తెలంగాణ జన సమితి పార్టీ 6వ ఆవిర్భావ దినోత్సవం.

వనపర్తి నేటిదాత్రి : తెలంగాణ జన సమితి 6 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
వనపర్తి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ ,అంబేద్కర్. తెలంగాణ జాతిపిత జయశంకర్ చిత్రపటాల కు పూలమాల వేసి నివాళులర్పించిన టి.జె.ఎస్ జిల్లా అధ్యక్షులు య౦ఏ ఖాదర్ పాష అర్పించారు
ఈ సందర్భంగా ఖాదర్ మాట్లాడుతూ.
గత 5 సంవత్సరాలుగా తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించి.
డబ్బులే కేంద్రంగా జరుగుతున్న నేటి రాజకీయాల్లో తెలంగాణ జన సమితి మాత్రం ప్రజలతో మమేకమై, ప్రజల సమస్యలను నిరంతరం రాజకీయ ఎజెండా మీద నీలపగలిగిందని. అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మీద అవిశ్రాంత పోరాటం చేసి.. భూనిర్వాసితుల పక్షాన 317 జీవో పై పోరాడి వారికి ధైర్యంగా జన సమితి నిలబడింది
ప్రజలు ఎదర్కొన్న అనేక సమస్యల మీద స్పందించి, వాటిని రాజకీయ ఎజెండా మీద నిలపడంలో జన సమితి ప్రధాన పాత్ర వహించింది.
ప్రత్యేకంగా నిరుద్యోగ సమస్య మీద లోతుగా అధ్యయనం చేసి అనేక సదస్సులు నిర్వహించి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన అంశంగా ఎజెండా మీద నిలిపిందని అన్నారు
తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడగల ఏకైక పార్టీ తెలంగాణ జన సమితి, రాబోయే రోజుల్లో పైసల రాజకీయాలను అధిగమించాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని, టి.జె.ఎస్ శ్రేణులకు ఖాదర్ అన్నారు .
ఈ కార్యక్రమంలో టీజేఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కె బాలకృష్ణ.
జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ కుమార్ శెట్టి
మండల అధ్యక్షులు పిక్కిలి బాలయ్య. వినోద్ కుమార్. రాము షేక్ సోప్ అలీ . పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ప్రజావాణిలో వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

భూపాలపల్లి నేటిధాత్రి

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.

సోమవారం జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన 18దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు కలెక్టర్ తెలిపారు.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శాఖల వారిగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రజలు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
జిల్లా పౌర సంబంధాల అధికారి జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది.

అనుమతి లేని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల బ్రాంచ్ లను ముసివేయాలి

ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీమ్ నవీద్ డిమాండ్

హన్మకొండ, నేటిధాత్రి:

కె .ఎల్.ఎన్ రెడ్డి కాలనీ ,మరియు పోచమ్మ మైదాన్ లో నూతనంగా ప్రారంభించిన ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల కు ఇంటర్ బోర్డు నుండి ఎలాంటి అనుమతి లేదు , అయినప్పటికీ అల్ఫోర్స్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల ను మోసం చేస్తూ హన్మకొండ లో ని కే. ఎల్. ఎన్ రెడ్డి కాలనీ లో మరియు వరంగల్ పోచం మైదాన్ బ్రాంచ్లలో అడ్మిషన్లు చేసుకుంటూ ప్రజలకు మోసం చేస్తున్నారు, ఎలాంటి కార్పోరేట్ కలశాలు ప్రజలకు మోసం చేస్తున్న ఇరు జిల్లాల డి.ఐ.ఈ.ఓ లు ఆల్ఫోర్స్ కళాశాల యాజమాన్యానికి వత్తాసు పలకడం సిగ్గుచేటని హకీమ్ నవీద్ అన్నారు, విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆల్ఫోర్స్ కళాశాల కి సంబంధించిన ఈ బ్రాంచలలో అడ్మిషన్లు తీసుకొని తమ పిల్లలు భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు.త్వరలో ఇట్టి విషయంపై ఇంటర్మీడియట్ సెక్రటరీ గారి దృష్టి కి తీసుకువెళ్తామని ఆయన అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి జనజాతర బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి.

సభకు లక్షలాదిగా తరలిరావాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపు.

