అకాల వర్షంతో వరి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

మాజీ పిఎసిఎస్ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని గణపురం మండల మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాట్లాడుతూ
అకాల వర్షాలతో, జిల్లాలోని అన్ని మండలాల్లో వరి పంట గాలికి పూర్తిగా నెలకోరిగి, దెబ్బ తిన్న వరి పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలని అన్నారు.
ఎమ్మెల్యే పార్టీలో చేరికలపై ఉన్న శ్రద్ధ రైతులపై కొంచెం రైతులపై పెట్టి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి నష్టపరిహారం వచ్చేలా సహకరించాలని, లేని పక్షంలో రైతులను సంఘటితం చేసి జిల్లాలో నష్టపరిహారం కోసం పోరాటం చేస్తామని అన్నారు
ఇప్పటికే రైతుబంధు, రుణమాఫీ లేక రైతులు ఆందోళన చెందుతున్న సమయంలో రైతుల పై గాలి వర్షం పిడుగుపడినట్లు అయిందని పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు

మూడోవ సారి ప్రధానిగా మోడీని గెలిపించండి

బిజెపి మండల అధ్యక్షుడు దుగుట రాజ్ కుమార్

జైపూర్, నేటి,ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నర్వా,జైపూర్ గ్రామాలలో బుధవారం రోజున బిజెపి మండల అధ్యక్షుడు దుగుట రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గోమాస శ్రీనివాసుని లక్ష కోట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి ఓటేసి హిందూ ధర్మాన్ని కాపాడాలని ప్రజలను కోరారు. ప్రతి గ్రామం లో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గా ఉండి తీస్కోచ్చారు. బిజెపి కి ఓటు వేసి గెలిపిచల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు. మరియు నూతనంగా జైపూర్ మండల అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించిన దుగుట రాజ్ కుమార్ ను జైపూర్ మండలంలోని అన్ని గ్రామాల బూత్ స్థాయి అధ్యక్షులు బిజెపి పార్టీ కార్యకర్తలు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంతోష్,తిరుపతి గౌడ్,మల్లేష్, వెంకటేష్ ,కార్యకర్తలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పార్లమెంట్ ఎన్నికలకు సకల సౌకర్యాలు కల్పించాలి

ఎన్నికల ప్రత్యేక అధికారి సంజీవరావు

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలం నందు ప్రత్యేక అధికారి సంజీవ రావు ఆధ్వర్యంలో మే 13, 2024 న పార్లమెంటు ఎన్నికలు పోలింగ్ కేంద్రాలలో జరగబోవు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల నందు ఏర్పాట్లకు సంబంధించి తాగునీటి వసతి, టెంట్ సౌకర్యం, ర్యాంపు, విధ్యుత్ సౌకర్యం, ఎన్నికల విధులకు హాజరవుతున్న సిబ్బందికి భోజన వసతి, మరుగుదొడ్లు సౌకర్యాల వంటి అంశాలపై మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శాయంపేట తాహసిల్దార్ సుభాషిని, ఎంపీడీవో ఫణి చంద్ర, మండలంలోని 24 గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శులు, బి ఎల్ ఓ ఎస్ రేషన్ షాప్ డీలర్లు పాల్గొన్నారు

చేతి గుర్తుపై ఓటు వేసి గడ్డం వంశీని గెలిపించాలి.

మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం కొలనూర్ గ్రామ సమీపంలో వ్యవసాయ కూలీల దగ్గరికి వెళ్లి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పెద్దపెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ మరియు మాజీ PACS చైర్మన్ గోపు నారాయణ రెడ్డి కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ విజయరామన రావు నాయకత్వంలో ఎ గ్రామానికి వెళ్లిన ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు తప్పకుండా ఈసారి తమ ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కు వేస్తామని ప్రజలు చెప్తున్నారు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అమ్ముల మల్లయ్య , గాజుల శివశంకర్ , గడ్డం బన్నీ కాసారపు శ్రీనివాస్ గౌడ్,కందుల సదాశివ్,కందుల అశోక్,గుండేటి శ్రీకాంత్,జంగం కొమురయ్య ,సుధాకర్,మహిళలతో తదితరులు పాల్గొన్నారు.

ప్రజల మద్దతుతోనే బీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖాయం.

