కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు
మొగుళ్ల పెళ్లి నేటి ధాత్రి
దేశంలో ప్రజాస్వామ్యానికి-నియంతృత్వానికి జరుగుతున్న యుద్ధమే త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపికి టీం లీడర్ మోదీ అయితే కాంగ్రెస్ కు టీం లీడర్ రాహుల్ గాంధీతోపాటు..కూటమి రూపంలో అతిపెద్ద ఇండియా టీమే ఉందన్నారు. మొదటి దశ ఎన్నికల అనంతరం మోదీ వెన్నులో వణుకు పుడుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆస్తులన్నీ ముస్లింలకు పంచుతారన్న మోదీ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటగా తీసుకోవాలన్నారు. పాంచ్ న్యాయ్, కుల గణన వంటివి బిజెపికి రుచించడం లేదని లింగారావు మండిపడ్డారు. బిజెపి లీడర్లది ఫ్యూడల్ మెంటాలిటీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముని ఫోటోలతో తప్ప మోదీ ఫోటోలతో బిజెపి ప్రచారం చేయడం లేదన్నారు. మోదీ మతతత్వవాది..రాహుల్ గాంధీ మానవతవాది అన్నారు.