భూపాలపల్లి నేటిధాత్రి

(మంగళవారం) భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండల కేంద్రంలో నిర్వహించబోయే జన జాతర భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా రానున్నారని, ఇట్టి సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు(సోమవారం) మధ్యాహ్నం జన జాతర ప్రాంగాణంలో ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్యే జీఎస్సార్ మీడియాతో మాట్లాడారు.
రేపు మధ్యాహ్నం 3 గంటలకు రేగొండ మండల కేంద్రంలో నిర్వహించబోయే జనజాతర బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఇట్టి సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి తో పాటు వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్ది డాక్టర్ కడియం కావ్య, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సరేఖ, ధనసరి అనసూయ సీతక్క, దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఏఐసీసీ ఇంచార్జీ దీపాదాస్ మున్షి, జాతీయ నాయకులు రోహిత్ చౌదరి తో పాటు వరంగల్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యే లు, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారని తెలిపారు. కావున, ఈ సభకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు లక్షలాదిగా తరలిరావాలని అన్నారు. ప్రధాని మోదీని ఓడించి, రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని కోరారు.
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తో కలిసి సభా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జీఎస్సార్..
ఈరోజు ఉదయం వరంగల్ పార్లమెంట్ ఎన్నికల బాధ్యులు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తో కలిసి సభా ప్రాంగాణంలో జరుగుతున్న ఏర్పాట్లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు. సభకు వివిధ రూట్లలో వచ్చే వాహనాలకు పార్కింగ్ ప్రాంతాలను ఎంపిక చేసి, చదును చేయాలని బాధ్యులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీఎస్సార్ వెంట పలువురు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు ఉన్నారు.

విలేకరి కూతురు సానియా ను ఘనంగా సన్మానించిన ఐక్యవేదిక

వనపర్తి నేటిదాత్రి :
చిట్యాల రోడ్డులోని డబుల్ బెడ్రూంలో నివసించే పత్రిక విలేకరి మహమ్మద్ నిరంజన్ కూతురు సానియా ఇంటర్ ఒకేషనల్ లో 960 మార్కులు సాధించిన నేపథ్యంలో అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్, సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ, టౌన్ కార్యదర్శి రమేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఉమా, టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, చత్రూ నాయక్, శివకుమార్, రాములు తదితరులు ఘనంగా సన్మానించారు*
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వనపర్తి లో నిరుపేద కుటుంబంలో పుట్టిన విద్యార్థినీ, విద్యార్థులు చాలామంది ఉన్నారని, వారు తెచ్చుకున్న మార్కులు వారి కుటుంబానికి కాక వనపర్తికి కూడా గర్వకారణమని అన్నారు

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి.ఆర్థిక సాయం

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని చెన్నవేల్లి గ్రామానికి చెందిన మోదేళ్ళ నర్సింలు(58) అనారోగ్యంతో మరణించారు.
వారి మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు, మైబు, పిట్టల బాలు, రాఘవేందర్, ప్రశాంత్, ఆంజనేయులు, శ్రీను, రాజు, గ్రామస్తులు, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

చెల్పూర్ 2004-2005 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఘనంగ జెడ్పిఎస్ఎస్ హై స్కూల్ లో 10 వ తరగతి 2004-2005 పూర్వ విద్యార్థుల సమ్మేళనము, ఈ కార్యక్రమం లో గురువులని పూలు చల్లుతు స్టేజ్ మీదకి ఆహ్వానించి శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి
హజరైన అప్పటి ఉపాధ్యాయులు
మరియు విద్యార్థిని విద్యార్థులు
రిటైర్డ్ ఉపాధ్యాయులు నరహరి మధుసూదన్ రెడ్డి, శాస్త్రి , పాఠశాల హెడ్ మాస్టర్ అశోక్ కుమార్, ఓ సారయ్య , పి సత్యనారాయణ రావు, రాజి బాపు, సుధాకర్, ఏ సాంబయ్య, పట్టాభి , ఎల్ గణపతి , ఎన్ శ్రీధర్, వి సంపత్ , సదాశివుడు గార్లతో పాటు అప్పుడు చదువుకున్న సుమారు 63 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థులు మాట్లాడుతూ ఆ రోజుల్లో టీచర్ కనబడితే గౌరవంగా నమస్కారాలు చేసేవాళ్ళము గురువులు చెప్పిందల్లా క్రమశిక్షణ గా చేసేవాళ్లం టీచర్ క్లాస్ లో లేనప్పుడు అల్లరితో క్లాస్ రూమ్ మార్మోగేది టీచర్ క్లాస్ రూముకు రాగానే ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండేది ఆ రోజుల్లో 26 జనవరి 15 ఆగస్టు జెండా పండుగల కు ఆటలు పాటలు ఉండేవి పోటీల్లో విజయం సాధించిన వారికి ప్రైజులు ఇచ్చేవారు ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి సంతోషంగా స్కూలుకు వచ్చేవాళ్ళం 2004 2005 పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది పదవ తరగతి అయిపోయి 20 సంవత్సరాలు కావస్తుంది గురువులకు నాతోటి విద్యార్థి విద్యార్థులకు ఈ సమ్మేళనానికి వచ్చినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అన్నారు, ఈ కార్యక్రమానికి విద్యార్థిని విద్యార్థులు వచ్చినవారు పొనగంటి సతీష్ .దొంగల నవీన్ రెడ్డి, యాషం రాజేష్, బీరెల్లి రాజు, గరిగెల రాజు కుమార్, అల్లం వేణు, వేల్పూగొండ శ్రీనివాస్, చుక్క రాము, శైలజ , స్రవంతి, జ్యోతి, స్వప్న, హసీనా , అర్చన , కంచర్ల కుమార్, ఎర్ర కుమార్, దండు సుమన్ తదితరులు పాల్గొన్నారు

ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలను చూసి ఓటేయండి

రైతుల సంక్షేమమే బిఆర్ఎస్ పార్టీ ధ్యేయం..