రఘునాథపల్లి ఇన్చార్జి గూడ కిరణ్ కుమార్.

రఘునాథపల్లి ( జనగామ) నేటి ధాత్రి :-
ఈనెల 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ విజయం ఖాయమని రఘునాథ్ పల్లి బీఆర్ఎస్ ఇన్చార్జి గూడ కిరణ్ కుమార్ అన్నారు.. బుధవారం రఘునాథ్ పల్లి మండల కేంద్రంలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల విశ్వాసంతో ఉన్నారని తమ ప్రచారానికి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. ప్రజల స్పందన చూస్తుంటే కచ్చితంగా పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని తెలుస్తుందని అన్నారు. రేపు రఘునాథ్ పల్లి మండలం మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ప్రచారం ఉన్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలోబీ ఆర్ ఎస్ మండల నాయకులు నాయఇమ్మడిశెట్టి రఘు,దేవర యాకయ్య,మల్కాపురం అన్వేష్ గౌడ్,కడారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

గంగాధర మండల మహిళా కాంగ్రెస్ కమిటీ నియామకం

రామడుగు/గంగాధర, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా గంగాధర మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మంత్రి లత మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఆదేశాల మేరకు మండల మహిళా కాంగ్రెస్ కమిటీని ఎన్నుకున్నారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యక్షులుగా రుద్ర స్వప్న, గడ్డం జ్యోతి, ప్రధాన కార్యదర్శిగా వేముల శ్వేత, కార్యదర్శులుగా పెరుక రచన, పర్లపల్లి రమ్య, కోశాధికారిగా అముడగొని భారతిని ఎన్నుకోవడం జరిగినది. అనంతరం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేతుల మీదుగా వారి నియామక పత్రాలను అందుకున్నారు. ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పురుమల్ల మనోహర్, మహిళా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షురాలు తోట సంధ్య, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిది కొల రమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఓటింగ్ శాతం పెంచేందుకు అవగాహన చేస్తున్న అధికారులు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో బుధవారం రోజున స్వీప్ యాక్టివిటీస్ లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలములో ఓటింగ్ శాతం పెంచేందుకు గాను గణపురం మరియు చెల్పూర్ గ్రామాలలో అంగన్వాడీ టీచర్స్, ఆశ వర్కర్లు, ఏఎన్ఎం ఎస్ హెచ్ జి గ్రూప్ సభ్యులు మరియు పంచాయతీ కార్యదర్శులతో ఓటర్ల అవగాహన సదస్సు మరియు ర్యాలీ, ప్రతిజ్ఞ కార్యక్రమము చేపట్టడము జరిగినది. ఇట్టి కార్యక్రమములో ఎల్.విజయ లక్ష్మి స్విప్ నోడల్ అధికారి & సి‌ఈ‌ఓ జి.ప్ర.ప. గణపురం ఎం‌పి‌డి‌ఓ ఎల్ భాస్కర్ , డిప్యూటీ తహశీల్దార్ మరియు ఏ‌పి‌ఎం, ఐ‌కే‌పి, బాబా సిసి మెడికల్ అధికారి పాల్గొన్నారు.

వీణవంక మండలం లో రవాణా & బీసీ సంక్షేమ శాఖ మాత్యలు పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలు

వీణవంక,( కరీంనగర్ జిల్లా).

నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మాత్యలు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి 56 వ జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది
బస్టాండ్ వద్ద కేకు కట్ చేసి అనంతరం పండ్లు స్వీట్స్ పంపిణీ చేశారు
ఎండీ సాహెబ్ హుస్సేన్ మాట్లాడుతు.. ఎన్ స్ యు ఐ నుండి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ రాష్ట్ర మార్క్ ఫెయిడ్ చైర్మెన్ గా, పార్లమెంట్ సభ్యులు గా ఎం ఎల్ ఏ గా రాష్ట్ర మంత్రి గా వివిధ హోదాలో ప్రజలకు సేవలు చేస్తన్నా పొన్నం మరిన్ని మంచి పదవులు చేపట్టాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని వారన్నారు
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గంగాడి రాజిరెడ్డి, చదువు జయపాల్ రెడ్డి, ఈదునూరి పైడి కుమార్, నల్ల కొండల్ రెడ్డి, మేకలు ఎల్లారెడ్డి, మాదాసి సునీల్, మాజీ సర్పంచ్ కర్ర తిరుపతిరెడ్డి, కర్ర కుమార్ రెడ్డి, నల్ల కొండల్ రెడ్డి, పర్లపెల్లి ప్రసాద్, మాసాడి చొక్కా రావు, అంబాల రంగయ్య, ఆలేటి శ్రీపాల్ రెడ్డి, జగన్ రెడ్డి, చింతల తిరుపతిరెడ్డి, కొత్తిరెడ్డి రవీందర్ రెడ్డి, ఓరెమ్ శ్రీనివాస్, దాసరపు రమేష్, మోహన్ రెడ్డి, గట్టయ్య, రాంగోపాల్ రెడ్డి, తదితరులు పాలుగోన్నారు

భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇండియా కూటమి అభ్యర్థి రాజేందర్ రావు ను గెలిపించండి- కొయ్యడ సృజన్ కుమార్

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలువు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించిన సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్. ఈసందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం రెండు పర్యాయాలు అధికారంలో ఉండి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజా సంక్షేమాన్ని మరిచి పెట్టుబడి దారి వర్గాలకు కొమ్ము కాస్తున్నారని, దేశంలోని యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చేప్పి ఉద్యోగ అవకాశలు కల్పించకుండా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టారని ఆరోపించారు. నరేంద్రమోడీ బిజెపి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలను రాజకీయంగా ఎదుర్కొలేక అధికార దాహంతో సిబిఐ, ఇడి లాంటి దర్యాప్తు సంస్థలను గుపిట్లో పెట్టుకొని రాజకీయంగా నిర్వీర్యం చేయాడానికి కుట్ర చేస్తున్నారని, ఇదే కాకుండా మళ్ళీ అధికారంలోకి రాగానే రాజ్యాంగాన్ని మార్చి ఎస్సి ఎస్టీ, బిసిల రెజర్వేషన్లను మార్చడానికి చీకటి కుట్ర పన్నారని ఈపరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా అలోచించి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే ఇండియా కూటమి అభ్యర్థులను గెల్పించాలని, బీజేపి ఆభ్యర్థులను తరిమికొట్టాలని పిలుపు నిచ్చారు. ఈకార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గోడిశేల తిరుపతి గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్, నాయకులు ఎగుర్ల మల్లేష్, కీర్తికుమార్, ముత్యం ఆంజనేయులు గౌడ్, రాజయ్య, రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

గంగారం మండలం లో పలుగ్రామంలో ప్రచారం చేసిన బీఆర్ఎస్ నాయకులు

గంగారం, నేటిధాత్రి :

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం బిఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఇర్ప సూరయ్య ఆధ్వర్యంలో మహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీమతి మాలోత్ కవిత గెలుపే లక్ష్యంగా గంగారం మండలంలో పలుగ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని వివరిస్తూ మాట్లాడుతున్న , కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఇప్పుడు మాట మార్చారు,అన్నారు,క్వింటా వడ్లకు 500 బోన్స్ ఇస్తానని ఇవ్వలేదని అన్నారు, ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఒక గ్యారెంటీ కూడా అమలు చేయలేదని అన్నారు, పెన్షన్లు 4వేలు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వడంలేదని అన్నారు, మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు,కావున ఇప్పుడు, మళ్లీ ఓట్ల కోసం రైతు రుణమాఫీ ఆగస్టు 15 తారీకు చేస్తానని అంటున్నాడు. కావున ప్రజల గమనించాలని అన్నారు ఇప్పుడు జరిగే మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీమతి మాలోత్ కవిత కార్ గుర్తు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించరు వారి వెంట కొత్తగూడెం గంగారం ఎన్నికల ఇంచార్జ్ ఈసం సమ్మయ్య జిల్లా నాయకులు సువర్ణపాక జగ్గారావు ఇస్లావత్ బాలకృష్ణ దుర్గం కృష్ణ మాదారపు సతీష్ జనగాం వెంకన్న సోషల్ మీడియా ఇంచార్జి జనగాం రవి తదితరులు పాలుగోన్నారు

బీరన్న దేవాలయ నిర్మాణానికి తిరుపతిరావు రూ.350000/- విరాళం

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)

