`కాంట్రాక్టర్లను బిచ్చగాళ్లను చేసిన ద్రోహి?
`పిలిచి మరీ మోసం చేసిన పాపి?
`పేదల బతుకులతో ఆటలాడుకున్న దుర్మార్గుడు?
`కుటుంబాలలో చిచ్చు పెట్టిన నీచుడు?
`హాయిగా సాగుతున్న జీవితాలను వీధిపాలు చేసిన స్వార్థపరుడు?
`నిత్యం నీతులు చెప్పే నయ వంచకుడు?
`కష్టం చేసిన వారి ఉసురు పోసుకున్న కర్కోటకుడు?
`నమ్మించి మోసం చేసిన నయవంచకుడు?
`పార్లమెంటు సభ్యుడై వుండి అన్యాయానికి ఒడిగట్టిన పాపాత్ముడు?
`ఈ తిట్లన్నీ బాధితుల కడుపుమంటలు.
`బిల్లులు అడిగితే కేసిఆర్‌ను అడుక్కోపో అంటున్నాడు?
`ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో…అని బెదిరిస్తున్నాడు?
`కొండా బాధితులంతా ఏకమౌతున్నారు.
`చెవెళ్లకు వెళ్ళి కొండా బండారం బైటపెట్టేందుకు సిద్దమౌతున్నారు.
`ఇంటింటికీ ప్రచారం కొండా నయవంచన చెబుతామంటున్నారు.
`ప్రజా ద్రోహికి ఒక్క ఓటు పడకుండా ప్రచారం సాగిస్తామని హెచ్చరిస్తున్నారు?
`రోజు రోజుకూ కొండా బాధితులు వెలుగులోకి వస్తున్నారు.
`నేటిధాత్రితో తమకు జరిగిన అన్యాయం వివరిస్తున్నారు.
`మాకు అండగా నిలవాలని కోరుతున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
వంచనకు మారు పేరు కొండా? నయవంచనకు రూపం కొండా? విషం నిండిన మనస్తత్వం కొండా? నమ్మించి మోసం చేయడంలో దిట్ట కొండా? మాటలు తీయగా, చేతలు చేదు గులిక కొండా? ప్రజా సేవ చేస్తానని గెలిచి ప్రజలను మోసం చేసిన కొండా? ప్రజా సేవ వదిలేసి కాంట్రాక్టులు చేసి ఆస్ధులు కూడబెట్టుకున్న కొండా? తన సంపాదన కోసం సామాన్యులను వాడుకొని వదిలేసిన స్ధార్ధపరుడు కొండా? గెలిపించిన ప్రజలను గాలికొదిలేసి, ఐదేళ్లు ప్రజల కంటికి కనిపించని కొండా? తనంత సుద్దపూస మరొకరు లేరంటూ నిత్యం నీత పలుకులు వచించే వ్యక్తి కొండా? ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కొండా? టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీకే వెన్ను పోటు పొడిచిన నాయకుడు కొండా? మేక వన్నె పులిలా, తన కాంట్రాక్టుల కోసం అమాయకులైన వారిని నిండా ముంచిన ద్రోహి కొండా? ఇతర కంపనీలలో పనిచేస్తుంటే, నమ్మించి తన కంపనీకి వాడుకొని మోసం చేసిన దగుల్భాజీ కొండా? తన మాటలు నమ్మినందుకు అభాగ్యులను వీధి పాలు చేసిన కొండా? హాయిగా సాగుతున్న తమ జీవితాలలో తుఫాను రేపిన కొండా? తమను అడుక్కుతినేలా చేసిన కొండా? అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నది ఎవరో కాదు.. చెవెళ్ల ఎంపిగా బిజేపి తరుపున పోటీ చేస్తున్న అభ్యర్ధి కొండా విశ్వేశ్వరరెడ్డి బాధితులు. ఆయన వల్ల నష్టపోయిన వాళ్లు…ఆయన వల్ల సర్వస్వం కోల్పోయి రోడ్డున పట్ట కుటుంబాలు చెబుతున్న మాటలు.