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల కు వారంటీ లేని హామీలు ఇచ్చినది.

పదేళ్ల కెసిఆర్ పాలనలో అభివృద్ధి.. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో కరువు..

కెసిఆర్ సంక్షేమం
బికెయంఆర్ అభివృద్ధి..

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపు ఖాయం.

శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులను పొందిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

సోమవారం రోజు గద్వాల నియోజకవర్గం లో కె.టి దొడ్డి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో శ్రీశ్రీశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,ఎంపీ అభ్యర్థి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ దర్శించుకుని దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించరు. అనంతరం
నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో కె.టి దొడ్డి మండల లో ఎన్నికల ప్రచారంనిర్వహించారు.
ఎమ్మెల్యే కి ఎంపీ అభ్యర్థి కి ప్రజాప్రతినిధులు నాయకులు గజమాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..
60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ లో సాధ్యం కానీ అభివృద్ధి కార్యక్రమాలు పదేళ్ల తెలంగాణ పాలనాల్లో కేసీఆర్ నాయకత్వంలో సాధ్యం కావడం జరిగింది. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కేసీఆర్ తోనే సాధ్యం కావడం జరిగింది. కెసిఆర్ ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి అనేకమైన సంక్షేమ పథకాలను ఎలాంటి మధ్యవర్తి లేకుండా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు కేసీఆర్ ని గర్వంగా చెప్పారు.
గతంలో ఈ ప్రాంతంలోని రైతులు జీవనోపాధి కోసం కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు వంటి ప్రాంతాలకు వెళ్లి వలస కూలీలుగా పరిస్థితి ఉండేది. కెసిఆర్ పాలనలో రైతుల సంక్షేమం కోసం అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులకు 24 గంటల కరెంటు సాగునీరు అందించి ప్రతి ఎకరానికి పెట్టుబడి సాయం అందించి రైతులను ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్లీ 100 రోజుల్లో కరువు ఏర్పడింది. నీళ్లు లేక కరెంటు లేక పంటలు ఎండిపోవడం పరిస్థితి వచ్చింది.
రైతులకు ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు 15000 ఇస్తాను ఇయ్యలేదు ఊరికి సబ్సిడీ 500 రూపాయలు ఇయ్యలేదు రైతులకు రైతు మూలం రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఇంతవరకు చేయలేదు‌. కాబట్టి రైతులు పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి కేసీఆర్ బలపరిచిన అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి గెలిపించాలని కోరారు.

ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ..

నేను నడిగడ్డ వాసి పుట్టిన బిడ్డ పదేళ్లలో కెసిఆర్ పాలనలో గురుకులాల సంక్షేమం కోసం కేసీఆర్ సహకారంతో కార్యదర్శిగా పనిచేసే పది లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తుని తీర్చిదిద్దడం జరిగింది. నేడు ఆ విద్యార్థులు అతుస్థాయిలో ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉన్నత స్థాయి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. భవిష్యత్తులో మీ పిల్లలు కూడా ఇదేవిధంగా మంచి ఉన్నత స్థాయికి స్థాయికి ఎదిగే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలిపారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినది అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు 420 హామీలు వంద రోజుల్లో అమలు చేస్తామని మాయ మాటలు చెప్పి ప్రజలకు మోసం చేసి అధికారం చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు ఎలాంటి హామీ గ్యారెంటీలను అమలు చేయలేక పోయినది. కేవలం మాటలు తప్ప చేతలు లేని ప్రభుత్వంగా మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నన్ను కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని ప్రలోభాలు పెట్టడం జరిగింది ఎన్నో ప్రభుత్వంలో అధికార పదవిలను ఇస్తామని మాటలు చెప్పడం జరిగింది. వాటన్నిని వాటిని కాదని కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మేలు జరుగుతుందని కెసిఆర్ సారథ్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా కెసిఆర్ ఆశీస్సులతో పోటీ చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఒక్కసారి నన్ను ఆశీర్వదిస్తే నాగర్ కర్నూల్ లో గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు మీ తరఫున ప్రశ్నించే గొంతుగా నిలబడి గద్వాల నియోజకవర్గంలో ప్రపంచ చిత్రపటంలో అభివృద్ధి చెందే విధంగా నా వంతు కృషి చేస్తానని. విద్యారంగం అభివృద్ధి కొరకు రైతుల అభివృద్ధి కొరకు అన్ని వర్గాల సంక్షేమ అభివృద్ధి కొరకు ప్రతిరోజు కృషి చేస్తానని తెలిపారు.
త్వరలోనే మే 13వ తేదీన జరగబోయే నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికలలో కారు గుర్తు పైన ఓటు వేసి అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడ జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి పటేల్ ప్రభాకర్ రెడ్డి, రమేష్ నాయుడు, సత్యం రెడ్డి, శ్రీధర్ గౌడ్, చక్రధర్ రావు, ఎంపీపీలు మనోరమ్మ, ప్రతాప్ గౌడ్, రాజారెడ్డి, జెడ్పిటిసి లు రాజశేఖర్,పద్మ వెంకటేశ్వర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉరుకుందు, మాజీ సర్పంచ్ ఆంజనేయులు, సింగిల్ విండో డైరెక్టర్ రఘ కుమార్ శెట్టి , మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీకరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపు కోసం మండల కేంద్రంలో మార్కెట్ చౌరస్తాలో ప్రతి ఇంటింటా వినోద్ కుమార్ గెలుపు కోసం ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినోద్ కుమార్ గెలుపుతోనే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అందుచేత ఆయనకు ఓటేసి గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు యూత్ నాయకులు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పాలమూరు జిల్లాలో కమలం జోరు