కమలాపూర్ మండలం లోని ఉప్పల్ గ్రామములో నూతనంగా నిర్మిస్తున్న బీరన్న ఆలయ నిర్మాణానికి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాయినేని తిరుపతి రావు రూ.3,50,000/- ల విరాళం ప్రకటించారు.గ్రామానికి చెందిన కురుమ సంఘం పెద్దల అభ్యర్థన మేరకు విరాళం ప్రకటించిన తిరుపతి రావు ను వారితో పాటు గ్రామస్థులు అభినందించారు.గ్రాములో ఎవ్వరికీ ఎలాంటి ఆపద కలిగిన ముందుండే తిరుపతి రావు వివిధ కుల సంఘాలకు,ఆలయాల నిర్మాణాలకు కూడా హితోధికంగా ఆర్థికంగా విరాళాలు అందిస్తూ దాతృత్వం లో తనకు మరెవరూ సాటి రారని మరో సారి నిరూపించుకున్నారు అని కురుమ సంఘం పెద్దలు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమములో గ్రామ తాజా మాజీ సర్పంచ్ ఎర్రబెల్లి దేవేందర్ రావు,రాకం మొండయ్య,కోనుపుల రామచందర్,ఎర్రబెల్లి శ్రీధర్ రావు,మొందెద్దుల రాజమౌళి,బండారి ఐల కొమురయ్య,వీరబోయిన రవి,ముష్కే శ్రీను,బండారి మొగిలి,పూర్ణచందర్,బండ సదయ్య తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సేవలో ప్రధాని మోదీ

వేములవాడ నేటిధాత్రి

వేములవాడలో కోడె మొక్కులు తీర్చుకున్న ప్రధాని మోదీ


ప్ర‌ధానికి ప్ర‌త్యేక ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాల‌ను అంద‌జేసిన వేద పండితులు ఆలయ ఆవరణలో ఉన్న భక్తులకు మోదీ నమస్కారం చేశారు. రాజన్నను దర్శించుకున్న తొలి ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు రాజన్న దర్శనం అనంతరం మోదీ బిజెపి బహిరంగ సభలో పాల్గొన్నారు
పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా బుధవారం వేముల‌వాడ‌లో,బారి బ‌హిరంగ సభలో పాల్గొన్న మోదీ
లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బుధ‌వారం వేములవాడ లో ప్ర‌ధాని మోదీ పర్యటించారు. దీనిలో భాగంగా వేముల‌వాడ శ్రీరాజ‌రాజేశ్వ‌రస్వామి ఆల‌యంలో ప్ర‌ధాని మోదీ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేకంగా నిలిచే కోడె మొక్కుల‌ను ప్ర‌ధాని తీర్చుకున్నారు. అనంత‌రం ప్ర‌ధానికి వేద పండితులు ప్ర‌త్యేక ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాల‌ను అంద‌జేశారు. అంత‌కుముందు ఆయ‌న‌ను ఆల‌య అధికారులు, అర్చ‌కులు ప్ర‌త్యేక మెమొంటో, శాలువాతో స‌త్క‌రించ‌డం జరిగింది.
ఇక పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా మోదీ వేముల‌వాడ‌,లో నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని బీజేపీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున ప్ర‌సంగించ‌రు
నా తెలంగాణ కుటుంబం సభ్యులందరికీ నమస్కారం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం నా అదృష్టం అంటు ప్రసంగం తెలుగులో మొదలు పెట్టారు మూడోదశ పోలింగ్ తర్వాత కాంగ్రెస్ ఇండియా కూటమి పని అయిపోయిందని చెప్పారు ఇండియా కూటమి మూడో స్థానానికి పడిపోయిందని చెప్పారు తెలంగాణలో బిఆర్ఎస్ అడ్రస్ కనిపించడం లేదన్నారు దేశభద్రతకే బిజెపి ఫస్ట్ ప్రయారిటి ఇస్తుందని చెప్పారు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలది అవినీతి బంధం అని విమర్శించారు ఆ పార్టీల మధ్య స్పష్టమైన అవగాహన ఉందని ఆరోపించారు కరీంనగర్లో బండి సంజయ్ భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్పారు ఇట్టి కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

