నల్లబెల్లి, నేటి ధాత్రి:
త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ భాజపా అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ గెలుపు కోరుతూ శుక్రవారం మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో సీతారాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించి దేశంలో మరొకసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గెలుపుకై ప్రతి ఒక్కరు తమ ఓటు ద్వారా సహకరించి దేశ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో మండల ఇన్చార్జి మల్యాల వినయ్ కుమార్, రేసు శ్రీనివాస్, కట్ట రామచంద్ర రెడ్డి, పెరుమాండ్ల కోటి, సుదగాని ప్రమోద్ గౌడ్, చుక్క శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.