బిజెపి ప్రచార హోరు..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ రూరల్ మండలంలో కమలం జోరుగా ప్రచారం నిర్వహించారు. వెంకటాపురం, చిన్న దర్పల్లి, నాయినాని పల్లిలలో బీజేపి లోకసభ ఎన్నికల ప్రచారంలో
పాల్గొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే.అరుణమ్మ అడుగడుగునా డప్పు చప్పుళ్ళు, మహిళల నృత్యాలు, జై బీజేపీ నినాదాలతో అరుణమ్మకు అడుగడుగినా నిరాజనాలు పలికిన గ్రామస్థులు, బీజేపీ శ్రేణులు
వెంకటాపురం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అరుణమ్మ. స్థానికులు, నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

అరుణమ్మ కామెంట్స్..

రేవంత్ రెడ్డి మోదీ కాలి గోటికి సరిపోడు

ఫ్రీ బస్ పేరుతో ప్రభుత్వం హడావుడి చేస్తున్నా..

ఫ్రీ బస్సు పేరుతో ప్రజల మధ్య గొడవలు సృష్టిస్తోంది

మహిళల మధ్య గొడవలు పెట్టకుండా చిత్తశుద్ధి ఉంటే మహిళల కు స్పెషల్ బస్సు వేయాలి

ఇచ్చిన ఏ ఒక్క హామీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేక పోతోంది
– రైతుబందు ఇస్తామన్నారు ఇచ్చారా.? ఇవ్వలేదు.
– రుణ మాఫీ ఇవ్వలేదు
– మహిళలకు భృతి ఇవ్వలేదు ఇచ్చిన మాట నిలుపుకొని రేవంత్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు

కానీ మోదీ మాట ఇస్తే అమలు చేసి తీరుతాడు.

– అయోధ్యలో రామ మందిరం కట్టించాం
– నిరుపేదలకు రేషన్ బియ్యం ఇస్తున్నాం
– కరోనా కష్టం కాలం లో ఆదుకున్నాం
– ఉచితంగా వాక్సిన్ ఇచ్చాము

మరి ఇన్ని ఇచ్చిన మోదికి ఓటు వేసి ఋణం తీర్చుకోవాలి.

ఇక్కడ అరుణమ్మ అక్కడ మోదీ గెలుస్తుంది అని కాంగ్రెస్ బేదిరింపులకు దిగుతోంది.

ఇక్కడ అరుణమ్మ ఉంటే వీళ్లకు ఎందుకంత భయం.. నిజాలు మాట్లాడుతదనా.

జుటా మాటలు చెప్పి… అరు గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చింది రేవంత్ సర్కార్..

అరుణమ్మ ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.

ఇలాంటి సన్యాసులకు కొంచమైనా సిగ్గుండాలి..

దమ్ముంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలి..

ఆనాడు అరుణమ్మపై కుట్రలు చేసిండు ఒక కాంగ్రెస్ పెద్ద మనిషి జైపాల్ రెడ్డి..

ఇప్పుడు వాళ్ల అల్లుడు రేవంత్ కుట్రలు చేస్తున్నారు.

కాంగ్రెస్ తరపున పోటీ చేస్తూన్న కాండిడేట్ కు ఈ ఊరు తెల్వదు.. ఇక్కడి సమస్యలు తెలియవు..

కానీ ఈయన వచ్చి ఇక్కడ ఉద్ధరిస్తాడంట..

కల్వకుర్తి నుంచి వచ్చి వాళ్లు రాజకీయాలు చేయుచ్చు కానీ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన మనమిక్కడ పోటీ చేయొద్దు అంట.