ఇలాంటిద్రోహి మరొకరు వుండరంటూ నేటిధాత్రిని ఆశ్రయిస్తున్న కొండా బాదితులు..
వారు చెబుతున్న మాటలు వింటుంటే ఎంతటి కర్కషమైన గుండెలు కూడా ఆవిరి కావాల్సిందే. వారు ప్రస్తుతం పడుతున్న బాదలు వింటుంటే ఎవరికైనా కనీళ్లు కట్టలు తెంచుకొని రావాల్సిందే..అంతలా కొండా విశ్వేశ్వరరెడ్డి మూలంగా నష్టపోయారు. ఒకరు కాదు..ఇద్దరు కాదు. దాదాపు ముప్పై మందిని ఒక్క సిద్దిపేట జిల్లాలోనే మోసం చేశాడంటే, తెలంగాణ వ్యాప్తంగా కొండా ఎంతమందిని మోసం చేశాడో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తి వల్ల సర్వం కోల్పోయి వీధినపడ్డ ఒక్కొక్కరి జీవితాలు దినదిన గండంగా సాగుతున్నాయి. కొండావిశ్వేశ్వరరెడ్డిని నమ్ముకొని వారసత్వంగా వచ్చిన ఆస్ధులు అమ్ముకున్న వాళ్లున్నారు. రాత్రనక పగలనక కష్టపడి సంపాదించి పైసా పైసా కూడబెట్టుకున్న సొమ్ము కూడా కొండా పాలైంది. చిన్నా చితక పనలు చేసుకుంటూ అప్పులు చేసి కొనుక్కున్న ట్రాక్టర్లు పోయాయి. జేసిబిలు అమ్ముకున్నారు. చేసిన అప్పులకు వడ్డీల మీద వడ్డీలు, చక్రవడ్డీలు కడుతున్నారు. కట్టుకోలేక క్షణ క్షణం అప్పుల్లో తిట్లతో నరకం అనుభవిస్తున్నారు. ప్రశాంతంగా సాగుతున్న తమ జీవితాల్లో కొండా వచ్చి కల్లోలం సృష్టించాడు. అంటూ బాధితులు ఆర్తనాదాలు పెడుతున్నారు. అరిగోస పడుతున్నారు. తినేందుకు తిండి లేని బతుకులై దీనంగా రోదిస్తున్నారు. ఒకప్పుడు కనీసం సమాజంలో పరువుతో బతికిన వాళ్లు కొండా మూలంగా తమను తాము దాచుకొని బతకాల్సివస్తోంది. అప్పులోల్లను చూసి భయం, భయంగా బతుకుతున్నారు. వారు తిడుతున్న తిట్లను తింటూ, జీవచ్చవాలుగా బతుకుతున్నారు. చేసిన పనులకు ఇవ్వాల కాకపోతే, రేపు సొమ్మురాకుండాపోతుందా? అని ఎదరుచూస్తున్న బాదితులకు ఇక రూపాయి ఇచ్చేది లేదు అంటూ కొండా విశ్వేశ్శరెడ్డి సమాదానం చెబుతున్నాడు. మీ దిక్కున్న చోట చెప్పుకో పొండి అంటున్నాడు. వారి కష్టంతో ఆస్ధులు కూడబెట్టుకున్నాడు. అటు ప్రభుత్వ బిల్లులు వసూలు చేసుకున్నాడు. ఇటు సబ్ కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకున్నాడు. ఆఖరుకు వారు పెట్టిన పెట్టుబడిని కూడా దిగిమింగి కూర్చుకున్నాడు. మొత్తంగా కొండాను నమ్మినందుకు బాదితుల జీవితాలు వీధి పాలు చేశాడు. వారి జీవితాల్లో చీకట్లు నింపాడు. వారి బతుకులు ఆగం చేశాడు.