ప్రజాస్వామ్యం-నియంతృత్వం మధ్య ఎన్నికలివి

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు
మొగుళ్ల పెళ్లి నేటి ధాత్రి
దేశంలో ప్రజాస్వామ్యానికి-నియంతృత్వానికి జరుగుతున్న యుద్ధమే త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపికి టీం లీడర్ మోదీ అయితే కాంగ్రెస్ కు టీం లీడర్ రాహుల్ గాంధీతోపాటు..కూటమి రూపంలో అతిపెద్ద ఇండియా టీమే ఉందన్నారు. మొదటి దశ ఎన్నికల అనంతరం మోదీ వెన్నులో వణుకు పుడుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆస్తులన్నీ ముస్లింలకు పంచుతారన్న మోదీ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటగా తీసుకోవాలన్నారు. పాంచ్ న్యాయ్, కుల గణన వంటివి బిజెపికి రుచించడం లేదని లింగారావు మండిపడ్డారు. బిజెపి లీడర్లది ఫ్యూడల్ మెంటాలిటీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముని ఫోటోలతో తప్ప మోదీ ఫోటోలతో బిజెపి ప్రచారం చేయడం లేదన్నారు. మోదీ మతతత్వవాది..రాహుల్ గాంధీ మానవతవాది అన్నారు.

మాజీ మంత్రి నిరంజన్ ఆదేశాలతో ఇంటింటా ప్రచారం

వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి పట్టణంలో మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలతో కే డి ఆర్ నగర్ 32 వ వార్డులో మున్సిపల్ కౌన్సిలర్ పెండం నాగన్న యాదవ్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుండి పోటీ చేస్తున్న టిఆర్ఎస్ అభ్యర్థి రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సగర సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యం సాగర్ మనపాడు వెంకటయ్య నందిమల్ల గోపి శివన్న రాసిక రమేష్ కృష్ణయ్య నిరంజన్ బీబీ నఫియా బేగం పద్మ వార్డు ప్రజలు పాల్గొన్నారు

గడప గడపకు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు

కొల్చారం, ( మెదక్) నేటిధాత్రి :-

మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయ పేట గ్రామంలో నిన్నటి రోజు ఇంటింటికి ప్రచారం చేస్తున్న స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్, మరియు గ్రామ అధ్యక్షుడు మొజంబిల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కలిసి మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మదుకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.
రాష్ట్రంలో పదేళ్లు విధ్వంసం సృష్టించిన కేసీఆర్‌కు ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ విమర్శించారు. ఓటమి తర్వాతనైనా కేసీఆర్‌లో మార్పువస్తుందని, రైతులకు క్షమాపణ చెప్పి ఓట్లు అడుగుతారని ఆశించామని, ఆయనలో మార్పు రాలేదని దుయ్యబట్టారు. సరికదా ఈ ప్రభుత్వం పడిపోతుందంటున్నారని మండిపడ్డారు. ఈక్రమంలోనే కేంద్ర సర్కార్‌పై స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను మోదీ గుజరాత్‌కు తరలించారని ఆరోపించారు. ఆయన గుజరాత్‌కు మాత్రమే ప్రధానా? దేశం మొత్తానికా? అని నిలదీశారు. ఈ పదేళ్లలో తెలంగాణకు మోదీ గాడిదగుడ్డు మాత్రమే ఇచ్చారని మెదక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ విమర్శించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాణిక్యరెడ్డి,సిద్దిరాములు,డప్పు కుమార్,ఆకులస్వామి,నాగరాజ్, కొత్తగొల్లరాజు,సాకలస్వామి. దండు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

తడసి ముద్ద అయిన వరి ధాన్యం రాసులు

రైతులకు తప్పని తిప్పలు

ప్రభుత్వం అదుకోవాలని కొరుతున్న రైతులు

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, మే – 8(నేటి ధాత్రి):