ఉన్న ఊరిని బాగు చేయనోడు మన ఊరిని ఎలా బాగు చేస్తాడు..

ఒక ఆడబిడ్డపై కుట్రలు క్యూస్తున్న సన్యాసులకు సిగ్గు ఉండాలి.

ఒక అడబిడ్డకు విలువ ఇవ్వనోడు మనిషే కాదు..

బడే భాయ్..చోటేభాయ్ కలిసి హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు కుట్ర చేస్తారు

కాంగ్రెస్,బీజేపీ లను నమ్మి ప్రజలు ఆగం కావొద్దు

ఇప్పటికే ఆరు గ్యారెంటీలను నమ్మి ఆగమయ్యారు

కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్

కమలాపూర్ మండలం శనిగరం లో రోడ్ షో

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)ఆరు గ్యారెంటీలు ఇస్తామని ఉత్తమాటలు.. ఉద్దెరహామీలు ఇచ్చిన కాంగ్రెస్ ను నమ్మి ఇప్పటికే ప్రజలు మోసపోయి గోస పడుతున్నారని… మళ్లీ ఇప్పుడు బీజేపీ మాటలు నమ్మి మరో సారి ప్రజలు మోసపోతే ఇక్కడ చోటే భాయ్ రేవంత్ రెడ్డి…ఢిల్లీలో బడే భాయ్ నరేంద్రమోదీ కలిసి హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు కుట్రలు చేస్తారని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.హుజురాబాద్ నియోజకవర్గములోని కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో సోమవారం రోడ్ షో కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ నదుల అనుసంధానం పేరుతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందని,గోదావరి నీళ్లను కృష్ణ నది మీదుగా కావేరి నదిలో కలిపి తమిళనాడు కు తరలించే కుట్రలు చేస్తుందని అన్నారు.తెలంగాణ లోని గోదావరి నీళ్లను ఎత్తుకుపోవడానికి ఏమన్నా నరేంద్రమోదీ సొమ్ము కాదని అన్నారు.
గోదావరి నీళ్లను తమిళనాడు కు పట్టుకుపోవడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, గోదావరి నీళ్లు తమిళనాడు కు పోతే తెలంగాణ ఎడారి అవుతుందని,నీళ్లను కాపాడుకోవడానికి పార్లమెంట్ లో ప్రశ్నించే గళం కావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థినైనా తనని గెలిపించాలని వినోద్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.తెలంగాణ లోని 33 జిల్లాల్లో ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల ఉండాలి,కానీ తొమ్మిది పూర్వపు జిల్లాల్లోనే ఉన్నాయని..ఇంకా 23 నవోదయ పాఠశాలలు ఏర్పాటు కాలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా కూడా ఒక్క నవోదయ పాఠశాల తేలేక పోయారని అన్నారు.బీజేపీ పదేళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో తెలంగాణ కు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు.2014నుంచి 2019 వరకు తాను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ కు వెయ్యి కోట్లతో స్మార్ట్ సిటీ, కొత్తపల్లి-మనోహరబాద్ రైల్వే లైన్, కరీంనగర్ లో 50 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణం చేయించడం ప్రారంభించామన్నారు.
జాతీయ రహాదారులు కూడా తీసుకువచ్చానని పేర్కొన్నారు.కమలాపూర్
ఉప్పల్ దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని ఐదేల్లలో ఎంపీ గా ఉండి బండి సంజయ్ పూర్తి చేయించలేకపోయారని విమర్శించారు.ఐదేళ్లుగా ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఒక్క గుడి తేలేదు..ఒక్క బడి కూడా తేలేదని విమర్శించారు.
రాబోయే తరాలు బాగుండాలి. .పిల్లల భవిష్యత్ కోసం కేసీఆర్ గారు ఆలోచన చేసి
33 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి నూట యాబై రోజులు అవుతున్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అర గ్యారెంటీ కూడా అమలు చేయలేదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండేళ్లకు ఒక్క సీఎం మారుతడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ రద్దయ్యేది తెలీదు…
ఎప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడేది తెలువదని నిశితంగా విమర్శించారు.

పనిచేసే ఎంపి కావాలి బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ ఎస్ వి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ పనిచేసే ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ 2014 ఎలక్షన్ లో కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా గెలుపొంది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన అన్న వినోద్ కుమార్.నీ గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఎంపీగా ఉన్న సందర్భంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అలాగే తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని కేసీఆర్ వేన్నటి ఉండి అనేక ఉద్యమాలు చేశారని అభివృద్ధిలో కరీంనగర్ స్మార్ట్ సిటీగా ఏర్పడడానికి కృషి చేశారని కొత్తపల్లి నుండి మనోహరాబాద్ రైల్వే స్టేషన్ లైన్ ఏర్పాటు చేయించారని వేళ్ళకోట్లతో రహదారులు విస్తరింప చేశారని అంతేకాకుండా కొండగట్టు ఆలయ అభివృద్ధి కొరకు 330 ఎకరాల గవర్నమెంట్ భూమిని దేవాలయానికి అప్పజెప్పడం జరిగిందని అంతేకాకుండా నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత తనకే దక్కుతుందని పార్లమెంట్లో తెలంగాణ తరఫున ప్రశ్నించిన గొంతుకు వినోద్ అన్నాఅని ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గెలిచి ఐదు సంవత్సరాలు అయినా కూడా ఏమీ అభివృద్ధి చేయలేదని సిరిసిల్ల నేతన్నలకు గాని వేముల రాజన్న దేవాలయం గాని రూపాయి కూడా తీసుకురాని వ్యక్తి బండి సంజయ్ అని మళ్లీ ఏమి పెట్టుకొని ఓటు అడగడానికి వస్తారని కాంగ్రెస్ మాయమాటలకు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని ఎవరో ముక్కు ముఖం తెలియని దమ్మి అభ్యర్థులు పెట్టి బిజెపి కాంగ్రెస్ కుమ్మక్కై రాజకీయ దెబ్బతీయాలని చూస్తున్నారని ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన కరీంనగర్ లో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని కరీంనగర్ ప్రజలు విద్యార్థులు నిరుద్యోగులు యువత మహిళలు అన్న వినోద్ కుమార్ వెంటనే ఉన్నారని వినోద్ కుమార్ అన్నను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్ నవీన్ రాకేష్ కూడా వెంకటేష్ ఒగ్గు అరవింద్ రోహిత్ నవీన్ సందీప్ తదితరులు పాల్గొన్నారు

అంబెడ్కర్ కూడలిలో ఆరూరి కరపత్రాల ఆవిష్కరణ

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణ కేంద్రం అంబేద్కర్ సెంటర్లో బిజెపి పార్లమెంట్ అభ్యర్థి ఆలూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ప్రచార కరపత్రం ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెస్పీ రాష్ట్ర నాయకులు వేల్పుల సూరన్న మున్నూరుకాపు
పరకాల నియోజకవర్గం ఇంచార్జ్ మంద రాజు మాదిగలు ముఖ్యఅతిథిగా పాల్గొని కరపత్రం ఆవిష్కరించారు.అనంతరం పరకాల పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ రాజుపేట 18,19 వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ మాదిగల చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణకు బిజెపి ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి మాదిగలు ఏకతాటిపై కొచ్చి మాదిగలకు విలువ నిచ్చే పార్టీలకు ఓటు వేయాలని ఎస్సీ వర్గీకరణ సాధించుకునే అంతవరకు బిజెపి పార్టీ కి మద్దతుగా ప్రచారం నిర్వహించి బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల నాయకులు అహర్నిశలు కృషిచేసి వారిని గెలిపించాలని ఇప్పటికే కాంగ్రెస్
బిఆర్ఎస్ పార్టీలు మాదిగల మోసం చేసి ఇప్పటివరకు మాదిగలకు ఎంపీ టికెట్లు కూడా కేటాయించని పార్టీలను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నాయకులు,ముఖ్యర ముఖేష్ మాదిగ ఎమ్మెస్ఎఫ్ రాష్ట్ర నాయకులు,ఎమ్మెస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు బొచ్చు ప్రశాంత్ మాదిగ,బుర్ర మహిపాల్ మాదిగ,శాయంపేట ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కోకిల సమ్మయ్య మాదిగ,గోవింద సదయ్య మాదిగ,మొలుగూరి భాను మాదిగ,కోయిల రాకేష్ మాదిగ, బుర్ర బాబు,బుర్ర రాజేష్, గోవింద రాజు మాదిగ,గోవిందా సుభాష్ మాదిగ,మరియు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు చాడ రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక.

వీణవంక ,(కరీంనగర్ జిల్లా).

నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని వల్బాపూర్ గ్రామానికి చెందిన చాడ రాజేందర్ రెడ్డి గత తెలంగాణ ఉద్యమం నుండి అహర్నిశలు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తి ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వీరి వెంట వల్బాపూర్ మాజీ సర్పంచ్ ఎక్కటీ రఘుపాల్ రెడ్డి ఎంపీటీసీ జీడి ధవేందర్ పోరెడ్డి తిరుపతి రెడ్డి, కాల్వల సదాశివరెడ్డి, గట్టయ్య, కామిడీ శ్రీపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించండి

సిపిఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిదాత్రి :
ప్రపంచ కార్మిక దినోత్సవం138వ మేడే ను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కొమరం సీతారాములు, అరేం నరేష్ లు పిలుపునిచ్చారు
సోమవారం మండల కేంద్రంలోని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టియు) ముద్రించిన మేడే పోస్టర్ను ఆవిష్కరణ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో అనేక రకాలైన ప్రభుత్వ సంస్థలు ఎల్ఐసి, ఎయిర్ పోర్టులు, ఓడరేవులు, రోడ్డు మార్గాలను ప్రైవేట్ కంపెనీలైన ఆదాని,అంబానీ తదితర కుబేరులకు అప్పనంగా కట్టబెట్టిందని, ఈ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులను రోడ్డుపాలు చేసిందని విమర్శించారు.
అనేక పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్రులు విభజించి కార్మికులకు తీరని ద్రోహం చేసిందని అన్నారు.
త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మతతత్వ ఆర్ఎస్ఎస్,బిజెపి అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు పర్శకరవి, ఈసం కృష్ణన్న,గడ్డం లాలయ్య, పాయం ఎల్లన్న, ఎట్టి గాదెయ్య, కల్తీ నరసన్న గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు చింత నరసన్న,మెంతిని నగేష్, తదితరులు పాల్గొన్నారు.

ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

– మే 3 నుంచి జూన్ 3 వ తేదీ వరకు

– కలెక్టర్ అనురాగ్ జయంతి
రాజన్న సిరిసిల్ల స్టాఫర్/ ఏప్రిల్ 29, 2024(నేటి ధాత్రి):

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉచితంగా అందించనున్న వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. మే 3వ తేదీ నుంచి జూన్ 3
వ తేదీ వరకు శిక్షణ కొనసాగనుందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారి ఆదేశాలతో జిల్లా యువజన క్రీడల శాఖ వారి ఆధ్వర్యంలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణ ప్రాంతములో వేసవి క్రీడా శిక్షణ శిబిరములో భాగంగా తేది: మే 03 నుంచి జూన్ 3వ తేదీ దాకా 2024. జిల్లాలో నీ బాల బాలికలకు ఈ క్రింది క్రీడాంశాలలో ఉచితముగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈ క్రింది విభాగాల్లో శిక్షణ:
కరాటే,  యోగ,  వాలీబాల్,  టేబుల్ టెన్నిస్, షటిల్ బాడ్మింటన్,  క్రికెట్, బాస్కెట్ బాల్. విలు విద్య (ఆర్చరీ)
కబడ్డీ, అథ్లెటిక్స్ లో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.
ఆయా క్రీడలో ఉదయము 6.00 గంటల నుంచి 8.00 గంటల వరకు అలాగే సాయంత్రం 5.00 గంటల నుంచి 7.00 గంటట వరకు ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ( నాన్ రెసిడెన్సియల్) సిరిసిల్ల పట్టణములోని రాజీవ్ నగర్, మినీ స్టేడియంలో  కొనసాగుతాయని సూచించారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు 90594 65889, 75692 07411 లో సంప్రదించాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఏ రాందాస్ కోరారు.

గ్రామాల్లో గంజాయి కల్తీకల్లు నిర్మూలిద్దాం పోస్టర్ ఆవిష్కరణ

ఎస్సై ప్రమోద్ కుమార్

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలం ఎస్ఐ ప్రమోద్ కుమార్ మరియు తన సిబ్బంది మండలంలోని అన్ని గ్రామాలకి వెళ్లి గ్రామ కూడలి బస్టాండులో గంజాయి మరియు కల్తీకల్లు నిర్మూలన గురించి వాల్ పోస్టర్లు అతికించి మండల ప్రజలని ఎవరైనా గంజాయివిక్రయించినకల్తీకల్లు అల్ప్రోజలం మరియు డైజొఫామ్) కలిపిన కల్లును విక్రయించిన డయల్ 100, తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్ బ్యూరో 8712671111 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని చెబుతూ సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, గంజాయి వాడకం జిల్లా నుండి మండలం నుండి పల్లెలకుచాప కింద నీరులా కూడా పాకిందని యువత తల్లిదండ్రులు ఇప్పుడు కూడా వారి పిల్లల్ని గమనిస్తూ ఉండాలని గంజాయి తాగే వారిలో మత్తు అనేది నరాల వ్యవస్థ పై పని చేస్తుందని ఇంత ముందు ఎప్పుడు లేని విధంగా విపరీతమైన ఆకలి విపరీతమైన నవ్వు వస్తుంటాయని ఇటువంటి మార్పులు ఏవైనా చోటు చేసుకుంటే వెంటనే సంప్రదించాలని వారికి అవసరానికి మించి డబ్బులు ఇవ్వకూడదని తెలుపుతూ ప్రస్తుతం గంజాయిని అనేక రకాలుగా చాక్లెట్ల రూపంలో మిల్క్ షేక్ ల రూపంలో అమ్ముతున్నారు కనుక తల్లితండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు, గ్రామాలలో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్న సమాచారం ఉన్న సేవిస్తున్న సమాచారం ఉన్న వెంటనే తెలియపరచాలని మన యువతను రక్షించుకోవా ల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

వైరా ఎమ్మెల్యే చోరువతో గుడి తండాలో మంచి నీటి సమస్యను పరిష్కరించిన అదికారులు.

