లక్షటిపేట (మంచిర్యాల) నేటిధాత్రి:
కొమురంభీమ్ అసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం పిక్ల తాండా మామిడిపల్లి గ్రామానికి చెందిన రాథోడ్ దిలీప్ అనే 28సంవత్సరాల వ్యక్తి మద్యానికి బానిసై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చికిత్సపొందుతూ మృతి చెందాడు. మృతునికి గత నాలుగు నెలల క్రితం సత్యసాయి నగర్ కి చెందిన అరుణతో వివాహం అయ్యింది. స్వగ్రామంలో మద్యం తాగి జులాయిగా తిరుగుతున్నడని తల్లి తండ్రులు అత్తగారి ఊరు అయిన లక్షెట్టిపేట లో ఏదైనా పని చేసుకోమని నెల క్రితం పంపారు. ఇక్కడ ఒక మార్బుల్ దుకాణంలో పనిచేసుకుంటూ వచ్చిన డబ్బులతో తరుచుగా మద్యం తాగుతున్నాడు. మద్యం మానమని చెబితే వినలేదు. ఈనెల 27న అతిగా మద్యం తాగి రావడంతో ఇంట్లో వాళ్ళు మండలించగా మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేపించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయాడు. మృతుని తల్లి సోబాబాయి ఫిర్యాదు మేరకు ఎస్సై చంద్రకుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.