వేములవాడ నేటిధాత్రి
వేములవాడలో కోడె మొక్కులు తీర్చుకున్న ప్రధాని మోదీ
ప్రధానికి ప్రత్యేక ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలను అందజేసిన వేద పండితులు ఆలయ ఆవరణలో ఉన్న భక్తులకు మోదీ నమస్కారం చేశారు. రాజన్నను దర్శించుకున్న తొలి ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు రాజన్న దర్శనం అనంతరం మోదీ బిజెపి బహిరంగ సభలో పాల్గొన్నారు
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వేములవాడలో,బారి బహిరంగ సభలో పాల్గొన్న మోదీ
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వేములవాడ లో ప్రధాని మోదీ పర్యటించారు. దీనిలో భాగంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా నిలిచే కోడె మొక్కులను ప్రధాని తీర్చుకున్నారు. అనంతరం ప్రధానికి వేద పండితులు ప్రత్యేక ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు ఆయనను ఆలయ అధికారులు, అర్చకులు ప్రత్యేక మెమొంటో, శాలువాతో సత్కరించడం జరిగింది.
ఇక పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ వేములవాడ,లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రసంగించరు
నా తెలంగాణ కుటుంబం సభ్యులందరికీ నమస్కారం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం నా అదృష్టం అంటు ప్రసంగం తెలుగులో మొదలు పెట్టారు మూడోదశ పోలింగ్ తర్వాత కాంగ్రెస్ ఇండియా కూటమి పని అయిపోయిందని చెప్పారు ఇండియా కూటమి మూడో స్థానానికి పడిపోయిందని చెప్పారు తెలంగాణలో బిఆర్ఎస్ అడ్రస్ కనిపించడం లేదన్నారు దేశభద్రతకే బిజెపి ఫస్ట్ ప్రయారిటి ఇస్తుందని చెప్పారు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలది అవినీతి బంధం అని విమర్శించారు ఆ పార్టీల మధ్య స్పష్టమైన అవగాహన ఉందని ఆరోపించారు కరీంనగర్లో బండి సంజయ్ భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్పారు ఇట్టి కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు