడ తపస్పల్లి రిజర్వాయర్ నేను తీసుకువచ్చింది అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ మండల శ్రీరాములు చేర్యాల పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ కౌన్సిలర్ ఉడుముల ఇన్నమ్మ భాస్కర్ రెడ్డి కౌన్సిలర్లు ఆడెపు నరేందర్ చెవిటి లింగం మాజీ జెడ్పిటిసి దాసరి కళావతి డాక్టర్ రామగళ్ళ పరమేశ్వర్ ఆడెపు చంద్రయ్య పుర్మా ఆగం రెడ్డి మంచాల చిరంజీవులు దాసరి క్రాంతి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు
పరకాల నేటిధాత్రి వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ గెలుపు కోసం సోమవారం రోజున పరకాల మండలంలోని నాగారం గ్రామంలో పరకాల మండల ఇన్చార్జి ఎర్రం రామన్న,పరకాల రూరల్ మండలం అధ్యక్షులు ముష్కే దేవేందర్ ఆధ్వర్యంలో బిజెపి పథకాల గురించి వివరించి కరపత్రాలు స్టిక్కర్స్ పంపిణీ పంచడం జరిగింది.అనంతరం కమలం గుర్తుకు అమూల్యమైన ఓటు వేయాలని ఆరూరి రమేష్ ను అధిక మెజారిటీ తో గెలిపంచాలని తెలియజేస్తూ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హుజురాబాద్ ప్రబారి డాక్టర్ పెసర్ విజయచందర్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సంతోష్ కుమార్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జ సత్యనారాయణ రావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గురు ప్రసాద్,కట్టగాని శ్రీకాంత్,బిజెపి హన్మకొండ జిల్లా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
`ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో…అని బెదిరిస్తున్నాడు?
`కొండా బాధితులంతా ఏకమౌతున్నారు.
`చెవెళ్లకు వెళ్ళి కొండా బండారం బైటపెట్టేందుకు సిద్దమౌతున్నారు.
`ఇంటింటికీ ప్రచారం కొండా నయవంచన చెబుతామంటున్నారు.
`ప్రజా ద్రోహికి ఒక్క ఓటు పడకుండా ప్రచారం సాగిస్తామని హెచ్చరిస్తున్నారు?
`రోజు రోజుకూ కొండా బాధితులు వెలుగులోకి వస్తున్నారు.
`నేటిధాత్రితో తమకు జరిగిన అన్యాయం వివరిస్తున్నారు.
`మాకు అండగా నిలవాలని కోరుతున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
వంచనకు మారు పేరు కొండా? నయవంచనకు రూపం కొండా? విషం నిండిన మనస్తత్వం కొండా? నమ్మించి మోసం చేయడంలో దిట్ట కొండా? మాటలు తీయగా, చేతలు చేదు గులిక కొండా? ప్రజా సేవ చేస్తానని గెలిచి ప్రజలను మోసం చేసిన కొండా? ప్రజా సేవ వదిలేసి కాంట్రాక్టులు చేసి ఆస్ధులు కూడబెట్టుకున్న కొండా? తన సంపాదన కోసం సామాన్యులను వాడుకొని వదిలేసిన స్ధార్ధపరుడు కొండా? గెలిపించిన ప్రజలను గాలికొదిలేసి, ఐదేళ్లు ప్రజల కంటికి కనిపించని కొండా? తనంత సుద్దపూస మరొకరు లేరంటూ నిత్యం నీత పలుకులు వచించే వ్యక్తి కొండా? ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కొండా? టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీకే వెన్ను పోటు పొడిచిన నాయకుడు కొండా? మేక వన్నె పులిలా, తన కాంట్రాక్టుల కోసం అమాయకులైన వారిని నిండా ముంచిన ద్రోహి కొండా? ఇతర కంపనీలలో పనిచేస్తుంటే, నమ్మించి తన కంపనీకి వాడుకొని మోసం చేసిన దగుల్భాజీ కొండా? తన మాటలు నమ్మినందుకు అభాగ్యులను వీధి పాలు చేసిన కొండా? హాయిగా సాగుతున్న తమ జీవితాలలో తుఫాను రేపిన కొండా? తమను అడుక్కుతినేలా చేసిన కొండా? అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నది ఎవరో కాదు.. చెవెళ్ల ఎంపిగా బిజేపి తరుపున పోటీ చేస్తున్న అభ్యర్ధి కొండా విశ్వేశ్వరరెడ్డి బాధితులు. ఆయన వల్ల నష్టపోయిన వాళ్లు…ఆయన వల్ల సర్వస్వం కోల్పోయి రోడ్డున పట్ట కుటుంబాలు చెబుతున్న మాటలు. ఇలాంటిద్రోహి మరొకరు వుండరంటూ నేటిధాత్రిని ఆశ్రయిస్తున్న కొండా బాదితులు.. వారు చెబుతున్న మాటలు వింటుంటే ఎంతటి కర్కషమైన గుండెలు కూడా ఆవిరి కావాల్సిందే. వారు ప్రస్తుతం పడుతున్న బాదలు వింటుంటే ఎవరికైనా కనీళ్లు కట్టలు తెంచుకొని రావాల్సిందే..అంతలా కొండా విశ్వేశ్వరరెడ్డి మూలంగా నష్టపోయారు. ఒకరు కాదు..ఇద్దరు కాదు. దాదాపు ముప్పై మందిని ఒక్క సిద్దిపేట జిల్లాలోనే మోసం చేశాడంటే, తెలంగాణ వ్యాప్తంగా కొండా ఎంతమందిని మోసం చేశాడో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తి వల్ల సర్వం కోల్పోయి వీధినపడ్డ ఒక్కొక్కరి జీవితాలు దినదిన గండంగా సాగుతున్నాయి. కొండావిశ్వేశ్వరరెడ్డిని నమ్ముకొని వారసత్వంగా వచ్చిన ఆస్ధులు అమ్ముకున్న వాళ్లున్నారు. రాత్రనక పగలనక కష్టపడి సంపాదించి పైసా పైసా కూడబెట్టుకున్న సొమ్ము కూడా కొండా పాలైంది. చిన్నా చితక పనలు చేసుకుంటూ అప్పులు చేసి కొనుక్కున్న ట్రాక్టర్లు పోయాయి. జేసిబిలు అమ్ముకున్నారు. చేసిన అప్పులకు వడ్డీల మీద వడ్డీలు, చక్రవడ్డీలు కడుతున్నారు. కట్టుకోలేక క్షణ క్షణం అప్పుల్లో తిట్లతో నరకం అనుభవిస్తున్నారు. ప్రశాంతంగా సాగుతున్న తమ జీవితాల్లో కొండా వచ్చి కల్లోలం సృష్టించాడు. అంటూ బాధితులు ఆర్తనాదాలు పెడుతున్నారు. అరిగోస పడుతున్నారు. తినేందుకు తిండి లేని బతుకులై దీనంగా రోదిస్తున్నారు. ఒకప్పుడు కనీసం సమాజంలో పరువుతో బతికిన వాళ్లు కొండా మూలంగా తమను తాము దాచుకొని బతకాల్సివస్తోంది. అప్పులోల్లను చూసి భయం, భయంగా బతుకుతున్నారు. వారు తిడుతున్న తిట్లను తింటూ, జీవచ్చవాలుగా బతుకుతున్నారు. చేసిన పనులకు ఇవ్వాల కాకపోతే, రేపు సొమ్మురాకుండాపోతుందా? అని ఎదరుచూస్తున్న బాదితులకు ఇక రూపాయి ఇచ్చేది లేదు అంటూ కొండా విశ్వేశ్శరెడ్డి సమాదానం చెబుతున్నాడు. మీ దిక్కున్న చోట చెప్పుకో పొండి అంటున్నాడు. వారి కష్టంతో ఆస్ధులు కూడబెట్టుకున్నాడు. అటు ప్రభుత్వ బిల్లులు