కారేపల్లి నేటి ధాత్రి

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాణిక్యారం గుండి తండాలో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మిషన్ భగిరద పైప్ లైన్లు వేసి గేట్ వాల్ ను మట్టితో మూసి వేసి నారని మంచి నీళ్ళు రాక గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రామంలో కి వచ్చిన అదికారులను గ్రామ ప్రజలు నిలదీసినారు అట్టి విషయం ను పై అదికారులు తో మాట్లాడి పరిష్కారం చెస్తామని తెలిపారు అట్టి విషయం ను అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైరా నియోజకవర్గం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కి తెలియపర్చగ ఎమ్మెల్యే చోరవతో వెంటనే అదికారులకు తెలిపారు స్పందించిన అదికారులు మాణిక్యారం గ్రామపంచాయతీ గుడి తండా గ్రామంలో మిషన్ భగిరద వాటర్ ట్యాంక్ వద్ద ఎర్పాటు చేసి నీల్లురాకుండా పైప్ లైన్ కనేక్షన్ వాల్ మూసి వేసి మట్టితో పూడ్చిన దాన్ని స్పెషల్ ఆఫీసర్ గ్రామ కార్యదర్శి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రజలను కలిసివారి సహకారంతో వాల్ చుట్టు ఉన్న మట్టి ని తోలగించి గ్రామ ప్రజలకు ఉన్న మంచి నీటి ఎద్దడిని పరిష్కరించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో బానోత్ జెత భూక్యా కోండయ్య దాంతోజు రామాచారి భూక్యా హర్ధు భూక్యా పిచ్చ్యి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, మల్లన్న’ను” భారీ మేజార్టీతో గెలిపించండి.

పట్టభద్రుల గళాన్ని చట్టసభల్లో వినిపించండి.

హన్మకొండ :వాజేడు మండలం ధర్మవరం గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా స్థానిక గ్రామంలో’ని పట్టభద్రుల’తో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశానికి తీన్మార్ మల్లన్న టీమ్ ములుగు జిల్లా ఇంఛార్జీ అచ్ఛునూరి కిషన్ మాట్లాడుతూ
మే 27,న జరిగే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో నిరుద్యోగుల, పట్టభద్రుల, ప్రజా గొంతుక, మన అభిమాన నాయకుడు తీన్మార్ మల్లన్న’ను భారీ మేజార్టీతో గెలిపించి మన గళాన్ని చట్టసభల్లో వినబడలంటే ప్రతి ఒక్కరు కంకణబద్దులై ఉండాలి అని నెల రోజులు మల్లన్న గెలుపు కోసం కృషి చేస్తూ, మిగితా నాలుగు సంవత్సరాలు మీ గొంతుకగా, మీలో ఒక్కడిగా మీ సమస్యల సాధనకై, పట్టభద్రుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాడని హామీ ఇస్తున్నాం. కావున మీరందరూ మల్లన్న గెలుపులో కీలక పాత్ర పోషించాలన్నారు.

అనంతం పేరూరు ఎస్.ఐ రమేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా’తో సన్మానించి రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మీ వంతు సహకారం కావాలని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో..బొల్లె రమేష్, మత్యబోయిన ప్రసాద్, గౌరారపు సర్వేశ్వరుని రావు, కర్రి సంతోష్, ఏలేటి రవికుమార్, విక్రమ్, విద్యాసాగర్, దేవా, అశోక్, రాజాబాబు, నాగేశ్వరరావు, బార్గవచారి, జనార్ధన్ రావు, రాము, సంతీష్, వెంకటేష్, శ్రీకాంత్, శివకుమార్, రామారావు తదితరులు పాల్గొన్నారు.

అంత్యక్రియలకు ఆర్ధికసాయం అందజేసిన పెగళ్ళపాటి లక్ష్మినారాయణ

వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి :

గీసుకొండ మండలకేంద్రానికి చెందిన చినగారి రాజు అనే వ్యక్తి తీవ్ర కిడ్నీవ్యాధితో బాధపడుతూ శనివారం రాత్రి నిమ్స్ ఆస్పత్రిలో మరణించారు. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో మృతుని అంత్యక్రియల నిర్వహణకు సహాయార్థం గీసుకొండ గ్రామానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మినారాయణ మానవత్వంతో స్పందించి రూ.5 వేల నగదు సహాయాన్ని పంపగా ఆ నగదును మాజీసర్పంచ్ దౌడు బాబు, గీసుకొండ సోషల్ సర్వీస్ టీమ్ సభ్యులు కర్ణకంటి రాంమూర్తి, ముల్క సత్యనారాయణ కలిసి మృతుని కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికులు పోలీసు కానిస్టేబుల్ చినగారి రాజు, మేకల మోహన్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version