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గంలో గాలి వానతో కూడిన అకాల వడ గాలుల వర్షం భారీగా కురిసింది. మంగళవారం మధ్యాహ్నం మొదలై రాత్రి వరకు ఏకధాటిగా కురవడంతో గాలి తీవ్రతకు రోడ్లపై చెట్లు విరిగి పడడంతో పాటు, కొనుగోలు కేంద్రాల్లో, బీట్ లలో వరి ధాన్యం తడిసి ముద్ద అవ్వడంతో రైతులు కన్నీటి పర్వంలో మునిగారు. కోతలు కోసి కొనుగోలు కేంద్రానికి తరలించిన ధాన్యం రాశులు కుప్పలు పూర్తిగా తడిసి పోవడంతో రైతులు ఏమి తోచని పరిస్థితుల్లో తీవ్రంగా రోదిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి పంట ఫలితం చేతికందే సమయంలో ప్రకృతి సృష్టించిన విపత్తుతో పూర్తిగా నష్టం వాటిల్లింది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతు తడిసిన ధాన్యం వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

ఉచిత పథకల పేరు తో పబ్బం గడుపుతున్న కాంగ్రెస్

కొత్తగూడ, నేటిధాత్రి :

ప్రతి గ్రామనికి బస్సులు వేసి
ఉచిత ప్రయాణలు చేపిస్తామని చెప్పి గద్దెనెక్కి ఇప్పటికి ఐదు నెలల అయిన మా గ్రామనికి బస్సులు రావడం లేదని చెప్తున్నా మహిళాలు బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారి మరియు ములుగు జిల్లా జెడ్పీ చైర్మన్ ములుగు నియోజకవర్గ ఇంచర్జి నాగ జ్యోతి మరియు కొత్తగూడ బిఆర్ఎస్ మండల పార్టీ అద్యాక్షుడు కొమ్మానబోయిన వేణు ఆధ్వర్యంలోమహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీమతి మాలోత్ కవిత గెలుపే లక్ష్యంగా కొత్తగూడ మండలం వెలుబల్లి. బత్తుల పల్లి కార్లయి లో ఇంటింటి ప్రచారం చేస్తు, గ్రామలలో రైతులు, గ్రామ పెద్దవాళ్ళతో కొమ్మానబోయిన వేణు
మాట్లాడుతు , కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఇప్పుడు మాట మార్చారు,అన్నారు,క్వింటా వడ్లకు 500 బోన్స్ ఇస్తానని ఇవ్వలేదని అన్నారు, ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఒక గ్యారెంటీ కూడా అమలు చేయలేదని అన్నారు, పెన్షన్లు 4వేలు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వడంలేదని అన్నారు, మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు,కావున ఇప్పుడు, మళ్లీ ఓట్ల కోసం రైతు రుణమాఫీ ఆగస్టు 15 తారీకు చేస్తానని అంటున్నాడు. కావున ప్రజల గమనించాలని అన్నారు ఇప్పుడు జరిగే మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ mp అభ్యర్థి శ్రీమతి మాలోత్ కవిత గారికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటి అద్యక్షులు pacs డైరెక్టర్ గజ్జి కొంరెల్లి ఎంపీటీసీ మోకాళ్ళ సంతోషరాణి. వెంకటేష్. BRS పార్టీ నాయకులు సువర్ణపాక జగ్గారావు.మండల పార్టీ అధికార ప్రతినిధి బానోత్ నెహ్రూ నాయక్ మాజీ సర్పంచ్ బానోత్ వీరన్న అజ్మిరా రమష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పార్లమెంట్ ఎన్నికల్లో సింహం గుర్తు కి ఓటు వేయండి

ఆదివాసీలకు “తుడుం దెబ్బ” పిలుపు.

కొత్తగూడ, నేటిధాత్రి :

మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో అత్యధికంగా ఓటు బ్యాంక్ కల్గి ఉన్న ఆదివాసీల మనోభావాలను కించ పరుస్తూ అధికార కాంగ్రెస్,బీజేపీ, గత ఐదు నెలల ముందు అధికారం లో ఉన్న బిఆర్ యస్ పార్టీ ఈ మూడు భూర్జవ రాజకీయ దోపిడీ పాలక వర్గ పార్టీలు ఆదివాసీలకు ఎంపీ టికెట్ కేటాయించకుండా కుట్రలు చేసి ఆదివాసీల ఓట్లకోసం నేడు ఎక్కడా లేని ప్రేమ ఒల్క పోస్తూ దొంగ నాటకాలు ఆడుతూ ఆదివాసీలు తమ పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేసి అక్రమంగా ST లలో చలామణి అవుతున్న వారిని గెలిపించాలని వారిని గెల్పిస్తే ఆదివాసీలను అన్నీ విధాలుగా అభివృద్ధి చేస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతు న్నాయని మూడు ప్రధాన భూర్జవ రాజకీయ పార్టీ లైన కాంగ్రెస్,బీజేపీ,బి ఆర్ యస్ లు ద్వంద విధానాలతో ఆదివాసీలను మోసం చేసేందుకు సిద్దమైనాయని ఆయా పార్టీల కుటిల బుద్దిని ఆదివాసీ సమాజం గుర్తించాలని ఈ మూడు రాజకీయ పార్టీలలో కొన సాగుతున్న ప్రజా ప్రతినిధులు నాయకులు ఆదివాసీ జాతి ఆస్థిత్వం ను మర్చి పోయి తమ స్వార్ధం కోసం రాజకీయ పార్టీల ఎజెండాలను మోస్తూ ఆదివాసీ ల ను ఆయా పార్టీలకు తాకట్టు పెట్టి ఆదివాసీ సమూహం ను బలి చేస్తున్నారని అందుకే తుడుందెబ్బ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు డా మైపతి అరుణ్ కుమార్ ను జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి బరిలో ఉంచడం జరిగిందని ఇందుకు గాను డా,అరుణ్ కుమార్ గారి సింహం గుర్తు పైన తమ అమూల్య మైన ఓటు వేసి గెల్పించెందుకు ప్రతి ఆదివాసీ గూడెంల లోని ఆదివాసీ ప్రజలు ఉద్యోగులు,విద్యార్థులు,మహిళలు,ఆదివాసీలతో సహజీవనం చేస్తున్న ఆదివాసేతరులు ప్రజా స్వామిక వాదులు విభిన్న సామాజిక వర్గాల ప్రజలు ఆదివాసీల మనోభావాలు కాపాడటం కోసం సహకరించాలని ఈ రోజు కొత్తగూడ మండలం లోని వివిధ గ్రామాల్లో అరుణ్ కుమార్ గెల్పు కోసం ప్రచారం లో పాల్గొన్నారు కార్యక్రమం ఆగబోయిన రవి,రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి ఈక విజయ్ కుమార్ మహేందర్,మునీందర్ యాదగిరి, రాజేష్,సూర్యనారాయణ,మనోహర్,లు పాల్గొన్నారు.

ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి పండ్ల పంపించేయడం జరిగినది. ఈకార్యక్రమంలో ఎంపీపీ జవ్వాజి హరీష్, రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్, దేశరాజుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కోలరమేష్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, రామడుగు గ్రామశాఖ అధ్యక్షులు కర్ణ శ్రీనివాస్, రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్, ఇరవై మూడు గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ చేరికలు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు టోనీ ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీలో కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై పార్టీ చేసే అభివృద్ధి పనులకై వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకై ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ఇంతకుముందు ఎంపీగా ఉన్న సమయంలో అప్పటి ఎంపీ ఇప్పటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన ఇందిరమ్మ కాలనీకి సంబంధించి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని ఇల్లు లేనినిరుపేదలకు ఇల్లు కట్టించి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానీదిఅలాగే ఆయన ఎంపీగా ఉన్న సమయంలో ఈ ఎస్ ఐ హాస్పిటల్ కేంద్ర విశ్వవిద్యాలయం కస్తూర్బా గాంధీ పాఠశాల మోడల్ స్కూల్ తో పాటు అనేక అభివృద్ధి నిధులు తెచ్చి ఇందిరమ్మ కాలనీ అభివృద్ధి పథంలో ముందు ఉంచారని అభివృద్ధి లోఅనేక నిధులు కేటాయించారనిఅలాంటి అభివృద్ధి పనులు చేసిన ఏకైక వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని ఉద్యమ సమయంలో ఎంతో కీలక పాత్ర పోషించి తెలంగాణ రావడానికి ఎంతో కృషి చేశారని అలాంటి అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇందిరమ్మ కాలనీలో అనేకమంది కాంగ్రెస్ పార్టీలో చేరారని దీనికి అంతటికి కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టోనీ యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ నాయకులు నాయకులు కార్యకర్తలు మహిళ నాయకులు పార్టీ కార్యకర్తలు ఇట్టి చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు

error: Content is protected !!
Exit mobile version