వసూలు చేసుకున్నాడు. ఇటు సబ్ కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకున్నాడు. ఆఖరుకు వారు పెట్టిన పెట్టుబడిని కూడా దిగిమింగి కూర్చుకున్నాడు. మొత్తంగా కొండాను నమ్మినందుకు బాదితుల జీవితాలు వీధి పాలు చేశాడు. వారి జీవితాల్లో చీకట్లు నింపాడు. వారి బతుకులు ఆగం చేశాడు. అలాంటి కొండా విశ్వేశ్వరెడ్డి బాధితుల్లో ఒకరు రమేశ్. ఉమ్మడి నల్లగొండ జిల్లా గుండాల మండలానికి చెందిన నివాసి. మిషన్ భగీరథ పనుల్లో రమేశ్ చూపిస్తున్న చురుకుదనాన్ని చూసి, కొండా విశ్వేశ్వరరెడ్డి పిలిపించుకున్నాడు. తాను సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్ధకు కాకుండా నేరుగా మా ఎవరెస్టు కంపనీలోనే సబ్ కాంట్రాక్టు ఇస్తాను తీసుకో..అంటూ నమ్మించాడు. నయ వంచన చేశాడు. రమేశ్ లాంటి సబ్‌కాంట్రాక్టర్లు చేస్తున్న పనిని చూపించుకొని కొండా ప్రభుత్వం నుంచి బిల్లులు వసూలు చేసుకున్నాడు. సబ్ కాంట్రాక్టర్లకు మాత్రం మొండి చేయి చూపించాడు. కనీసం వారు పెట్టిన పెట్టుబడి కూడ ఇవ్వకుండా నిండా ముంచేశాడు. అప్పటికే సమాజంలో కొంత పేరు పరపతి వున్న రమేశ్ గుండాలలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవించేవారు. అలాంటి వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డిని నమ్మి సర్వం కోల్పోయాడు. బతుకే దినదిన గండంగా మారిపోయి బతుకుతున్నాడు. తనకు వారసత్వంగా వచ్చిన భూములు అమ్ముకున్నాడు. తాను కొనుక్కున్న ప్లాట్లు అమ్ముకున్నాడు. తనకున్న ట్రాక్టర్లు అమ్ముకున్నా అప్పులు తీరలేదు. ఆఖరు రమేష్‌కువున్న రెండు జేసిబీలు కూడా అమ్ముకున్నాడు. ఇప్పుడు కూలీగా మారిపోయాడు. భార్యా భర్తలిద్దరూ కూలీ పనులు చేసుకుంటున్నారు. ఒకప్పుడు పది మందికి పని కల్పించే స్ధాయిలో వున్న రమేష్, ఇప్పుడు తనకు ఎవరు పని కల్పిస్తారా? రోజు వారి కూలికి ఎవరు పిలుస్తారా? అని ఎదురుచూస్తున్నాడు. కొండా పుణ్యమా? అని రమేశ్ సతీమణి కూడా ఇప్పుడు కూలీ పనికి వెళ్లాల్సిన దుస్తితి ఏర్పడిరది. ఒకప్పుడు రమేశ్‌కుమారుడు ఇంటర్‌మీడియేట్ కార్పోరేట్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతుండేవాడు. కొండా మూలంగా ఇరవై ఏళ్లుగా సంపాదించుకున్న సంపాదన రెండేళ్లలో ఊడ్చుకుపోయింది. తన కుమారుడు ఇంటర్మీడియేట్ రెండో సంవత్సరం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకోవాల్సివచ్చింది. ఆ అబ్బాయి కూడా సెలవు రోజుల్లో కూలికివెళ్లాల్సిన పరిస్ధితికి రమేష్ జీవితం దిగజారిపోయింది. ఇది ఒక్క రమేష్ జీవితమే కాదు..