అలాంటి కొండా విశ్వేశ్వరెడ్డి బాధితుల్లో ఒకరు రమేశ్. ఉమ్మడి నల్లగొండ జిల్లా గుండాల మండలానికి చెందిన నివాసి.
మిషన్ భగీరథ పనుల్లో రమేశ్ చూపిస్తున్న చురుకుదనాన్ని చూసి, కొండా విశ్వేశ్వరరెడ్డి పిలిపించుకున్నాడు. తాను సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్ధకు కాకుండా నేరుగా మా ఎవరెస్టు కంపనీలోనే సబ్ కాంట్రాక్టు ఇస్తాను తీసుకో..అంటూ నమ్మించాడు. నయ వంచన చేశాడు. రమేశ్ లాంటి సబ్‌కాంట్రాక్టర్లు చేస్తున్న పనిని చూపించుకొని కొండా ప్రభుత్వం నుంచి బిల్లులు వసూలు చేసుకున్నాడు. సబ్ కాంట్రాక్టర్లకు మాత్రం మొండి చేయి చూపించాడు. కనీసం వారు పెట్టిన పెట్టుబడి కూడ ఇవ్వకుండా నిండా ముంచేశాడు. అప్పటికే సమాజంలో కొంత పేరు పరపతి వున్న రమేశ్ గుండాలలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవించేవారు. అలాంటి వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డిని నమ్మి సర్వం కోల్పోయాడు. బతుకే దినదిన గండంగా మారిపోయి బతుకుతున్నాడు. తనకు వారసత్వంగా వచ్చిన భూములు అమ్ముకున్నాడు. తాను కొనుక్కున్న ప్లాట్లు అమ్ముకున్నాడు. తనకున్న ట్రాక్టర్లు అమ్ముకున్నా అప్పులు తీరలేదు. ఆఖరు రమేష్‌కువున్న రెండు జేసిబీలు కూడా అమ్ముకున్నాడు. ఇప్పుడు కూలీగా మారిపోయాడు. భార్యా భర్తలిద్దరూ కూలీ పనులు చేసుకుంటున్నారు. ఒకప్పుడు పది మందికి పని కల్పించే స్ధాయిలో వున్న రమేష్, ఇప్పుడు తనకు ఎవరు పని కల్పిస్తారా? రోజు వారి కూలికి ఎవరు పిలుస్తారా? అని ఎదురుచూస్తున్నాడు. కొండా పుణ్యమా? అని రమేశ్ సతీమణి కూడా ఇప్పుడు కూలీ పనికి వెళ్లాల్సిన దుస్తితి ఏర్పడిరది. ఒకప్పుడు రమేశ్‌కుమారుడు ఇంటర్‌మీడియేట్ కార్పోరేట్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతుండేవాడు. కొండా మూలంగా ఇరవై ఏళ్లుగా సంపాదించుకున్న సంపాదన రెండేళ్లలో ఊడ్చుకుపోయింది. తన కుమారుడు ఇంటర్మీడియేట్ రెండో సంవత్సరం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకోవాల్సివచ్చింది. ఆ అబ్బాయి కూడా సెలవు రోజుల్లో కూలికివెళ్లాల్సిన పరిస్ధితికి రమేష్ జీవితం దిగజారిపోయింది. ఇది ఒక్క రమేష్ జీవితమే కాదు..కొండాను నమ్మినందుకు ఆయన మాటలకు మోసపోయిన ఎంతో మంది జీవితాలు ఇంతకన్నా దుర్భరంగా మారిపోయాయి.
కొండా విశ్వేశ్వరరెడ్డి దురహంకారం ఎంత పరాకాష్టకు చేరిందంటే బాధితుడైన రమేశ్ ఫోన్‌ను బ్లాక్ లిస్టులో పెడతా? అంటూ బెదిరింపులకు గురిచేశారు.
