భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలంలో కొత్తగూడెం నియోజకవర్గ టిపిసిసి సభ్యులు జేబీ శౌరి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది….
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు అందరూ ముక్తకంఠంతో అధికారం పార్టీలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని గోడు వెళ్లబోతున్నారు..
ఆనాడు బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక రకాల ఉద్యమాలు కార్యక్రమాలు చేసి నేడు అధికార పార్టీలో గుర్తింపు నోచుకోక సొంత పార్టీలోనే చులకన భావం ఎక్కువైపోయిందని నిరుత్సాహ చెందారు
ఈ సందర్భంగా కార్యకర్తల్లో ముఖ్యకంఠంతో పెత్తనం ఎక్కువైనప్పుడు ప్రతగించడం తప్పదని త్వరలోనే కార్యచరణ ప్రకటిస్తామని తెలియజేశారు..
టిపిసిసి ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉన్నామని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది…
ఈ కార్యక్రమంలో భద్రాది కొత్తడం జిల్లా ఓబీసీ అధ్యక్షులు అల్లాడి నరసింహారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్ఎస్ఈ అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్, కొత్తగూడెం నియోజకవర్గం అధ్యక్షులు గడ్డం రాజశేఖర్, కొత్తగూడెం నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ గౌస్, కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుమ్మడి శ్రీనివాస్. మరియు తదితరులు పాల్గొన్నారు