కొండాను నమ్మినందుకు ఆయన మాటలకు మోసపోయిన ఎంతో మంది జీవితాలు ఇంతకన్నా దుర్భరంగా మారిపోయాయి. కొండా విశ్వేశ్వరరెడ్డి దురహంకారం ఎంత పరాకాష్టకు చేరిందంటే బాధితుడైన రమేశ్ ఫోన్‌ను బ్లాక్ లిస్టులో పెడతా? అంటూ బెదిరింపులకు గురిచేశారు. పదే పదే చేస్తే మర్యాదగ వుండదని హెచ్చరించారు. ఎవరెస్టు కంపనీలో బాద్యులకు ఫోన్ చేస్తే లిప్ట్ చేయడం లేదని పలుసార్లు ఫోన్ చేస్తే సహించమంటూ హుకూం జారీచేశారు. మా పైసలు మాకిస్తే మేంమెందుకు ఫోన్ చేస్తామంటే, సిఎం కేసిఆర్ నెంబర్ ఇస్తాం వసూలుచేసుకో..అంటూ ఫోన్‌లో దురుసుగా ప్రవర్తించారు. ఇలా అయితే బాగా లేదని రమేశ్ బంజారాహిల్స్‌లో వున్న ఎవరెస్టు కార్యాలయానికి వెళ్తే, మరోసారి వస్తే మంచిగా వుండదంటూ దాడి చేసి కొట్టే ప్రయత్నం చేశారు. చివరికి తెలంగాణ తొలి అమరుడు స్వర్గీయ శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మకు తనకు జరిగిన అన్యాయం రమేశ్ వివారించాడు. ఆమె సైతం రమేశ్‌కు డబ్బుల కోసం కూడా ప్రయత్నం చేసింది. అప్పటి మంత్రి, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావును రమేశ్ కలిశారు. ఆ సమయంలో హరీష్‌రావు ఫోన్ చేస్తే బిల్లులు ఇస్తామంటూ సమాధానం చెప్పడం, తర్వాత కొండా అనుచరులు రమేశ్‌ను బెదిరించడం మొదలుపెట్టారు. ఒక దశలో వారి బెదిరింపులకు వెరవకుండా, శంకరమ్మను తీసుకొని ఎవరెస్టు కంపనీకి వెళ్లడంతో కొంత అమౌంట్ కు చెక్ ఇచ్చారు. అది బౌన్స్ అయ్యింది. చెక్ బౌన్స్ అయ్యిందని రమేశ్ ప్రశ్నిస్తే సమాదానం చెప్పాల్సింది పోయి, తిరిగి న్యూసెన్స్ కేసు నమోదు చేయిస్తాంటూ బెదిరించారు. కాటారం మండలంలో వున్న ఒక కొండ మీద మిషన్ భగీరధ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం ఎవరూ చేయలేమంటూ చేతులెత్తేసినా, ఎంతో కష్టపడి రమేశ్ నిర్మాణం చేశాడు. అందుకు ఆయన అదనంగా కొంత ఖర్చు చేసుకున్నాడు. ఎవరెస్టు కంపనీకి పేరు వచ్చేలా చేశాడు. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా కొండా విశ్వేశ్వరరెడ్డి మోసం చేసి, రమేశ్ జీవితాన్ని చిదిమేశాడు. ఇటీవల కొండా వల్ల నష్టపోయిన బాదితులంగా ఏకమై, చెవెళ్ల ప్రచారానికి వెళ్లేందుకు సిద్దపడుతున్నారు. గతంలో కొండా విశ్వేశ్వరరెడ్డి సుద్దపూసలాగా హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు బాధితుడు బాలసుబ్బయ్య పెద్దఎత్తున కరపత్రాలు పంపణీ చేశాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి అసలు స్వరూపం, వికృత రూపం మొత్తం బైటపెట్టాడు. ఇప్పుడు కొండా వ్యతిరేకులంతా చెవెళ్లకు వెళ్లి, ఊరూరు తిరిగి, కొండాకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు భయలుదేరుతున్నారు. కొండాను ఓడిరచి తమ కసిని తీర్చుకుంటామంటున్నారు. కొండాను వదిలిపెట్టే ప్రసక్తి లేదని శపధం చేస్తున్నారు. పేదలే కదా? అని చిన్న చూపు చూసి వారి కష్టం దోచుకొని, వారి ఆస్ధులు పోగొట్టుకునేలా చేసిన కొండాను ఎట్టిపరిస్ధితుల్లో చెవెళ్లలో ఒక్క ఓటు పడకుండా ప్రచారం చేస్తామంటున్నారు.