పదే పదే చేస్తే మర్యాదగ వుండదని హెచ్చరించారు. ఎవరెస్టు కంపనీలో బాద్యులకు ఫోన్ చేస్తే లిప్ట్ చేయడం లేదని పలుసార్లు ఫోన్ చేస్తే సహించమంటూ హుకూం జారీచేశారు. మా పైసలు మాకిస్తే మేంమెందుకు ఫోన్ చేస్తామంటే, సిఎం కేసిఆర్ నెంబర్ ఇస్తాం వసూలుచేసుకో..అంటూ ఫోన్‌లో దురుసుగా ప్రవర్తించారు. ఇలా అయితే బాగా లేదని రమేశ్ బంజారాహిల్స్‌లో వున్న ఎవరెస్టు కార్యాలయానికి వెళ్తే, మరోసారి వస్తే మంచిగా వుండదంటూ దాడి చేసి కొట్టే ప్రయత్నం చేశారు. చివరికి తెలంగాణ తొలి అమరుడు స్వర్గీయ శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మకు తనకు జరిగిన అన్యాయం రమేశ్ వివారించాడు. ఆమె సైతం రమేశ్‌కు డబ్బుల కోసం కూడా ప్రయత్నం చేసింది. అప్పటి మంత్రి, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావును రమేశ్ కలిశారు. ఆ సమయంలో హరీష్‌రావు ఫోన్ చేస్తే బిల్లులు ఇస్తామంటూ సమాధానం చెప్పడం, తర్వాత కొండా అనుచరులు రమేశ్‌ను బెదిరించడం మొదలుపెట్టారు. ఒక దశలో వారి బెదిరింపులకు వెరవకుండా, శంకరమ్మను తీసుకొని ఎవరెస్టు కంపనీకి వెళ్లడంతో కొంత అమౌంట్ కు చెక్ ఇచ్చారు. అది బౌన్స్ అయ్యింది. చెక్ బౌన్స్ అయ్యిందని రమేశ్ ప్రశ్నిస్తే సమాదానం చెప్పాల్సింది పోయి, తిరిగి న్యూసెన్స్ కేసు నమోదు చేయిస్తాంటూ బెదిరించారు. కాటారం మండలంలో వున్న ఒక కొండ మీద మిషన్ భగీరధ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం ఎవరూ చేయలేమంటూ చేతులెత్తేసినా, ఎంతో కష్టపడి రమేశ్ నిర్మాణం చేశాడు. అందుకు ఆయన అదనంగా కొంత ఖర్చు చేసుకున్నాడు. ఎవరెస్టు కంపనీకి పేరు వచ్చేలా చేశాడు. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా కొండా విశ్వేశ్వరరెడ్డి మోసం చేసి, రమేశ్ జీవితాన్ని చిదిమేశాడు.
ఇటీవల కొండా వల్ల నష్టపోయిన బాదితులంగా ఏకమై, చెవెళ్ల ప్రచారానికి వెళ్లేందుకు సిద్దపడుతున్నారు.
గతంలో కొండా విశ్వేశ్వరరెడ్డి సుద్దపూసలాగా హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు బాధితుడు బాలసుబ్బయ్య పెద్దఎత్తున కరపత్రాలు పంపణీ చేశాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి అసలు స్వరూపం, వికృత రూపం మొత్తం బైటపెట్టాడు. ఇప్పుడు కొండా వ్యతిరేకులంతా చెవెళ్లకు వెళ్లి, ఊరూరు తిరిగి, కొండాకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు భయలుదేరుతున్నారు. కొండాను ఓడిరచి తమ కసిని తీర్చుకుంటామంటున్నారు. కొండాను వదిలిపెట్టే ప్రసక్తి లేదని శపధం చేస్తున్నారు. పేదలే కదా? అని చిన్న చూపు చూసి వారి కష్టం దోచుకొని, వారి ఆస్ధులు పోగొట్టుకునేలా చేసిన కొండాను ఎట్టిపరిస్ధితుల్లో చెవెళ్లలో ఒక్క ఓటు పడకుండా ప్రచారం చేస్తామంటున్నారు.