Not caring scorching sun people are eager to see KCR
Listening with care to what he has been saying
People spent happy lives during the tenure of KCR
There were no power cuts and water problem
There was an uninterrupted drinking water supply
State-facing draught with the advent of Congress
Now Telangana wants re-entry of KCR
Telangana masses decided to give victory to KCR
His successful road shows are the best example
Yerrabelli Dayakar Rao shared his opinion with the editor of ‘Neti Dhatri’ Katta Raghavendra Rao
Hyderabad, Netidhathri
Now we are again looking at the scenarios of the Telangana movement in the state. The presence of masses in large numbers for the road shows and public meetings conducted by KCR is the best example of his ‘cherishma’ remaining intact. Not caring about the scorching sun, people are eagerly waiting for their beloved leader who brought a separate state and caused for eliminating the plights of farmers along with all sections of Telangana. When heard about the visit of KCR in their region, immediately people rushed to the place where the KCR meeting was held. They are not hesitating to wait for him, on the occasion of his visit being delayed. They are of the strong opinion that only KCR can solve their problems and treat him as a troubleshooter for the plight they have been facing. Speaking this is the craze of KCR among Telangana masses that grew up during the Telangana movement. They have been waiting for their leader even in the time of mid-summer is the main point being run has become an astonishing factor for those observing the politics of Telangana. They responded well to his speeches and raised slogans in favour of him in the middle of his speeches. They are in the feeling that KCR is only leader who can stand in support, while they are in trouble. While looking at him after a long time, the hearts of the people filled with enormous joy and expressed their favour towards him with their gestures. The presence of such a large number of people shows how a strong opposition party can prevent the government from doing un-favour to the people. The craze towards KCR reached peak level which made the Congress and BJP leaders to rethink about their expectations. At the same time the leaders of both parties in fear about the election results. When observing the response to KCR public meetings and road shows, there appears to be flutter among BJP and Congress leaders and being fell a nightmare about their defeat in these elections. Looking at the tremendous response received by KCR, their previous hopes gradually diminished and left in fear of defeat. The entry of KCR into the election campaign gradually transformed the situation in favour of BRS, which Congress and BJP felt till now that the wave is in favour of them. Now they are in the mood of losing confidence by observing the anger among people against them. For ten years period BJP never bothered about the plights of the Telangana people and always tried to keep the state in trouble. Within four months of the period after coming into power Congress gained antagonism among people with its unpopular anti-people activities. With the entry of KCR, state politics have been turning fast and political scholars also expressing their astonishment at the speed of changes that have been taking place in the state. On this occasion, Yerrabelly Dayakar Rao interacted with Katta Raghavendra Rao, Editor of Netidhatri and shared his opinions on this current scenario.
This mass response never expected
In general, leaders become enthusiastic when they look at the presence of people in large numbers. The KCR road shows now have transformed the entire scenario of Telangana, which has been making both Congress and BJP fear about their future. In his ten years of rule KCR eliminated the troubles of people who faced during sixty years under the united rulers. KCR not only fought for 14 years for separate Telangana but also strived hard to eliminate the troubles faced by the people. For this purpose, he went to a stage where he kept ready himself to sacrifice his life for the cause of Telangana. Every person in Telangana has affection for KCR for this bold attempt to bring a separate state. It was unfortunate that the people believed the negative campaign of Congress against BRS. At the same time, BRS failed to counter those allegations and moved in a proactive way. This party was only left behind with a margin of votes of 1.8%. We can’t say this minute difference is defeat. We will return to power, Yerrabelli expressed his confidence
Congress deceived the people
Congress gave six guarantees. These six contain a total of 13 assurances. Out of them till now they have implemented only two assurances but saying that all were implemented. Still, they are trying to deceive the people. How far they can be able to keep people’s distance from the facts? People can bear anything up to some extent but never tolerate the betrayal. Till now Raitubandhu has not paid. There is no gold for Kalyana Lakshmi. Scooties were not distributed to young women as per the assurance given during the election campaign. No distribution of Rs.2500 and regular pension payment till now has not taken place for women. If you go on telling like that a total of 420 assurances have not been implemented so far. Immediately after winning the elections, Congress assured assurance regarding the loan waiver. After that, it said a hundred days for implementation. Now they are telling before 15th, August. Is there any guarantee that the government can implement this as it said? Congress leaders are unable to accept the challenge of Harish Rao. If Congress fails to fulfil the promise of waiver of loans for farmers, then it will become nothing but deceiving the people. Now the Telangana people are not in a position to believe Congress. They never cost their vote in favour of Congress. In rural areas, Congress leaders are facing a negative wave and people are questioning their failures in these four months period. Especially they are raising questions on the implementation of six guarantees. Tanks in the state now are in the state of defunct. Crops in lakhs of acres now have been facing dry-up conditions. Nobody has come forward to purchase paddy. Who can pay a Rs.500 bonus for paddy?
All are failures during Congress
Since the Congress came into power, the problems of the people began and now they are in the feeling that it is a great mistake committed by them is vote in favour of Congress. In the last ten years, nobody faced water problems. Mission Bhagiratha water is supplied to every household. Especially there was no disruption of water supply in Hyderabad. Plentiful water is supplied to twin-cities people regularly. This can be said as the greatest contribution made by KCR. Now once again the water supply is being given for once in three days. In the last ten years, there were no water tankers in Hyderabad. Now they again entered. Speaking Congress brought draught along with it. Even five months back background water table is considerably high. Unfortunately, now they have been depleting. Wells and tanks are gradually reaching the stage of defunct. Now entire river water has been released into sea is nothing but the in-efficiency of the present ruler. Congress leaders misguided the people and tried to unpopular the BRS. Now the time has come for the people to show their anger against the government in the form of votes!
వడదెబ్బతో హమాలి కూలి మృతి చెందిన సంఘటన వేములవాడ మండలంలోని అచ్చన్నపేట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వేములవాడ రూరల్ మండలంలోని అచ్చన్నపేట గ్రామ పంచాయతీలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న కొనుగోలు కేంద్రంలో వడదెబ్బతో శంకర్ (34)రక్తం కక్కుకోని అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మహాదేవపూర్ మండలానికి బిజెపి ఇన్చార్జిగా బొమ్మన భాస్కర్ రెడ్డిని నియమించి నియామక పత్రం అందజేసిన పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చదుపట్ల సునీల్ రెడ్డి ఈ సందర్భంగా బొమ్మన భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి పార్టీ మహాదేవపూర్ మండల ఇన్చార్జిగా నియమానికి సహకరించిన పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ట సునీల్ రెడ్డి భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షులు నిశిధర్ రెడ్డి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు అలాగే పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను క్రమశిక్షణతో విజయవంతం చేస్తూ బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు
మతోన్మాద కార్పోరేట్ విధానాలు అనుసరిస్తున్న బిజెపిని ఓడించండి.
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు పిలుపు.
భూపాలపల్లి నేటిధాత్రి
భారత కమ్యూనిస్టు పార్టీ మారుస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్లో శాఖ కార్యదర్శిల విస్తృత సమావేశం జరిగింది. సమావేశానికి పార్టీ జిల్లా నాయకుడు వెలిశెట్టి రాజయ్య అధ్యక్షత వహించగా, పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డాక్టర్ కడియం కావ్యము అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని మోడీ అమలు చేయలేదు. లేని పేదలందరికీ 10 లక్షలు ఇచ్చి ఇంటి స్థల మిత్రమన్న మాట గాలిలో కలిసింది. జీరో అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తామని జీరో అకౌంట్ ఓపెన్ చేసి ఒక్క రూపాయి బిళ్ళ ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిండు మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలని ఒక్కరి కూడా ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమయ్యిండు. రైతు వ్యతిరేక 3 అగ్రి చట్టాలు తెచ్చి రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమించటం వలన ఆ తప్పనిసరి పరిస్థితులలో రద్దు చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మోడీ సర్కార్ కి ఎదురయింది. అయినా ఇంకా కనీసం మద్దతు ధర ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది చట్టం కూడా చేయలేదు. ఉపాధి హామీ చట్టంలో రోజుకు 600 రూపాయలు సంవత్సరానికి ₹200 రోజుల పనిగా అనిపిస్తామని నిధులు కేటాయించలేదు మున్సిపాలిటీ ఏరియాలలో ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయలేదు. అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసి పోడు భూములకు పట్టకుండా పోడు రైతులు అందరికీ అన్యాయం చేసిండు మోడీ సర్కారు. మోడీ పాలనలో దళితుల మీద గిరిజనుల మీద మహిళల మీద మైనార్టీల మీద చిన్న పిల్లల మీద దాడులు హత్యలు, అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాల్ని మార్చి పెట్టుబడుదారులకు అనుకూలంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా చట్టాలను నాలుగు కోట్లుగా మార్చి కార్మిక వర్గానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. మోడీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దుచేసి మనధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. లో భాగంగానే న్యూటన్ సిద్ధాంతాన్ని రద్దు చేసింది. చరిత్రను వక్రీకరించిండు. బీజేపీని ఓడించి మతోన్మాదాన్ని ఎండగట్టాలని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బిజెపిని ఓడించండి. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి. కూటమి తరపున కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ కడియం కావ్య చేతి గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆకుదారి రమేష్,మేకల మహేందరూ, శేఖర్, శ్రీధరు,లక్ష్మక్క,రాజీని, గోవర్ధన్, కోసరి రమేష్,నరేష్, మహేశ్వరి, ఇతరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో శుక్రవారం రోజున పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో జైపూర్ ఎస్సై శ్రీధర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీధర్ మాట్లాడుతూ ఎస్ఎస్సి మరియు ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన కృంగిపోతున్నారని మరియు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అలాంటి ఆలోచనలు రావడం చాలా బాధాకరమైన విషయమని, ఎప్పుడు ధైర్యంగా నమ్మకంతో ముందడుగు వేస్తూ జీవించాలని, చిన్న చిన్న విషయాలకు కూడా ఆత్మహత్యలు వంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని, పిల్లలందరూ మీ తల్లిదండ్రుల యొక్క కష్టాలను మీకోసం పడే ఆరాటాన్ని ,మీరు పంచే అనురాగాన్ని ఆనందాన్ని పొందటానికి ఎదురుచూస్తూ ఉండే ఆ కళ్ళల్లో విషాదాన్ని నింపే ఆలోచనలు చేయకూడదని సూచించారు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని ధైర్యం చెప్పి అండగా నిలవాలని నిత్యం పిల్లలను గమనిస్తూ ఉండాలని తెలిపారు. పరీక్షలలో ఫెయిల్ అయినంత మాత్రాన ఆధైర్య పడాల్సిన అవసరం ఏమీ లేదని మళ్లీ ప్రయత్నం చేసి ఉత్తీర్ణత సాధించవచ్చునని విద్యార్థులకు హితువు పలికారు. విద్యార్థులు చాలా చిన్న వయసులోనే చెడు సావాసాల ద్వారా మాదకద్రవ్యాలకు,మత్తు పదార్థాలకు, గంజాయి ,మద్యపానం మొదలగు ఇతర చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని, అలాంటి ఆలోచనలని మొగ్గలోనే తుంచి వేయాలని, బంగారు భవిష్యత్తును నాశనం చేయడానికి ముఖ్య కారణం చెడు వ్యసనాలేనని విద్యార్థులందరూ ఇది గమనించి అలాంటి వాటికి దూరంగా ఉండి చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకొని భావితరాలకు అదర్శంగా నిలవాలని తెలిపారు. పిల్లల ప్రవర్తనలో మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఎస్సై శ్రీధర్, పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 138వ మేడేను శ్రామిక కార్మిక వర్గాలు రైతు లేబర్ యూనియన్ వర్గాలు మేడేను విజయవంతం చేయాలని కార్మిక సంఘాలన్నీ ఏకమై 138వ మే డే విజయవంతం చేయాలని 1867 మొదటి మేడే కార్మిక సంఘాలుగా ఏర్పడి జరపడం జరిగింది 12 గంటలు ఉన్న పని దినాన్ని ఎనిమిది గంటల పరిధినాలపై కదం తొక్కిన కార్మిక కార్మిక వర్గాలు మేడే ద్వారా సాధించుకొని విజయవంతమైనాయి భారత దేశంలో పెట్టుబడిదారుల పాలను అంతం చేసి ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరేయడమే కార్మిక ప్రధాన లక్ష్యం భారతదేశంలో 75 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో కార్మిక వర్గాలు దశాబ్ద కాలంగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలను సమూలంగా రద్దుచేసిన బిజెపి ప్రభుత్వానికి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి శ్రామిక కార్మిక వర్గాల అనుకూలమైన ఇండియా కూటమిని అభ్యర్థులను గెలిపించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మల్లెపాక యాకన్న ఏఐసిటియు నాయకులు నారాయణ అంజి వెంకన్న పాక ఎంకన్న రమేష్ సైదులు బద్రి రమేష్ తదితరులు పాల్గొన్నారు
త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ భాజపా అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ గెలుపు కోరుతూ శుక్రవారం మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో సీతారాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించి దేశంలో మరొకసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గెలుపుకై ప్రతి ఒక్కరు తమ ఓటు ద్వారా సహకరించి దేశ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో మండల ఇన్చార్జి మల్యాల వినయ్ కుమార్, రేసు శ్రీనివాస్, కట్ట రామచంద్ర రెడ్డి, పెరుమాండ్ల కోటి, సుదగాని ప్రమోద్ గౌడ్, చుక్క శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండలం గోడిశేలపేట గ్రామంలో మహ్మద్ రఫిక్ చెల్లా వివాహ వేడుకకు మరియు ఎండపల్లి కి చెందిన కనుకుట్ల లక్ష్మి కూతురు వివాహా వేడుకకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండ పల్లి ఎంపిటిసి సభ్యులు మహ్మద్ బషీర్ హాజరై నూతన వదూవరులను ఆశీర్వాదించారు,మరియు వధువు కుటుంబానికి వంటకు కావాల్సిన 25 కిలోల బియ్యం మరియు 5000.రూపాయలు అందజేసి,కుటుంబాలకు ధైర్యాన్ని ఇచ్చారు , ఈ వేడుకలకు కాంగ్రెస్ నాయకులు పొట్లపల్లి సత్యనారాయణ రావు తోడేటి బాల్లింగ్ మంతెన నర్సయ్య దేవి రవీందర్ కుసుమ రాజు మహేష్ తదితులు పాల్గొన్నారు
కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలంలో కొత్తగూడెం నియోజకవర్గ టిపిసిసి సభ్యులు జేబీ శౌరి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది….
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు అందరూ ముక్తకంఠంతో అధికారం పార్టీలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని గోడు వెళ్లబోతున్నారు..
ఆనాడు బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక రకాల ఉద్యమాలు కార్యక్రమాలు చేసి నేడు అధికార పార్టీలో గుర్తింపు నోచుకోక సొంత పార్టీలోనే చులకన భావం ఎక్కువైపోయిందని నిరుత్సాహ చెందారు
ఈ సందర్భంగా కార్యకర్తల్లో ముఖ్యకంఠంతో పెత్తనం ఎక్కువైనప్పుడు ప్రతగించడం తప్పదని త్వరలోనే కార్యచరణ ప్రకటిస్తామని తెలియజేశారు..
టిపిసిసి ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉన్నామని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది…
ఈ కార్యక్రమంలో భద్రాది కొత్తడం జిల్లా ఓబీసీ అధ్యక్షులు అల్లాడి నరసింహారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్ఎస్ఈ అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్, కొత్తగూడెం నియోజకవర్గం అధ్యక్షులు గడ్డం రాజశేఖర్, కొత్తగూడెం నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ గౌస్, కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుమ్మడి శ్రీనివాస్. మరియు తదితరులు పాల్గొన్నారు
శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ వెంకటరమణ కాలనీలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన సీని యర్ నాయకులు,ఆ కాలనీ అధ్యక్షులు నాగేశ్వరరావు,నాయకులు రాజేష్,తన్నీ రు ప్రసాద్,మహిళా నాయకురాలు లక్ష్మి వారి బృందం ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి చేవెళ్ల ఎంపీగా నిలబడిన రంజిత్ రెడ్డి ని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాల ని వారు కోరారు. ఈ సందర్భంగా పలు అపార్ట్మెంట్లు ఇళ్లలో వాణిజ్య సముదా యాల వద్ద ఓటరులను కలిసి వారికి కరపత్రాలను అందిస్తూ,గత 10 సంవ త్సరాలుగా పార్లమెంట్ అభ్యర్థిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మంచి వ్యక్తిగా పేరున్న వ్యక్తి ఎవరు వెళ్లిన కాదన కుండా అన్నా అంటే నేనున్నా మంచి వ్య క్తిత్వం ఉన్న మహామనిషి ని గెలిపించు కొని మనకు కావల్సిన అభివృద్ధిని చే సుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు.ఈరోజు చాలా వరకు వెంకటరమణ కాలనీ గోకుల్ ప్లాట్స్ లోని వందల మంది ఓటర్లు కలిసి తమ అభ్యర్థిని చూపించి ఇతనికి మీ అమూ ల్యమైన ఓటు వేయాలని వారు అభ్యర్థిం చారు.ఈ కార్యక్రమంలో వెంకటరమణ కాలనీ గోకుల్ ప్లాట్స్లోని పలువురు చోటా,మోటా నాయకులు మహిళలు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని ఓటర్లను కలిసి వారికి కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లు ఉంటే మనం అనుకున్న 6 సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో పొందవచ్చు అన్నారు. ప్రస్తు తం ఎన్నికల నిబంధనలను అనుసరించి వాటిని మళ్లీ ఎన్నికలయ్యాక ప్రతి ఒక్క రికి పొందేలా చూడాల్సిన బాధ్యత తాము తమ బాసుకి తెలియజేసి మీకు న్యాయంగా అందేలా చూస్తామని ప్రచారంలో పాల్గొన్న నాగేశ్వరరావు పలువురు ఓటర్లకు హామీ ఇచ్చారు.
గణపురం మండల కేంద్రంలో గల నాగలింగేశ్వర స్వామి రెడ్డి గుడి వద్ద స్వామివారిని శుక్రవారం రోజున హనుమాన్ మాలాధారణ స్వాములు ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, పూజలు నాగలింగేశ్వర స్వామికి స్వాములు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని పూజలు నిర్వహించారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.